tallest
-
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ కా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తుతో ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం (Adilabad Town) బొక్కల్‌గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (Govt School) నంబర్–2లో పదో తరగతి చదువుతున్నాడు.ఈ విద్యార్థి తాత నందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎత్తులో ఉంటారు. హేమంత్ చెల్లి పదో తరగతి చదువుతోంది. హేమంత్ (Hemanth) 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా, 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం పదో తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు హేమంత్‌ను జూనియర్ అమితాబ్‌గా పిలుస్తున్నారు. చివరి బెంచీలో కూర్చుంటా..అందరికంటే పొడవుగా ఉండటంతో తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. శుభకార్యాలకు వెళ్లినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు దిగుతున్నారు. – హేమంత్ఈఏపీ సెట్‌కు తొలిరోజు 5,010 దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కోకన్వీనర్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, రెండు విభాగాలకు రాసే వారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పీహెచ్డీ దరఖాస్తుల స్వీకరణ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2000 అపరాధ రుసముతో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి.. నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. చదవండి: ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ అదే పరిస్థితికాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగినా.. పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసినా పీహెచ్డీ సీట్ల పెంపుపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళలుగా గిన్నిస్ రికార్డులకెక్కిన వారెవ్వరో మనకు తెలిసిందే. వారిన చూసి యావత్తు దేశం అబ్బురపడింది కూడా. అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో ఎదురపడితే ఎలా ఉంటుంది..అన్న ఆలోచనే ఎంతో ఆశ్యర్యానికిలోను చేస్తుంది. అలాంటిది అదే నిజమైతే ఎలా ఉంటుందో చెప్పండి. ఔను..! మీరు వింటుంది నిజమే..!. ఆ ఇద్దరు వ్యక్తులు తాము రికార్డులకెక్కిన అదే వేదిక వద్ద కలుసుకుని ఆనందంతో మునిగితేలారు. ఆ క్షణం ఆ ఇరువురూ ఇది కల? నిజమా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. నవంబర్ 13, 2024 అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే రోజున ఆ ఇరువురు లండన్‌లో మధ్యాహ్నం టీ కోసం సమావేశమయ్యారు. లండన్‌లో ది సావోయ్ హోటల్ రుచికరమైన టీ సిప్ చేస్తూ..ఒకరి ఇష్టాలను ఒకరూ షేర్చేసుకున్నారు. అక్కడ టీ తోపాటు పేస్ట్రీలను కూడా ఆస్వాదించారు. ఇక అత్యంత పొడవైన మహిళ రుమిసా.. "జ్యోతిని కలవడం ఇదే తొలిసారి. ఆమె అత్యంత అందమైన మహిళ. తాను ఆమెను కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది". రుమిసా. అలాగే జ్యోతి ప్రతిస్పందనగా.."నాకంటే ఎత్తుగా ఉన్నవారిని చూడటం అలవాటు చేసుకున్నాను. ఈ రోజు ప్రపంచంలోనే ఎత్తైన మహిళను కలుసుకోవడం అత్యంత సంతోషంగా ఉంది." అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, రుమీసా 215.16 సెం.మీ (7 అడుగుల 0.7 అంగుళాలు)తో అత్యంత ఎత్తైన మహిళగా నిలిచింది. ఇక జ్యోతి 62.8 సెం.మీ (2 అడుగుల 0.7)తో అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by NDTV (@ndtv) (చదవండి: ఆరు పదులకు అందాల కిరీటం) -
కిలోమీటర్ బిల్డింగ్!
ఇప్పటివరకూ మనం ఒక భవనం ఎత్తును మీటర్లలోనే చెప్పుకుంటున్నాం... ఇకపై మాత్రం కిలోమీటర్లలో చెప్పుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి కిలోమీటరు ఎత్తైన భవనం తాలూకూ నిర్మాణం పూర్తవుతోంది మరి! ఎక్కడుందీ భవనం? ఎవరు కడుతున్నారు? ఎందుకు? ఖర్చెంత?...ఎడారి దేశం సౌదీ అరేబియాలో కొత్త కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం కొత్త కాదు. ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ‘ద లైన్’ నిర్మాణ దశలో ఉండగానే బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ‘జేఈసీ టవర్స్’ పేరుతో సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న కిలోమీటరు భవనం కూడా కొత్త రికార్డును సృష్టించింది. అన్నీ సవ్యంగా సాగితే సుమారు 1007 మీటర్లు అంటే కిలోమీటరు కన్నా పిసరంత ఎక్కువ ఎత్తు ఉన్న ఈ భవనం 2028 నాటికి అందుబాటులోకి రానుంది. కిలోమీటర్ ఎత్తు అంటే ఎంత? అని అనుకుంటూ ఉంటే కొన్ని పోలికలు చూద్దాం. ఈఫిల్ టవర్‌కు మూడు రెట్లు ఎక్కువ. లేదా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకు రెట్టింపు. భారత్‌లోనే అతి ఎత్తైన బిల్డింగ్ లోఖండ్వాలా మినర్వా (78 అంతస్తులు, 301 మీటర్ల ఎత్తు) కంటే మూడు రెట్లు ఇంకొంచెం ఎక్కువన్నమాట. మొదట్లో ఈ జేఈసీ టవర్స్‌కు ‘కింగ్డమ్ టవర్’ అని పేరు పెట్టారు. కాకపోతే అప్పుడు లక్ష్యం ఒక మైలు ఎత్తు. ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని స్పష్టమైన తరువాత దీన్ని కిలోమీటరుకు పరిమితం చేశారు. పేరు కూడా ముందు ‘జెడ్డా టవర్స్’ అని తాజాగా ‘జెడ్డా ఎకనమిక్ టవర్’ అని మార్చారు. దుబాయిలోని ఎత్తైన భవం ‘బుర్జ్ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్ చేసిన ఆడ్రియన్ స్మిత్, గార్డన్ హిల్లు ఈ జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేశారు. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకుల మాదిరిగా త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్ ఒడ్డునే కడుతున్నారు.భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుందని మనకు తెలుసు. అందుకే జేఈసీ టవర్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన గాలులను తట్టుకోవడమే కాకుండా.. సూర్యుడి ఎండ ప్రతాపాన్ని తగ్గించేందుకూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్ దిమ్మెల పునాదులపై నిర్మాణమవుతోంది. అంతస్తులు ఎన్నో తెలుసా?లోఖండ్ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉండగా.. జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉండబోతున్నాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బుర్జ్ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తన్ని వీక్షించేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉంటే.. జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తైన అంతస్తులో వ్యూపాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి. జేఈసీ టవర్ నిర్మాణం పదేళ్ల క్రితమే మొదలైనా 60వ అంతస్తు స్థాయికి చేరేటప్పటికి ఆగిపోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలై పూర్తి చేసుకోబోతోంది. ఇంతకీ ఈ భవనం కట్టేందుకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పలేదు కదా... అక్షరాలా... 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! రూపాయల్లో చెప్పుకోవాలంటే 159,662,700,000! పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్నమాట!!!-జి.గోపాలకృష్ణ మయ్యా -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
వీడియో: రష్యాపై విరుచుకుపడుతున్న ఉక్రెయిన్.. 9/11 తరహాలో దాడులు
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యాలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల అత్యంత ఎత్తయిన భవనం వోల్గా స్కైపైకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని పలు అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. వోల్గా స్కై కాంప్లెక్స్ ఎత్తు 128.6 మీటర్లు. ఈ ప్రాంతంలో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. డ్రోన్ శిథిలాలు భవనంపై చెల్లాచెదురుగా పడివున్నాయని అధికారులు చెబుతున్నారు. A large drone recently crashed into the 38-story Volga Sky residential complex, the tallest building in Saratov, Russia, causing significant damage and injuring at least two people.#russia #Ukraine pic.twitter.com/iWU96hPpok— Bhoopendra Singh 🇮🇳 (@bhoopendratv007) August 26, 2024ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో డ్రోన్ స్ట్రైక్ కారణంగా వాటి శిథిలాలు కింద చెల్లాచెదురుగా పడ్డాయని ప్రాంతీయ గవర్నర్ రోమన్ బుసార్గిన్ తెలిపారు. ఈ తాజా దాడి రష్యాలో భద్రతాపరమైన ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అయిన వీడియోలు డ్రోన్ దాడి కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనేది చూపిస్తున్నాయి. 2001, సెప్టెంబరు 11న యునైటెడ్ స్టేట్స్‌లోని ట్విన్ టవర్స్‌పై అల్-ఖైదా వైమానిక దాడులు జరిపింది. వాటిని 9/11 దాడులుగా పేర్కొంటారు.🇺🇦#Ukraine 🇷🇺#Russia #Saratov #Engels #UkraineRussiaWar️️ #UkraineWar #UAV Russian media reports that at least twenty cars were damaged when a drone flew into the 38-story Volga Sky residential complex in the city of Engels in the Saratov region.The attack began at… pic.twitter.com/S9eRX8dbxQ— 🛰️ Wars and news 🍉 (@EUFreeCitizen) August 26, 2024 -
ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత
ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్ శాంటోస్ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.గాయని, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది. ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్ అయింది. 1960లో క్వీన్ ఆఫ్‌హైట్ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్. వీరికి ముగ్గురు పిల్లలు. మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట. -
US: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్‌లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు. అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్‌లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది. తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం. వేముల ప్రభాకర్ (చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్‌వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్‌లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్‌వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్‌వుడ్స్ స్టేట్ పార్క్‌లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్‌లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్‌ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్‌లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్‌లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
భారతదేశంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన భవనాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
Dubai: ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం
దుబాయ్: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్ వేదిక కాబోతోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్ గిన్నిస్ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్ నగరం(అమెరికా) మాన్‌హట్టన్ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్ హైపర్‌టవర్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. సెంట్రల్ పార్క్ టవర్ దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. అగ్రభాగాలు.. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
విమానంలో ఆరు సీట్లను బెడ్‌గా మార్చారు ఎందుకో తెలుసా!
ప్రపంచంలో అత్యంత పొడుగైనా మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న రుమేసా గెల్గి తొలిసారిగా ఫ్లైట్ జర్నీ చేసింది. ఆమె పొడుగే శాపంగా మారి ఎక్కడికి ప్రయాణించలేక ఇబ్బంది పడుతుండేది. ఐతే ఆమె బాధను టర్కిష్ ఎయిర్‌లైన్స్ దూరం చేసింది. ఆమె పొడగు కారణంగా విమానంలో కూర్చొని ప్రయాణించడం అసాధ్యం. అందుకని ఆమె కోసం ఆరు సీట్లను బెడ్‌గా మార్చి విమానంలో ప్రయాణించే ఏర్పాటు చేసింది. దీంతో ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయింది. గెల్గి ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ మేరకు గెల్గి విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ప్రావిన్స్కోకు 13 గంటలు ప్రయాణించింది. ఇది తన చివరి ఫ్లైట్ జర్నీ మాత్రం కాదని నమ్మకంగా చెబుతోంది. తాను సాంకేతిక రంగంలో పనిచేస్తున్నానని, తనలాంటి వారికోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉంటానని చెబుతోంది. విమానంలో ప్రయాణించే అవకాశం ఇచ్చినందుకు టర్కీష్ ఎయిర్ లైన్స్‌కి ధన్యావాదాలు చెప్పింది. భవిష్యత్తులో ఆమెకు మరింత సహాయ సహకారాలను అందజేస్తామని టర్కీ ఎయిర్‌లైన్స్ హామి ఇచ్చింది. View this post on Instagram A post shared by RUMEYSA GELGI (@rumeysagelgi) (చదవండి: ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న వెర్బల్ ఫాస్ట్! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..) -
ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ప్రారంభం.. విశేషాలివే
జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్. ‘విశ్వాస్ స్వరూపం’గా పిలిచే ఈ విగ్రహం ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాబు, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పాల్గొన్నారు. రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘రామ కథలోని ప్రతి అంశం ప్రేమ, సామరస్యం, సోదరభావం గురించి చెబుతుంది. దేశంలో ప్రస్తుతం అదే అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అలాంటి కథలను చెప్పించాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు సీఎం అశోక్ గెహ్లోట్. ఆయనతో పాటు యోగా గురు రామ్‌దేవ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గలాబ్ చాంద్ కటారియా సహా ఇతర నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విగ్రహం విశేషాలు.. ► మహా శివుడి అతిపెద్ద విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. ► 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. ద్యానం చేస్తున్నట్లు ఉన్న కైలాశనాథుడు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తాడు. ► ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకోసం 3,000 టన్నుల స్టీల్, ఐరన్ ఉపయోగంచారు. 2.5లక్షల క్యుబిక్ టన్నులు కాంక్రిట్, ఇసుకను వాడి పూర్తి రూపాన్నిచ్చారు. ► ఈ శివుడి విగ్రహ నిర్మాణానికి 2012, ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మొరారి బాబుల సమక్షంలోనే శంకుస్థాపన చేశారు. ► ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించాం. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. World's tallest statue of shiva was inaugurated in rajsamand distict in Rajasthan pic.twitter.com/WDJgVlzXmE — Priyadarshini soni (@PriyaSo62807043) October 29, 2022 ఇదీ చదవండి: ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం -
అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ
బ్రెజిలియన్, బ్రిటిష్ పరిశోధకులు బృందం 2019లో త్రీడీ మ్యాపింగ్ ప్రాజెక్టు అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఒక అత్యంత ఎత్తైన చెట్టును కనుగొన్నారు. దీంతో వారిలో ఆ చెట్టు గురించి ఏదో తెలియని కుతుహలం కలిగింది. ఎలాగైనా ఆ చెట్టు గురించి తెలుసుకోవాలి, అక్కడకు చేరుకుని ఆ చెట్టును చూడాలి అని పరిశోధకులు అనుకున్నారు. ఈ మేరకు శాస్తవేత్తల బృందం ఈ చెట్టుని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించింది. ఇది ఎంజెలిమ్ వెర్మల్హో అని పిలిచే డినిజియా ఎక్సెల్సా చెట్టు. ఈ చెట్టు ఎత్తు 30 అంతస్థుల భవనం అంత ఎత్తు ఉంటుంది. ఈ చెట్టు వద్దకు వెళ్లేందుకు శాస్తవేత్తలు మూడేళ్లుగా అనేక రకాలుగా ప్లాన్లు వేశారు. అందుకోసం సుమారు ఐదుసార్లకు పైగా అమెజాన్ అడవుల్లో పర్యటించారు. ఎట్టకేలకు సెప్టెంబర్17న ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది దట్టమైన అమెజాన్ అడవుల్లో ఉండటం వల్ల చేరుకోవడం కష్టమైంది. దాదాపు రెండు వారాలకు పైగా ట్రెక్కింగ్ చేసి ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ చెట్టు 9.9 మీటలర్ల చుట్టుకొలతతో దాదాపు 290 అడుగుల పొడవు ఉంది. ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా) -
ఫెన్రిర్.. అత్యంత ఎత్తైన పిల్లి! ఇక ఆర్కురస్ 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డు!
ఫెన్రిర్... ఒక అడుగు 6.83 అంగుళాలతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన విలియం జాన్ పవర్స్‌కు పిల్లులంటే ఇష్టం. ఆయన పెంచుతున్న పిల్లుల్లో ఒకటైన ఫెన్రిర్ అనాట్రెస్ పవర్స్... సవన్నా జాతి హైబ్రిడ్ పిల్లి. భుజం నుంచి కాలి వరకు... 18.83 అంగుళాల పొడవు ఉంది. 2016లో ఇదే జాతికి చెందిన మరో పిల్లి ఆర్కురస్.. 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అది మరణించింది. అయినా ఇప్పటికీ రికార్డుల్లో ఎత్తయిన దేశీయ పిల్లి అదే. ఇక బతికి ఉన్న ఎత్తైన పిల్లిగా రికార్డు ఫెన్రిర్దే! విలియం దగ్గర ఇలాంటి పిల్లులు ఇంకా ఉన్నాయి. అతని పిల్లుల్లో ఒకటైన ఆల్టేర్ అతి పొడవైన తోక 16.07 అంగుళాలు కలిగిన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. దీనికంటే ముందు.. సైనస్ అనే మరో పిల్లి అతిపొడవైన తోక 17.58అంగుళాలతో రికార్డు నెలకొల్పింది. (చదవండి: గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత కంపెనీ కలుషిత సిరప్ వల్లే!) -
ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా?
మహానగరాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహర్మ్యాలే.. నింగిని తాకేలా ఉండే ఈ భవనాలను చూసి అచ్చెరువొందని వారు ఉండరు. ఇంతకూ మీకీ విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో? ఏ అమెరికాదో అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాలు కలిగిన నగరం చైనాలోని షెంజెన్. 200 మీటర్లు(దాదాపుగా 60 అంతస్తులు) అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు ఇక్కడ 120 ఉన్నాయట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా(828 మీటర్లు) ఉన్న దుబాయ్ తర్వాతి స్థానంలో నిలిచింది. టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటాట్ కౌన్సిల్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా చైనాలోని నగరాలే ఉన్నాయి. 27వ స్థానంలో ముంబై ఉంది. కోల్‌కతా 199వ స్థానంలో(ఒకే భవనం) ఉంది. షెంజెన్‌కి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. అంటే.. భవిష్యత్తులో ఈ కేటగిరీలో షెంజెన్‌ను కొట్టేవాడు లేడన్నమాట. చదవండి: ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు.. 200 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు కలిగిన నగరాలు(టాప్–10) -
Photo Feature: ప్రపంచంలోనే ఎత్తైన కుక్క.. దీని ఎత్తు ఎంతో తెలుసా?
World's Tallest Dog: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జ్యూస్ అనే అమెరికన్ గ్రేట్ డేన్ కుక్క ప్రపంచంలోనే ఎత్తయిన కుక్కగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని ఎత్తు 3 అడుగుల 5.18 అంగుళాలు. దీని వయసు రెండేళ్లు. ఇంత ఎత్తు ఉన్నప్పటికీ మిగతా చిన్నగా ఉన్న కుక్కలతో త్వరగా కలిసిపోయి ఆడుకుంటుందని దాని యాజమాని తెలిపారు. తాము జ్యూస్‌ను చిన్న పిల్ల వయసు నుంచే పెంచుకుంటున్నామని, అప్పుడే అది భారీ సైజులో ఉండేదని దాని యజమాని బ్రిటనీ డేవిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు తెలిపారు. జ్యూస్ చాలా పొడువైన కాళ్లను కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. చదవండి: రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన? -
ఆజానుబాహుల దేశంగా పేరు.. కానీ పొట్టిగా అయిపోతున్నారు!
‘మా తాత ఆరు అడుగుల ఆజానుబాహుడు తెలుసా?’ అని ఎవరన్నా అంటే ‘హా..అయితే మరి నువ్వేంట్రా ఇంతే ఉన్నావ్?’ అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. తాతలు పొడుగ్గా ఉంటే ఆ వంశీకులు కూడా పొడవుగానే అవుతారు. అది డీఎన్ఏను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఆరు అడుగుల పొడుగు ఉండేవారు. కాలం, తరాలు గడుస్తున్న కొద్దీ ఆ వంశంలో పుట్టిన వారు పొడవు తగ్గిపోతుంటారా? అంటే నిజమేనంటోంది ఓ సర్వే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడుగైన వారిగా పేరొందిన నెదర్లాండ్స్ దేశస్థులు ఇప్పుడు అంత పొడవు పెరగడం లేదట.. పైగా పొడవు తగ్గిపోతూ..పొట్టిగా అయిపోతున్నారట. వారు ఎందుకు పొడవు తగ్గిపోతున్నారో తెలుసుకుందామా.? ఒకప్పుడు ఆరడుగుల ఆజానుబాహులకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. ఆ దేశంలో పుట్టే పురుషులతో పాటు మహిళలు కూడా ఆరేడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవైన వ్యక్తులున్న దేశంగా ‘నెదర్లాండ్స్’ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా గత 6 దశాబ్దాలుగా ఈ రికార్డు నెదర్లాండ్ పేరిటే ఉంది. ఇప్పుడు ఆ రికార్డుకు ఆ దేశం క్రమంగా దూరమవుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది. మునుపటి తరంతో పోల్చితే ఆ దేశస్థులు క్రమంగా పొడుగు తగ్గిపోతున్నారు. 1980లో పుట్టిన వారితో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొట్టిగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ భూ ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కువ ఎత్తున్న జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్స్ నిలవడం విశేషం. ప్రస్తుతం ఆ దేశంలో 19 ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు (182.9 సెం.మీ) కాగా, యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు (169.3 సెం.మీ)గా ఉంది. 1980లో పుట్టిన మునుపటి తరంతో పోల్చితే 2001లో పుట్టినవారు సరాసరిగా కనీసం 1 సెంటీ మీటర్ ఎత్తు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మహిళలు 1.4 సెం.మీ మేర ఎత్తు తగ్గిపోయారు. ఆ దేశంలోని 19 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 7,19,000 మంది ఎత్తుపై ఈ సర్వే నిర్వహించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ ఎత్తు తగ్గడానికి కారణాలివే.... నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు తగ్గిపోవడానికి గల కారణాలను ఆ దేశ ప్రభుత్వ సంస్థ సీబీఎస్ విశ్లేషించింది. సరైన పౌష్టికాహారం తీసుకోనందునే వారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నట్లు పేర్కొంది. పౌష్టికాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే తరం ఎత్తు మరింత తగ్గిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఆ దేశంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా అప్పట్లో చిన్నారులు సరైన పౌష్టికాహారానికి దూరమై ఉండవచ్చని భావిస్తున్నారు. అది వారి ఎత్తు తగ్గడానికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బాల్యంలో సరైన వసతులు లేకపోవడం కూడా వారి ఎత్తును ప్రభావం చేస్తుందని పేర్కొన్నారు -
బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం
డ్రెస్ అయినా, చీర అయినా కాస్త పొడవుగా ఉన్నవాళ్లకు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇంకాస్త పొడవుంటే నా పర్సనాలిటికీ ఈ డ్రెస్ బాగా నప్పుతుంది అని టీనేజ్ అమ్మాయిల నుంచి పెళ్లయిన మహిళల వరకు అంతా తెగ మదనపడుతుంటారు. వీళ్లు ఇలా ఫీల్ అవుతుంటే రుమేసా మాత్రం ప్రపంచంలో నా అంతా ఎత్తు ఎవరూ లేరు, ప్రపంచంలో నేనే పొడవైన మహిళనంటోంది. అనడమేకాదు తన పేరుమీద గిన్నిస్ రికార్డులను కూడా తిరగ రాసేస్తుంది. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు 7 అడుగుల 0.7 (215.16 సెంటీమీటర్లు) అంగుళాలతో ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా నిలిచింది.అయితే రుమేసా గిన్నిస్బుక్ను రికార్డు నెలకొల్పడం ఇది తొలిసారి కాదు. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి టాలెస్ట్ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది. అప్పుడు రుమేసా ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి. అయితే రుమేసాకంటే ముందు ప్రపంచంలో పొడవైన మహిళ రికార్డు చైనాకు చెందిన యోడిఫెన్ పేరు మీద ఉంది. ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు (233.3 సెంటీమీటర్లు), ఈమె 2012లో మరణించింది. ప్రపంచంలోనే అతిపొడవైన వ్యక్తి కూడా టరీ్కకి చెందిన వారు కావడం విశేషం. జీవించి ఉన్న అతిపొడవైన వ్యక్తి సుల్తాన్ కొసెన్ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్ జిన్లియన్ పేరు మీదే ఇప్పటికీ రికార్డు ఉంది. ఆమె ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం(246.3 సెంటీమీటర్లు). జెంగ్ 1982లో మరణించారు. వీవర్ సిండ్రోమ్.. రుమేసా వీవర్ సిండ్రోమ్ కారణంగా ఇంత పొడవు పెరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లలో అస్థిపంజరం సాధారణం కంటే అధికంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్నవాళ్లు స్వయంగా నడవడం కూడా కష్టమే. ఎక్కువగా వీరు ఇతరుల సాయం లేదా వీల్ చెయిర్, వాకర్ స్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రుమేసా ఎక్కువగా వీల్ చెయిర్‌ను వాడుతుంది. తనకు ఈ సిండ్రోమ్ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడకపోగా తనలాంటి వారికి..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య అని, దీనిని అంగీకరించి ధైర్యంగా ఉండాలని చెబుతోంది. ప్రతి ప్రతికూలతకు ఒక అనుకూలత ఉంటుంది. అది బయట పడేంతవరకు వేచి ఉండి, మనలో ఉన్న సామర్థ్యాలతో ముందుకు సాగాలని చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ ఇన్ఫ్రా జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ‘క్రౌన్’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటివరకు దక్షిణ భారతంలో 50 అంతస్తులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానాన్ని భాగ్యనగర ‘క్రౌన్’ సొంతం చేసుకుంది. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్.. హైదరాబాద్‌కు చెందిన సాస్ ఇన్ఫ్రా కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్ పేరిట జీ+57 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. భవనం ఎత్తు 228 మీటర్లు. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్మెంట్ విస్తీర్ణాలుంటాయి. ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించామని సాస్ ఇన్ఫ్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 60–70 యూనిట్లు విక్రయమయ్యాయని.. 2025 తొలి త్రైమాసికం నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా రానున్నట్లు చెప్పారు. ♦నానక్‌రాంగూడలో మూడు బేస్మెంట్లు 32 అంతస్తులలో ఆక్రోపోలిస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సుమధుర నిర్మాణ సంస్థ.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+44 అంతస్తుల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 5.06 ఎకరాల విస్తీర్ణం 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఒలంపస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో 854 యూనిట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.7,499లుగా నిర్ణయించామని సుమధుర వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు. చదవండి : Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ ఎక్కడ వస్తున్నాయంటే? ♦నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వస్తున్నాయి. ♦ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణమని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే ఈ తరహా నిర్మాణాలే సరైనవి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో నిర్మాణాలు కేవలం 20 శాతం లోపు ఉండటం మంచి పరిణామం. ఫలితంగా మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. హైరైజ్ ఉన్న చోట అభివృద్ధి.. హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయి. ల్యాండ్‌మార్క్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్ కపుల్స్ ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారని సుమధుర సీఎండీ మధుసూదన్ తెలిపారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే? ♦సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. ♦హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ♦ప్రతి అంతస్తుని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి. ♦ఆయా భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి. ట్రాఫిక్ అసెస్మెంట్ను పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే అనుమతులను జారీ చేయాలి. లాభాలు ఏంటంటే? ♦ఎత్తైన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, విధానపరమైన నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన ♦వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ♦ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. చుట్టూ పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ♦ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ♦ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు. -
వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు!
మీరట్: పుట్టినప్పుడే రెండడుగులు పొడువు, ఆరున్నర కిలోల బరువుతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కరణ్ సింగ్ ఇప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆరడుల ఆరు అంగుళాల ఎత్తు పెరిగి అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. బడిలో తోటి విద్యార్థుల ముందు తాటి చెట్టంత పొడువు కనిపిస్తున్నాడు. భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన ఈ బాలుడి తల్లి స్వెత్లాన్లా ఏడు అడుగుల రెండు అంగుళాల పొడవుతో దేశంలోనే అత్యంత పొడవైన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఈ బాలుడి తండ్రి సంజయ్ ప్రస్తుం కుమారుడికన్నా కొంత పొడవుగా ఉన్నారు. తాను తల్లికి మించి పొడవు పెరగాలని తన తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కరణ్ సింగ్ చెప్పారు. కానీ తన సైజు దుస్తులు, బూట్లు దొరక్క ఇప్పటికే ఇబ్బంది పడుతున్నానని, భవిష్యత్తులో మరెంత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ తరగతి చదువుతున్న కరణ్ సింగ్ 12 నెంబరు బూట్లు ధరిస్తూ పదవ తరగతి పిల్లలు ధరించే దుస్తులను వేసుకుంటున్నారు. ఇప్పటికే ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో కరణ్ సింగ్ రెండు సార్లు ఎక్కారు. -
టూరిస్టులకు ప్రత్యేకాకర్షణ..!
దేశ భక్తిని చాటే అతి పెద్ద త్రివర్ణ పతాకం.. ఇప్పుడా రాష్ట్రంలో టూరిస్టులకు ప్రత్యేకార్షణగా మారింది. డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకం ఇంఫాల్ ప్రజలను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం అక్టోబర్ 19న పాఠశాల 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మువ్వన్నెల జెండా ఆకాశ హర్మ్యాలను దాటి... రెపరెపలాడుతూ సందర్శకుల గుండెల్లో దేశ భక్తిని నింపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పట్లో వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపియాల్, ఏవీఎస్ ఎమ్ అండ్ బార్, డైరెక్టర్ జనరల్, భారత కోస్ట్ గార్డ్ లు ఈ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిగ్-21 యుద్ధ విమానం కూడ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్మీ కమాండర్, పశ్చిమ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ఆధ్వర్యంలో జూన్ 3న టి-55 రష్యన్ యుద్ధ ట్యాంక్ ను ఈ పాఠశాల ప్రాంగణంలో స్థాపించారు. ప్రస్తుతం క్రీడా దిగ్గజం మిగ్-21 యుద్ధ విమానం, సర్ఫేస్ టు ఎయిర్ పిఛోరా క్షిపణులు, టి-55 యుద్ధ ట్యాంక్ తో పాటు... పాఠశాలకే ప్రత్యేకాకర్షణగా నిలిచిన అతిపెద్ద జాతీయ పతాకం.. వీక్షకులకు అద్భుతాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో మిగిలిన ట్రోఫీల నుంచి ఓ నౌకను కూడా ఏర్పాటుచేస్తే.... ఇదో నావికా ప్రాతినిధ్య కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని.. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జీఎస్ థిల్లాన్ అన్నారు. దేశానికి సైనికులు గర్వకారణమని, వారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం వల్ల రక్షణ సేవలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనతో కలగడంతోపాటు, వారిపై మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రతిష్టించిన చోటే గణపయ్యకు వీడ్కోలు
-
అతి పెద్ద ఏకశిలా వినాయకుడి విగ్రహం