ఫెన్రిర్... ఒక అడుగు 6.83 అంగుళాలతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన విలియం జాన్ పవర్స్‌కు పిల్లులంటే ఇష్టం. ఆయన పెంచుతున్న పిల్లుల్లో ఒకటైన ఫెన్రిర్ అనాట్రెస్ పవర్స్... సవన్నా జాతి హైబ్రిడ్ పిల్లి. భుజం నుంచి కాలి వరకు... 18.83 అంగుళాల పొడవు ఉంది. 2016లో ఇదే జాతికి చెందిన మరో పిల్లి ఆర్కురస్.. 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డును సొంతం చేసుకుంది.
ఆ తరువాత ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అది మరణించింది. అయినా ఇప్పటికీ రికార్డుల్లో ఎత్తయిన దేశీయ పిల్లి అదే. ఇక బతికి ఉన్న ఎత్తైన పిల్లిగా రికార్డు ఫెన్రిర్‌దే! విలియం దగ్గర ఇలాంటి పిల్లులు ఇంకా ఉన్నాయి. అతని పిల్లుల్లో ఒకటైన ఆల్టేర్ అతి పొడవైన తోక 16.07 అంగుళాలు కలిగిన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. దీనికంటే ముందు.. సైనస్ అనే మరో పిల్లి అతిపొడవైన తోక 17.58అంగుళాలతో రికార్డు నెలకొల్పింది.
(చదవండి: గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత కంపెనీ కలుషిత సిరప్ వల్లే!)
Comments
Please login to add a commentAdd a comment