అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ | Scientists 3D Mapping Study Satellite Pictures To Discover Tallest Tree | Sakshi
Sakshi News home page

అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ

Published Sun, Oct 9 2022 8:54 PM | Last Updated on Sun, Oct 9 2022 9:13 PM

Scientists 3D Mapping Study Satellite Pictures To Discover Tallest Tree - Sakshi

బ్రెజిలియన్‌, బ్రిటిష్‌ పరిశోధకులు బృందం 2019లో త్రీడీ మ్యాపింగ్‌ ప్రాజెక్టు అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఒక అత్యంత ఎత్తైన చెట్టును కనుగొన్నారు. దీంతో వారిలో ఆ చెట్టు గురించి ఏదో తెలియని కుతుహలం కలిగింది. ఎలాగైనా ఆ చెట్టు గురించి తెలుసుకోవాలి, అక్కడకు చేరుకుని ఆ చెట్టును చూడాలి అని పరిశోధకులు అనుకున్నారు. ఈ మేరకు శాస్తవేత్తల బృందం ఈ చెట్టుని అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ అడవుల్లో ఉన్నట్లు గుర్తించింది.

ఇది ఎంజెలిమ్‌ వెర్మల్హో అని పిలిచే డినిజియా ఎక్సెల్సా చెట్టు. ఈ చెట్టు ఎత్తు 30 అంతస్థుల భవనం అంత ఎత్తు ఉంటుంది. ఈ చెట్టు వద్దకు వెళ్లేందుకు శాస్తవేత్తలు మూడేళ్లుగా అనేక రకాలుగా ప్లాన్‌లు వేశారు. అందుకోసం సుమారు ఐదుసార్లకు పైగా అమెజాన్‌ అడవుల్లో పర్యటించారు. ఎట్టకేలకు సెప్టెంబర్‌17న ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది దట్టమైన అమెజాన్‌ అడవుల్లో ఉండటం వల్ల చేరుకోవడం కష్టమైంది.

దాదాపు రెండు వారాలకు పైగా ట్రెక్కింగ్‌ చేసి ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ చెట్టు 9.9 మీటలర్ల చుట్టుకొలతతో దాదాపు 290 అడుగుల పొడవు ఉంది. ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అ‍ధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement