టూరిస్టులకు ప్రత్యేకాకర్షణ..!
దేశ భక్తిని చాటే అతి పెద్ద త్రివర్ణ పతాకం.. ఇప్పుడా రాష్ట్రంలో టూరిస్టులకు ప్రత్యేకార్షణగా మారింది. డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకం ఇంఫాల్ ప్రజలను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం అక్టోబర్ 19న పాఠశాల 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మువ్వన్నెల జెండా ఆకాశ హర్మ్యాలను దాటి... రెపరెపలాడుతూ సందర్శకుల గుండెల్లో దేశ భక్తిని నింపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పట్లో వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపియాల్, ఏవీఎస్ ఎమ్ అండ్ బార్, డైరెక్టర్ జనరల్, భారత కోస్ట్ గార్డ్ లు ఈ జెండాను ఆవిష్కరించారు.
ఇప్పటికే డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిగ్-21 యుద్ధ విమానం కూడ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్మీ కమాండర్, పశ్చిమ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ఆధ్వర్యంలో జూన్ 3న టి-55 రష్యన్ యుద్ధ ట్యాంక్ ను ఈ పాఠశాల ప్రాంగణంలో స్థాపించారు. ప్రస్తుతం క్రీడా దిగ్గజం మిగ్-21 యుద్ధ విమానం, సర్ఫేస్ టు ఎయిర్ పిఛోరా క్షిపణులు, టి-55 యుద్ధ ట్యాంక్ తో పాటు... పాఠశాలకే ప్రత్యేకాకర్షణగా నిలిచిన అతిపెద్ద జాతీయ పతాకం.. వీక్షకులకు అద్భుతాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో మిగిలిన ట్రోఫీల నుంచి ఓ నౌకను కూడా ఏర్పాటుచేస్తే.... ఇదో నావికా ప్రాతినిధ్య కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని.. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జీఎస్ థిల్లాన్ అన్నారు. దేశానికి సైనికులు గర్వకారణమని, వారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం వల్ల రక్షణ సేవలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనతో కలగడంతోపాటు, వారిపై మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.