Tricolour
-
Independence Day- 2024: ఆ 13 గ్రామాల్లో తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలు
భారతదేశంలో నేటివరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలిస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో నేటి వరకూ జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఈరోజు (పంద్రాగస్టు) ఈ గ్రామాల్లో మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది.ఈ వివరాలను రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ గ్రామాల్లో నూతన భద్రతా బలగాల శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. బస్తర్ రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్రాజ్ ఈరోజు (గురువారం) నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.గత ఏడాది గణతంత్ర దినోత్సవాల అనంతరం ఈ ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. కొత్త క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం ఉదయం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేయనున్నారని అధికారులు తెలిపారు. -
యూపీలో బీజేపీ త్రివర్ణ పతాక మార్చ్
లక్నో: ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘త్రివర్ణ పతాక మార్చ్’నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ నిర్ణయించింది. ఆదివారం(ఆగస్టు11) నుంచి 13 దాకా మూడురోజులపాటు మార్చ్ జరగనుంది. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హర్‌ఘర్‌తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా త్రివర్ణ పతాక మార్చ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు అన్నింటికంటే దేశమే ముందు అని ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. -
టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?
భారత క్రికెట్ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. Indian team jersey for World Cup 2023. pic.twitter.com/q1EYsZebEK — Johns. (@CricCrazyJohns) September 20, 2023 కాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది. టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్ఫుల్గా ఉందని అంటున్నారు. -
వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది. వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా.. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో.. ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు స్పీకర్, లోక్‌సభ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్లు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల న్యాయమూర్తులు ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
స్వాతంత్య్ర వేడుకల్లో సీమా హైదర్.. జేజేలు కొడుతూ..
లక్నో: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్‌తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్‌కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా(ఎమ్ఎన్ఎస్) సీమా హైదర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. #Pakistan national #SeemaHaider was seen hoisting the Tricolour at her house in #Noida as part of #HarGharTiranga campaign ahead of #IndependenceDay.https://t.co/NUvcWcZMeB — IndiaToday (@IndiaToday) August 14, 2023 తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్‌తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. సీమా మిస్టరీ.. 2019లోనే సిమా హైదర్, సచిన్ ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్‌తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: అజిత్‌తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్ పవార్ -
ఇది మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం ఆ పార్టీ కార్యదర్మి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ రాజ్‌ఘాట్ వద్ద సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఆ ప్రసంగంలో.. "మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మా నాన్న(రాజీవ్ గాంధీ) అంతక్రియల ఊరేగింపు తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. భద్రతా బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్‌ఘాట్‌కు వరకు తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపుకి వెళ్లేందుకు ఎలా పట్టుబట్టారో తెలిపింది. అప్పుడూ మా నాన్న మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టారు. అలాంటి అమరవీరుడి తండ్రిని పార్లమెంటులో అవమానించారు. ఆ అమరవీరుడి కుమారుడిని మీరు దేశ వ్యతిరేకి అంటారు. ఈ సందర్భంగా ప్రియాంక పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రస్తావిస్తూ.. ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారో అంటూ హేళన చేశారు. మోదీ తన వ్యాఖ్యలతో మొత్తం కుటుంబాన్నే గాక కాశ్మీర్ పండిట్ల సంప్రదాయాన్నే అవమానించారు. దీనికి మీపై ఎటువంటి కేసు లేదు. అలాగే రెండేళ్ల పదవీకాలంపై వేటు పడదు, అనర్హులుగా ప్రకటించరు కూడా. ఎందుకు ఇలా అని ప్రియాంక ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ.. సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం. ఇదే మా బలం అని రాసుకొచ్చారు. కాగా, ఆమె ఆ ప్రసంగంలో.. అమరులైన ప్రధాని కుమారుడు, పైగా జాతీయ సమైక్యత కోసం వేలకిలోమీటర్లు నడిచిన మహోన్నత వ్యక్తి (రాహుల్) ఎప్పటికీ దేశాన్ని అవమానించలేడని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు. అంతేగాదు ఈ దేశ ప్రధాని పిరికివాడని, అధికారం వెనక దాక్కున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దేశ ప్రజలు కచ్చితంగా అలాంటి దురహంకారి రాజుకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) (చదవండి: తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం! పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్) -
ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం పెట్టడం కాదు.... గుండెల్లో ఉండాలి!
ముంబై: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చేపట్టిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ...కేవలం త్రివర్ణ పతాకన్ని పెడితే దేశభక్తుల కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది అజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా చేస్తున్నారు నిజమే కానీ 75 ఏళ్ల స్వాతంత్య్ర అనంతరం ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి బాల్ థాకరే 1960లో ప్రారంభించిన కార్టూన్ మ్యాగజీన్ మార్మిక్ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఓ వీడియోలో మాట్లాడుతూ...భారత్ బానిసత్వం వైపు వెళ్లడానికి వ్యతిరేకంగా కార్టూనిస్టులు ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు. అయినా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయమంది, కానీ ఎవరో పంపించిన ఒక వైరల్ చిత్రంలో తన వద్ద త్రివర్ణ పతాకం ఉంది గానీ ఇల్లు లేదని ఒక పేదవాడు చెబుతున్నాడని అన్నారు. నేటికీ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనీయులు ప్రవేశిస్తున్నారు. మన ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచితే వాళ్లు వెళ్లిపోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతీయత అనేది మన హృదయాల్లో ఉండాలని గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే సాయుధ బలగాల బడ్జెట్లో కోత పెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. త్రివర్ణ పతాకాన్ని డీపీ పెట్టడం సంతోషమే, కానీ ఇళ్లను వదిలి దేశం కోసం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల బడ్జెట్లో కోత పెట్టడం దురదృష్టమని అన్నారు. అగ్నిపథ్ పథకం పై కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్కి కోంస మీ వద్ద డబ్బు లేదు కానీ రాష్ట్రల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మీ వద్ద డబ్బు ఉందంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. అలాగే బిహార్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క రాష్ట్రంలోని ప్రభుత్వాలను పడగొట్టడమే ధ్యేయంగా బీజేపీ కంకణం కట్టుకుందంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆదిత్యనాథ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు కూడా. (చదవండి: థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. ఫుల్ జోష్‌లో బీజేపీ) -
అమితాబ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 3 రంగుల గడ్డంతో ఫొటో వైరల్
Amitabh Bachchan Republic Day Wishes With Tricolour Beard: బుధవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవ సందర్భంగా సామాన్యులు, రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు బిగ్‌బీ. గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. అయితే అమితాబ్ జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు. మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు బిగ్‌బీ. ఈ పోస్ట్‌పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. 'శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు' అని పులువురు కామెంట్ చేస్తే మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ను పెడుతున్నారు. అలాగే ఈ పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..
న్యూయార్క్: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జేసన్ కిర్క్ మైక్రోస్కోప్‌తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్ అంటారు. ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్ నిర్వహించే ‘స్మాల్ వరల్డ్ కాంపిటీషన్’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి -
StayStrongIndia: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం
కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్ ధైర్యం ఉండు.. కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి. ఇటీవల బూర్జ్ ఖలీఫాపై భారత జెండా రెపరెపలు ఆడించి ‘భారత్ కోలుకో’ అంటూ సందేశం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం... పాలనురుగులు కక్కుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే నయాగార రంగు మారింది. కెనడాలోని ఒంటరియో వద్ద ఉన్న నయాగార జలపాతం భారత జెండా రంగులు అద్దుకుంది. తెల్లగా కనిపించే నయాగారా కాస్త త్రివర్ణ శోభితంగా మారింది. కరోనాతో తీవ్రంగా సతమతమవుతున్న భారత్‌కు ధైర్యం చెప్పేలా ఈ విధంగా కెనడా అధికారులు ఈ విధంగా నయాగారాపై భారత రంగులు వచ్చేలా లైటింగ్ వేశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలిపేందుకు ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు భారత జెండాలోని మూడు రంగులు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగులు వచ్చేలా లైటింగ్ వేశారు. దీంతో నయాగారా త్రివర్ణ శోభితంతో అద్భుతంగా కనిపించింది. ‘ధృడంగా ఉండు భారత్ (స్టేస్ట్రాంగ్ ఇండియా)’ అంటూ సందేశం పంపారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి India is currently facing a surge in cases and losses of life resulting from COVID-19. In a display of solidarity and hope for India, Niagara Falls will be illuminated tonight from 9:30 to 10pm in orange, white and green, the colours of the flag of India. #StayStrongIndia pic.twitter.com/o0IIxxnCrk — Niagara Parks (@NiagaraParks) April 28, 2021 -
అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్ చీఫ్ జెండావిష్కరణ!
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ కేరళలోని ఓ స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. రాజకీయ నేతలు పాఠశాలలో జెండాను ఎగురవేయరాదని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినా ఆయన ఖాతరు చేయలేదు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం పలక్కాడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాలల్లో రాజకీయ నేతలు జెండా ఎగురవేయడం సరికాదని, స్కూల్ అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రమే ఇందుకు అనుమతిస్తామని పలక్కాడ్ జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వ చర్యపై ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. రాష్ట్రంలో వామపక్షాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన దుమారం రేపుతున్నది. -
టూరిస్టులకు ప్రత్యేకాకర్షణ..!
దేశ భక్తిని చాటే అతి పెద్ద త్రివర్ణ పతాకం.. ఇప్పుడా రాష్ట్రంలో టూరిస్టులకు ప్రత్యేకార్షణగా మారింది. డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకం ఇంఫాల్ ప్రజలను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం అక్టోబర్ 19న పాఠశాల 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మువ్వన్నెల జెండా ఆకాశ హర్మ్యాలను దాటి... రెపరెపలాడుతూ సందర్శకుల గుండెల్లో దేశ భక్తిని నింపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పట్లో వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపియాల్, ఏవీఎస్ ఎమ్ అండ్ బార్, డైరెక్టర్ జనరల్, భారత కోస్ట్ గార్డ్ లు ఈ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిగ్-21 యుద్ధ విమానం కూడ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్మీ కమాండర్, పశ్చిమ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ఆధ్వర్యంలో జూన్ 3న టి-55 రష్యన్ యుద్ధ ట్యాంక్ ను ఈ పాఠశాల ప్రాంగణంలో స్థాపించారు. ప్రస్తుతం క్రీడా దిగ్గజం మిగ్-21 యుద్ధ విమానం, సర్ఫేస్ టు ఎయిర్ పిఛోరా క్షిపణులు, టి-55 యుద్ధ ట్యాంక్ తో పాటు... పాఠశాలకే ప్రత్యేకాకర్షణగా నిలిచిన అతిపెద్ద జాతీయ పతాకం.. వీక్షకులకు అద్భుతాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో మిగిలిన ట్రోఫీల నుంచి ఓ నౌకను కూడా ఏర్పాటుచేస్తే.... ఇదో నావికా ప్రాతినిధ్య కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని.. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జీఎస్ థిల్లాన్ అన్నారు. దేశానికి సైనికులు గర్వకారణమని, వారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం వల్ల రక్షణ సేవలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనతో కలగడంతోపాటు, వారిపై మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.