
Amitabh Bachchan Republic Day Wishes With Tricolour Beard: బుధవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవ సందర్భంగా సామాన్యులు, రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు బిగ్‌బీ. గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. అయితే అమితాబ్ జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు.
మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు బిగ్‌బీ. ఈ పోస్ట్‌పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. 'శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు' అని పులువురు కామెంట్ చేస్తే మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ను పెడుతున్నారు. అలాగే ఈ పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment