beard
-
మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. గడ్డం సంరక్షణ, పద్ధతులుగడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండిమంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.కీలక సూచనలుతాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్ -
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. అదిరిన కొత్త లుక్..
కేటీఆర్ ఎప్పుడూ నీట్ షేవ్‌తో డీసెంట్ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. మరి అలాంటి లీడర్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్కు మారిన కేటీఆర్ చిత్రాన్ని చూస్తారా? ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం ఎక్కువ అవ్వడంతో ప్రతి రంగంలోనూ మార్పులు జరుగుతున్నాయి. ఏఐసాయంతో ఇష్టమైన నాయకుల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్‌తో పరిచయం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ అభిమాని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటను ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్‌లో రూపొందించారు. పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్ చేసి కేటీఆర్‌కు పంపించాడు. ఆ ఫొటో కేటీఆర్‌కు బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్‌లో (ట్విటర్)షేర్ చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్ చేస్తున్నా’ అనే క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఆ ఫొటోను షేర్ చేశారు. దాని కింద ‘నేను నా జుట్టు, గడ్డం పెంచుకుంటే’ అని ఓ ట్యాగ్‌లైన్ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది! Tweeting a digitally edited pic sent by an admirer of the Party If only I could grow my hair and beard 😁 pic.twitter.com/foqNr7GjV2 — KTR (@KTRBRS) January 21, 2024 -
జపనీస్ కుర్రాళ్లకు గడ్డం ఎందుకు ఉండదు?
జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్ విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈడీఏఆర్ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది. గడ్డం ఎందుకు పెంచుకోరు? జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు!
పెరిగిన గడ్డం ఓ వరుడి పాలిట శాపంగా మారింది. కొన్ని గంటలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడికి అతడి తండ్రే విలన్ అయ్యాడు. తాను నీట్‌గా షేవింగ్ చేసుకుని రమ్మంటే, వధువు మాటలు విని గడ్డం ట్రిమ్ చేసుకుని వచ్చిన తనయుడిపై కన్నెర్ర చేసిన ఆ తండ్రి ఏకంగా వివాహాన్ని ఆపేశాడు. సంచలనం కలిగించిన ఈ వినూత్న వివాదాన్ని మీరూ చదవండి.. సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగరం పరిధిలోని సూలూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కుమారుడికి వివాహ ఏర్పాట్లు చేశాడు. మూడు నెలల క్రితం పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరు వర్గాల పెద్దలు మూడు నెలలుగా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తనకు కాబోయే భార్యతో ఆ పారిశ్రామికవేత్త తనయుడు నిత్యం ఫోన్లో బీజీ కూడా అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆ వరుడు నిత్యం గడ్డంతో కనిపించే వాడు. పెళ్లి సమయానికి గడ్డం తీసి వేసి నీట్‌గా షేవింగ్ చేసుకోవాలని తండ్రి సూచిస్తూ వచ్చాడు. ఆ మేరకు పెళ్లి గడియల సమయం ఆసన్నమైంది. సోమవారం వివాహం బ్రహ్మాండంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం తండ్రి ఆదేశాల మేరకు బ్యూటీ ఫార్లర్కు వెళ్లి తన గడ్డం తొలగించి నీట్‌గా షేవింగ్ చేసుకునేందుకు వరుడు వెళ్లాడు. అయితే బ్యూటీ ఫార్లర్లో ఏమి జరిగిందో ఏమోగానీ, గడ్డంను ట్రిమ్ చేసుకుని ఇంటికి వచ్చిన తనయుడిని చూసిన తండ్రి ఆగ్రహానికి లోనయ్యాడు. షేవింగ్ ఎందుకు చేసుకోలేదంటూ ప్రశ్నించాడు. వధువుకు నచ్చినందుకేనా. తనకు కాబోయే భర్త గడ్డంతోనే పెళ్లి పీటలు ఎక్కాలని, కాస్త ట్రీమ్ చేసుకుంటే చాలని వధువు సూచించినట్లు తండ్రికి.. వరుడు సమాధానం చెప్పాడు. ఈ సమాధానం తండ్రిని చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడే నాకు గౌరవం ఇవ్వడం మానేసినట్టున్నావ్..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడ్డం తీస్తేనే పెళ్లి అని తేల్చి చెప్పేశాడు. దీంతో ఎవరి మాట వినాలో అయోమయంతో తల్లడిల్లిన ఆ తనయుడు చివరకు తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం వెనక్కి తగ్గని ఆ తండ్రి తన సామాజిక మాధ్యమాల్లో సోమవారం జరగాల్సిన తన కుమారుడి వివాహం ఆగిందని, ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదని ప్రకటించేశాడు. ఇది వధువు కుటుంబం దృష్టికి చేరడంతో వరుడి ఇంటికి పరుగులు తీశారు. తాను చెప్పినట్టుగా గడ్డం తొలగించకుండా వధువు చెప్పినట్టుగా ట్రిమ్ చేసుకొచ్చిన తనయుడు పరిస్థితిని వారికి వివరించాడు. బంధువులు, వధువు కుటుంబం బుజ్జగించినా ఆ తండ్రి ఏమాత్రం తగ్గక పోవడం ఉదయం జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కాగా తన కంపెనీలోని కార్మికులే గడ్డం పెంచితే తాను ఒప్పుకోనని.. అలాంటిది కొడుకే ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు తండ్రి చెప్పడం కొసమెరుపు. ఈ విషయం మీడియాకి తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
మొక్కవోని ధైర్యం.. గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్‌లోకి
అమెరికా మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి. ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్‌తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట. షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది. -
బీటీఎస్ బ్యాండ్ బాయ్స్‌కి గడ్డం ఉంటే.. ఎలా ఉంటుందో చూడండి..
-
అక్కడ మగవాళ్లు గడ్డం లేకుండా ఆఫీసుకి రాకూడదట!
Taliban have enforced a new dress code: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎప్పడూ ఏదో ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ని అమలు చేసింది. దీని ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం లేకుండా కార్యాలయానికి రాకూడదని తెలిపింది. పాశ్చాత్య సూట్లు ధరించకూడదని, తమ తలలను కప్పుకోవడానికి టోపీ లేదా తలపాగాతో పాటు సంప్రదాయ పొడవాటి టాప్స్ , ప్యాంటులు ధరించాలి అని పేర్కొంది. ఈ కోడ్‌ను ఉల్లంఘిస్తే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడమే కాకుండా చివరికి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పైగా గతవారం నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా బాలికలు పాఠశాలలకు హాజరుకాకుండా నిషేధించింది. దీంతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయమై తాలిబన్లకు విద్యాహక్కును గౌరవించమని నొక్కి చెప్పింది. ఆఖరికి పురుషులు, కుటుంబ సభ్యులు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడాన్ని నిషేధించింది కూడా. (చదవండి: రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి) -
సామీ! అది మాస్క్ లేక గడ్డమా... సభలో చమత్కరించిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: ఒక్కోసారి రాజకీయ నాయకులు రాజకీయం పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఛలోక్తులు విసురుకోవడం సహజం. నిజానికి ఆ సెటైర్లు భలే నవ్వుతెప్పించే విధంగానే ఉంటాయి. అవతలి ప్రతిపక్షం నాయకులు కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుని రివర్స్ పంచ్‌లు వేస్తుంటారు కూడా. అచ్చం అలాంటి సంఘటన రాజ్యసభలోలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రాజ్యసభలో జరుగుతున్న సమావేశంలో బీజేపీ ఎంపీ సురేష్ గోపీ వంతు రాగానే ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నారు. ఆయన మళయాళం నటుడు కూడా. అయితే ఆయన సమావేశంలో లేచి నిలబడి తన గురించి చెబుతుండగా ఇంతలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘సార్ ఏంటిది? గడ్డమా? లేక మాస్క్? నాకు అర్థకావడం లేదు అంటూ వెంకయ్య చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగి నవ్వులు విరిశాయి. అయితే ఎంపీ సురేష్ ఇది గడ్డమే తన తదుపరి సినిమా కోసం ఇలా పెంచానని వివరణ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగం కొనసాగించమని వెంకయ్యనాయుడు అన్నారు. A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U — Mohamed Imranullah S (@imranhindu) March 27, 2022 (చదవండి: మూడేళ్లుగా సేకరిచిన రూపాయి నాణేలతో డ్రీమ్ బైక్...) -
అమితాబ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. 3 రంగుల గడ్డంతో ఫొటో వైరల్
Amitabh Bachchan Republic Day Wishes With Tricolour Beard: బుధవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవ సందర్భంగా సామాన్యులు, రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు బిగ్‌బీ. గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. అయితే అమితాబ్ జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు. మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు బిగ్‌బీ. ఈ పోస్ట్‌పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. 'శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు' అని పులువురు కామెంట్ చేస్తే మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ను పెడుతున్నారు. అలాగే ఈ పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
మామూలోడు కాదుగా..! గడ్డంతో 63 కేజీల యువతిని ఎత్తాడు.. రికార్డు కొట్టాడు!!
Guinness World Record Man Lifting 63 kg Woman Using Beard: గిన్నీస్ వరల్డ్ రికార్డు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు 63 కేజీల మహిళలను పైకి ఎత్తుతాడు. ఆ.. ఇలాంటివి చాలానే చూశాం.. అనుకుంటున్నారా! అతను ఎత్తింతి చేతులతో కాదు.. అదే ట్విస్ట్!! ఈ వీడియోలో స్టంట్ చేసిన వ్యక్తి పేరు అంటనాస్ కాంట్రిమాస్. అతని గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా లేపడం కనిపిస్తుంది. మహిళను పైకి ఎత్తేటప్పుడు అతని ముఖంలో బాధ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐతే ఆ బాధంతా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికే భరించానని అంటున్నాడు ఈ గెడ్డం వీరుడు. దీంతో గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటివ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో కామెంట్లతో వైరల్ అవుతోంది. ఇది నిజంగా చాలా అద్భుతం, భిన్నమైన ప్రతిభ అని ఒకరు, ఇతని వెంట్రుకలు దేనితో తయారు చేయబడ్డాయో.. ఇంత స్రాంగ్‌గా ఉన్నాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదిఏమైనప్పటికీ ఇతని గడ్డం గురించి నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
మరో బాంబు పేల్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్ కటింగ్స్ బంద్!
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం లేకుండా విదేశాలు తమ అంతర్గత పాలన విషయంలో జోక్యం చేసుకోకూడదని తాలిబన్ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజాగా మరో అవసరపై కూడా నిషేదం విధిస్తున్నట్లు వారు ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. దాంతోపాటు షాపులలో ఆధ్యాత్మిక పరమైనవి కాకుండా ఇతర సంగీతం వినిపించకుడదని హకుం జారీ చేశారు. తాలిబన్ల పాలానా విధానం చూస్తే వారు పాత ధోరణినే కొనసాగిస్తున్నట్లు ఆ మీడియా పేర్కొంది. ఓ పక్క మారిపోయామంటూనే తమ పాత ధోరణిని పాటిస్తున్న తాలిబన్లు అఫ్గన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమ నగరం హెరాత్‌లో కిడ్నాప్‌కు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను చంపి ఆ మృతదేహాలను తాలిబన్లు బహిరంగంగా వేలాడదీసిన సంగతి తెలిసిందే. చదవండి: Afghanistan: తాలిబన్ల వికృత చర్య.. చంపేసిన వాళ్లని.. -
World Beard Day: చిట్కాలు పాటిస్తే.. ఆకర్షణీయమైన గడ్డం మీ సొంతం
సాక్షి, వెబ్‌డెస్క్: మగవారి అందాన్ని గడ్డం రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ముఖ్యంగా యువత వైవిధ్యమైన ఆకృతుల్లో గడ్డం పెంచి కొత్త ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. కాస్త కొత్తగా కనిపించాలంటే.. గడ్డంలో మార్పు చేస్తే చాలని హెయిర్ స్టైల్ నిపుణులు కూడా సూచనలు ఇస్తారు. అయితే చాలా మంది గుబురుగా గడ్డం పెంచుకొని ఆకర్షణీయంగా కనిపించాలని ఆశపడాతారు. కానీ, తల మీద జట్టు ఉన్నంత ఒత్తుగా గడ్డం రాదు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ రోజు ‘ప్రపంచ గడ్డం దినోత్సవం’. చాలా మంది మంచి గడ్డం పెంచుకొని తమ స్నేహితుల ‘గడ్డం గ్యాంగ్’ లో కలవాలని తహతహలాడుతారు. మంచి గడ్డంతో ట్రెండీగా ఉన్న కొంత మందికి తల జట్టు వలే.. గడ్డం కూడా పలుచబడుతుంది. అలాంటి వారి కోసమే.. గడ్డాన్ని రక్షించుకునే పది చిట్కాలు.. ► షేవింగ్ నిలుపుగా చేయించాలి.. సాధారణంగా గడ్డంను షేవింగ్ చేసుకునే సమయంలో ముఖంపై నుంచి కిందికి, కింది నుంచి పైకి రేజర్‌తో షేవ్ చేస్తారు. అయితే దానికి బదులుగా అడ్డంగా.. కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి షేవ్ చేసుకుంటే గడ్డం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. ► ఆముదం నూనె.. గడ్డం పెరగడానికి ఖరిదైన క్రీమ్‌లు, నూనెలు వాడుతుంటారు కొంతమంది. అయితే వాటి బదులు సహజమైన ఆముదం నూనెతో ప్రతి రోజు రాత్రి ముఖానికి మర్ధనం చేసుకుంటే గడ్డం దట్టంగా పెరుగుతుంది. ► ఆలివ్ ఆయిల్.. ముఖానికి ఆలివ్ ఆయిల్ మర్ధనం చేయడం వల్ల గడ్డం సంమృద్ధిగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్‌కు జట్టు పెంచే సామర్థ్యం ఉన్నట్లు ఆయుర్వేదం కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. ► సరైన ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల జట్టుతో పాటు గడ్డం కూడా పలచబడతూ ఉంటుంది. అయితే గడ్డం బాగా పెరగాలంటే.. కాలీఫ్లవర్, బీన్స్, అరటిపండ్లు, సోయాబీన్, గుడ్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ కూరగాయాలను ఆహారంలో భాగం చేసుకుంటే గడ్డం పెరుగుదల సంమృద్ధిగా ఉంటుంది. ► కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె జట్టును సంరక్షించడంతో పాటు గడ్డం పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే కొబ్బరి నూనెతో పాటు రోజ్మేరీ ఆయిల్‌ను తగిన పాళ్లలో కలిపి మర్ధనం చేసుకోవటం వల్ల గడ్డం పెరుగుదలకు మేలు చేస్తుంది. ► ఫేషియల్ మసాజ్.. ముఖంపై గడ్డం పెరగాలంటే ప్రతి రోజు ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవటం వల్ల రక్త సరఫరా మెరుగువుతుంది. దాని వల్ల జట్టు కుదుళ్లకు పోషకాలను రవాణా బాగా జరుగుతుంది. దాంతో గడ్డం వేగంగా, దట్టంగా పెరుగుతుంది. ► పొగతాగటం మానేయాలి.. పొగతాగటం వల్ల జట్టు పెరగటం తగ్గిపోతుంది. సిగరేట్లలో ఉండే నికోటిన్ రక్త సరఫరా వేగాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రభావం జట్టు, గడ్డం పెరగటంపై పడుతుంది. ► ఒత్తిడి దూరంగా ఉండాలి.. ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల కూడా జట్టు ఎదుగుదల మందగిస్తుంది. ముఖంపై ఉండే గడ్డం పెరుగుదలలో దాని ప్రభావం కనిపిస్తుంది. ఒత్తిడి వల్ల విడదలయ్యే కొన్ని హార్మొన్లు గడ్డం ఎదుగుదలను అడ్టుకుంటాయి. ► మంచి నిద్ర కచ్చితంగా శరీరానికి కావల్సినంత సమయం నిద్ర పోవాలి. తగినంత నిద్ర పోవటం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు సరైన క్రమంలో ఉంటాయి. మంచి నిద్రతో జట్టు రాలిపోకుండా గడ్డం దట్టంగా ఉంటుంది. -
మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మీసాలతో ఉన్న పెద్దమనుషులు కనిపిస్తారు. యాభై ఏళ్లు దాటిన వాళ్లందరూ దాదాపు మీసం రాయుళ్లే. మీసాల గురించి ఎవరినైనా అడిగినా.. ‘మగోడు అన్నప్పుడు మీసం ఉండాలె. మీసం ఉంటేనే రోషం ఉంటది’ అనే సమాధానం వస్తుంది. ‘మా తండ్రి, తాత, ముత్తాతలు పెంచిండ్రు. మేం గూడ పెంచినం’ అంటారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్‌లో దాదాపు 100 మందికి పైనే మీసం రాయుళ్లు ఉంటారు. పది మందిలో ఏడెనిమిది మందికి కచ్చితంగా మీసాలు ఉంటాయి. మగవాళ్లకు మీసాలు ఉండాలని, ఆ దర్పం వేరేగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొందరైతే నలుగురిలో నిలబడినప్పుడు మీసాలను మెలేస్తుంటారు. ఆ ఊరికి కొత్తగా ఎవరొచ్చినా మీసం రాయుళ్లను ఆసక్తిగా చూస్తారు. తాము మాత్రం బతికున్నన్ని రోజులు మీసాలను కాపాడుకుంటామని చెబుతున్నారు. మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు తాతల కాలం నుంచి మగవాళ్లందరూ మీసాలు పెంచుతున్నారు. మా తాత నుంచి మా తండ్రికి అబ్బింది. నాకు కూడా మీసం మీద అభిమానంతోని పెంచినా. ఇప్పటికీ మీసాలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. మీసం తిప్పితే ఆ సంతోషం వేరేగా ఉంటది. ఇప్పటోళ్లు మీసాలన్నీ గీకేసుకుంటున్నరు. – కడెం లస్మయ్య మా అన్నదమ్ములందరికీ మీసాలున్నయి మేం ఆరుగురం అన్నదమ్ములం. అందరికీ మీసాలు ఉన్నయి. మా తాతలు, తండ్రుల నుంచి మా అన్నలు అందరూ పెంచిండ్రు. ఆళ్లను చూసి నేను గూడ పెంచిన. మీసం ఉంటే అందరూ గొప్పగ జూస్తరు. మా ఊళ్లె చానా మంది మీసాలతోనే ఉంటరు. –బందంల అశోక్ -
గడ్డం తీయనందుకు ఎస్సైపై సస్పెన్షన్ వేటు
లక్నో: గడ్డం చేసుకోనందుకు ఓ ఎస్ఐని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుది. వివరాలు.. ఇంటెసర్ అలీ బాగ్పత్ ఎస్ఐగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డం చేయించుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే మూడు సార్లు ఆదేశించారు. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇంటెసర్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్బంగా బాగ్పత్ ఎస్పీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. ‘పోలీసు మాన్యువల్ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉంది. మిగతావారందరూ నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందే. ఒకవేళా గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించాము. అతడు దానిని పాటించలేదు.. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకున్నాడు. దాంతో సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. ఇంటెసర్ మాట్లాడుతూ.. ‘గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ నేను దరఖాస్తు చేశాను.. కానీ స్పందన రాలేదు’ అని తెలిపారు. (చదవండి: ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!) -
సింగం స్టైల్లో.. ధోని న్యూలుక్
దుబాయ్ : మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు భారత క్రికెట్లో సరికొత్త కొత్త చరిత్ర. హెలికాప్టర్ షాట్ కొట్టినా.. జుట్టుపెంచినా.. జుట్టు కత్తిరించినా.. మైదానంలో కెప్టెన్‌గా ఎన్నో మ్యాచ్‌లు కూల్‌గా గెలిపించినా.. ఓడినా ఇలా ధోని ఏంచేసినా క్రికెట్ అభిమానుల్లో అవి చర్చనీయాంశంగా నిలిచాయి. అయితే తాజాగా.. సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ న్యూలుక్ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఎంతోకాలం నుంచి మైదానంలో ధోనిని చూడాలనుకుంటున్న వారికి తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు. ధోనీ ప్రస్తుతం సింగం స్టైల్లో కాస్త ట్రిమ్ చేసుకొని డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అయితే ధోని న్యూలుక్‌పై అతడి అభిమానులు సోషల్ మీడియాలో వివిధ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ న్యూజిలాండ్- టీమీండియా మ్యాచ్‌లో ధోని చివరిసారిగా కనిపించాడు. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ('ధోని.. నిజంగా నువ్వు అద్భుతం') Thala #Dhoni In singam Look 😍🔥#SooraraiPottru #ipl2020schedule pic.twitter.com/YmT0yloTbE — Suriya Fans Members ™ (@SuriyaFCMembers) September 19, 2020 -
'ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపించాం'
సాక్షి, చెన్నై: గృహ నిర్బంధంలో పెరిగిన గడ్డంతో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపినట్లు తమిళనాడులోని బీజేపీ శ్రేణులు ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు నాటి నుంచి గృహనిర్బంధంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫొటో ఇటీవల ఇంటర్నెట్ ద్వారా బయటకు వచ్చింది. గతంలో ఎప్పుడూ శుభ్రంగా షేవింగ్ చేసుకునే ఒమర్ అబ్దుల్లా ఆ ఫొటోలో దట్టంగా గడ్డం పెరిగిన స్థితిలో వృద్ధునిలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఈ ఫొటోను మాధ్యమాల్లో పెట్టినట్లు సమాచారం. అంతేగాక పలుపార్టీల నేతలు ఉమర్ అబ్దుల్లాకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ నేతలు ఉమర్ అబ్దుల్లా ఫొటోను హేళన చేశారు. ఉమర్ అబ్దుల్లాతో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలంతా స్వేచ్ఛగా తిరుగుతుండగా ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతేగాక అమేజాన్ ద్వారా షేవింగ్ రేజర్‌ను జమ్ముకశ్మీర్‌లోని ఉమర్ అబ్దుల్లా విలాసానికి బుక్ చేశారు. దయచేసి దీనిని స్వీకరించండి, ఏదైనా అవసరమైతే మీ కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోండని ట్వీట్ చేశారు. (ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్) -
మీ గడ్డం బిరుసుగా ఉందా?
కొంతమందికి గడ్డం చాలా బిరుసుగా ఉంటుంది. అలాంటి పురుషులకు షేవ్ చేసుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. మరికొందరికి గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలన్నీ ఒకే పాటర్న్‌లో ఉండవు. అక్కడక్కడా సుడి తిరిగినట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు షేవింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సురక్షితమైన షేవింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ ప్రక్రియ మెత్తగా, హాయిగా, సాఫీగా జరుగుతుంది. అంతేకాదు... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా కూడా చూసుకోవచ్చు. షేవింగ్ ప్రక్రియ మృదువుగా జరిగిపోడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు/సూచనలివి... ►బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు ఒక షేవింగ్‌కు ముందుగా న్యాప్కిన్ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని కాసేపు చుట్టుకుని ఉండాలి. అలా చేశాక షేవింగ్ చేసుకుంటే... అప్పటికే వెంట్రుకలు బాగా తడిసి మెత్తబడి ఉండటం వల్ల అవి తేలిగ్గా కట్ అవుతాయి. ►గడ్డంలోని వెంట్రుకలు మెలి తిరిగి ఉన్నచోట అవి సరిగా కట్ కాలేదనుకోండి. అప్పుడు ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరలా మాటిమాటికీ షేవ్ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి మంట పుడుతుంది. ఆ గాయం మిమ్మల్ని రోజంతా బాధపెడుతూనే ఉంటుంది. ►గడ్డంలో సుడులు మెలితిరిగిన ప్రదేశాలు మీ షర్ట్ కాలర్ ఉండే ప్రాంతంలోనే ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో మీరక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్ చేసుకున్నట్లయితే... ఆ రోజున మాత్రం గట్టిగా, బాగా బిరుసుగా ఉండే కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకండి. వీలైతే కాలర్ లేనివో లేదా మెత్తటి కాలర్ ఉండే డ్రస్ లాంటివో వేసుకోండి. ►మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్ ఇవ్వండి. ►ఎలక్ట్రిక్ రేజర్ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రేజర్‌తో షేవ్ చేసుకునే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచీ కట్ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్)లోకి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతి షేవ్స్లో ఇది మరింత బాధాకరంగా పరిణమించే అవకాశాలుంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిది. -
‘మగవారిలా గడ్డం ఉంది...విడాకులు ఇప్పించండి’
గుజరాత్ : తన భార్య గొంతు మగవారిలా రావడమే కాక గడ్డం కూడా ఉంది...కాబట్టి తనకు విడాకులు మంజూరు చేయాలని కోరిన ఓ వ్యక్తి పిటిషన్‌ను గుజరాత్ అహ్మాదాబాద్ ఫ్యామిలి కోర్టు కొట్టి వేసింది. కోర్టు పిటిషన్లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు. కానీ వివాహం అయిన అనంతరం తాను ఆమె మొహం చూసి ఆశ్చర్యపోయానని ఎందుకంటే ఆమెకు మగవారిలాగా గడ్డం ఉందన్నాడు. అంతేకాక ఆమె గొంతు కూడా మగవారి గొంతులాగానే ఉన్నదని తెలిపాడు. ఈ విషయాల గురించి తన భార్య కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు తనకు చెప్పకుండా మోసం చేశారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇందుకు సమాధానం చెప్పాలని కోర్టు పిటిషన్‌దారు భార్యను కోరింది. అందుకు ఆమె హార్మోన్ల అసమతుల్యం వల్ల తనకు మొహం మీద వెంట్రుకలు ఉన్న మాట వాస్తవమే అని, కానీ వాటిని తొలగించవచ్చని తెలిపారు. తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విడాకులు కావాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. పిటిషన్‌దారు భార్య తరుపు లాయర్ ఈ విషయాలను కోర్టుకు తెలియజేసాడు. వీరిద్దరి వాదనలు విన్న కోర్టు విడాకులు మంజూరు చేయలేమని భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. -
నాకు అత్యంత ఇష్టం కాబట్టే..: కోహ్లి
బెంగళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కార్లంటే విపరీతమైన మోజు. దానిలో భాగంగా పలు రకాలైన కార్లను కోహ్లి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అనేకసార్లు కోహ్లినే స్పష్టం చేశాడు కూడా. అయితే కోహ్లికి తన గడ్డమన్నా చాలా ఇష్టమట. తనకు గడ్డం బాగుండటం వల్లే దానిని పెంచుతూ ఉంటానన్నాడు. తాను ఎక్కువగా గడ్డాన్ని తీయించడాన్ని ఇష్టపడనని కోహ్లి మరోసారి తెలిపాడు. ‘నాకు నా గడ్డం అంటే చాలా ఇష్టం. నాకు గడ్డం బాగుంటుందనే అనుకుంటున్నా. అందుచేత గడ్డాన్ని తీయించి క్లీన్‌షేవ్‌లో కనబడాలని అనుకోను’ అని కోహ్లి తెలిపాడు. అంతకుముందు కూడా తన గడ్డంపై రవీంద్ర జడేజా చేసిన చాలెంజ్‌ను సైతం కోహ్లి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
వరుడికి గడ్డం ఉందని ..పెళ్లిలో..
-
పెళ్లిలో వరుడికి గడ్డం తెచ్చిన తంట..
సాక్షి, భోపాల్(ఖండ్వా) : ఒకప్పుడు పెళ్లిళ్లు కట్నకానుకల విషయంలో తగాదాలు వచ్చి ఆగిపోతుండేవి. ఇప్పుడు వాటికి భిన్నంగా అనవసర విషయాల కారణంగానే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లి కొడుకు స్నేక్ డ్యాన్స్ చేస్తున్నాడన్న కారణంగా ఒకరు, వరుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చారని మరోకరు.. ఇలా చాలా రకాలుగా వధువులు పెళ్లిళ్లు ఆపాలని చూస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. ఏకంగా వరుడికి గడ్డం ఉందని అది గీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లి మండపంలో వధువు మొండికేసి కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోగల అయ్గటీ గ్రామంలో రూపాలీ, మంగల్సింగ్ల వివాహానికి పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి మండపం వద్దకు వరుడు బంధువులతో ఊరేగింపుగా వచ్చాడు. ఆ సమయంలో వరుడిని గమనించిన వధువు.. అతని గడ్డం ఉందని అది తీసేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చుంది. దీంతో వధువు తరుపు బంధువులు వరుడికి గడ్డం గీయించుకొని రమ్మని చెప్పారు. ఇందుకు వరుడు నిరాకరించాడు. వరుడు గడ్డం గీసుకుని రావాలని చెప్పడం వరుడి బంధువులకూ నచ్చలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో పెళ్లికి వచ్చిన వారు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. పోలీసులు మండపానికి చేరుకుని నచ్చజెప్పడంతో వరుడు షేవింగ్ చేసుకునేందుకు అంగీకరించాడు. అప్పటికే ముహుర్త సమయం దాటిపోయింది. దీంతో మరుసటి రోజు ఉదయన్నే మరో ముహూర్తానికి వివాహం జరిపించారు. -
తగ్గాలి.. పెంచాలి!
రామ్‌చరణ్ కొత్త లుక్ చూశారా! గుబురు గడ్డంతో... కాస్త సన్నబడి కొత్తగా ఉన్నారు కదూ. ‘ధృవ’లో ఆరు పలకల దేహంతో ధృడంగా, క్లీన్ షేవ్‌తో కనిపించారు. ఇప్పుడు గుబురు గడ్డం వెనక ఉన్న స్టోరీ ఏంటని ఆరా తీస్తే, అసలు విషయం తెలిసింది. దర్శకుడు సుకుమార్ వెయిట్ తగ్గి, గడ్డం పెంచమని చరణ్‌ని అడిగారట! ఆయన కోరిక మేరకు రామ్‌చరణ్ గడ్డం పెంచుతున్నారు. బరువు కూడా తగ్గుతున్నారు. తగ్గడం కోసం ఫుడ్ హ్యాబిట్స్‌ని కొంచెం మార్చుకున్నారట. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే చరణ్ ఈ కొత్త లుక్‌లో కనువిందు చేయనున్నారు. ఇంకాస్త గడ్డం పెంచుతారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఆల్రెడీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
గడ్డం... కాదు అడ్డం!
పురుషజాతికి ప్రథమ శత్రువు రేజర్ బ్లేడ్. దానినే కనక కనిపెట్టకపోయి ఉంటే మగవాళ్లందరూ ఎంచక్కా మంచి మంచి గడ్డాలతో కళకళలాడుతూ ఉండేవాళ్లు అంటారు గడ్డం ప్రేమికులైన మగవాళ్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొన్ని నెలల క్రితం ‘గడ్డాల మీసాల పోటీ’ జరిగింది బెంగళూరులో. 400 మంది బవిరి గడ్డాల వాళ్లు, కురచ గడ్డాల వాళ్లు, బారు గడ్డాల వాళ్లు, చిట్టి పొట్టి గడ్డాల వాళ్లు పాల్గొన్నారు. వీళ్లలో మీసగాళ్లు కూడా ఉన్నారు. ‘నవంబర్ నెలను నో షేవ్ మంత్‌గా పాటించే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ నెలలో గడ్డాలు గీసుకోకుండా మగవారి ఆరోగ్య సమస్యల పట్ల చైతన్యం కలిగించడమే దీని ఉద్దేశం’ అని నిర్వాహకులు అన్నారు. ‘గడ్డంతో ఇబ్బంది లేదా’ అని అడిగితే, ‘లేదు ఇలాగే బాగుంది’ అని చాలామంది జవాబు చెప్పారు. కొందరు మాత్రం ‘బాగుంది కానీ అన్నం తినేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది’ అని నవ్వేశారు. సంపద అంటే పెద్దనోట్లు చిన్ననోట్లు మాత్రమే కాదు... కేశ సంపద ఉండడం కూడా పెద్ద సంపదే అని ఈ గడ్డం రాయుళ్లని చూస్తే అర్థమయ్యింది. -
గీకకోయి.. గ్రీకువీరుడా!
వన్స్ అపాన్ ఏ టైమ్ గీకితే గ్రీకువీరుడు.. ఇప్పుడు గీకకపోతే క్లీన్ హిట్! హీరోలు.. దర్శకులు.. గడ్డాలు పెంచుతున్నారు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. మన హీరోల పుల్లింగ్ పవర్ అంతా గడ్డంలోనే ఉంది. గడ్డం ఎందుకు పెంచుతున్నారనే చిక్కు ప్రశ్న వీడింది. పెంచితే చాలు.. అందరూ చిక్కుతారట. ఈ గడ్డం బాబుల చిక్కు విప్పుదాం రండి!! ‘మాసిన గడ్డం.. పెరిగిన మీసం.. ఎంత చిరాగ్గా ఉందో ఓసారి అద్దంలో చూసుకోరా!’ - నాన్న క్లాస్ పీకడం కామన్. అమ్మయితే... ‘ఈ అవతారం ఏంట్రా’ అంటుంది. ‘ప్రేమలో ఫెయిలైన పార్వతీశంలా ఎలా ఉన్నావో! ఈ మీసాలు.. గడ్డం.. తీసేయొచ్చుగా’ - గాళ్‌ఫ్రెండ్ కూడా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎవరేమన్నా.. ఏదేమైనా.. యూత్ ఆన్సర్ మాత్రం నో షేవ్. ఎందుకంటే.. అదొక స్టైల్! ఆ స్టైల్‌కి సోషల్ కాజ్ కూడా యాడ్ అయితే.. సూపర్ కదా! ఆ సూపర్ ట్రెండ్‌కి ఈ మంత్ మంచి చాన్స్ గురూ! ‘నో షేవ్ నవంబర్’... ఇప్పుడీ ట్రెండ్... తెలుగులోనూ పాపులర్. మన తెలుగు హీరోలు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ‘నో షేవ్’తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. గడ్డంలో మనోళ్లు హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే.. కుర్రకారు కూడా ఫాలో అయిపోతున్నారు. రీసెంట్గా ‘నో షేవ్’తో నయా లుక్‌లో మన హీరోలు-దర్శకులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు!! ఎప్పుడూ సోగ్గాడిలా చక్కగా క్లీన్ షేవ్‌తో కనిపించే మన్మథుడు నాగార్జునను ఈ మధ్య చూశారా? మీసాలు.. గడ్డాలు.. బాగా పెంచేశారు. నాగార్జున మ్యాన్లీ లుక్ మహిళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కోసం గడ్డం పెంచారాయన. గడ్డంతో గ్రీకు వీరుడు భలే ఉన్నాడంటున్నారు. మహిళాభిమానులు ఎక్కువున్న మరో స్టార్ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ గడ్డంతో కనిపించడం తక్కువే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే షేవింగ్‌కి నో చెప్పేస్తారు. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న ‘గురు’ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి వచ్చేశారు. మొన్నీమధ్య విడుదలైన మారుతి సినిమా చూసినోళ్లు వెంకటేశ్ ‘బాబు లుక్ బంగారం’ అన్నారు. సడన్‌గా ‘గురు’ ఫస్ట్‌లుక్ చూసి ‘వావ్.. వాట్ ఏ ఛేంజ్ గురూ’ అంటూ క్లాప్స్ కొట్టారు. ఇక, విలన్‌గా టర్న్ అయిన మరో సీనియర్ హీరో జగపతిబాబు అయితే గడ్డంతో నయా ట్రెండ్ సెట్ చేశారు. హీరోగా ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో.. ఇప్పుడీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కి అంతకు మించి అభిమానులున్నారు. ముఖ్యంగా ఇప్పటి అమ్మాయిల్లో జగపతిబాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఓ కారణం ఈ గడ్డం లుక్కే. యంగ్ హీరోల పద్ధతులూ మారాయ్! పదిహేనేళ్ల కెరీర్లో లుక్ పరంగా చిన్న ఎన్టీఆర్ ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు. ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ - రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ ‘నో షేవ్’ లుక్స్‌లో కనిపించారాయన. ప్రస్తుతం ఎన్టీఆర్ గడ్డంతోనే ఉన్నారు. బహుశా కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టున్నారు. ‘బాహుబలి’ ప్రభాస్ సంగతి ప్రత్యేకించి చెప్పాలా? ఆ మీసకట్టు.. గడ్డం.. రాజసానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. ‘బాహుబలి’తో పాటు మధ్యలో విడుదలైన సినిమాలకు, ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న దర్శకుడు తేజ సినిమా కోసం రానా దగ్గుబాటి రఫ్ అండ్ టఫ్ గడ్డం మెయిన్టైన్ చేస్తున్నారు. ఇక, ఎప్పుడూ ప్రయోగాలకు ముందుండే మంచు మనోజ్ రానున్న ‘ఒక్కడు మిగిలాడు’లో చనిపోయిన ఎల్.టి.టి.ఇ. అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ లాంటి గెటప్‌లో గడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు. సెట్స్‌పై ఉన్న ‘గుంటూరోడు’లో గడ్డంతోనే లవ్లీగా కనిపించనున్నారు. ‘హైపర్’ తర్వాత కొత్త సినిమా ఏదీ అంగీకరించని రామ్.. మరికొంతమంది హీరోలు గడ్డంతో దర్శనమిస్తున్నారు. చూడబోతుంటే... ఈ గడ్డం గ్యాంగ్ లిస్ట్‌లో చాలామంది చేరేట్లు ఉన్నారు. - సత్య పులగం ‘గడ్డం గ్యాంగ్’లో వీళ్లు పర్మినెంట్! నయా ట్రెండ్ సెట్ చేయాలనో.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో.. ఆ మ్యాన్లీ లుక్‌లో ఓ కిక్కుందనో.. హీరోలు మీసాలు, గడ్డాలు పెంచుతారు. దర్శకులు కూడా పెంచవలసిన అవసరం ఉందా? లేదు కదూ! కానీ, కొందరు దర్శకులు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ.. గడ్డం గ్యాంగ్‌లో పర్మినెంట్ మెంబర్షిప్ తీసేసుకున్నారు. దర్శకుల గడ్డం గ్యాంగ్‌లో ఎవరెవరున్నా.. పేటెంట్ రైట్స్ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏదైనా సినిమా మొదలెడితే, అది పూర్తయ్యేంత వరకూ గడ్డం తీయరాయన. ‘బహుశా.. ఈ గడ్డం తీసేస్తే ప్రేక్షకులు నన్ను గుర్తు పట్టరేమో!’ అనేంతలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ‘సెలూన్‌కి వెళ్లి షేవింగ్ చేయించుకోవడానికి బద్ధకం. నా గడ్డం వెనక కారణం ఇదే’ అని త్రివిక్రమ్ చెప్పినా.. ఆయన్ను చూసి కొంతమంది ఆ స్టైల్ ఫాలో అవుతున్నారంటే అందులో అబద్ధమేమీ లేదు. దర్శక ధీరుడు రాజమౌళికి సెట్స్‌పై ఉన్న సినిమాలోని హీరో లుక్‌ను మెయిన్టైన్ చేయడం అలవాటు. మూడేళ్ల నుంచీ ‘బాహుబలి’ తీస్తున్నారు కదా. ఆ సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాలతో పాటు ఆయన కూడా గడ్డం పెంచుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచినవాళ్లకు ప్రత్యేకంగా ఓ ‘కిట్’ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ఏం ఉంటాయో తెలుసా? గడ్డం, మీసాలు చక్కగా మెయిన్టైన్ చేయడానికి కావల్సిన క్రీములూ, లోషన్లూ. ఆ విషయం పక్కన పెడితే... ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి గడ్డం తీసేస్తారో? ఉంచుతారో చూడాలి. ఆయన వాటం చూస్తుంటే మాత్రం అలాగే కంటిన్యూ అయ్యేట్లే కనిపిస్తున్నారు. ఎక్కడ మొదలైందీ ట్రెండ్! ఆస్ట్రేలియాలో... 1999లో కొంతమంది అడిలైడ్ సిటీ యూత్ రెబెక్కాహిల్, బ్రెట్రింగ్దాల్ ఈ ‘నో షేవ్ నవంబర్’ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీన్నే ‘మువంబర్’ అంటారు. ఈ నెల రోజులూ షేవింగ్ చేయకుండా సేవింగ్ చేసిన డబ్బును క్యాన్సర్‌పై అవగాహన కల్పించిన సంస్థలకు అందిస్తారు. ఈ ఒక్క నెల షేవింగ్ మానేయడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా మగవారు అనారోగ్యం పాలవుతుంటారు. దీనిపై అవగాహన కల్పించడమే ఈ ‘మువంబర్’ టార్గెట్.