లక్నో: గడ్డం చేసుకోనందుకు ఓ ఎస్‌ఐని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుది. వివరాలు.. ఇంటెసర్ అలీ బాగ్‌పత్ ఎస్‌ఐగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డం చేయించుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే మూడు సార్లు ఆదేశించారు. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇంటెసర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్బంగా బాగ్‌పత్ ఎస్పీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. ‘పోలీసు మాన్యువల్ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉంది. మిగతావారందరూ నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందే. ఒకవేళా గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించాము. అతడు దానిని పాటించలేదు.. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకున్నాడు. దాంతో సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. ఇంటెసర్ మాట్లాడుతూ.. ‘గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ నేను దరఖాస్తు చేశాను.. కానీ స్పందన రాలేదు’ అని తెలిపారు. (చదవండి: ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!)
Comments
Please login to add a commentAdd a comment