గడ్డం... కాదు అడ్డం! | Is not a constraint on the chin | Sakshi
Sakshi News home page

గడ్డం... కాదు అడ్డం!

Published Mon, Nov 28 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

గడ్డం... కాదు  అడ్డం!

గడ్డం... కాదు అడ్డం!

పురుషజాతికి ప్రథమ శత్రువు రేజర్ బ్లేడ్. దానినే కనక కనిపెట్టకపోయి ఉంటే మగవాళ్లందరూ ఎంచక్కా మంచి మంచి గడ్డాలతో కళకళలాడుతూ ఉండేవాళ్లు అంటారు గడ్డం ప్రేమికులైన మగవాళ్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొన్ని నెలల క్రితం ‘గడ్డాల మీసాల పోటీ’ జరిగింది బెంగళూరులో. 400 మంది బవిరి గడ్డాల వాళ్లు, కురచ గడ్డాల వాళ్లు, బారు గడ్డాల వాళ్లు, చిట్టి పొట్టి గడ్డాల వాళ్లు పాల్గొన్నారు. వీళ్లలో మీసగాళ్లు కూడా ఉన్నారు.

‘నవంబర్ నెలను నో షేవ్ మంత్‌గా పాటించే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ నెలలో గడ్డాలు గీసుకోకుండా మగవారి ఆరోగ్య సమస్యల పట్ల చైతన్యం కలిగించడమే దీని ఉద్దేశం’ అని నిర్వాహకులు అన్నారు. ‘గడ్డంతో ఇబ్బంది లేదా’ అని అడిగితే, ‘లేదు ఇలాగే బాగుంది’ అని చాలామంది జవాబు చెప్పారు. కొందరు మాత్రం ‘బాగుంది కానీ అన్నం తినేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది’ అని నవ్వేశారు. సంపద అంటే పెద్దనోట్లు చిన్ననోట్లు మాత్రమే కాదు... కేశ సంపద ఉండడం కూడా పెద్ద సంపదే అని ఈ గడ్డం రాయుళ్లని చూస్తే అర్థమయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement