మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు.
ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు.
గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్‌లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు.
గడ్డం సంరక్షణ, పద్ధతులు
గడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి
మంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.
టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం.
ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.
అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్‌ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.
కీలక సూచనలు
తాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి.
B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.
రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్‌ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.
చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
గోవాబీచ్‌లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్
Comments
Please login to add a commentAdd a comment