Oils
-
మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. గడ్డం సంరక్షణ, పద్ధతులుగడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండిమంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.కీలక సూచనలుతాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్ -
కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధరలకు రెక్కలు
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు. కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని హోల్‌సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.వంటనూనెలదీ ఇదే దారి... కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
ఫాస్ట్‌ఫుడ్.. హెల్త్బ్యాడ్! తెల్లగా మారితే.. ఆరెంజ్ కలర్ వేసి మరీ.. వామ్మో!
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్ మానేయాలని సూచించాడు. గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు. సాక్షి, సిరిసిల్లటౌన్: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. రూ.కోట్లలో వ్యాపారం ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్ దందా జరుగుతుంది. నిబంధనలు బేఖాతర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ ప్రభావాలు.. చికెన్ ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. సోయాసాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్ వాడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రైస్ వంటి వంటకాలకు చేతికి దొరికిన పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. టమాట సాస్ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. చిల్లీసాస్ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు. నిబంధనలు పాటించకుంటే కేసులు ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి. మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!) -
డై కానివ్వకండి
తెల్ల వెంట్రుకలను నల్లబరచడానికి వాడే రకరకాల రసాయనాల హెయిర్ డైలతో ఒక ఇబ్బంది ఉంది. అవి మాడుపైన సహజమైన నూనెలను తొలగించి, తెల్లవెంట్రుకల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు, వెంట్రుకల కుదుళ్లునూ బలహీనపరుస్తాయి. దీనివల్ల వెంట్రుకలు రాలడం, బలహీనపడటం జరుగుతుంది. అలా కాకుండా.. డై వాడుతున్నప్పటికీ.. జుట్టుకు పూర్వపుకాంతి పోకుండా ఉండాలన్నా, రసాయనాల రంగుల వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండాలన్నా తరచు కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ఆముదం – కొబ్బరి నూనె టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ నూనెను వేళ్లతో అద్దుకుంటూ జుట్టుకుదుళ్లకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. ఇలా తలంతా పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. రసాయనాలు గాఢత లేని షాంపూల వాడకం మేలు. మందార పువ్వు – ఉసిరి పొడి జుట్టుకు ప్రకృతిసిద్ధమైన మాస్క్. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలమవుతాయి. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడే సమస్య దరిచేరదు. చుండ్రు సమస్య ఉండదు. 2–3 మందార పువ్వులను 2 టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా నూరాలి. మిశ్రమం చిక్కగా తయారవ్వడానికి పెరుగు లేదా కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌లా పనిచేస్తుంది. హెన్నా లేదా గోరింటాకు పొడి చాలా మంది తెలుపు, నలుపులుగా ఉండే జుట్టుకు హెన్నా (గోరింటాకు పొడి)ను మొట్టమొదటి ఎంపికగా వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్ కలర్స్‌లో రసాయనాలు ఉండి జుట్టు ఊడిపోతుందనే భయం వల్ల కూడా చాలా మంది హెన్నా వాడుతుంటారు. తెల్లవెంట్రుకలకు సరైన చికిత్స ఇవ్వాలంటే.. 5–6 టేబుల్ సూన్ల హెన్నా పౌడర్ని తగినన్ని నీళ్లలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 3–4 గంటల సేపు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. -
పండుగ పూట ధరల మంట..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ వంట నూనెలు, పప్పుల ధరలు భగ్గున మండుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడంతో ధరలు ఎగబాకుతున్నాయి. అన్ని రకాల వంట నూనెల ధరల్లో 15% నుంచి 20% వరకు పెరుగుదల ఉండటం, పప్పుల ధరలూ అదే రీతిన పెరుగుతుండటంతో సామాన్యుడి పండుగ సంతోషం ఆవిరవుతోంది. కాగుతున్న నూనెలు...వంట నూనెల ధరలకు ఈసారి రెక్కలొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోవడంతో దిగుమతి సుం కాలు పెరిగి వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో లీటర్‌కు రూ.5 నుంచి 20 దాకా వంట నూనెల ధరలు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో హైదరాబాద్‌లో వంట నూనెల వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు మరింత భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి. సన్ ప్లవర్ ఆయిల్ ధర గతేడాది లీటర్ 90 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ. 98 నుంచి రూ. 100 దాకా ధర పలుకుతోంది. గత నెలతో పోల్చినా ధర రూ. 15 నుంచి రూ. 20కి పెరిగింది. ఇక సామాన్యులు అధికంగా వినియోగించే పాయాయిల్‌కు కూడా కిలో రూ. 85 నుంచి రూ. 90కి పెరిగింది. గత ఏడాది దీని ధర కేవలం రూ.75గా ఉంది. గతంకన్నా రూ. 15 మేర ధరల పెరిగింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం రూ. 100 నుంచి రూ. 120కి పెరిగింది. దేశంలో ఏటా 15 మిలియన్ టన్నుల నూనెలు అవసరం ఉండగా అందులో 8 మిలియన్ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కువగా మలేసియా, ఇండోనేసియాల నుంచి నూనెలు దిగుమతి అవుతోంది. అయితే ఈ రెండు దేశాల నుంచి నూనెల దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయంగా వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. వందకు అటుఇటూగా కంది, పెసర... గత ఏడాది ఖరీఫ్‌లో కందిసాగు 2.91 లక్షల హెక్టార్లకుగాను 2.60 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపైనే ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. అదీగాక దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలోనూ సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో మేలురకం కందిపప్పు ధర రూ. 95–102 మధ్య ఉంది. నల్లగొండ జిల్లాలో కిలో కందిపప్పు రూ. 102 వరకు ఉండగా మహబూబ్‌నగర్‌లో రూ. వందకు అటుఇటుగా అమ్ముతున్నారు. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో కందిపప్పు ధర రూ. 76–80 మధ్య ఉండగా, ఈసారి పెరుగుదల రూ. 20 వరకు ఉంది. గత 20 రోజుల కిందటి ధరలతో పోల్చినా రూ. 10 వరకు ధర పెరిగింది. గత ఏడాది రెండో రకం కందిపప్పు ధర కిలో రూ. 68–70 పలకగా ఈ ఏడాది రూ. 85–90 మధ్య పలుకుతోంది. ఇక పెసర, మినపపప్పు ధరలు సైతం ఆకాశంలోనే ఉన్నాయి. వాటి సాగులో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20 శాతం నుంచి 25 శాతం వరకు ఉంది. పెసర పప్పు గత ఏడాది రూ. 82 ఉండగా ఈ ఏడాది వందకు దగ్గరగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే కిలో రూ. 105 వరకు విక్రయిస్తున్నారు. అన్నింటికన్నా ఎక్కువగా మినపప్పు ధర ఏకంగా కిలో రూ. 115కిపైనే ఉంది. సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోవడంతో దీని ధర నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోరూ. 120 వరకు విక్రయిస్తున్నారు. -
కట్టె గానుగ నూనె.. తాటి బెల్లం!
జాతిపిత గాంధీజీ పుట్టి నేటికి 150 ఏళ్లు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీజీ.. ఆ కల సాకారానికి ఆరోగ్యదాయకమైన మన సంప్రదాయక ఆహార సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. కట్టె గానుగలతో స్వచ్ఛమైన నూనెలు, తాటి బెల్లం వంటి ఆరోగ్యదాయకమైన దేశీ ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని నమ్మి.. ఆ దిశగా సమాజాన్ని నడిపించారు. అయితే, కాలక్రమంలో ప్రపంచీకరణ పుణ్యాన ఇవి మరుగున పడిపోవడం.. ఫలితంగా అనేక జబ్బులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు, చెక్క గానుగ వంట నూనెలు, తాటి బెల్లం వంటి మన సంప్రదాయ విశిష్ట ఆహారాల ద్వారానే జబ్బులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని స్వతంత్ర వైద్యులు, ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నూనె గింజలను సాగు చేస్తున్న రైతులు ఇంటి దగ్గరే సొంతంగా చెక్క గానుగలను స్వల్ప పెట్టుబడితోనే ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేసి, మంచి ఆదాయం గడించవచ్చు. గీత కార్మికుల సొసైటీలకు తాటి, ఈత నీరా తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తే.. తమిళనాడు, కర్ణాటకల్లో మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తాటి బెల్లం ఉత్పత్తిని విస్తృతంగా చేపట్టవచ్చు. తద్వారా గ్రామాల్లోనే వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు ప్రజలకు అమృతాహారాన్ని అందించవచ్చు. మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా వాడదగినది, రోగనిరోధక శక్తిని పెంపొందించేది.. తాటి బెల్లమని నిపుణులు సూచిస్తున్నారు! చెక్క గానుగలు, తాటి బెల్లం తయారీ కేంద్రాల ఏర్పాటుకు శిక్షణతోపాటు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని గాంధీజీ స్ఫూర్తితో నడుస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. మహాత్ముడి బోధనలు నేడు మనకు అందిస్తున్న ఆహార స్వరాజ్య స్ఫూర్తి ఇదే! ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెల(కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్)కు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో, నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. వేరుశనగలు, కుసుమలు, నువ్వులు, కొబ్బరిని సాగు చేస్తున్న రైతులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వీటితో కట్టె గానుగ నూనెలు తీసి అమ్మితే.. ఏడాది పొడవునా మంచి ఆదాయం లభిస్తుంది. కట్టె గానుగలను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు పొందడానికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ తోడ్పాటును అందిస్తున్నది. హైదరాబాద్‌లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామీణ పరిశ్రమల విభాగాధికారి మాడుగుల హరి అందించిన వివరాల ప్రకారం.. రైతులు, రైతు సంఘాలతోపాటు.. రైతులు కానప్పటికీ యువతీ యువకులు కూడా సయితం చెక్క గానుగలను గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కట్టె గానుగల నిర్వహణకు అవసరమైన సాంకేతిక శిక్షణ అందించడంలో ఖాదీ కమీషన్ తోడ్పడుతుంది. ఇప్పటికీ ఎద్దు గానుగలు నడుస్తున్నాయి.. సంప్రదాయ పద్ధతిలో ఎద్దుతో నడిచే కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించడం వ్యయప్రయాసలతో కూడి ఉన్నదైనప్పటికీ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలలో కొందరు ఈ రంగంలో కృషి చేస్తున్న వారు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మైసూరుకు చెందిన దేశిరి సంస్థ నిర్వాహకులు నవీన్(99458 11771) వంటి వారు కూడా ఎద్దుతో నడిచే కట్టె గానుగలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని, నిర్వహించడంతోపాటు ఇతరులకూ సహాయ సహకారాలను అందిస్తున్నారు. మోటారుతో నడిచే కట్టె గానుగలు ఎద్దులకు బదులు 2 హెచ్. పి.– 3 ఫేజ్ మోటారుతో చిన్న సైజు కట్టె గానుగలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్, వార్థాలోని జమన్‌లాల్ బజాజ్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గతంలోనే అభివృద్ధి చేశాయి. వీటిని చాలా తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఆవాల నుంచి వీటి ద్వారా నూనె గానుగ ఆడవచ్చు. 8 గంటల్లో 100–120 కిలోల నూనె గింజలను ఆడవచ్చు. 6“6 అడుగుల చోటు, ఇద్దరు పనివారు చాలు. ధర రూ. లక్ష వరకు ఉంటుందని హైదరాబాద్‌లోని ఖాదీ కమీషన్ అధికారులు తెలిపారు. ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నెల రోజుల శిక్షణ కట్టె గానుగలను గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పుకోవడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, శిక్షణా సదుపాయాలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ అందిస్తున్నది. నాసిక్(మహారాష్ట్ర)లోని డా. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో అభ్యర్థులకు నెల రోజుల శిక్షణ ఇస్తారు. వసతి ఉచితం. శిక్షణ, మెస్ చార్జీలు కలిపి ఒకరికి రూ. 6,400 ఖర్చవుతుంది. ప్రయాణ ఖర్చులు అదనం. ఈ నెల రోజుల్లో గానుగ నిర్వహణలో పూర్వానుభవం లేని వారు కూడా పూర్తిగా నేర్చుకోగలుగుతారని ఖాదీ కమిషన్ అధికారులు తెలిపారు. రైతు/రైతు సహకార సంఘాలు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు/ మహిళా సహకార సంఘాలు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు/ మైనారిటీలు/ ఎస్సీ, ఎస్టీలు/ ఓబీసీలు లేదా వ్యక్తిగతంగా యువతీ యువకులు సైతం ఎద్దుతో నడిచే/ మోటారుతో నడిచే కట్టెగానుగలు నెలకొల్పుకోవడానికి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు పొందవచ్చు. ఇందుకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ తోడ్పడుతుంది. రుణం పొందటం ఎలా? కట్టె గానుగలకు రుణం కావాల్సిన వారు ఖాదీ కమిషన్ వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలించి, అర్హుల ధరఖాస్తులను బ్యాంకులకు పంపుతుంది. బ్యాంకులు ధరఖాస్తుదారులను పిలిచి, వారి వివరాలను తెలుసుకొని, సంతృప్తి చెందితే రుణం మంజూరు చేస్తారు. రుణ మంజూరు తర్వాత ధరఖాస్తుదారులకు 10 రోజులపాటు బ్యాంకు/ ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. రుణ మొత్తంలో 10% ధరఖాస్తుదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొలి విడత రుణాన్ని బ్యాంకు మేనేజర్ విడుదల చేస్తారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సబ్సిడీ (మార్జిన్ మనీ) మొత్తం కోసం బ్యాంకు మేనేజర్ ప్రతిపాదన పంపుతారు. ఆ మొత్తం విడుదలై లబ్ధిదారుల ఖాతాలో డిపాజిట్ అవుతుంది. గానుగ సక్రమంగా నడుస్తూ, నెలవారీ కిస్తీలు సజావుగా చెల్లిస్తూ ఉంటే.. 3 ఏళ్ల తర్వాత ఆ సబ్సిడీ మొత్తం మేరకు అప్పు, వడ్డీతో సహా, తగ్గిపోతుంది. 15%– 35% వరకు సబ్సిడీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రుణాలపై సబ్సిడీ గ్రామీణ జనరల్ అభ్యర్థులకు 25%, అర్బన్ (మునిసిపల్ కార్పొరేషన్/మునిసిపాలిటీ/నగరపంచాయతీ) అభ్యర్థులకు 15% సబ్సిడీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఓబీసీ, మైనిరిటీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు గ్రామీణులకైతే 35%, అర్బన్వాసులైతే 25% వరకు సబ్సిడీ లభిస్తుంది. తాటి/ఈత బెల్లం తయారీపై చెన్నైలో శిక్షణ తాటి, ఈత చెట్ల నీరా నుంచి తయారు చేసే బెల్లం అత్యంత ఆరోగ్యదాయకమైనదని గాంధీజీ ఆనాడే గుర్తించారు. దేశీ ఆహారం విశిష్టతనెరిగిన డా. ఖాదర్‌వలి వంటి నిపుణులు ఇప్పుడూ చెబుతూనే ఉన్నారు. తాటి/ఈత చెట్ల నుంచి స్వచ్ఛమైన ఆహార పానీయం నీరాను సేకరించి బెల్లం, పంచదార, పటిక బెల్లం వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. తయారీ పద్ధతులపై చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పామ్గుర్ అండ్ పామ్ ప్రోడక్ట్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నది. తాటి/ఈత ఉత్పత్తులపై పూర్తిస్థాయి శిక్షణ 4 నెలలు. శిక్షణ ఇప్పించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ సిద్ధంగా ఉంది. చెట్టు నుంచి ఈ ఆహార పానీయాన్ని పులవక ముందు సేకరిస్తే పోషక విలువలతో కూడిన నీరా వస్తుంది. అదే పానీయం పులిస్తే కల్లుగా మారుతుంది. ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోట్ల సంఖ్యలో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. అయితే, వీటి నుంచి ప్రస్తుతం కల్లు మాత్రమే గీస్తున్నారు. ఈ చెట్లన్నీ ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉంటాయి. తమ పొలంలో ఉన్న తాటి/ఈత చెట్ల నుంచి కూడా రైతులు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొందనిదే నీరా సేకరించుకోవడానికి వీలు లేదు. గీత కార్మిక సొసైటీలకు కల్లు గీతకు లైసెన్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కల్లు వినియోగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో లక్షలాది గీత కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నీరా తీయడానికి ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేస్తే తాటి/ఈత నీరాతో బెల్లం తదితర ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. తాటి/ఈత బెల్లానికి షుగర్‌ను పెంచే లక్షణం ఉండదు. మధుమేహం ఉన్న వారు కూడా ఈ బెల్లాన్ని వినియోగించవచ్చని, దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుందని వైద్యులు చెబుతుండటంతో గీత కార్మికులకు మంచి ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం కోసం కట్టె గానుగలను రక్షించుకోవాలి కట్టె గానుగ నూనె ఎంతో ఆరోగ్యదాయకం. చిన్న వయసులోనే మనుషులు లేనిపోని జబ్బుల పాలవడం, అర్థాయుష్షు.. వంటి విపరిణామాలకు తింటున్న ఆహారం సరైనది కాకపోవడమే కారణం. ఎద్దుతో నడిచే కట్టె గానుగతో తీసిన వంట నూనెలు ఎంతో ఆరోగ్యదాయకం. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యానికి కట్టె గానుగ నూనె ఒక ప్రతీక. గ్రామంలో పండే నూనె గింజలు, గ్రామంలో చెట్టు నుంచి వచ్చే కట్టె గానుగ, కట్టె గానుగను తయారు చేసే విశిష్ట నైపుణ్యం కలిగిన కళాకారుడి పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది. మహాత్ముడి స్ఫూర్తిని బతికించుకోవాలన్న తపనతో 2013 శ్రీరామనవమికి తొలి కట్టె గానుగను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ గానుగల సంఖ్య ఐదుకు పెరిగింది. మా గానుగ చూసి కర్ణాటకలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 10 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. జన్యుమార్పిడి పత్తి గింజల నూనెను వంటనూనెలతో కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అటువంటి కల్తీ నూనెల నుంచి మన జాతి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కట్టె గానుగల దేశీ సంస్కతి పరిరక్షణకు అందరం పూనుకోవాలి. కట్టె గానుగ తయారు చేసే కార్పెంటర్లు ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ విశిష్ట కళను కాపాడుకోవాలి. యూనివర్సిటీలు దీనిపై కోర్సు పెట్టాలి. – విజయరామ్, సేవ్ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ ఫోన్లు: 040–27654337, 27635867 ఎవరిని సంప్రదించాలి? చెక్క గానుగలు, తాటి/ ఈత బెల్లం తయారీ యూనిట్లు.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల శుద్ధి యంత్రాల యూనిట్లు.. మామిడి తాండ్ర, పచ్చళ్ల తయారీ, నిమ్మ, అనాస, ఉసిరి, బొప్పాయి, సపోట, అరటి తదితర పండ్లతో తయారు చేసే అనేక ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణలు అందించడానికి ఖాదీ కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర, తెలంగాణవాసులు చెక్క గానుగలు, తాటి/ఈత బెల్లం తయారీ యూనిట్ల ఏర్పాటుపై పూర్తి వివరాలకు.. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ ఆవరణలో గల ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ సంచాలకులు వి. చందూలాల్ లేదా గ్రామీణ పరిశ్రమల అధికారి మాడుగుల హరిని 040–29704463 నంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించచ్చు. www.kvic.org.in -
ఆ నూనెలు గుండెకు ఎందుకు మేలు చేస్తాయంటే..
ఈ రోజుల్లో ఎక్కడ చూసిన గుండె జబ్బులకు సంబంధించిన వార్తలే. కారణాలేవైనా కావచ్చుగానీ.. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు వాడటం, బాగా నిద్రపోవడం అనే రెండు చర్యలతో గుండెజబ్బులతో పాటు గుండెపోటు సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు అంటున్నారు కీనన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బయో మెడికల్ శాస్త్రవేత్తలు. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు (కుసుమ, సోయా, సూర్యకాంతి, ఆలివ్) ఉన్న ఆహారం జీర్ణమైన తరువాత మన శరీరంలో అపోలిపో ప్రొటీన్ (అపో ఏ –4) మోతాదు ఎక్కువ అవుతుందని, రక్తంలో ఈ ప్రొటీన్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఇప్పటికే పరిశోధనల్లో రుజువైందని డాక్టర్ హూ నీ అనే శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాకుండా ఈ అపోలిపో ప్రొటీన్ ఇతర వ్యాధుల విషయంలోను మేలు చేస్తుంది. రక్తంలోని ప్లేట్లెట్లపై ఉండే గ్లైకో ప్రొటీన్‌ను అడ్డుకోవడం ద్వారా ఇది అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూస్తాయని, ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవని వివరించారు. అంతే కాకుండా అపో ఏ –4 ప్రొటీన్ రక్తనాళాల్లో గార పేరుకు పోవడాన్ని తగ్గిస్తుందని, ఈ నూనెలతో కూడిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే పనిచేయడం మొదలుపెట్టి ప్లేట్లెట్ల చురుకుదనాన్ని, ఒకదానితో ఒకటి అతుక్కుపోవడాన్ని తగ్గిస్తుందని వివరించారు. -
పట్టుకున్నారు..
కాకినాడ రూరల్:కాకినాడ పట్టణంలోని రాజాజీ వీధిలోని చందా కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.62 లక్షల విలువైన వంట నూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లను సీజ్ చేసినట్టు కాకినాడ పౌరసరఫరాల శాఖ సహాయ అధికారి పీతల సురేష్ శుక్రవారం వివరించారు. వ్యాపారులు ఏ డోర్ నంబర్ పేరుతో గోడౌన్లు రిజిస్టేషన్ చేయించుకున్నారో అదే గోడౌన్లో సరుకు నిల్వ ఉంచుకోవాల్సి ఉండగా.. చందా కిరాణా షాపు యజమాని కాంతిలాల్ చౌదరి ఒక గోడౌన్‌కు అనుమతి తీసుకొని మరో రెండు గోడౌన్లకు అనుమతులు లేకుండా వంటనూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లు నిల్వ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గోడౌన్లకు కనీసం లైసెన్సు కోసం దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేకుండా గోడౌన్లో స్టాకులను అక్రమంగా ఉంచినందుకు నిత్యవసర వస్తువుల చట్టం 1955 సెక్షన్6ఏ ప్రకారం కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకు నివేదిక పంపినట్టు తెలిపారు. అనుమతులు లేని గోడౌన్లలో 6785 లీటర్ల వంట నూనెలు, 644 కిలోల పంచదార, 250 కిలోల వేరుశనగ గుళ్లు నిల్వ ఉన్నాయని, వీటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.5,62,336 ఉంటుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్ అధిక ధరలకు విక్రయించేందుకు వీలుగా ఈ అక్రమ నిల్వలు ఉంచినట్టు గుర్తించామని సురేష్ తెలిపారు. సీజ్ చేసిన స్టాకును అశోక జనరల్ స్టోర్స్ యజమాని కాంతిలాల్జైన్కు భద్రత నిమిత్తం అప్పగించినట్టు వివరించారు. వంట నూనెలు, పంచదారకు సంబంధించి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా సక్రమంగా రికార్డులు రాయకపోయినా, అనుమతిలేని గోడౌన్లో నిత్యవసర సరుకులు నిల్వ ఉంచినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో కాకినాడ అర్బన్, కరప, కాకినాడ రూరల్ సివిల్ సప్లై అధికారులు ఎం.సూరిబాబు, పి.సుబ్బారావు, ఎ. తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం నవ్వాలంటే.. నువ్వులు
గుడ్‌ఫుడ్ ఇప్పుడంటే మనం వంటకు రకరకాల నూనెలు ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు వంట నూనె అంటే నువ్వులనూనే. అంటే... తిలల నుంచి తీసిందే ‘తైలం’ అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో నువ్వులు అంతగా ఇమిడిపోయాయి. నువ్వులలో ఉన్న మంచి ఆరోగ్యకరమైన పోషకాల జాబితాకు అంతే లేదంటే అతిశయోక్తి కాదు. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్–ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. కాబట్టి శరీరంలో అయ్యే గాయాల రిపేర్‌కు ఇది బాగా తోడ్పడుతుంది. నువ్వుల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటివల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.నువ్వులలో విటమిన్–బి కాంప్లెక్స్‌లోని పోషకాలైన నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటివి మరింత ఎక్కువ. నువ్వుగింజల్లోని బరువులో 50 శాతం మేరకు నూనె పదార్థమే ఉంటుంది. అందులో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని ఛాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. -
బతుకు పచ్చడి
కొండెక్కిన పప్పులు.. నూనెలు గత ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరం పట్టించుకోని ప్రభుత్వం కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. సలసల కాగుతున్న నూనెల ధరలను తలుచుకుని బెంబేలెత్తిపోతున్నాడు. రోజంతా కష్టించినా.. కనీసం కందిపప్పు కూడా కొనలేని పరిస్థితిలో పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నాడు. కొందరైతే.. మజ్జిగనీళ్లు.. రసంతోనే కాలం గడుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి పబ్బం గడుపుకుంటున్న వ్యాపారులను.. వారిని కట్టడి చేయలేని ప్రభుత్వ పెద్దల అసమర్థతను గుర్తుచేసుకుంటూ.. గంజినీళ్లతో గొంతుతడుపుకుంటున్నారు. తిరుపతి: నిత్యావసర వస్తువుల ధరలు జెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. నూనెల రేటు సలసలకాగుతున్నాయి. కూరగాయలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉల్లి ఘాటు తగ్గలేదు. ఎండుమిర్చి ధర పెరుగుతూనే ఉంది. మొత్తం మీద సామాన్యుడు పచ్చడి మెతుకులు కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెడుతూ వ్యాపారులకు కొమ్ముకాస్తోంది. ఒకవైపు అన్నదాత వరుస కరువుతో అల్లాడుతుండగా మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజలను ధరాఘాతం వెంటాడుతోంది. చిన్న తరగతి ఉద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. అర్ధాకలితో కాలం నెట్టుకొస్తున్నారు. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం.. ఈ ఏడాది పప్పుల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దిగుబడులు పడిపోయాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారులు సరుకును బ్లాక్ మార్కెట్‌కి తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పప్పుల ధరలు అమాంతం పెంచేశారు. పప్పు కరువు.. హోటళ్లలో సైజు తగ్గిన ఇడ్లీ, దోసెలు సగటు జీవి ఇంట్లో పప్పు కనుమరుగైంది. హోటళ్లలో సైతం నీళ్ల సాంబారే దర్శనమిస్తోంది. మినప్పప్పు ధర పెరగడంతో ఇడ్లీ, దోసెల పరిమాణం తగ్గిపోయాయి. వేరుశెనగ పప్పు ధర పెరగడంతో నీళ్ల చెట్నీ గతి అవుతోంది. పచ్చడి మెతుకులు తిని కాలం గడుపుదామని అనుకుంటే ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయల ధరలు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చాలామంది తమగోడు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. ధరలపై కొరవడిన పర్యవేక్షణ.. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ధరలు పెరిగినప్పుడు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా సబ్సిడీ ధరలతో సరఫరా చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులకు ఉపయోగపడే కొన్ని వస్తువులనైనా సబ్సిడీ ధరలకు సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు.