జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్‌లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్ విషయంలో ఈ సూత్రం వర్తించదు.
ఈడీఏఆర్ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్‌కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది.
గడ్డం ఎందుకు పెంచుకోరు?
జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment