growing
-
యువత... మరింత క్రియాశీలంగా!
కౌమారదశ అనేది మానవ అభివృద్ధిలో ప్రత్యేకమైన, క్లిష్టమైన దశ. మంచి ఆరోగ్యానికి దీర్ఘకాలిక పునాదులు వేయడానికి కీలకమైన దశ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘ఫ్యూచర్ సమ్మిట్’లో ‘ట్రెండ్స్ ఇన్ అడల్సెంట్ హెల్త్: సక్సెస్ అండ్ చాలెంజెస్ ఫ్రమ్ 2010 టు ది ప్రజెంట్’ పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కౌమరుల ఆరోగ్యం, అలవాట్లౖను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నివేదిక ఇది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... కౌమారదశలో ఉన్న ఏడుమందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాథపడుతున్నారు. నిరాశ, ఆందోళన అనేవి వారిలో తీవ్రంగా కనిపిస్తున్నాయి.కౌమార బాలికలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. కౌమారదశలో ఉన్న పదిమందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. యువతలో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు పెరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలు యువత శారీరక, మానసిక ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది. కౌమారుల ఆరోగ్యం, హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని, పరిశోధన, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని అధ్యయన కర్తలు కోరుతున్నారు. యువత ఏం కోరుకుంటున్నారో నాయకులు వినాలని, వారు క్రియాశీల భాగస్వాములుగా, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండేలా చూడాలన్నారు.ఇవి చదవండి: Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి! -
ఫ్యాషన్ With కాషన్
స్టైల్‌గా కనపడడం కోసం సిటిజన్లు దేనికైనా సై అంటున్నారు. కేశాలకు దట్టించే కలర్స్ నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్ వరకూ తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలని, అందుకోసం దేనికైనా రెడీ అంటున్నారు..ఈ ట్రెండ్ అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని కొనితెస్తోంది. ఫ్యాషన్ ప్రియుల్ని సిటీలో స్కిన్ స్పెషలిస్టులు, ఫిజియో థెరపిస్ట్‌లు... తదితర వైద్యులు, నిపుణుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తోంది. ఏం చేస్తావో నాకు తెలీదు...నా లుక్ చూసి మా కంపెనీలో కొలీగ్స్‌కి మెంటలెక్కాలి....తన హెయిర్ స్టయిలిస్ట్ దగ్గర ఓ ఉద్యోగి ఆర్డర్ లాంటి అభ్యర్థన... వెళ్లేది పేజ్ త్రీ పారీ్టకి.. అక్కడ ఫ్యాషన్ షోని మించిన అవుట్‌ఫిట్స్‌తో వస్తారు.. అలాంటి చోట సమ్‌థింగ్ స్పెషల్‌గా కనపడాలి. దానికి నువ్వేం చెప్పినా నేను రెడీ...పర్సనల్ మేకప్ ఆరి్టస్ట్తో ఓ పేజ్ త్రీ సోషలైట్ అగ్రిమెంట్ లాంటి కమిట్ మెంట్... తలపై మండుతున్న సెన్సేషన్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న షీలా అనే గృహిణిని పరీక్షించిన వైద్యులు ఆమె గతంలో చేయించుకున్న హెయిర్ స్ట్రెయిట్నింగ్ ప్రక్రియే దీనికి కారణమని నిర్ధారించారు. ఆ ప్రక్రియలో భాగంగా ఉపయోగించిన క్రీమ్‌లో గ్లైక్సిలిక్ యాసిడ్ ఆమె చర్మంలో చేరుకుని అక్కడ నుంచి మూత్రాశయాన్ని సైతం దెబ్బతీసిందని తేల్చారు. అధికంగా హెయిర్ డై వాడితే అందులో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్, పీపీడీ తదితర హానికారకాల వల్ల జుట్టు ఊడిపోవడంతో మొదలుపెట్టి అస్తమా, బ్రెస్ట్ కేన్సర్ వంటిప్రాణాంతక వ్యాధులు సైతం రావచ్చని డెర్మటాలజిస్ట్ డా.గీతా ఒబెరాయ్ చెబుతున్నారు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి అవయవాలపైనా, పురుషుల్లో వీర్యోత్పత్తిపైనా దుష్ప్రభావం పడవచ్చని, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి బ్రీతింగ్ సమస్యల వరకూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.ఈ తరహా వస్త్రధారణ వల్ల మెరాల్జియా పెరాస్తటికా అనే నరాల వ్యాధి వస్తుందని కెనడియన్ మెడికల్ ఆసోసియేషన్ జర్నల్ నిర్ధారించింది. అదే విధంగా జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనంలో టైట్ జీన్స్ వల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే సరిస్థితి, దీనితో శరీర కదలికల సమస్యలు రావచ్చని స్పష్టం చేసింది.లిప్‌స్టిక్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే డీహైడ్రేషన్ సహా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లిప్‌స్టిక్‌లో వినియోగించే సర్వసాధారణ రసాయనం ట్రైక్లోజన్ వల్ల హృద్రోగ సమస్యలు రావచ్చని కాలిఫోరి్నయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం నిర్ధారించింది.హైహీల్స్ షూస్ వినియోగం.. మహిళల్లో బోన్ హెల్త్‌పై దుష్ప్రభావం చూపుతోందని, శాశ్వత బ్యాక్‌పెయిన్‌కి, ఆస్టియోపొరోసిస్కి కారణమవుతోంది. ముఖ్యంగా 20–45ఏళ్ల మధ్య వయస్కులపై నిర్వహించిన మ్యాక్స్ హెల్త్ కేర్ అధ్యయనం తేలి్చంది.యువి నెయిల్ పాలిష్ డ్రయ్యర్స్ వినియోగం వల్ల కేన్సర్ల ప్రమాదం పొంచి ఉందని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. నెయిల్ పాలిషితో పాటు షాంపూల్లోని కొన్ని రసాయనాలు 63 శాతం మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం నిర్ధారించింది. హెయిర్ స్ప్రే, ఆఫ్టర్ షేవ్ లోషన్స్‌లో ఉండే హానికారకాలు చర్మం ద్వారా ప్రయాణించి కాలేయాన్ని, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు చెడు చేస్తాయని స్పష్టం చేసింది.రంగుల టాటూ... రోగాల కాటు.. తప్పనిసరిగా స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే టాటూస్ కోసం వెళ్లాలి. సరైన ఆరి్టస్ట్ కాకపోతే అతను రిపీటెడ్ నాన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడితే... హెపటైటిస్ నుంచి ఎయిడ్స్ వరకూ అన్నిరకాల వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకునే ముందు మన చర్మ ఆరోగ్యం గురించి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. టాటూస్ వేసుకున్నాక కనీసం రెండు వారాల పాటు పర్యవేక్షణ అవసరం.రంగు పడుద్దా? లేదా? హెయిర్ డై/కలర్స్, షాంపూలు, కండిషనర్లు... వంటివి ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు అన్నీ కెమికల్స్ మేళవించినవే. వీటి విచ్చలవిడి వినియోగం వల్ల తల ఉపరితల భాగంపై చర్మంతో పాటు విభిన్న రకాల కేన్సర్లకూ ఆస్కారం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ కలర్స్‌లో అత్యధిక శాతం హానికారకాలేనని స్పష్టం చేస్తున్నారు. వీటిని వినియోగించే సమయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి... అలాగే లక్షల్లో ఖర్చుపెట్టి చేయించుకుంటున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్... వంటివి విజయవంతం కావాలంటే తప్పనిసరిగా పూర్తి స్థాయి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. లేదంటే కొత్త సమస్యలు తప్పవు. బ్యాండ్ బాజా... మెమొరీ లేజా... ఇప్పుడు హెడ్ బ్యాండ్స్ వాడకం భారీగానే పెరిగింది. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది. అంతేకాదు మెమొరీ ప్రాబ్లెమ్స్ కూడా రావచ్చని పలువురు నిపుణులు చెబుతున్న మాట. బొట్టు.. జాగ్రత్తగా పెట్టు... నుదుటన బొట్టు.. స్టిక్కర్లలోకి మారిపోయి చాలా కాలమైంది. అయితే వీటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని రకాల స్టిక్కర్స్‌తో పాటు సింధూర్స్ కూడా అలర్జీలను కలిగిస్తాయి. వీలైనంత వరకూ న్యాచురల్, ఆర్గానిక్‌వి వాడడం మంచిది.పియర్సింగ్.. సమ్‌థింగ్ రాంగ్...కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు ఇటీవలో శరీరంలోని అనేక చోట్ల బాడీ పియర్సింగ్‌ను ఇష్టపడుతున్నారు. చెవిపోగుల నుంచి మొదలై ఇప్పుడు వంటి మీద ఎక్కడ పడితే అక్కడ రకరకాల పరికరాలను అతికించుకుంటున్నారు. ఆఖరికి నాలుక మీద కూడా రింగుల్ని గుచ్చుకుంటున్నారు. అయితే ఈ పిచ్చి ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఒకటికి మించి చెవి చుట్టూ కుట్టించుకోవడం. ముఖ్యంగా నాలుక, పెదవి, నాభి వంటి ప్రాంతాల్లోనూ పియర్సింగ్ చేయించుకోవడం, అవేమో ఇమిటేషన్ జ్యుయలరీ కావడం వల్ల స్కిన్ అలెర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలోని సున్నితమైన భాగాలపై జ్యుయలరీ యాడ్ చేయడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తీవ్రమైన ఫ్యాషన్స్ అనుసరించడం అంటే ఒక సైకలాజికల్ సమస్యగా గుర్తించాలని చెబుతున్నారు. దీన్ని అదుపు చేయకపోతే ఇది ట్రాక్షన్ అలోపేసియాకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మితిమీరితే అనర్ధాలే... దాదాపు అన్ని హెయిర్ డైలలో ఉండే పీపీడీ చాలా హానికరం.. దీర్ఘకాలం పాటు వినియోగిస్తే జుట్టు రాలడంతో మొదలై కేన్సర్ల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొంత మందికి దీని రియాక్షన్ వెంటనే తెలుస్తుంది. మరికొంత మందికి చాలా కాలం తర్వాతే బయటపడతాయి. దీనికి బదులు గోరింటాకు, హెన్నా వంటివాటితో ప్యూర్ బ్లాక్ కాకపోయినా, బ్రౌన్ కలర్ వచ్చేలా చేయవచ్చు. హెయిర్ స్ట్రయిటనింగ్ ఇప్పుడు బాగా చేయించుకుంటున్నారు. సాఫ్ట్‌నెస్ కోసం నప్పని రసాయనాలు ఉపయోగిస్తారు. కొన్ని క్రీమ్స్... వల్ల తెల్లగా అయ్యాం అనుకుంటారు గానీ... అవి చర్మం తాలూకు పొరల్ని దెబ్బతీస్తాయి. హానికారక బాక్టీరియాను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మేకప్ వల్ల చర్మం పొడిబారిపోయే చాన్స్ ఉంది. క్లెన్సర్‌తో శుభ్రపరచకపోతే ఆయిల్ బయటకు పోక కురుపులు తయారవుతాయి. పియర్సింగ్ సున్నితమైన అవయవాలపైన చేయించుకోకూడదు. అలాగే టాటూ ఆరి్టస్ట్స్తో చేయించుకుంటే ఇన్ఫెక్షన్లకు అవకాశాలు ఉంటాయి. –డా.డబ్లు్య.జాన్, డెర్మటాలజిస్ట్మేకప్... ఆరోగ్యానికి పేకప్...నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేస్తామని ప్రకటించే మేకప్ ఉత్పత్తుల్లో పరిమితికి మించిన రసాయనాలు వాడుతున్నారంటూ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులను సీజ్ చేయడం దీనికి ఓ ఉదాహరణ.ఫ్యాబ్రిక్... నప్పకపోతే..తిప్పలే...రకరకాల ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన డ్రెస్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఫ్యాషన్‌లో ముందుండాలని పోటీపడుతున్న యువత అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా ఏది కొత్తగా వస్తే దాన్ని వాడేస్తోంది.లిప్స్కి లాస్..ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమైంది. లిప్‌స్టిక్ పేరుతో అధరాలను మెరిపించేందుకు ప్రయతి్నంచే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్ లేకుండా ఏ లిప్‌స్టిక్ తయారయ్యే ప్రసక్తే లేదు కాబట్టి వీటిని తప్పనిసరైతే తప్ప వాడకూడదంటున్నారు. దీని బదులు కొత్తిమీర ఆకులతో, బీట్రూట్ వంటివి ఉపయోగించి పెదాల్ని ఎర్రగా మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.డ్రెస్ టూ డ్రగ్స్.. మానసిక ఒత్తిడి తప్పదు...ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం అది కూడా ఫ్యాషన్‌ను ఫాలో అవడం ద్వారా అనేది తొలి దశలో బాగానే ఉన్నా రానురానూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. అలాగే అప్ టు డేట్‌గా కనపడాలనే ఆతృత చదువు, వృత్తి, ఉద్యోగాలు వంటి ఇతర ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించనివ్వదు. అలాగే ఆరోగ్యకరమైన ఫ్యాషన్లను దాటిపోయి అనారోగ్యకరమైన అలవాట్లకు ఇది దారి తీస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలు కూడా తోడవుతాయి.. కాబట్టి ఫ్యాషన్ ప్రియత్వం అనేది నియంత్రణలో ఉండేలా చూసుకోవడం అత్యవసరం. లేకపోతే ఇది డ్రెస్సులతో మొదలై డ్రగ్స్ దాకా చేర్చినా ఆశ్చర్యం లేదు. ఈ ఫ్యాషన్ల పిచ్చిలో ఉన్న యువతను ఇతర ఆరోగ్యకరమైన వ్యాపకాలకు అంటే ఆటల వంటి అభిరుచుల వైపు మళ్లించడం మంచిది. – డా.జె మయూర్‌నాథ్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, సైక్రియాట్రిస్ట్ -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
జపనీస్ కుర్రాళ్లకు గడ్డం ఎందుకు ఉండదు?
జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్ విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈడీఏఆర్ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది. గడ్డం ఎందుకు పెంచుకోరు? జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత్
ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
జనం.. గగనయానం!
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్‌కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్‌నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్‌తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’
సోషల్ మీడియాలో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఒక డచ్ డైరెక్టర్ షేర్ చేసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ డైరెక్టర్ పేరు ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్. ఆయన ఒక టైమ్‌లాప్స్ వీడియో రూపొందించారు. ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చారు. ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్ వీడియోగా రూపొందించారు. దీనిలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. 2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి, నేడు అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది. బాల్యం నుంచి నేటి వరకూ ఆమె ముఖంలో చోటుచేసుకున్న మార్పులను ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫొటోలలో ఆమె స్టయిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్ ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ రెడిట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆ తండ్రి కృషిని అభినందిస్తున్నారు. ఒక యూజర్... ఈ టైమ్ లాప్స్ వీడియోను ఆ అమ్మాయి చూసి తెగ మురిసిపోయి ఉంటుందన్నారు. ట్విట్టర్లో ఈ వీడియో @TansuYegen పేరుతో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక మిలియన్‌మంది వీక్షించగా, 26 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! The father filmed his daughter's photo every week until she turned 20. 📸 pic.twitter.com/MNmOpEx0sk — Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023 -
రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది. సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు! -
వేగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ చెప్పారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంటే అందులో ఏపీ వాటా 4.85 శాతం ఉందని తెలిపారు. మంగళవారం (జూన్ 27) విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పోటీ–సుస్థిర ఆంధ్రప్రదేశ్ 2023–24’ నినాదంతో సీఐఐ ఏపీ చాప్టర్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఏపీ సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానంలో ఉండటం, సముద్ర ఆధారిత ఎగుమతులతో వేగంగా వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2025 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జీడీపీ 6.5%–6.7%కి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4.0లో భాగంగా పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీని పెంపొందించాలని సూచించారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు 9 అంశాల ప్రధాన అజెండాగా సీఐఐ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, సమృద్ధి వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో చైనా తర్వాత భారత్ తయారీ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులను ఉపయోగించుకుని తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామిక రాయితీలు, తక్కువ రేటుకే విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రీన్ బిజినెస్, గ్రీన్ ఎకానమీని సీఐఐ ప్రోత్సహిస్తోందని, పారిశ్రామిక సంస్థలు పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో ఇండస్ట్రీలో ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత్‌లో మెడికల్ టూరిజానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. సీఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ డీవీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
అబ్బో ఎంత పెద్ద ఇళ్లో... విస్తీర్ణమైన గృహాలకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలు నిర్ణయంలో విస్తీర్ణం కూడా ప్రధానమైనదే. ఎవరు ఇంటికొచ్చినా అబ్బా ఎంత పెద్ద ఇళ్లో అనిపించుకోవాలనే కోరిక ప్రతీ గృహ కొనుగోలుదారులకు ఉంటుంది. ఫలితంగా దేశంలో ఏటేటా గృహ విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇంటి విస్తీర్ణాలలో 7 శాతం వృద్ధి నమోదైంది. 2018లో 1,150 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణం.. 2023 నాటికి 1,225 చ.అ.లకు పెరిగిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. గృహ కొనుగోలు ఎంపికలో కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2020 కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు గృహాలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఈ ఇళ్ల నిర్వహణ సులువు వంటి రకరకాల కారణాలతో చిన్న సైజు గృహాలను కొనుగోలుదారులకు ఎక్కువగా కోరుకునేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్, ఐసోలేషన్ గది వంటి కొత్త అవసరాలు ఏర్పడటంతో ఇంటి విస్తీర్ణాలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత నాలుగేళ్లలో తొలిసారికి గృహ విస్తీర్ణాలు పెరగడం ప్రారంభమైంది. 2023 నుంచి ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ.. పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాదీలు విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే యూనిట్ సైజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఫ్లాట్ విస్తీర్ణం సగటున 2,200 చ.అ.లుగా ఉన్నాయి. ఏడాదిలో ఫ్లాట్ల సైజులలో 29 శాతం మేర వృద్ధి నమోదయింది. 2022 క్యూ1లో 1,700 చ.అ.లుగా ఉన్న ఫ్లాట్ల సగటు విస్తీర్ణం.. 2023 క్యూ1 నాటికి 2,200 చ.అ.లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోనే పెద్ద సైజు గృహాలలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. అత్యధికంగా ఎన్సీఆర్లో ఫ్లాట్ల సైజులు 50 శాతం మేర పెరిగాయి. 2022 తొలి త్రైమాసికం (క్యూ1)లో 1,130 చ.అ.లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,700 చ.అ.లకు పెరిగాయి. బెంగళూరులలో 1,200 చ.అ. నుంచి 1,300 చ.అ.లకు, కోల్‌కతాలో 800 చ.అ.ల నుంచి 1,150 చ.అ., పుణేలో 877 చ.అ. నుంచి 1,013 చ.అ.లకు పెరిగాయి. ముంబై,చెన్నైలలో క్షీణత: ఆశ్చర్యకరంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నైలలో గృహ విస్తీర్ణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. 2013లో 932 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణాలు.. 2022 క్యూ1 నాటికి 783 చ.అ.కు, 2023 క్యూ1 నాటికి 743 చ.అ.కు పడిపోయాయి. 2019తో పోలిస్తే 2020లో మాత్రమే ఫ్లాట్ల విస్తీర్ణాలలో 21 శాతం వృద్ధి నమోదు కాగా.. ఆ తర్వాతి ఏడాది నుంచి విస్తీర్ణాలలో క్షీణతే కనిపిస్తుంది. చెన్నైలో ఏడాది కాలంలో విస్తీర్ణాలు 6 శాతం మేర తగ్గాయి. 2022 క్యూ1లో 1,250 చ.అ. లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,175 చ.అ.లకు క్షీణించాయి. కరోనా తొలి దశలో చిన్నవైనా పర్లేదు సొంతిల్లు కావాలనే భావన గృహ కొనుగోలుదారులలో రావటంతో అప్పటి నుంచి ఎంఎంఆర్‌లో ఫ్లాట్ల విస్తీర్ణాలు క్రమంగా తగ్గుతున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఎంఎంఆర్, చెన్నైలలో పెద్ద సైజు గృహాల సరఫరా తగినంత ఉండటం, ఖరీదైన మార్కెట్లు కావటం కూడా చిన్న సైజు ఇళ్ల సరఫరా పెరగడానికి కారణమని పూరీ వివరించారు. -
ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!
భారత్‌లోని విద్యా విధానం, డిగ్రీలు గురించి అమెరికాలోని బ్లూమ్‌బెర్గ్ చెందిన ఓ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ సర్వే చేసింది. తన అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు రూ.900 కోట్లు విద్యారంగంపై ఖర్చుపెడుతోందని, వేగంగా కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. అయినప్పటికీ యువత ఎలాంటి నెపుణ్యాలు లేని గ్యాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలిపింది. ఇదే భారత ప్రధాన ఆర్ధిక వ్యవస్థను కుంటిపరుస్తోందని చెప్పింది. ఉద్యోగం వస్తుదనే ఆశతో రెండు, మూడు డిగ్రీలు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు కుప్పలు తెప్పలుగు పుట్టుకొస్తున్న ప్లేస్మెంట్లు ఇచ్చే ఇన్స్టిట్యూట్ల వైపు ఆకర్షితులై వేలకు వేలు డబ్బు వెచ్చించి..చివరి ఉద్యోగాలు లేక నానాపాట్లు పడుతున్నారని పేర్కొంది. అల్ఫాబేట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి వారికి భారత్‌లోని అత్యున్నత విద్యా సంస్థల్లో చోటు దక్కకపోవడం అత్యంత విచిత్రం అని కూడా పేర్కొంది. ఇక్కడ టాప్ సంస్థల తోపాటుగా చిన్నప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింది. వాటిల్లో తక్కువ శిక్షణ కూడిన ఉపాధ్యాయులను నియమించుకుని, ఔట్ డేటెడ్ పాఠ్యాంశాలను చెబుతున్నట్లు వెల్లడించింది. అందువల్ల అలాంటి సంస్థల్లో డిగ్రీలు చేసిన ఎలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండకపోవడంతో నిరుద్యోగులు మిగిలిపోతున్నట్లు వీబాక్స్ వెల్లడించింది. కానీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశమని, ఎక్కువ మంది యువకుల ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి ఆర్భాటంగా చెబుతుందని పేర్కొంది. వృద్ధి పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకువెళ్తున్నప్పటకీ ..నిరుద్యోగం 7% కంటే ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. ఇదే దాని ప్రధాన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని కూడా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందని వెల్లడించింది. భారత్‌లోని విద్యా వ్యవస్థలో పలు లోపాలను ప్రస్తావిస్తూ..విద్యార్థులకు క్లాస్రూమ్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టీకల్ నాలెడ్జ్ లేకుండా చేయడంతో ఉద్యోగాలు రాక పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది. కొన్ని పేరున్న మెడికల్ కాలేజీలు ఆస్పత్రులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చి వారిని ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించింది. అయినప్పటికీ విద్యార్థులు అలాంటి కాలేజీల్లోనే ఏదో రకంగా జాయిన్ అయిపోతున్నారని, డిగ్రీ సంపాదిస్తే చాలు అన్నట్లు ఉంటున్నారని చెప్పుకొచ్చింది. కాగా, ఇలాంటి డిగ్రీలు విలువలేనివని, దీంతో ఏటా మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ డీన్, ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆప్ ఎడ్యకేషన్ మాజీ సభ్యుడు అనిల్ సద్గోపాల్ అన్నారు. అలాగే మానవ వనరుల సంస్థ ఎస్హెచ్ఎల్ చేసిన ఒక అధ్యయనంలో కేవలం 3.8% ఇంజనీర్లు మాత్రమే స్టార్టప్‌లలో సాఫ్ట్వేర్ సంబంధిత ఉద్యోగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని గుర్తించింది. అంతేగాదు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..ఐటి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే గ్రాడ్యుయేట్లకు ముందు శిక్షణ అవసరం. చాలామంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారందరికీ ఉద్యోగం చేసే నేపుణ్యాలు లేవన్నారు. అందువల్లే ఏటా నిరుద్యోగుల ఎక్కువ అవుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమైని అన్నారు. ఉద్యోగాలు లేక నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు ఇండియా బ్రాండ్ ఈక్వీటీ ఫౌండేషన్ ప్రకారం భారత్‌లో విద్యా పరిశ్రమ అధ్యయనం ప్రయకారం భారత్‌లో 2025 నాటికి విద్యారంగం కోసం దాదాపు రూ. 1800 కోట్లు కేటాయిస్తుందని అంచనా. ఇది యూఎస్‌లోని విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువే. భారత్‌లో విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 2.9% వద్దే నిలిచిపోయిందని, ఇది ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువే అని ఈక్వీటి ఫౌండేషన్ వెల్లడించింది. (చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..) -
హైదరాబాద్: అక్కడ ప్రాపర్టీలకు యమ డిమాండ్.. ఎగబడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు హైదరాబాద్‌లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాసిత ప్రాంతం ఇబ్రహీంపట్నం. ఐటీ, ఏరోస్పేస్ హబ్‌గా పేరొందిన ఆదిభట్ల, ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రమైన కొంగరకలాన్ ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఉండటంతో ఇబ్రహీంపట్నానికి డిమాండ్ పెరిగింది. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలే కాకుండా వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అందుబాటు ధరలు ఇబ్రహీంపట్నం అభివృద్ధి చోదకాలు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల స్వరూపం మారిపోయింది. సొంతంగా ఉండేందుకు విస్తీర్ణమైన ఇళ్లు కొనుగోలు చేశాక.. రెండో పెట్టుబడి వాణిజ్య సముదాయంలోనే చేయాలనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో ఇన్నాళ్లు ప్రధాన నగరంలోనే కేంద్రీకృతమైన గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రరాపార్టీలు.. క్రమంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించాయి. ప్రధానంగా హైదరాబాద్‌కు అనుసంధానమై ఉన్న ఇబ్రహీంపట్నంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు డిమాండ్ ఏర్పడిందని టీఎన్ఆర్ గ్రూప్ ఎండీ టీ నర్సింహారావు తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!) ఇప్పటివరకు షాపింగ్ మాల్స్‌లలో రిటైల్ స్థలం కొనాలంటే పెద్ద ప్రహసనమే. ధర, డిమాండ్, అగ్రిమెంట్, నిర్మాణం వంటి చాలా అంశాలలో పరిజ్ఞానం ఉండాలి. దీంతో విద్యావంతులైన పెట్టుబడిదారులే ఈ తరహా ప్రాపర్టీలను ఎంచుకునేవారు. సామాన్య, మధ్యతరగతి కూడా గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టే విధంగా అత్యంత సులువు చేస్తున్నాయి పలు నిర్మాణ సంస్థలు. నిర్మాణ రంగంలో అనుభవం, నమ్మకమైన నిర్మాణ సంస్థ చేపట్టే వాణిజ్య సముదాయాలైతే ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఓటీటీ, యాప్‌లు వచ్చాక ప్రధాన నగరంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే ఈ సంస్కృతి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఇంకా రాలేదు. ఇలాంటి తరుణంలో ఇబ్రహీంపట్నంలో మల్టీప్లెక్స్ కం షాపింగ్ మాల్స్‌కు నిర్మించాలని నిరయించామని టీఎన్ఆర్ గ్రూప్ డైరెక్టర్ టీ విక్రమ్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం, కర్మన్ఫట్లలో 8 లక్షల చ.అ.లలో రెండు షాపింగ్ వల్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. (ఇదీ చదవండి: మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా? కంపెనీ ఏం చెబుతోందంటే?) ఇబ్రహీంపట్నంలో రెండ్నునర ఎకరాల విస్తీరంలో టీఎన్ఆర్ జగదాంబ, కర్మన్‌ఫట్‌లో మూడున్నర ఎకరాలలో టీఎన్ఆర్ ప్రిస్టన్ వల్‌ను నిరి్మస్తున్నాం. జగదాంబలో ఏడు స్క్రీన్లు, ప్రిస్టన్‌లో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. దీంతో పాటు ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ దుకాణాలుంటాయి. జగదాంబ షాపింగ్ మాల్లో రెంటల్ ఇన్‌కం స్కీమ్‌ను ప్రారంభించాం. 100 చ.అ. రిటైల్ స్పేస్‌ను రూ.12 లక్షలకు అందిస్తున్నాం. దీంతో కొనుగోలుదారులకు నెలకు రూ.6 వేలు అద్దె కంపెనీ చెల్లిస్తుంది. ఇరవై ఏళ్ల గ్యారంటీ లీజు ఉంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, సపర్ వర్కెట్లు, బ్యాంకులు, వంటి అన్ని రకాల వ్యాపార సముదాయాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ల ధరలు రూ. 40 లక్షల నుంచి ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఇబ్రహీంపట్నం మీదుగా భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీకి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వంతో తుది దశ చర్చలు ముగిశాయి కూడా. కొంగరకాన్ - రావిర్యాలలో ఎల్రక్టానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. -
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
జజ్జనకరి జనాలే...
-
అంతరిక్షంలో వరి మొక్కలను పెంచిన చైనా!... వీడియో వైరల్
Taikonauts conducting life science experiment in space: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నినిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్‌లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్) తన లైప్ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ఈ ప్రయోగాన్నిప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు...థాలేక్రెస్ అనే క్యాబేజ్ జాతికి చెందిన విత్తనం తోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్ స్టేషన్‌లోని వెంటియన్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకుక చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది. ఐతే థాల్స్క్రేస్ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి మొక్కలు సుమారు 30 సెం. మీటర్ల వరకు పెరిగాయి. రేడియోషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అనేది తెలుసుకునేందుకే చైనా టైకోనాట్స్(వ్యోమోగాములు) ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చైనీస్ సెన్స్ అకాడమీకి చెందిన పరిశోధకుడు జెంగ్ హుక్వింగ్ మాట్లాడుతూ..."ఈ రెండు ప్రయోగాలు అంతరిక్షంలోని ప్రతి మొక్క జీవిత కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. అలాగే మొక్కలను పెంచేందుకే కాకుండా మైక్రోగ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచాలో పరిశోధనల్లో తెలుస్తుందని చెప్పారు. అంతేకాదు పంటలను భూమి లాంటి వాతావరణంలోనే కృత్రిమంగా పెంచగలమని అన్నారు. మొక్కలు పుష్పించడం జరిగితే అంతరిక్షంలో మరిన్ని పంటలను పండించేందుకు దోహదపడుతుందని జెంగ్ అన్నారు." అయినా చైనా ఏమీ తొలిసారిగా అంతరిక్షంలో మొక్కలు పెంచలేదు. గతేడాది జూలైలో చాంగ్ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. వేడుక ఏదైనా..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్ కాల్‌తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్‌గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్ చేస్తోంది. అదరహో అనిపించేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లే సమకూరుస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక ఫంక్షన్‌కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్ మేనేజ్మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి. రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్ చేసే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్ గాళ్స్ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్ సంస్కృతి హైదరాబాద్‌లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్ గాళ్స్‌కు రూ.50–70 వేల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్యాకేజీలు.. ►పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న వారూ ఉన్నారు. ►దీంతో ఈవెంట్ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. ►డెకరేషన్‌కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. ►విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. ►మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్ కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్ నిర్వాహకుడు అనిల్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కావాల్సిన విధంగా.. నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్‌కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. –విజయసాయి, విజయవాడ ట్రెండ్ మారుతోంది.. వివాహ వేడుకల ట్రెండ్ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్ మ్యూజిక్‌లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్‌థింగ్ స్పెషల్‌గా, స్టేటస్ సింబల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్ గాళ్స్ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్‌కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. – విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ -
భారీ అవకాశాలు: డిజిటల్ హబ్‌గా విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రోజురోజుకీ ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. కొన్నాళ్ల కిందటి వరకూ క్రమంగా ఒక పద్ధతిలో విస్తరిస్తూ వచ్చిన ఆన్లైన్ రంగం... కోవిడ్‌తో ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోయింది. ఆన్లైన్ వ్యవస్థే సమూలంగా మారిపోయింది. ఇంట్లో సరుకులు మొదలు... ఇతరత్రా వస్తువులు... తినే భోజనం... కాఫీ, టీ కూడా ఆన్లైన్లోనే ఆర్డరు చేసే పరిస్థితులు బాగా పెరిగిపోయాయి. మరోవంక సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచార వ్యూహాన్నీ మార్చాయి. పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆన్లైన్ వినియోగదారుల అభిరుచులను కనుక్కోవడంతో పాటు ఎటువంటి ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు? ఎలాంటి ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు? వంటి డేటా కంపెనీలకు ఇంధనంగా మారుతోంది. సరిగ్గా ఈ అవసరమే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కు.. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే ‘మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్’కు డిమాండ్‌ను పెంచుతోంది. రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖపట్నంలో ఇప్పటికే పలు కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తున్నాయి. ఈ రంగానికి సంబంధించిన మానవ వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తుండటంతో విశాఖలో రాబోయే రోజుల్లో ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ వార్షిక కార్యకలాపాలు 300 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే ఐదేళ్లలో డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాల విలువ ఏకంగా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పలు సంస్థలు అంచనాలు వేశాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశాలూ లేకపోలేదన్నది నిపుణుల మాట. దీంతో ఐటీ ఆధారిత సేవలందిస్తున్న సంస్థలు కూడా డిజిటల్ మార్కెటింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రంలో మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖలోనే ఐటీ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయనే అంశం నిర్వివాదం. గతంలో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించినా... ఆ తరవాత నిపుణుల కొరత వంటి పలు కారణాలతో తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. డిజిటల్ మార్కెటింగ్‌కు వచ్చేసరికి మాత్రం ఇప్పటికే ఇక్కడ పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిటైల్, హెల్త్, టెక్స్టైల్ బిజినెస్ రంగాల్లోని కంపెనీలకు సేవలందిస్తున్నాయి. వీటిలో హెల్త్‌టెక్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ రంగంలో విస్తరిస్తున్న పల్సస్ గ్రూపు ఇప్పటికే ఇక్కడ 2,500 మందికి ఉపాధి కల్పించింది. ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, చెన్నై, హైదరాబాద్‌లో కేంద్రాలున్నా విశాఖ కేంద్రంలో 65 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఇక డబ్ల్యూఎన్ఎస్, ఏజీఎస్ హెల్త్‌టెక్, ఏసీఎస్ హెల్త్‌కేర్ వంటి ఇతర కంపెనీలూ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఇప్పటికే 4 వేల మందికి పైగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి పొందుతుండగా... వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 20వేలకు చేరవచ్చనే అంచనాలున్నాయి. ‘‘వచ్చే ఐదేళ్లలో డిజిటల్ రంగ మార్కెట్ ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. దీన్లో కనీసం 2 శాతంపై ఏపీ దృష్టి సారించినా ఇక్కడ కనీసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది’’ అనేది నిపుణుల మాట.. తద్వారా డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖ కేంద్రంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ అన్ని విధాలా అనుకూలం ఐటీ సేవల రంగమైతేనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలం. దీనికి శిక్షణ పొందిన మానవ వనరులు కావాలి. డిజిటల్‌కూ అంతే. కొన్నాళ్లుగా మేం శిక్షణనిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నారు. నగరంలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల లభ్యత కూడా పెరిగింది. పలు ఇతర కంపెనీలూ వచ్చాయి. నిజానికి ఏపీ ఐటీ నిపుణుల సంఖ్య లక్షల్లో ఉన్నా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఐటీకి ప్రాధాన్యమివ్వటం, విశాఖ సహా 3 చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీలు ప్రతిపాదించటం రాష్ట్రంలో ఈ రంగానికి ఊతమిస్తాయి. డిజిటల్‌పై ప్రభుత్వం దృష్టి పెడితే ఇక్కడి విద్యార్థులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూపు సీఈవో విశాఖలో అపార అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖలో చాలా అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఇక్కడ మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ రంగంలో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలకు అవకాశం ఉంది. – ఆర్ఎల్ నారాయణ, చైర్మన్, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ఇన్వెస్ట్మెంట్ బ్రాండింగ్ కమిటీ డేటా చాలా కీలకం ఆన్లైన్ వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలకు వినియోగదారుల అభిరుచులపై డేటా చాలా కీలకం. వారి అభిరుచులకు అనుగుణంగా వారు తమ వద్ద ఆయా ప్రొడక్ట్స్‌ను స్టాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగదారుల డేటా చాలా కీలకం. దీన్ని విశ్లేషించడం అంత సులువు కాదు. నిపుణులు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడాలి. ఇందుకోసం మా ఉద్యోగులకు మేమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్ రంగం చాలా కీలకంగా మారనుంది. – చమన్ బేడ్, ఏసీఎస్ హెల్త్‌టెక్ సీఈవో -
తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ
-
ఆంగ్లం..అందలం
బద్వేలు: టేకూరుపేట పోరుమామిళ్ల మండలంలోని ఒక చిన్న గ్రామం. ఆక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో 2012లో కేవలం 40 మంది విద్యార్థుల పేర్లు నమోదైనా వచ్చేది 28 మందే. అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన వీరయ్య తమ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీనిపై గ్రామాల్లో విసృత ప్రచారం చేశారు. ఒక్క ఏడాదే దాదాపు 60 వరకు అడ్మిషన్లు రావడంతో 30లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య 96కు చేరింది. 2015లో ప్రభుత్వం నుంచి ఆంగ్ల మాధ్యమానికి అనుమతి వచ్చేలోపు ఈ సంఖ్య మరింత పెరిగి 150కి చేరింది. ఇలా ప్రతి ఏటా పెరుగుతూ ప్రస్తుతం 245కు చేరడం విశేషం. 3 వేల జనాభా కూడా లేని ఒక కుగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 245 మంది విద్యార్థులు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమంగా విద్య లభించడమేనని గ్రామస్థులు చెబుతున్నారు. 10 గ్రామాల నుంచి విద్యార్థుల రాక.. టేకూరుపేట ప్రాథమిక పాఠశాలలో చుట్టు పక్కల ఉన్న పదిగ్రామాలకు చెందిన పిల్లలు చదువుతున్నారు. కొండుగారిపల్లె, తిరువెంగళాపురం, యర్రశాల, యర్రశాల హరిజనవాడ, టేకూరు, చిన్నకప్పలపల్లె, పెద్దకప్పలపల్లె, తిమ్మారెడ్డిపల్లె, దాసరిపల్లె, కవలకుంట్లలకు చెందిన విద్యార్థులు ఇక్కచ చదువుకుంటున్నారు. తమ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలున్నా ఆంగ్ల మాధ్యమం ఉండటంతోనే టేకూరుపేట పాఠశాలలో పిల్లలను తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ♦పోరుమామిళ్లలోని ప్రయివేట్ కాన్వెంట్‌ల్లో చదువుతున్న పైగ్రామాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు అక్కడ మానుకుని టేకూరుపేటలో చేరడం విశేషం. ♦ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రధానోపాధ్యాయుడు వీరయ్య రూ.10 లక్షలు వెచ్చించి వ్యాను కొనుగోలు చేశారు. విద్యార్థుల నుంచి డీజిల్ ఖర్చుకు సరిపోయే విధంగా కొంత నగదు వసూలు చేస్తూ వ్యాను నిర్వహణ చేస్తున్నారు. ♦పోరుమామిళ్ల నుంచి వచ్చే విద్యార్థులకు రూ.300 వ్యాను ఫీజు. అంటే రోజుకు పోను, రానూ రూ.12 వసూలు చేస్తున్నట్లు. ♦పాఠశాలలో చదివే ఇద్దరు ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు. ♦ప్రభుత్వం 2017లో దీన్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్పు చేసింది. ప్రత్యేకశ్రద్ధ.. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వీరయ్యతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా ప్రత్యేకశ్రద్ధతో విద్యాభోధన చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆంగ్ల మాధ్యమ పుస్తకాలతో పాటు కాపీరైటింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. ♦ప్రొగ్రెస్కార్డుల్లో విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో చర్చించి వారి మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు. ♦యోగాతో పాటు కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ♦ప్రతి రోజూ సాయంత్రం పూట స్టడీఆవర్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల సందేహలు నివృత్తి చేస్తారు. ♦మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. మోనూలో లేకపోయిన రోజూ రసం కూడా వడ్డించడం విశేషం. ఆంగ్ల మాధ్యమంతోనే చేరికలు మా పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తరువాతే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత కాలంలో చదువు, ఉద్యోగం, ఉన్నతిలో ఆంగ్లం తప్పనిసరిగా మారింది. గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. టేకూరుపేట పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తరువాత 40 మంది ఉన్న విద్యార్థులు 245కు చేరింది. ఉపాధ్యాయులు కూడా చక్కగా బోధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. – వీరయ్య, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీపాఠశాల, టేకూరుపేట ప్రయాస తప్పింది గతంలో ఆంగ్ల మాధ్యమం కావాలంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరుమామిళ్లకు పిల్లలను పంపేవాళ్లం. దీంతో పాటు ఫీజులు భారంగా మారేవి. రోజూ ఉదయాన్నే వారిని సిద్ధం చేయడం, పంపడం, వారు వచ్చే వరకు ఆందోళనగా ఎదురు చూడటం జరిగేది. కానీ సమీపంలోనే ఉత్తమవిద్య అందుతోంది. దీంతో ప్రయాస తప్పింది. – షేక్ మహబూబ్ చాను, టేకూరుపేట రూ.40 వేలు పైనే ఆదా ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదవాలంటే ఫీజులు, పుస్తకాలు, స్కూల్ డ్రస్, వ్యాను ఫీజు వంటి వాటికి కనీసం రూ.40వేలు అవసరం. ఇవన్నీ లేకుండా ఇదేస్థాయిలో టేకూరుపేట ప్రాథమిక పాఠశాలలో విద్య లభిస్తున్న నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు ఇక్కడే తమ పిల్లలను చేర్పిస్తున్నారు. – బోజ్జా ప్రియాంక, టేకూరుపేట -
ఫలసాయం పుష్కలం
కర్నూలు అగ్రికల్చర్: కరువు సీమలో పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెరిగింది. ఉత్పత్తులూ అంచనాలను మించుతున్నాయి. అయితే రాయలసీమలో ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు మృగ్యం. ఇవి అందుబాటులోకి వస్తే రైతన్నలకు కనక వర్షమే. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న మామిడి పల్ప్ ఫ్యాక్టరీ ఒక్కటీ ఎప్పుడో మూతడింది. సీమలో సంప్రదాయ పంటల సాగు తగ్గి రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించడం మంచి మార్పునకు సంకేతమని సంబంధిత అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సీమ జిల్లాల్లో 4,02,567 హెక్టార్లలో మామిడి, చీని, సపోట, దానిమ్మ, అరటి, నిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, పనస, ఉసిరి తదితర పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. ఏటా 99,79,122 టన్నుల దిగుబడి లభిస్తోంది. ఈ ఏడాది అదనంగా 15వేల హెక్టార్లలో తోటలు పెంచుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా పండే ఆపిల్‌బేర్, కర్జూరాలు, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ఎగుమతులు ఈ ప్రాంతం నుంచి అరటి, బొప్పాయి, సపోటా ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చీని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దానిమ్మ, నిమ్మ వెళుతోంది. మామిడి దేశం నలుమూలలకు పంపుతున్నారు. అరటి, దానిమ్మ, బొప్పాయి, మామిడి గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం విశేషం. ఏటా రూ. 20 వేల కోట్ల విలువైన పండ్లను ఉత్పత్తి చేస్తుండగా, దానిలో రూ. 5 వేల కోట్ల ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టపోతున్న వైనం సీమ జిల్లాల్లో పండ్ల ఆధారిత పరిశ్రమలు, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు బాగా నష్టపోతున్నారు. పెట్టుబడి, కష్టం రైతులది కాగా... లాభాలు మాత్రం దళారులు ఎగరేసుకు పోతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి దాదాపు 2,000 టన్నుల పండ్లు హైదరాబాద్‌కే తరలిస్తున్నారు. మామిడి సీజన్లో రోజువారీ ఎగుమతి విలువ రూ.5 కోట్లు పైమాటే. దీనిపై ఒక శాతం మార్కెట్ సెస్...రూ.50 లక్షల దాకా తెలంగాణ ప్రభుత్వానికి వెళుతోంది. అదే సీమ జిల్లాల్లో ఫ్రూట్ మార్కెట్ ఉంటే ఆ ఆదాయం ఏపీ ప్రభుత్వానికి లభించేది. అలాగే పండ్ల తోటల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యాన తోటల అభివృద్ధికి కృషి కర్నూలు జిల్లాలో ఉద్యాన తోటల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నాం. మార్కెంటింగ్ సదుపాయాలు పెంచేలా ప్రయత్నాలు మొదలు పెట్టాం. అలాగే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రైతుల్లోకి తీసుకెళ్లి ఉద్యాన తోటలు విరివిగా సాగుచేసేలా చూస్తున్నాం. ఉద్యాన ఆధారిత పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి హార్టికల్చర్ మిషన్ కింద సబ్సిడీలు అందజేస్తాం. సీహెచ్ పుల్లారెడ్డి, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ, కర్నూలు ప్రధాన పండ్లతోటల సాగు (హెక్టార్లలో) మామిడి=2,14,060,అరటి=60,065 ,నిమ్మ=3,070 ,బొప్పాయి=13,273 ,సపోట=5,173,కరబూజ=10,267 ,చీని=68,818 ,కళింగర=1,02,231 ,ఉసిరి=362,జామ=2,849,సీతాఫలం=9,643, రేగు=1,210 డ్రాగన్ ఫ్రూట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 20 ఏళ్లకు పైగా దిగుబడులు ఇస్తాయి. అరుదైన ఉద్యాన పంటలు పండిస్తున్నా, వాటి ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో నష్టపోతున్నాం. ఈ పంటను సీమలోని జిల్లాల్లో పండిస్తున్నందున వీటి ఆధారిత పరిశ్రమలతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. – విష్ణువర్ధన్‌రెడ్డి, కరివేముల,దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా -
కనుబొమలకు ఆముదం
కనుబొమ్మలు సరైన ఆకృతిలోనే కాదు దళసరిగా ఉండేలా షేప్ చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. బాలీవుడ్– టాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కొంతమందికి కనుబొమలు ఒత్తుగా ఉంటాయి. లేదంటే ఖరీదైన కనుబొమ్మల కిట్‌ను కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తారు. అలా చేయలేని వారు కూడా కనుబొమలు ఒత్తుగా పెరిగేలా ఇంట్లోనే ఒక సీరమ్‌ను తయారుచేసుకొని వాడుకోవచ్చు. ►2 టేబుల్ స్పూన్ల ఆముదం ►టీ స్పూన్ కొబ్బరి నూనె ►3–4 చుక్కల లావెండర్ ఆయిల్. ►చిన్న బాటిల్లో ఆముదం, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి ►మస్కారా బ్రష్‌తో ఆ ఆయిల్‌ను అద్దుకుంటూ కనురెప్పలకు ఉపయోగించాలి ►టూత్‌పిక్‌తో ఆయిల్‌ను అద్దుకుంటూ జాగ్రత్తగా కనుబొమ్మల వెంట్రుకలకు వాడాలి. ఈ ఆయిల్‌ను రోజుకు రెండు సార్లు వాడుకోవచ్చు. ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్‌లోని విటమిన్లు, ప్రొటీన్లు వెంట్రుకల వృద్ధికి తోడ్పడతాయి. -
వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!
వాషింగ్టన్: ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే వేగవంతమైన వృద్ధే అయినప్పటికీ, అంత భారీగా ఏమీ లేదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ వివరించిన అంశాలను, ఫిచ్ తాజా అవుట్‌లుక్‌ను క్లుప్తంగా చూస్తే... మరిన్ని సంస్కరణలు అవసరం: ఐఎంఎఫ్ ►గడచిన ఐదు సంవత్సరాలుగా భారత్ పలు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. మరిన్ని సంస్కరణలనూ తీసుకురావాల్సి ఉంది. అధిక వృద్ధిరేటు పటిష్టతకు ఇది అవసరం. ► ఐదు సంవత్సరాలుగా సగటున భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. ► భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం దేశానికి కలిసివస్తున్న మరో అంశం. దీనిని మరింత వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉంది. ► విధానపరమైన అంశాల్లో కొన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పరిస్థితుల మెరుగునకు చర్యలు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా చూడ్డం, అలాగే కార్మిక, భూ సంస్కరణల చర్యలు, వ్యాపార నిర్వహణా అంశాలను మరింత సులభతరం చేయడం ఇందులో ఉన్నాయి. ► వచ్చే నెల్లో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ స్ప్రింగ్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) సర్వే నివేదిక విడుదలకానుంది. ఈ నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మరిన్ని అంశాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ నేతృత్వంలో ఈ నివేదిక రూపొందుతుండడం గమనార్హం. వృద్ధి అంచనాల కోత: ఫిచ్ ► మందగమన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని రేటింగ్ దిగ్గజం ఫిచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నట్లూ తన అవుట్‌లుక్‌లో తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.2 శాతంగా తొలుత అంచనావేయడం జరిగింది. దీనిని 6.9 శాతానికి తగ్గిస్తున్నాం. కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనాలకన్నా (7 శాతం) ఈ రేటు తక్కువగా ఉండడం గమనార్హం. ►అలాగే 2019–2020 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7 శాతంనుంచి 6.8 శాతానికి కోత. అయితే 2020–21ల్లో ఈ రేటు 7.1 శాతానికి పెరిగే వీలుంది. (2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం) ► తక్షణం వృద్ధి తగ్గిపోవడానికి తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం కారణం. వ్యవసాయ రంగమూ పేలవంగానే ఉంది. దేశీయ అంశాలే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ► రుణ లభ్యత దేశంలో తగ్గింది. రుణం కోసం బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనరంగాలు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ► ఇక ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ► డాలర్ మారకంలో రూపాయిది బలహీన బాటే. 2018 డిసెంబర్లో ఇది 69.82గా ఉండవచ్చు. 2019 డిసెంబర్ నాటికి 72, 2020 డిసెంబర్‌కు 73ను తాకే అవకాశం ఉంది. ► ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి స్నేహపూర్వకమైనవిగా ఉన్నాయి. వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళతర విధానాలను అనుసరించే వీలుంది. 2019లో మరో పావుశాతం రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50 శాతం) తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం, అంతర్జాతీయంగా సరళతర ద్రవ్య పరిస్థితులు ఈ అంచనాలకు కారణం. ► 2019లో చమురు ధరలు బ్యారల్‌కు సగటున 65 డాలర్లుగా ఉంటాయి. 2020లో 62.5 డాలర్లుగా ఉండే వీలుంది. 2018లో ఈ ధర 71.6 డాలర్లు. ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత... 2018, 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం, 3.1 శాతంగా ఉండే అవకాశం ఉందన్న తొలి అంచనాలను వరుసగా 3.2 శాతం, 2.8 శాతానికి ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి రేట్లు 2018, 2019ల్లో 6.6 శాతం, 6.1 శాతంగా ఉంటాయి. -
ఒక పక్షి పూసింది
ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్ మెడల్ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. పైకి కనబడుతోందే దేవుడా, పాడుకళ్లను పడనివ్వకూడదని రెక్కల్ని దాచేస్తే ఎలా?! ఎదుగుతున్న ఆడపిల్ల ఉన్న ఇల్లు ధైర్యంగా ఉండొద్దూ! మాధవ్ శింగరాజు ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా ఉంటుంది. మగపిల్లాడు ఎదిగితే పక్షి ఎగిరినట్లుగా ఉంటుంది. పువ్వు పూసినట్లుగా ఉండాలని ఆడపిల్ల, పక్షి ఎగిరినట్లుగా ఉండాలని మగపిల్లాడు నైటవుట్స్ చేసేమీ ఎదగరు. వాళ్ల మానాన వాళ్లు మెల్లిగా ఎదుగుతారు. ఇంట్లో పెట్టిందేదో ఇంత తిని, రోజూ స్కూల్‌కి వెళ్లొస్తూ, బాగా చదివి పరీక్షలు రాస్తూ, ఉద్యోగాలకు ప్రిపేర్ అయి ఇంటర్వ్యూలు నెగ్గుకొస్తూ.. ఓ రోజెప్పుడో దీపాలు పెట్టే వేళకు అకస్మాత్తుగా మన ఇంట్లోకి స్వీట్ బాక్సుతో వచ్చేస్తారు.. ‘ఆంటీ, నాకు యు.ఎస్.ఫర్మ్‌లో ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ వచ్చింది. నెలలో సగం రోజులు ఫ్లయిట్ జర్నీలే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ..’ అని అమ్మాయి చెబుతుంది! ‘అంకుల్, ఇక్కడే సిటీ బ్రాంచ్‌లో నాకు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పోస్టింగ్ వచ్చింది. నాన్న కోరుకున్నట్లే టెన్ టు ఫైవ్ బ్యాంక్ జాబ్’ అని అబ్బాయి చెబుతాడు. అప్పుడు కూడా ఆ ఎదిగిన అమ్మాయి ‘ఒక పువ్వు పూసినట్లుగా’నే, ఆ ఎదిగిన అబ్బాయి ‘ఒక పక్షి ఎగరబోతున్నట్లుగా’నే అనిపిస్తారు తప్ప.. అమ్మాయి చేయబోయేది జర్నీల జాబ్ కనుక ఆమెను ‘ఎదిగిన పక్షి’లా, అబ్బాయికి వచ్చింది ఎటూ కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగం కనుక అతడిని ‘ఒదిగిన పువ్వు’లా చూడలేం. ఆడపిల్లకు అంత పెద్ద బలమైన, మెరిసే అందమైన, చక్కటి డిజైన్లు ఉన్న ఖండాంతర రెక్కలు ఉన్నప్పటికీ ఆమె పక్షి కాలేదు, పువ్వే! ఎందుకు పువ్వంటే, పువ్వులా పెంచుకుంటాం కనుక. మగపిల్లాడు గాలికి ఎదిగితే, ఆడపిల్ల గాలిలోకి పరిమళాలు వెదజల్లుతూ ఎదుగుతుంది. అక్కడొస్తుంది భయం. పువ్వులా పెంచడం ఆ భయానికే. మనమ్మాయి ఎదగాలి. కానీ ఇంట్లోనే ఉండి ఎదగాలి! బయటి వాటర్ బాటిల్స్ తాగకూడదు. బయటి గాలి పీల్చకూడదు. బయటి సూర్యరశ్మి తగలకూడదు. కుండీలోని పువ్వు ఎంతవరకు ఎదుగుతుంది? మహా అయితే మెట్టినింటి గోడ మీది వరకు. అక్కడా మళ్లీ ఆ కుండీలోనే. అందుకే ఎక్కడో ఏ మానుకో పుట్టి, స్వేచ్ఛగా ఎదిగి, పక్షిలా ఎగిరిన పువ్వును చూస్తే ప్రపంచానికింత విడ్డూరం! సైకిల్ ఎవరైనా నడపగలిగిందే. ఆడపిల్ల నడిపితే సర్ప్రైజింగ్. ర్యాంక్ ఎవరికైనా వచ్చేదే. ఆడపిల్లకు వస్తే అమేజింగ్. ఎవరెస్టు ఎత్తు ఎవరికైనా ఒకటే. ఆడపిల్ల ఎక్కితే ఎస్టానిషింగ్. ఆడపిల్ల సాధించిన ప్రతి విజయంలోనూ మనమిలా ఎందుకు ‘ఆ’ అని నోరు తెరుస్తామంటే.. నడిచే దారిలో నడవనివ్వకుండా, పరుగెత్తే దారిలో పరుగెత్తనివ్వకుండా, పడిలేచే దారిలో పడిలేవనివ్వకుండా ఆడపిల్లల్ని అరచేతుల్లో పెట్టుకుని మనమే నడుస్తూ, మనమే పరుగులు తీస్తూ, మనమే పడిలేస్తూ ఉంటాం కదా. అందుకు. ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్‌మెడల్ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. ఆడపిల్ల అచీవ్మెంట్స్ మార్కుల్లో, న్యూయార్కుల్లో మాత్రమే పైకి కనిపించి, ఆమె ఫిజికల్ గ్రోత్ ఎప్పుడూ ఆ పన్నెండేళ్ల లోపు స్కర్ట్ లోపలే కనిపించకుండా ఉండిపోవాలని కోరుకుంటే.. ‘ఓకే పేరెంట్స్.. అలాగే చేద్దాం.. మీ అమ్మాయికొక మంచి వరుడు దొరికే వరకు’ అంటుందా ప్రకృతి మన వాకిట్లోకి వచ్చి. అనదు. అనకపోగా, మన అనుమతి లేకుండా ఇంటి లోపలకి వచ్చి.. బెడ్ మీద చుట్టూ బుక్స్‌తో బోర్లా పడుకుని కాళ్లు పైకీ కిందికీ ఆడిస్తూ హోమ్‌వర్క్ చేసుకుంటున్న మన అమ్మాయి బుగ్గలు పుణికి, ఆమె పసి పాదాలకు, అమాయకపు చుబుకానికి ఇంత పసుపు, గంధం రాసి వెళ్తుంది! ఏం చేస్తాం? ‘హనీ, సరిగ్గా కూర్చో నాన్నా’ అంటాం. పిల్ల వినకపోతుంటే వెళ్లి, సరిచేసి కూర్చోబెడతాం. ‘ఇలా ఉంటేనే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది మమ్మీ’ అంటున్నా వినకుండా! హింస ఇది ఆడపిల్లకు. హింసే! ఒంటిని టచ్ చెయ్యడం కన్న పెద్ద హింస ఒంటిని స్వేచ్ఛగా ఎదగనివ్వకపోవడం. ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతుంటే భయం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. లండన్‌లోని ‘గార్డియన్’ పత్రికా కార్యాలయానికి ఇటీవల కొంతకాలంగా ఫోన్లు వస్తున్నాయి. ‘మా చుట్టు పక్కల ఇళ్లలో బ్రెస్ట్ ఐరనింగ్ (గుండ్రాయిని వెచ్చబరిచి ఛాతీని అదమడం) జరుగుతోంది, ఎవరికి కంప్లైంట్ చెయ్యాలి? అని! ఆఫ్రికా దేశాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో.. ఎదిగే ఆడపిల్లలపై మగపిల్లల దృష్టి పడకుండా ఉండేందుకు అమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తారట. లండన్‌లోని ఆఫ్రికన్ వలస కుటుంబాల్లో అలా జరుగుతోందన్న విషయం ‘గార్డియన్’ పత్రిక వార్తా కథనంతో తెలుసుకున్న యూఎన్ఓ గతవారం బ్రిటన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు మేము నిబద్ధతతో ఉన్నాము’ అని బ్రిటన్ కూడా వెంటనే సంజాయిషీ ఇచ్చింది. పెద్ద విషయం ఇది. ఎదిగిన దేశాలకు మాత్రమే తల్లిదండ్రుల భయాందోళనల వల్ల బాలికల హక్కులకు భంగం కలగడాన్ని పెద్ద విషయంగా తీసుకోగల శక్తి ఉంటుంది. ‘అగ్రదేశం’ కన్నా పెద్దది ‘ఎదిగిన దేశం’. కొన్ని ఆయుధాలు, కొంత అహంకారం ఉంటే చాలు అగ్రదేశం అయిపోవచ్చు. ఆడపిల్లల్ని హాయిగా ఎదగనివ్వడానికి, స్వేచ్ఛగా ఎగరనివ్వడానికి రోజుకు పదిసార్లు దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకొచ్చే తల్లిదండ్రులకు ధైర్యాన్నిచ్చి, ‘మీ అమ్మాయిని నిశ్చింతగా బయటికి పంపండి, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మాది’ అని భరోసా ఇవ్వగలిగిన దేశం మాత్రమే ‘ఎదిగిన దేశం’ అవుతుంది. ‘బ్రెస్ట్ ఐరనింగ్’ అనే విపరీతం గురించి మీకివాళే మొదటిసారిగా తెలిసి, మీరింకా తేరుకోలేకపోతుంటే.. కాసేపటి తర్వాతనైనా.. అధునాతన తెగల్లోని మనం రోజూ చేస్తున్న ఆడపిల్లల ఆశల ఐరనింగ్, ఆశయాల ఐరనింగ్, వారి కలల ఐరనింగ్.. ఇవన్నీ ‘బ్రెస్ట్ ఐరనింగ్’ కంటే ఏం తక్కువ అని మీకు అనిపిస్తే కనుక మీరొక ఎదుగుతున్న పేరెంట్ అనే. మీ వల్ల ఈ దేశం ఎదగబోతున్నదనే. ఎదుగుతున్న ఇంట్లో, ఎదుగుతున్న దేశంలో ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా మాత్రమే ఉండదు. పక్షి ఎగిరినట్లుగా కూడా ఉంటుంది. పువ్వు తక్కువ, పక్షి ఎక్కువ అని కాదు. పక్షిలా ఎగరాలని ఉన్నప్పుడు పువ్వులా ఎందుకు ఉండిపోవాలీ అని! ∙