
క్యాంపస్ నుంచి కార్పొరేట్స్ దాకా ప్రతీ ‘ప్లే’స్‌లోనూ..
మోడ్రన్ థియేటర్ ఆర్ట్‌కి ఊపునిచ్చిన డ్రామనాన్ సంస్థ
నగరంలో ప్రదర్శనల నుంచి పోటీల దాకా నిర్వహణ
1వ తేదీ నుంచి స్కిట్స్ పేరుతో 2 రోజుల పాటు పోటీలు
నిన్నా మొన్నటి దాకా సినిమాల ప్రభావంతో కుదేలైపోయిన నాటక రంగం.. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీలు, ఇంకెన్నో డిజిటల్ వినోదాలూ.. విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటినీ తట్టుకుంటూ నగరవాసుల్ని తన ప్రదర్శనల వైపు నడిపిస్తోంది. యువతరాన్ని ఆకట్టుకుంటూ కాలేజీ క్యాంపస్‌లతో పాటు కార్పొరేట్ కంపెనీల ఆడిటోరియమ్స్ దాకా నాటకాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఉత్సాహానికి కారణం.. ఆధునికులకు నచ్చే యూత్ కలర్స్ రంగరించి.. రంగస్థల ఈవెంట్స్‌ను సిటిజనులకు చేరువ చేయడంలో డ్రామానన్ వంటి సంస్థలు నగరానికి రావడం ఒక కారణంగా చెప్పొచ్చు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపాల్‌లో పాతికేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో డ్రామనాన్(డ్రామాటిస్ట్ అనామిక) ఏర్పాటైంది. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ ఆర్‌కే షెనాయ్, దివంగత చందన్ శతపతిలు స్థాపించిన ఈ థియేటర్ గ్రూప్.. పాతిక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 450కి పైగా ప్రదర్శనలతో 70కి పైగా నాటకాలను విజయవంతంగా ప్రదర్శించింది. అనంతరం అర్బన్ ప్లానర్ అయిన ఆర్‌కే షెనాయ్ మన నగరానికి మకాం మార్చాక 2007లో డ్రామానాన్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి డ్రామనాన్ నగర థియేటర్ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2007లో భారతీయ విద్యాభవన్‌లో విలియం సెబ్రింగ్ రచించిన ‘ది ఒరిజినల్ లాస్ట్ విష్ బేబీ’తో ప్రారంభించి, ‘ఫూల్స్, ది గుడ్ డాక్టర్, పిజ్జాజ్ అండ్ డబుల్స్, ది లాస్ట్ రిసార్ట్, లవ్, లాస్ట్, 24 రూబుల్స్ లాస్ట్, అదర్ ఫాస్ట్ ఫుడ్స్.. ఇలా అనేక సొంత నాటకాలను సిటీలో ప్రదర్శించింది.
ఆదరణ.. అవార్డ్స్..
19 సంవత్సరాలుగా డ్రామనాన్ దేశవిదేశాలలో వివిధ ఉత్సవాల్లో ప్రదర్శనలు సమర్పించింది. గత 2015లో, బ్రాడ్‌వే ఆన్‌లైన్ మ్యాగజైన్ డ్రామనాన్‌ను దేశంలోని టాప్–20 థియేటర్ గ్రూపులలో ఒకటిగా పేర్కొంది. డ్రామనాన్ హైదరాబాద్ 2012, 2013లో ఐనా థియేటర్ పోటీల్లో, 2013లో షార్ట్ ప్లస్ స్వీట్ థియేటర్ పోటీల్లో గెలుపొంది సిటీ థియేటర్ సత్తా చాటింది. ప్రముఖ నటులు రజిత్ కపూర్ షెర్నాజ్ పటేల్ నటించిన రేజ్ ప్రొడక్షన్స్ ‘లవ్ లెటర్స్’ వంటి ప్రసిద్ధ నాటకాలను కూడా డ్రామనన్ నిర్మించింది.
స్కిట్.. ఫైట్.. షురూ..
థియేటర్ ప్రేమికులు, ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించేందుకు ‘స్కిట్స్’ అనే 12 నిమిషాల షార్ట్ ప్లే కాంటెస్ట్‌ని డ్రామనాన్ ప్రారంభించింది. ఇందులో నగరానికి చెందిన వివిధ కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహిక అనుభవజ్ఞులైన థియేటర్ గ్రూప్స్ పాల్గొంటున్నాయి. ఒక వార్షిక కార్యక్రమంగా మారిన ఈ పోటీల్లో అతుల్ కుమార్, రజిత్ కపూర్, షెర్నాజ్ పటేల్, అభిక్ మజుందార్ ప్రకాష్ కోవెలమూడి తదితర రంగస్థల ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
1, 2 తేదీల్లో ప్రిలిమినరీ పోటీలు..
ఈ పోటీల్లో ఈ ఏడాది 24 టీమ్స్ పాల్గొంటున్నాయి. స్కిట్స్ కార్యక్రమం నుంచి ‘ఉత్తమ నటుడు’, ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ప్లే’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రిప్‌్ట’, ‘ఉత్తమ పోస్టర్’, ‘ఉత్తమ ప్రచార వీడియో’, ‘ఆడియన్స్ ఛాయిస్ ప్లే’ వంటి పురస్కారాలు అందిస్తున్నారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.1,20,000 వరకూ ఉంటుంది. ఈ పోటీలకు సంబంధించి ప్రాథమిక రౌండ్ స్కిట్‌లు 1, 2వ తేదీల్లో గచి్చ»ౌలిలోని సుప్రీమ్ ట్రాంపోలిన్ పార్క్ సమీపంలో ఉన్న ఎలైన్డ్ ఎంప్లాయీస్ కాలనీలోని రంగభూమి స్పేసెస్‌లో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment