India's Worthless Degrees Undercut World's Fastest-Growing Major Economy - Sakshi
Sakshi News home page

ఆ విలువ లేని డిగ్రీలే భారత్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్‌!

Published Tue, Apr 18 2023 1:51 PM | Last Updated on Tue, Apr 18 2023 2:38 PM

Indias Worthless Degrees Undercut Worlds Fastest Growing Major Economy - Sakshi

భారత్‌లోని విద్యా విధానం, డిగ్రీలు గురించి అమెరికాలోని బ్లూమ్‌బెర్గ్ చెందిన ఓ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సర్వే చేసింది. తన అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు రూ.900 కోట్లు విద్యారంగంపై ఖర్చుపెడుతోందని, వేగంగా కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. అయినప్పటికీ యువత ఎలాంటి నెపుణ్యాలు లేని గ్యాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలిపింది. ఇదే భారత ప్రధాన ఆర్ధిక వ్యవస్థను కుంటిపరుస్తోందని చెప్పింది. ఉద్యోగం వస్తుదనే ఆశతో రెండు, మూడు డిగ్రీలు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు కుప్పలు తెప్పలుగు పుట్టుకొస్తున్న ప్లేస్‌మెంట్‌లు ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ల వైపు ఆకర్షితులై వేలకు వేలు డబ్బు వెచ్చించి..చివరి ఉద్యోగాలు లేక నానాపాట్లు పడుతున్నారని పేర్కొంది.

అల్ఫాబేట్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలు సుందర్‌ పిచాయ్‌, సత్య నాదేళ్ల వంటి వారికి భారత్‌లోని అత్యున్నత విద్యా సంస్థల్లో చోటు దక్కకపోవడం అత్యంత విచిత్రం అని కూడా పేర్కొంది. ఇక్కడ టాప్‌ సంస్థల తోపాటుగా చిన్నప్రైవేట్‌ విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింది. వాటిల్లో తక్కువ శిక్షణ కూడిన ఉపాధ్యాయులను నియమించుకుని, ఔట్‌ డేటెడ్‌ పాఠ్యాంశాలను చెబుతున్నట్లు వెల్లడించింది. అందువల్ల అలాంటి సంస్థల్లో డిగ్రీలు చేసిన ఎలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండకపోవడంతో నిరుద్యోగులు మిగిలిపోతున్నట్లు వీబాక్స్‌ వెల్లడించింది. కానీ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశమని, ఎక్కువ మంది యువకుల ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి ఆర్భాటంగా చెబుతుందని పేర్కొంది.

వృద్ధి పరంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకువెళ్తున్నప్పటకీ ..నిరుద్యోగం 7% కంటే ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. ఇదే దాని ప్రధాన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని కూడా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందని వెల్లడించింది. భారత్‌లోని విద్యా వ్యవస్థలో పలు లోపాలను ప్రస్తావిస్తూ..విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ నాలెడ్జ్‌ తప్ప ప్రాక్టీకల్‌ నాలెడ్జ్‌ లేకుండా చేయడంతో ఉద్యోగాలు రాక పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది. కొన్ని పేరున్న మెడికల్‌ కాలేజీలు ఆస్పత్రులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చి వారిని ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించింది. అయినప్పటికీ విద్యార్థులు అలాంటి కాలేజీల్లోనే ఏదో రకంగా జాయిన్‌ అయిపోతున్నారని, డిగ్రీ సంపాదిస్తే చాలు అన్నట్లు ఉంటున్నారని చెప్పుకొచ్చింది.

కాగా, ఇలాంటి డిగ్రీలు విలువలేనివని, దీంతో ఏటా మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ డీన్‌, ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఆప్‌ ఎడ్యకేషన్‌ మాజీ సభ్యుడు అనిల్‌ సద్గోపాల్‌ అన్నారు. అలాగే మానవ వనరుల సంస్థ ఎస్‌హెచ్‌ఎల్‌ చేసిన ఒక అధ్యయనంలో కేవలం 3.8% ఇంజనీర్లు మాత్రమే స్టార్టప్‌లలో సాఫ్ట్‌వేర్ సంబంధిత ఉద్యోగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని గుర్తించింది. అంతేగాదు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు  మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..ఐటి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే గ్రాడ్యుయేట్‌లకు ముందు శిక్షణ అవసరం. చాలామంది గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారందరికీ ఉద్యోగం చేసే నేపుణ్యాలు లేవన్నారు.

అందువల్లే ఏటా నిరుద్యోగుల ఎక్కువ అవుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమైని అన్నారు. ఉద్యోగాలు లేక నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు ఇండియా బ్రాండ్‌ ఈక్వీటీ ఫౌండేషన్‌ ప్రకారం భారత్‌లో విద్యా పరిశ్రమ అధ్యయనం ప్రయకారం భారత్‌లో 2025 నాటికి విద్యారంగం కోసం దాదాపు రూ. 1800 ​ కోట్లు కేటాయిస్తుందని అంచనా. ఇది యూఎస్‌లోని విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువే. భారత్‌లో  విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 2.9% వద్దే నిలిచిపోయిందని, ఇది ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువే అని ఈక్వీటి ఫౌండేషన్‌ వెల్లడించింది.

(చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement