పేదరికం నుంచి భారత్‌ బయటపడాలంటే..: నారాయణమూర్తి | Infosys Narayana Murthy Again Defended 70 Hour Work Week Philosophy, Urging Young Indians To Work Harder | Sakshi
Sakshi News home page

పేదరికం నుంచి భారత్‌ బయటపడాలంటే..: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై మరోసారి చర్చ

Published Mon, Dec 16 2024 9:47 AM | Last Updated on Mon, Dec 16 2024 10:45 AM

Infosys Narayanamurthy Again Defended 70 Hour Work Week

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. పని గంటలపై తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలు కొడుతూ.. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారాయన. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ..

‘‘ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే  భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్‌ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి.

.. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి పిలుపు ఇచ్చారు.

ఆ మధ్య ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్‌’ అనే పాడ్‌కాస్ట్‌ తొలి ఎపిసోడ్‌లో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. పలు దేశాల్లో పని గంటలపై చర్చ ఆ సమయంలో జరిగింది. అంతేకాదు.. ఇటీవల జపాన్‌లో వారానికి నాలుగు రోజుల పని దినాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. నారాయణమూర్తిని నెట్టింట ట్రోల్‌ చేశారు కూడా.

నారాయణమూర్తి ఏమన్నారంటే..
‘ది రికార్డ్‌’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. 

ఇదీ చదవండి: భారత్‌ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement