ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన వ్యయాన్ని (CAPEX) పెంచడంపై బడ్జెట్‌లో దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది రూ.11.11 లక్షల కోట్లతో పోలిస్తే 0.9% ఎక్కువ. అయితే, 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కొత్త కేటాయింపులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల్లో పెరుగుదల నమోదు చేశాయి.
మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో వేసిన అంచనా పద్దుల ప్రకారం కింది విభాగాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది.
ఎందుకోసం ఖర్చు చేస్తారంటే..
లాజిస్టిక్స్, ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్డు, రైలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతారు. సమాన అభివృద్ధి, మార్కెట్ల సౌలభ్య కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ప్రపంచం సుస్థిర భవిష్యత్తు దిశగా పయనిస్తున్న తరుణంలో ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ఖర్చు చేస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరిస్తుంది. మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తుంది.
డిజిటలైజేషన్ కోసం..
సుస్థిర వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్‌పై, ఈ విభాగంలో వినూత్న విధానాల అమలుకు ఖర్చు చేస్తారు. డిజిటల్ వృద్ధికి తోడ్పడటానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, 5జీ నెట్‌వర్క్‌లను పెంచేందుకు కృషి చేస్తారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ బెదిరింపుల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సదుపాయాలను బలోపేతం చేస్తారు.
హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు, వైద్య పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. విద్యా నాణ్యతను పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణా కేంద్రాలపై పెట్టుబడి పెడుతారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్‌లో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేస్తారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
ఎంఎస్ఎంఈలపై..
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు మూలధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంఎస్ఎంఈలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment