Capex cycle
-
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయం
దేశంలో ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 54% పెరుగుతుందని అంచనా. 2023-24లో రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్బీఐ ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ నిర్వహణ, స్థిరమైన క్రెడిట్ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి..వంటి చాలా అంశాలు ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయానికి, రోడ్లు, వంతెనలు, విద్యుత్..వంటి ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి వెచ్చిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలుబ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారీగా నిధులు పొంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సదుపాయాల ద్వారా రానున్న 3-5 ఏళ్లల్లో ఆదాయం సమకూరనుంది. మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు దూసుకుపోతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. ఎగుమతులు హెచ్చవుతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి అధికమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి. 1. యాపిల్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు. సీఈఓ: టిమ్‌కుక్ కంపెనీ ప్రారంభం: 1976 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 2. మైక్రోసాఫ్ట్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు. సీఈఓ: సత్యనాదెళ్ల కంపెనీ ప్రారంభం: 1975 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 3. సౌదీ అరమ్‌కో సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు. సీఈఓ: అమిన్ హెచ్.నజెర్ కంపెనీ ప్రారంభం: 1933 ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! 4. ఆల్ఫాబెట్(గూగుల్) సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు. సీఈఓ: సుందర్ పిచాయ్ కంపెనీ ప్రారంభం: 1998 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 5. అమెజాన్ సెక్టార్: ఈ కామర్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు. సీఈఓ: యాండీ జెస్సీ ఫౌండర్: జెఫ్‌బెజోస్ కంపెనీ ప్రారంభం: 1994 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 6. ఎన్విడియా సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు. సీఈఓ: జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రారంభం: 1993 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 7. మెటా ప్లాట్‌ఫామ్స్(పేస్బుక్) సెక్టార్: సోషల్ మీడియా మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు. సీఈఓ: మార్క్ జూకర్బర్గ్ కంపెనీ ప్రారంభం: 2004 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ 8. బెర్క్‌షైర్ హాత్వే సెక్టార్: ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు. సీఈఓ: వారెన్‌బఫెట్ కంపెనీ ప్రారంభం: 1839 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 9. టెస్లా సెక్టార్: ఆటోమోటివ్ మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు. సీఈఓ: ఎలాన్‌మస్క్ కంపెనీ ప్రారంభం: 2003 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 10. ఎలి లిల్లి సెక్టార్: ఫార్మాసూటికల్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు. సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్ కంపెనీ ప్రారంభం: 1876 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ -
రికవరీ కనబడుతోంది: నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 3.6 శాతమేనని వివరించింది. స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది.