ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 3.6 శాతమేనని వివరించింది.
స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్‌లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది.
రికవరీ కనబడుతోంది: నోమురా
Published Sat, Jan 4 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement