nomura
-
సగానికి పడిపోయిన పండుగ డిమాండ్
ముంబై: ప్రస్తుత ఏడాది పండుగల సందర్భంగా డిమాండ్ సగానికి క్షీణించి 15 శాతంగా ఉన్నట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. 2023లో పండుగల సీజన్లో డిమాండ్ 32 శాతం పెరగ్గా, 2022లో 88 శాతం వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ అమ్మకాలు పండుగల సీజన్లో పెరిగినప్పటికీ, మొత్తం మీద వృద్ధి నిదానంగానే ఉన్నట్టు పేర్కొంది.గ్రామీణ ప్రాంతాలు, టైర్–2, 3 పట్టణాల్లో డిమాండ్ స్థిరంగానే ఉండగా.. మెట్రోల్లో, పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. పట్టణ డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం ప్రకటించడం గమనార్హం. డిసెంబర్ నెలలో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడం డిమాండ్‌కు ఊతం ఇవ్వొచ్చని నోమురా అంచనా వేస్తోంది. రిటైల్ అమ్మకాల వృద్ధి 2023లో ఉన్న 36.4 శాతం నుంచి.. 2024లో 13.3 శాతానికి పరిమితం కావొచ్చన్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనాలను తన నివేదికలో నోమురా ప్రస్తావించింది.మరోవైపు రిటైల్ ఆటో విక్రయాలు 14 శాతం పెరగ్గా.. హోల్సైల్ వైపు ప్యాసింజర్ అమ్మకాలు, మధ్యశ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక మందగమనం కొనసాగుతోందంటూ.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉండొచ్చన ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావాహంగా ఉన్నట్టు నోమురా అభివర్ణించింది. -
అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్లో కొన్ని సెక్టార్లలోని స్టాక్లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్ఐఐలు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా వంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పరిమిత కాలానికి సంబంధించి ఆశావాహంగా ఉండడంలేదు.గడిచిన సెషన్లో అమ్మకాలు ఈ విభాగాల్లోనే..బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు గడిచిన సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80వేల దిగువున 79,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 79,822 – 80,436 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 24,307 వద్ద కనిష్టాన్ని, 24,498 వద్ద గరిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: స్క్రీన్కు బానిసవుతున్న బాల్యండిమాండ్ ఉన్న సెక్టార్లుసర్వీసెస్, ఇండ్రస్టియల్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, టెలికం షేర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. గోదావరి బయోరిఫైనరీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.352తో) పోలిస్తే 12% డిస్కౌంట్‌తో రూ.310 వద్ద లిస్టియ్యింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకొని 3% నష్టంతో రూ.343 వద్ద ముగిసింది. -
వృద్ధి మందగమనంలోకి భారత్
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్క్‌లు పెరుగుతున్నట్టు పేర్కొంది.వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే.పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది.కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
ఆర్థిక పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటూ.. రానున్న రోజుల్లో డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథం ఉంది. సాగు రంగం పట్ల సానుకూల అంచనాలు, పండుగల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు, ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు పెట్టుబడులకు ఊతమిస్తాయి’’అని సెపె్టంబర్ ఎడిషన్ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25 సంవత్సరానికి 6.5–7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. వినియోగ సెంటిమెంట్ మృదువుగా మారడంతో పట్టణ డిమాండ్ మోస్తరు స్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోందని.. సాధారణం మించి వర్షాలతో ఫూట్ఫాల్ (షాపులను సందర్శించే కస్టమర్లు) పరిమితంగా ఉండడం, కాలానుగుణ కారణాలతో ప్రజలు కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్టు వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్తబ్దత మరింత అధికం కావడం, అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఇవన్నీ ఆర్థిక వృద్ధికి రిస్క్‌లుగా పేర్కొంది. వీటి ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసరించే రిస్క్ ఉందంటూ.. అదే జరిగితే డ్యూరబుల్ గూడ్స్‌పై వినియోగదారులు చేసే వ్యయాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి సెపె్టంబర్లో పెరిగిపోవడం తెలిసిందే. కానీ, కొన్ని కూరగాయలను మినహాయిస్తే ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు మెరుగ్గా ఉండడం, ఖరీఫ్‌లో జోరుగా విత్తన సాగు వ్యవసాయ ఉత్పాదకత పట్ల ఆశాజనక అంచనాలకు వీలు కలి్పస్తోందని.. ఆహార ధాన్యాల నిల్వలు తగినంత ఉండడంతో మధ్యకాలంలో ధరల కట్టడికి వీలుంటుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల సానుకూల సెంటిమెంట్ ఉన్నట్టు వెల్లడించింది. స్థిరమైన వృద్ధి సాధించడం ద్వారానే ఈ సెంటిమెంట్‌ను వాస్తవిక పెట్టుబడులుగా మలుచుకునేందుకు అవకాశాలుంటాయని పేర్కొంది. నెల రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో రూ.85వేల కోట్లకు పైగా అమ్మకాలు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విదేశాలతో ఆర్థిక కార్యకలాపాలు (ఎక్స్టర్నల్ సెక్టార్) మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. పెరుగుతున్న పెట్టుబడులు, స్థిరమైన రూపాయి, మెరుగైన స్థితిలో విదేశీ మారకం నిల్వలను ప్రస్తావించింది. సెపె్టంబర్ చివరికి 700 బిలియన్ డాలర్లను విదేశీ మారకం నిల్వలు దాటిపోవడాన్ని గుర్తు చేసింది. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది.వృద్ధి మందగమనంలోకి భారత్జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్‌్కలు పెరుగుతున్నట్టు పేర్కొంది. వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే. పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది. కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
రక్షణ ఉత్పత్తుల్లో భారత్ ముద్ర
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీకి భారత్ కేంద్రంగా అవతరించగలదని.. వచ్చే పదేళ్ల కాలంలో (2032 నాటికి) 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) ఎగుమతులకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్నాలజీలు, సరీ్వసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు అపారమైన అవకాశాలు రానున్నాయని అంచనా వేసింది. ‘ఇండియా డిఫెన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంపై భారత్ మూలధన వ్యయాలు 2029–30 నాటి బడ్జెట్లో 37 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. 2024–25 బడ్జెట్లో 29 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా పెరగనున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే 2024 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం రూ.15.5 లక్షల కోట్లను భారత్ రక్షణ రంగంపై వెచ్చించనున్నట్టు అంచనా వేసింది. గతంతో పోలి్చచూస్తే ఇది పెద్ద మొత్తమేనని గుర్తు చేసింది. ‘‘సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం రూపంలో రక్షణ రంగానికి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలుకుతోంది’’అని వివరించింది.హెచ్ఏల్, బీఈఎల్‌కు ఆర్డర్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు గొప్ప అవకాశాలు రానున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో కంపెనీకి ఉన్న బలమైన సామర్థ్యాలను ప్రస్తావించింది. రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు సైతం బలమైన ఆర్డర్లకు అవకాశాలున్నాయని, దీంతో కంపెనీ మార్జిన్లు, రాబడుల రేషియోలు పెరుగుతాయని నోమురా తన నివేదికలో పేర్కొంది. వివిధ రూపాల్లో భారత్ సర్కారు అందిస్తున్న తోడ్పాటుతో ఈ రంగంలోని కంపెనీలకు సానుకూల వాతావరణం నెలకొన్నట్టు తెలిపింది. ఎగుమతులు టెక్నాలజీ బదిలీ, సహకారం రూపంలో భారత రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా తన స్థానాన్ని విస్తరించుకుంటున్నట్టు వివరించింది. దీంతో రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల అవకాశాలను పెద్ద ఎత్తున సొంతం చేసుకోగలవని అంచనా వేసింది. తద్వారా అవి తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోగవలని వివరించింది.లాభదాయక అవకాశాలురక్షణ రంగంలో ఎన్నో విభాగాలు లాభదాయక అవకాశాలను ఆఫర్ చేస్తున్నాయని నోమురా నివేదిక తెలిపింది. డిఫెన్స్ ఏరోస్పేస్ విభాగం ఒక్క దాని విలువే 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్, హెలీకాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను గుర్తు చేసింది. షిప్ బిల్డింగ్ సైతం భారీ అవకాశాలు కల్పిస్తోందని, సముద్ర తీర రక్షణ కోసం నేవల్ వెస్సెల్స్, సబ్మెరైన్లు, పెట్రోల్ బోట్లకు సంబంధించి 38 బిలియన్ డాలర్ల తయారీ అవకాశాలను ప్రస్తావించింది. మిసైళ్లు, ఆరి్టలరీ గన్ వ్యవస్థలపై పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నోమురా నివేదిక అంచనా వేసింది. తన ఆరి్టలరీ, మిసైల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేసింది. -
2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా
ముంబై: భారత్‌లో రుణ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితం కావచ్చని జపాన్ బ్రోకరేజ్ సంస్థ-నోమురా అంచనా వేసింది. 2022-23లో సాధించిన 15 శాతంతో పోల్చిచూస్తే రుణ స్పీడ్ దాదాపు 5 శాతం పడిపోతు దన్నది నోమురా అంచనాలు కావడం గమనార్హం. ఆహారేతర రుణాలకు సంబంధించి వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో సంస్థ అభిప్రాయపడింది. (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) రుణ వృద్ధి స్పీడ్ తగ్గడంసహా, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, తక్కువ మూలధన అవసరాలు వంటి కారణాలు 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటును 5.3 శాతానికి పరిమితం చేస్తాయని కూడా నోమురా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి 2.5 శాతం మేర పెరిగిన ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం) రుణ వృద్ధికి విఘాతం కలిగించే వీలుందని, వ్యవస్థలో ప్రత్యేకించి గృహ రుణాలపై ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించింది. (డిజిటల్ బాటలో ఎయిర్ ఇండియా - భారీ పెట్టుబడి) జనవరిలో 16.7 శాతం రుణ వృద్ధి నమోదయితే.. ఇది తగ్గుతూ వస్తున్న ధోరణి స్పష్టమవుతోందని పేర్కొంది. ఫిబ్రవరిలో 16 శాతం, మార్చిలో 15.4 శాతంగా రుణ వృద్ధి జరిగిందని పేర్కొంది. రానున్న మాసాల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రుణ వృద్ధి పెంచుకోవవడం-సాధ్యమైనంత మొండిబకాయిలు (ఎన్పీఏ) తగ్గించుకోవడంపై భారత్ బ్యాంకింగ్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు పరిస్థితి కనబడుతోందని పేర్కొంది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్
ముంబై: భారత్‌లో వ్యాపార క్రియాశీలత పురోగతి వేగంగా కొనసాగుతోందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా పేర్కొంది. ఆగస్టు 29నాటికి వ్యాపార క్రియాశీలత కరోనా ముందస్తు స్థాయికి చేరుకుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► నోమురా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 2021 ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 102.7కు ఎగసింది. దేశంలో కరోనా ముందస్తు.. అంటే 2020 మార్చి తరువాత ఇండెక్స్ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. అంతక్రితం ఆగస్టు 22వ తేదీతో ముగిసిన వారంలో ఇండెక్స్ 101.3 వద్ద ఉంది. మార్చి 2020 తర్వాత లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో ఇండెక్స్ భారీగా పడిపోయింది. ► 2021 జూన్‌లో ఇండెక్స్ 15 శాతం పెరిగితే, జూలైలో ఈ వేగం 17.1 శాతంగా ఉంది. తొలి ఫలితాల ప్రకారం ఆగస్టు 29 నాటికి 5.6 శాతంగా నమోదయ్యింది. ► ఆగస్టు 29వ తేదీనాటికి గూగుల్ రిటైల్, రిక్రియేషన్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగితే, యాపిల్ డ్రైవింగ్ ఇండిసీస్ 10 శాతం ఎగసింది. వర్క్‌ప్లేస్ మొబిలిటీ ఇండెక్స్ 3.7 శాతం పడిపోయినప్పటికీ, గూగుల్, యాపిల్ సంబంధిత ఇండెక్స్‌లు పెరగడం గమనార్హం. ► విద్యుత్ డిమాండ్ వారం వారీగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ► ఇక కార్మికుల భాగస్వామ్య సూచీ 40 శాతం నుంచి 40.8 శాతానికి ఎగసింది. మూడవవేవ్ను తోసిపుచ్చలేం... కాగా రానున్నది పండుగల సీజన్ కావడంతో మూడవవేవ్ ముప్పును త్రోసిపుచ్చలేమని నోమురా హెచ్చరించడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 7 రోజుల సగటు (మూవింగ్ యావరేజ్) కేసులు 9,200 పెరిగి 41,000కు చేరినట్లు నోమురా పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఇంకా మిశ్రమ వార్తలు వస్తున్నాయని తెలుపుతూ, ఇది మూడవ వేవ్‌కు సంకేతం కావచ్చనీ విశ్లేషించింది. అలాగే ఇదే సమయంలో వ్యాక్సినేషన్ మూవింగ్ యావరేజ్ వారం వారీగా 47 లక్షల డోసుల నుంచి 71 డోసులకు పెరిగిందని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే 2021 డిసెంబర్ ముగిసే నాటికి భారత్‌లో దాదాపు 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉందని పేర్కొంది. వృద్ధి 10.4 శాతం మూడవ వేవ్ సమస్యలు తలెత్తకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ ఎకానమీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని తన నివేదికలో నోమురా పేర్కొంది. -
కొత్త ఏడాదిలో రయ్రయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు. సియామ్ లెక్కల ప్రకారం.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది. కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్ స్థాయి తయారీ భారత్‌లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్ (ఎల్‌టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్‌టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు.. మోటార్స్, కంట్రోలర్స్ సైతం భారత్‌లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది. -
రూపాయి డీలా.. ఎందుకు ఇలా?
ముంబై: ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కోవిడ్-19కు ముందు స్థాయి 72కు చేరుకోగలదని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి 72 స్థాయిలో ట్రేడయ్యింది. ఇందుకు 2004 తదుపరి కరెంట్ ఖాతాలోటు నుంచి బయటపడటంతోపాటు మిగులుదిశగా పయనించడాన్ని ప్రస్తావించింది. ఇటీవల చమురు ధరలు పతనంకావడం, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితులు మెరుగుపడటం రూపాయికి బలాన్నివ్వగలవని పేర్కొంది. నేలచూపులో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 33 పైసలు (0.4 శాతం) కోల్పోయి 74.70ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టం కాగా.. తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత క్షీణించింది. బుధవారం కన్సాలిడేషన్ బాటలో సాగిన రూపాయి 74.37 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్టపోవడం గమనార్హం! -
వృద్ధి 5.7 శాతమే: నోమురా
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతమే నమోదవుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచనావేసింది. వినియోగం పడిపోవడం, పెట్టుబడుల బలహీనత, సేవల రంగం పేలవంగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని సంస్థ అంచనావేసింది. మందగమన పరిస్థితులకు ఇక తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతున్నట్లు సంబంధిత ఇండికేటర్స్ సూచిస్తున్నట్లు తెలిపింది. 2018–19లో 6.8 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30వ తేదీన ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
వచ్చే ఐదేళ్లలో కోటి ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. మధ్యతరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్షణీయ మార్కెట్‌గా నిలబెట్టనున్నాయి. అయితే వినియోగం అవుతున్న ఉత్పత్తుల్లో దిగుమతుల వాటా గణనీయంగా ఉండడంతో దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాల సృష్టి పరిమితం అవుతోందని నివేదిక తెలిపింది. మరోవైపు పలు క్లస్టర్లలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ కంపెనీల్లో తయారీకి బూస్ట్‌నిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా వర్క్ ఫోర్స్ 48 కోట్లుంది. 2025 నాటికి వీరికి అదనంగా 4.5 కోట్ల మంది జతకూడనున్నారు. మొత్తం పనివారిలో తయారీ రంగంలో 12.5 శాతం మంది ఉంటారు. సింహభాగం ఎంఎస్‌ఎంఈదే.. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో 3.6 కోట్ల ఉద్యోగాలతో ఎంఎస్ఎంఈ కంపెనీలు 70 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వినియోగదార్ల అభిరుచులు, సాంకేతిక మార్పుల ప్రభావం తయారీ రంగంపై ప్రస్ఫుటంగా కనపడుతోంది. కొత్త ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ, చిన్న కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని ఎన్ఆర్ఐ కన్సల్టింగ్ పార్ట్నర్ ఆశిమ్ శర్మ వ్యాఖ్యానించారు. మార్కెట్ ఆధారిత వ్యూహాలు అనుసరించి ఈ రంగ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ కంపెనీలు తయారు చేసిన వస్తువులు వాడుతున్న కస్టమర్లలో ప్రభావితం చేయగల కంపెనీలుగానీ వ్యక్తులుగానీ ఈ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని నివేదిక అభిప్రాయపడింది. తద్వారా ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. -
‘జీ’ హుజూర్ ఎవరికో..?
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్ దిగ్గజం, కామ్‌కాస్ట్(అమెరికాలో ఎన్బీసీ యూనివర్శల్ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్ మాజీ సీఎఫ్ఓ మైకేల్ ఏంజెలాకిస్ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఎటైర్స్, సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్, భారత చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (జీ ఎంటర్టైన్మెంట్లో వాటా కొనుగోలు కోసం రంగంలో ఉన్న ఏకైక భారత కంపెనీ ఇదే)లు ఇప్పటికే తమ బిడ్లను సమర్పించాయి. కామ్‌కాస్ట్, అటైర్స్ కలిసి సంయుక్తంగా వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. చైనాకు చెందిన టెన్సెంట్, ఆలీబాబాలు కూడా రంగంలోకి వస్తాయనే అంచనాలున్నాయి. కానీ, ఇంతవరకూ ఇవి ఎలాంటి బిడ్లు సమర్పించలేదు. జోరుగా చర్చలు... జీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో వాటా విక్రయ చర్చలు జోరుగానే సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సంప్రదింపులు, మేనేజ్మెంట్లో చర్చలు అన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయని, కొన్ని చర్చలు సీరియస్‌గానే సాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయని, సందర్భానికి తగ్గటు నిర్ణయాలు తీసుకోవడం కోసం వేచి చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాలపై కామ్‌కాస్ట్, సోనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జీ ప్రతినిధి పేర్కొన్నారు. వాటా విక్రయ ప్రక్రియ నిలకడగా కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. అటైర్స్, యాపిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎలాంటి స్పందన ఇప్పటివరకూ వ్యక్తం చేయలేదు. బ్రియాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని కామ్‌కాస్ట్ కంపెనీ మీడియా ఆస్తులను కొని, విక్రయించడం చేస్తోంది. ఈ కంపెనీ కేబుల్ నెట్వర్క్స్, బ్రాండ్‌బాండ్ అసెట్స్, కంటెంట్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, యానిమేషన్ స్డూడియోలు వంటి మీడియా ఆస్తుల క్రయ, విక్రయాలు జరుపుతోంది. రేసులో సోనీ ముందంజ... ఈ రేసులో సోనీ కార్పొ ముందంజలో ఉందని సమాచారం. వేగంగా వృద్ధి చెందుతున్న భారత టీవీ, మీడియా, వినోద రంగాల్లో కామ్‌కాస్ట్, అటైర్స్, యాపిల్.. వంటి సంస్థలకు చెప్పుకోదగ్గ ఉనికి లేదు. ఈ సంస్థలు ఆరంభంలో ప్రమోటర్లతో సమానమైన వాటాను కొనుగోలు చేసి, 3–5 ఏళ్ల తర్వాత పూర్తి వాటాను కొనుగోలు చేస్తాయని అంచనాలున్నాయి. వినోద, మీడియా రంగాల్లో వంద శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేయవచ్చు. అయితే సంక్లిష్టమైన, బహు భాషలతో కూడిన భారత మార్కెట్లో ఏ విదేశీ సంస్థకైనా స్థానిక భాగస్వామి తప్పనిసరి. భారత శాటిలైట్ టెలివిజన్ రంగంలో ముందుగానే ప్రవేశించిన కంపెనీల్లో సోనీ పిక్చర్స్నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్) ఒకటి. వివిధ జోనర్ల కొత్త చానెళ్లను ఆరంభించే జోరును ఇటీవలనే మరింతగా పెంచింది. రెండేళ్ల క్రితం జీ స్పోర్ట్స్ బిజినెస్‌ను రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసి తాజ్ టెలివిజన్(టెన్ స్పోర్ట్స్ బ్రాండ్)గా ప్రసారాలు చేస్తోంది. గత ఏడాది మరాఠి జనరల్ ఎంటర్టైన్మెంట్స్పేస్లోకి ప్రవేశించింది. ఇప్పుడు జీలో వాటా కొనుగోలు సోనీకి ఎంతగానే కలసివస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎస్పీఎన్కు పట్టణ ప్రాంతాల్లోనే, హిందీ మాట్లాడే మార్కెట్లోనే వీక్షకులున్నారు. జీకి మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకూ పాతుకుపోయింది. మొత్తం భారత టెలివిజన్ వీక్షణ మార్కెట్లో జీ వాటా 20% పైనే ఉంటుందని అంచనా. జీలో వాటాను విక్రయిస్తామని సుభాష్ చంద్ర వెల్లడించిన కొన్ని రోజులకే సోనీ కీలక అధికారులు–మైక్ హాప్కిన్స్(సోమీ పిక్చర్స్ టెలివిజన్ చైర్మన్), టోనీ విన్సిక్యెరా (సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్లు) సుభాష్ చంద్రను ఆయన నివాసంలో సందర్శించడం గమనార్హం. కష్టాల్లో సుభాష్ చంద్ర... జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో 50 శాతం వాటాను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్లోనే కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర వెల్లడించారు. అయితే, ఈ పరిణామం తర్వాత కంపెనీ షేరు భారీగా పతనమైంది. గత ఏడాది కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 23 శాతం కుదేలైంది. దీంతో ఈ కంపెనీలో వాటాను ప్రీమియమ్ ధరకు విక్రయించాలన్న సుభాష్ చంద్ర ఆశలు వమ్మయ్యాయి. ఈ కంపెనీలో దేశీ, విదేశీ సంస్థలతో కలుపుకొని ప్రమోటర్ల మొత్తం వాటా 41.62%%. దేశీయ ప్రమోటర్ సంస్థల వాటాలో 85 శాతం వరకూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల వద్ద తాకట్టులో ఉన్నాయి. -
రెండో త్రైమాసికం బాగుంటుంది
ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా సింగపూర్: ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో భారత్ వృద్ధి మెరుగ్గా ఉండగలదని జపాన్‌కి చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా వేసింది. క్యూ1లో వృద్ధి 6.1 శాతంగా ఉంటే .. క్యూ2లో 6.5–7% శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)తో కొంత అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం స్వల్పకాలికంగానే ఉండి రెండో త్రైమాసికంలో మెరుగైన వృద్ధికి ఉపయోగపడగలదని తెలిపింది. ‘కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు మొదలైన వాటి విక్రయాలు.. బొగ్గు, విద్యుదుత్పత్తి మొదలైనవి పెరుగుతున్న నేపథ్యంలో తొలి త్రైమాసికం కన్నా జూన్ క్వార్టర్లో వృద్ధి సగటున కొంత మెరుగ్గా ఉండగలదు‘ అని నొమురా చీఫ్ ఎకానమిస్ట్ సోనల్ వర్మ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్లు ఆమె వివరించారు. అయితే, జీఎస్టీ విధానానికి మారే క్రమంలో టోకు వర్తకులు .. నిల్వలు తక్కువ స్థాయిల్లో ఉంచవచ్చని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే.. భారత్ వృద్ధి ఈ ఏడాది 7%గాను, వచ్చే ఏడాది 7.8%గాను ఉండొచ్చని తెలిపారు. 2016–17లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మూడేళ్ల కనిష్టమైన 7.1%కి పడిపోయిన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
జీడీపీ లెక్క నిజమా.. మాయా?
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా సందేహం ⇒ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు... ⇒ అవ్యవస్థీకృత రంగంపై ప్రభావం సంగతేంటి? ⇒ అసలైన గణాంకాలు 2018 జనవరిలోనే: కోటక్ న్యూఢిల్లీ: దేశ జీడీపీ గణాంకాలు ఆర్థికవేత్తలు, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు, నాలుగో త్రైమాసికం (జనవరి–మార్చి)లో 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక విభాగం ప్రకటించింది. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో జీడీపీ రేటు మూడో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోతుందంటూ ఎన్నో ప్రముఖ సంస్థలు అంచనాలు వేశాయి. కానీ, కేంద్ర సర్కారు గణాంకాలు వాటికి భిన్నంగా ఉండడంతో విశ్లేషకులు వాటిని తోసిపుచ్చారు. వీటిపై తమకు ఎన్నో సందేహాలు ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. లోగడ రాయిటర్స్ నిర్వహించిన సర్వేలోనూ జీడీపీ 6.4 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ గణాంకాలు పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఎఫ్‌వో అనీష్ శ్రీవాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పూర్తిగా ఆశ్చర్యానికి లోనయ్యానని ఆయన చెప్పడం విశేషం. ఇక మెరుగైన గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల కోతపై పెట్టుకున్న ఆశలకూ విఘాతం కలిగినట్టేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ వచ్చే 12–18 నెలల్లో రేట్లను పెంచడం మొదలు పెట్టవచ్చని భావిస్తున్నాం’’ అన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమైంది. గణాంకాలు కచ్చితమేనా! ప్రభుత్వ గణాంకాల పట్ల సందేహాలను ప్రభుత్వ రంగంలోని ఎస్బీఐతోపాటు, నోమురా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సంస్థల ఆర్థికవేత్తలు సైతం ప్రశ్నించడం గమనార్హం. భారత వృద్ధి గణాంకాలు ‘నిజమా లేక మాయా?’ అని నోమురా ప్రశ్నించింది. అధికారిక గణాంకాలు వాస్తవిక ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసినట్టు పేర్కొంది. ‘‘2015–16 మూడో త్రైమాసికంలో జీడీపీ గణాంకాలను గణనీయంగా సవరించడం 2016–17 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ అధి కంగా ఉండేందుకు దారితీసింది. గణాంకాలతో డీమోనిటైజేషన్ ప్రభావాన్ని కప్పిపుచ్చారు’’ అని ఎస్బీఐ ము ఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు. మూడు కారణాలు ‘‘ఈ వ్యత్యాసాలకు 3 కారణాలున్నాయి. అవ్యవస్థీకృత రంగంపై పడిన ప్రభావాన్ని అంచనా వేయకపోవడం, 2015 మూడో త్రైమాసికం జీడీపీ వృద్ధి అంచనాలను సవరించడం, కంపెనీలు తమ దగ్గరున్న నగదు నిల్వలను సైతం విక్రయాలుగా చూపించడం. మా ఉద్దేశం ప్రకారం జీడీపీ గణాంకాలు... డీమోనిటైజేషన్ వృద్ధిపై చూపించిన ప్రభావాన్ని చాలా వరకు తక్కు వగా అంచనా వేయడమే’’ అని నోమురా పేర్కొంది. సవరించిన గణాంకాలతో నిజం తెలుస్తుంది డీమోనిటైజేషన్ ప్రభావం అస్పష్టంగా ఉందని, గణాంకాలు మిశ్రమ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. నగదు ఆధారిత లావాదేవీలపై ఆధారపడిన అవ్యవస్థీకృత రంగం, చిన్న మధ్య స్థాయి కంపెనీల విభాగాన్ని జీడీపీ గణాంకాల్లోకి పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత పూర్తిస్థాయి వాస్తవిక చిత్రం 2018 జనవరిలో వెలువడే 2016–2017 ఏడాది సవరించిన గణాంకాల్లో తెలుస్తుందని పేర్కొంది. వాస్తవాలకు విరుద్ధం! మోదీ సర్కారు డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తలైన ఆమర్త్యసేన్, పాల్ క్రుగ్మన్ వంటి వారు కూడా తప్పుబట్టారు. అయితే, ప్రభుత్వం, ఆర్బీఐ ఈ విమర్శలను తోసిపుచ్చుతూ ఇబ్బందులు తాత్కాలికమేనని చెప్పాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బలమైన జీడీపీ గణాంకాలు వెల్లడి కావడంతో అసలు వాటి నాణ్యత, విశ్వసనీయతపైనే ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రెండేళ్ల క్రితం మోదీ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను కొలిచే విధానాన్ని (బేస్ ఇయర్ మార్పు) మార్చింది. దాంతో రాత్రికి రాత్రే ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఇది వాస్తవికంగా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. తాజా గణాంకాలు ఈ విషయంలో మరింత సందేహాలకు తావిచ్చాయి. తమ ఆదాయం, ఉపాధిపై గృహస్థుల్లో అనిశ్చితి వల్ల వినియోగదారుల విశ్వాసం గణనీయంగా పడిపోయినట్టు ఆర్బీఐ తాజా సర్వే కూడా స్పష్టం చేసింది. కానీ, వాస్తవాలు ఇలా ఉంటే, క్యూ3 జీడీపీ వృద్ధి గణాంకాలు మెరుగ్గా నమోదయ్యాయనేది ఆర్థికరంగ విశ్లేషకుల వాదన. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో తమ అమ్మకాలు దెబ్బతిన్నట్లు పలు కార్పొరేట్ కంపెనీలు ప్రకటించగా, మరి జీడీపీ ఎలా పెరుగుతుందన్న సందేహాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. డీమోనిటైజేషన్ ప్రభావంతో వృద్ధి రేటు 100 బేసిస్ పాయింట్లు క్షీణిస్తుందన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా. ‘‘డిసెంబర్ త్రైమాసికంలో జీవీఏ 6.6%గా నమోదైనప్పటికీ... 2016–17 రెండో అర్ధభాగంలో వృద్ధి రేటు 7.5–8% ఉంటుంది. అయితే ఇది డీమోనిటైజేషన్ కంటే ముందు తాము వేసిన అంచనాల కంటే తక్కువే. వెనుకటి జీడీపీ సిరీస్‌లో వృద్ధి రేటు 4.5–5 స్థాయిల వద్దే నిలకడగా ఉండేది’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొంది. -
ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?
న్యూఢిల్లీ: అమెరికా 45 అధ్యక్షుడిగా ట్రంప్ చేపట్టనున్న విధానాలు, వివిధ పరిపాలనా సంస్కరణలు మన దేశాన్నికూడా ప్రమాదంలోకి నెట్టనున్నాయా? వివాదాస్పద నిర్ణయంతో ముస్లిందేశాలకు గట్టి షాకిచ్చిన ట్రంప్ మన మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయనున్నాడా? ఇపుడిదే చర్చ మార్కెట్ నిపుణులను ఆలోచనలో పడవేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లపై తక్కువ ప్రభావం ఉండనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేసియా లాంటి దేశాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. వీటి ఆర్థిక వ్యవస్థల కంటే దేశీయంగా తక్కువగా ఉండనుందని భావిస్తున్నారు. లోయర్ ఫిస్కల్ రేటు, కరెంట్ ఖాతా లోటుతో బలంగా ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విధానాలు ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావిస్తున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ దేశీయంగా తటస్థమని నోమురా ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుని అంచనా. బలమైన ఆర్థిక వ్యవస్త, తక్కువ అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ఇతర మార్కెట్లతో పోలిస్తే సాంకేతికంగా బలంగా ఉన్నట్టు చెప్పారు. టీపీపీలో ఒప్పందంలో ఇండియా భాగస్వామ్యం లేనందున అమెరికా చేపట్టిన వ్యాపార రక్షణాత్మక చర్యల ప్రభావం చాలా పరోక్షంగా ఉండనున్నట్టు చెప్పారు. అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థలకు కొంత నష్టమేనని తెలిపింది. అలాగే అమెరికా సరిహద్దు పన్ను పెరుగుదల ఔషధ తయారీ, టెక్స్ టైల్స్, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, ఆటో ఉత్పత్తులను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చైనా, అమెరికా ట్రేడ్ వార్ చైనా, లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టనుందని నోమురా ఎనలిస్ట్ అంచనావేశారు. అలాగే హాంక్ కాంగ్ జీడీపీ లో 25శాతం వాటావున్న ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ మార్కెట్ కి పెద్ద దెబ్బేనని వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని పడవేయనున్నాయి? టంపోనమిక్స్ ఫలితాలు మన ఆర్థిక వ్యవస్థపై సానుకూలమా? అనుకూలమా అనేది మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యగా ప్రమాణం చేసినప్పటినుంచి తనదైన దూకుడుతో తీసుకుంటున్న వివాదాస్పద పరిపాలన నిర్ణయాలు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిం దేశాలకు షాకిస్తూ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అమెరికాలో రెండో రోజూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. -
2017లో భారత వృద్ధి 7.1 శాతం
నొమురా అంచనా... న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు విషయంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నొమురా సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2017లో వృద్ధి రేటు విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని... ఇది 7.1 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది. అయితే, ఈ చర్యల ఫలితంగా 2018లో వేగవంతమైన వృద్ధి రేటు సాధ్యమవుతుందని, 7.7 శాతానికి ఎగుస్తుందని తన నివేదికలో నొమురా పేర్కొంది. ‘‘నోట్లపై ఆంక్షల వల్ల స్వల్ప కాలంలో వృద్ధికి విఘాతం కలుగుతుంది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, నిర్మాణం, రవాణా వంటి రంగాలు ఎక్కువగా నగదుపై ఆధారపడేవి. జీడీపీలో వీటి వాటా 55 శాతం. డీమోనిటైజేషన్ వల్ల మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ రంగాలపై ప్రభావం పడుతుంది. దీంతో 2016 నాల్గవ, 2017 తొలి త్రైమాసికాల్లో జీడీపీ రేటు 1 నుంచి 1.25 శాతం వరకు పడిపోతుంది’’ అని నొమురా వివరించింది.‘‘ప్రభుత్వ సంస్కరణల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు ఎదురైనా మధ్య నుంచి దీర్ఘకాలంలో మాత్రం ఆర్థిక రంగానికి మంచి జరుగుతుందని నొమురా తన నివేదికలో తెలిపింది. -
కరెంట్ అకౌంట్ లోటు పెరగొచ్చు: నొమురా
న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చే– దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం ( ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా) మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను జపాన్ బ్రోకరేజ్ సంస్థ–నొమురా పెంచింది. దీనిప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇంతక్రితం 0.4 శాతం అంచనా 1.4 శాతానికి ఎగసింది. కాగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను భారీగా 0.9 శాతం నుంచి 2.5 శాతానికిపెంచింది. కరెంట్ అకౌంట్ పరిమాణాన్ని ఆ నిర్దిష్ట కాలానికి (ఏడాది లేదా త్రైమాసికం) సంబంధించి జీడీపీతో పోల్చి చెబుతారు. నవంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు రెండేళ్ల గరిష్టస్థాయి 13 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో నొమురా తాజా అంచనాలు వెలువడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జీడీపీ వృద్ధిరేటు పడిపోయే అవకాశాలు ఉండడం తాజాగా క్యాడ్ రేటు పెంచడానికి కారణంగా సంబంధిత వర్గాలు వివరించాయి. దీనికితోడు మరికొంత కాలం దేశ ఎగుమతులు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని నొమురా తన తాజా నివేదికలో పేర్కొంది. -
మరో ఏడాది కష్టాలే..!
నొమురా అంచనావృద్ధి రేటు అంచనాలకు కోత ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకూ (2017-18, జూలై - సెప్టెంబర్) కొనసాగుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనావేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలకు కోత విధించిన కేర్, ఆంబిట్ వంటి ఆర్థిక విశ్లేషణా సంస్థల జాబితాలో తాజాగా నొమురా కూడా చేరడం గమనార్హం. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ⇔ మార్చి త్రైమాసికానికి ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ చోటుచేసుకుంటుంది. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ⇔ భారత్‌లో వినియోగ డిమాండ్ కీలకమైనది. పెద్ద నోట్ల రద్దు వల్ల నెలకొన్న ‘క్యాష్ షార్టేజ్’ వినియోగ డిమాం డ్‌పై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. ⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.5%కి తగ్గిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.9% నుంచి 7.5%కి తగ్గిస్తున్నాం. ⇔ వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, బ్యాంకింగ్‌లో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, గ్రామీణ డిమాండ్ దీర్ఘకాలంలో పుంజుకునే అవకాశాలు వంటివి భారత్ వృద్ధికి సానుకూలమైనవి. ఏటీఎంలు సాఫీగా నడిచేందుకు కృషి: జైకామ్ హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకు ఏటీఎంల వద్ద రద్దీ పెరిగిపోరుున నేపథ్యంలో కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు తమవంతు సాయం అందిస్తున్నట్టు జైకామ్ సెక్యూరిటీ సిస్టమ్స్ తెలిపింది. భారీ రద్దీని బ్యాంకులు తట్టుకోవడం వెనుక బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ పాత్ర తగినంత ఉన్నట్టు తెలిపింది. జైకామ్ కంపెనీ ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులకు చెందిన 4,500 ఏటీఎంల వద్ద సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సేవలదిస్తోంది. ఎరుుర్పోర్ట్లలో ఐడీబీఐ పీఓఎస్ మెషీన్లు... ముంబై: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విమాన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ముంబై ఎరుుర్‌పోర్టులో పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు తెలియజేసింది. ఈ పారుుంట్లలో ఐడీబీఐ వీసా, రూపే డెబిట్ కార్డు వినియోగదారులు డబ్బును డ్రా చేసుకోవచ్చని, ఒక కార్డుకు గరిష్టంగా రూ.2,000 వరకు తీసుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు కూడా వారి వీసా/రూపే డెబిట్ కార్డు ద్వారా ఈ పారుుంట్లలో డబ్బును డ్రా చేసుకోవచ్చని వివరించింది. -
గోల్డీలాక్స్ దశలో భారత్: నోముర
న్యూఢిల్లీ: భారత్ ‘గోల్డీలాక్స్’ కాలంలో పయనిస్తున్నట్లు జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ... నోముర అభివర్ణించింది. ద్రవ్యోల్బణం మరీ అధికంగా కాకుండా... అలాగని మాంద్యంలోకి జారిపోయేంత తక్కువగా కాకుండా ఉండే పరిస్థితిని ఆర్థిక పరిభాషలో ‘గోల్డీలాక్స్’గా వ్యవహరిస్తారు. మరో రకంగా చెప్పాలంటే... ఆర్థిక పరిస్థితులు అన్నీ తగిన స్థాయిలో ఉండడమే ‘గోల్డీలాక్స్’. తాజా నివేదికలో నోముర పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. {పస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ క్రమ రికవరీ దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉన్నా... దేశీయంగా డిమాండ్ వృద్ధి తీరు బాగుంది.ఆగస్టు పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తీరు (6.4 శాతం), సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం (4.41 శాతం) భారత్ వృద్ధికి సంబంధించి సంస్థ అంచనాల పటిష్టతకు కారణం. ఆర్థిక సంవత్సరం సగటున ద్రవ్యోల్బణం 5 శాతం ఉండవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే తగిన స్థాయిలో రేట్ల కోత నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల వరకూ పాలసీ రేటు యథాతథంగా కొనసాగవచ్చు.కాగా పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థల అంచనాలతో పోల్చితే.. తాజా నోముర వృద్ధి అంచనాలు కొంత బాగుండడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 29 విధాన పరపతి సందర్భంగా తన వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎన్సీఏఈఆర్లు ఈ రేటును 7.5 శాతంగా అంచనావేస్తున్నాయి. ఫిచ్ అంచనా 7.5 శాతం. ఏడీబీ, డీఎస్బీ 7.4 శాతంగా అంచనావేస్తున్నాయి. -
ఇన్వెస్టర్లూ.. పారాహుషార్!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ల సూచీలు కొత్త శిఖరాలకు ఎగిశాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని పలు బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి 249 నుంచి 290 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మొత్తం 543 సీట్లుండే లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 272 ఎంపీ స్థానాలను సాధించాలి. 2004, 2009 ఎన్నికల తుది ఫలితాల అంచనాల్లో నాటి ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ విఫలమైన విషయాన్ని బ్రోకరేజీ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. తాజా అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లు తమ జాగ్రత్తలో తాముండాలని క్రెడిట్ సూసీ, బార్ల్కేస్, యూబీఎస్, సిటీ గ్రూప్, నోమురా, కార్వీ సెక్యూరిటీస్, వెల్త్‌రేస్ వంటి బ్రోకరేజీ సంస్థలు హితవు పలుకుతున్నాయి. ఆ తర్వాత భిన్నంగా స్పందించవచ్చు... ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాతో మార్కెట్లలో ర్యాలీ నెలకొందనీ, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మార్కెట్లు భిన్నంగా స్పందించవచ్చని కార్వీ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. నెల క్రితం 30గా ఉన్న దేశ దుర్బల సూచీ (వీఐఎక్స్) ప్రస్తుతం 37.1 పాయింట్లకు చేరిందని యూబీఎస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2009 మేలో ఇది 56 పాయింట్ల రికార్డు స్థాయిని తాకిందని గుర్తుచేసింది. కొత్త ప్రభుత్వం విధాన నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడంపైనే మార్కెట్ల స్థిరత్వం ఆధారపడి ఉంటుందని తెలిపింది. తీవ్ర అనిశ్చితిలో ఉన్నాం... ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్న అభిప్రాయం స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే నెలకొందనీ, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత అధిక స్థాయిలో ఉన్నాయనీ క్రెడిట్ సూసీ రీసెర్చ్ నోట్ తెలిపింది. మనం ఇప్పటికీ అత్యధిక అనిశ్చితిలో ఉన్నామని వ్యాఖ్యానించింది. మే 16న (లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ) ఆశ్చర్యపడే విషయాలు వెల్లడికావచ్చని కూడా పేర్కొంది. జాగ్రత్తగా గమనిస్తున్నాం: నోమురా 2004, 2009 ఎన్నికల ఫలితాల అంచనాలు, వాస్తవ ఫలితాల్లో తేడాలుండడంగా తాజా ఎగ్జిట్ పోల్స్‌ను తాము జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నోమురా తెలిపింది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి భారీ మెజారిటీ వస్తే స్టాక్ మార్కెట్లో ర్యాలీ నెలకొంటుందని వెల్త్‌రేస్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోతే అస్థిర ప్రభుత్వం ఏర్పడి మార్కెట్లు పతనం కావచ్చని వ్యాఖ్యానించింది. -
మోడీ సర్కారొస్తే రూపాయి, స్టాక్స్ రయ్
ముంబై: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే డాలరుతో రూపాయి మారకం విలువ 58కి పెరగడానికి దోహదపడుతుందని జపాన్ బ్రోకరేజి సంస్థ నోమురా తెలిపింది. అంతేకాదు, స్టాక్ మార్కెట్లో 10 శాతం ర్యాలీ ఏర్పడుతుందని పేర్కొంది. ‘భారత నిర్ణాయక సమయం’ పేరుతో విడుదల చేసిన నివేదికలో సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఫైనాన్షియల్ మార్కెట్లకు అత్యంత ప్రాముఖ్యమైనవి. పటిష్టమైన ఆర్థిక విధానం, సరఫరాకు సంబంధించిన సవరణలు కొరవడడంతో దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగికత హెచ్చుస్థాయిలో ఉండి, డిమాండ్ మందగించడం) వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల తీర్పు విస్పష్టంగా ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడి అధికోత్పత్తికి అవకాశాలు పెరుగుతాయి..’ అని నోమురా వివరించింది. నోమురా ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ, ఆమె బృందం సభ్యులు, నోమురా ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అలస్టెయిర్ న్యూటన్, క్రెయిగ్ చాన్‌లు ఈ నివేదికను రూపొందించారు. -
ఈ ఏడాది 5% స్థాయిలో జీడీపీ: నోమురా
ముంబై: ఈ ఆర్థిక సంవత్సర ం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) అనూహ్య వృద్ధిని సాధించే అవకాశాల్లేవని జపనీస్ బ్రోకింగ్ దిగ్గజం నోమురా అంచనా వేసింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తున్న క ఠిన పరపతి విధానాలు, మందగమన పరిస్థితులు వంటివి కారణంగా నిలుస్తాయని నివేదికలో నోమురా పేర్కొంది. వెరసి ఈ ఏడాది జీడీపీ 4.5-5% స్థాయిలో నమోదు కావచ్చునని అభిప్రాయపడింది. అయితే 2014లో ఆర్థిక స్థిరీకరణకు అవకాశమున్నదని, పెట్టుబడుల వాతావరణం చక్కబడేందుకు ఆస్కారమున్నదని వివరించింది. అయితే ప్రస్తుతం అనూహ్య పురోభివృద్ధి సాధించేందుకు సరైన కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ 4.4%(ఏప్రిల్-జూన్), 4.8%(జూలై-సెప్టెంబర్) చొప్పున పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన ఏడాది(2012-13) జీడీపీ 4.5%కు పరిమితమైంది. ప్రధానంగా అధిక వడ్డీ రేట్లు, డిమాండ్ పడిపోవడం వంటి దేశీయ అంశాలు ఇందుకు ప్రభావం చూపాయి. -
రికవరీ కనబడుతోంది: నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 3.6 శాతమేనని వివరించింది. స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది.