మరో ఏడాది కష్టాలే..!
నొమురా అంచనావృద్ధి రేటు అంచనాలకు కోత
ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకూ (2017-18, జూలై - సెప్టెంబర్) కొనసాగుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనావేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలకు కోత విధించిన కేర్, ఆంబిట్ వంటి ఆర్థిక విశ్లేషణా సంస్థల జాబితాలో తాజాగా నొమురా కూడా చేరడం గమనార్హం. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...
⇔ మార్చి త్రైమాసికానికి ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ చోటుచేసుకుంటుంది. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది.
⇔ భారత్‌లో వినియోగ డిమాండ్ కీలకమైనది. పెద్ద నోట్ల రద్దు వల్ల నెలకొన్న ‘క్యాష్ షార్టేజ్’ వినియోగ డిమాం డ్‌పై ప్రతికూలత చూపే అవకాశం ఉంది.
⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.5%కి తగ్గిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.9% నుంచి 7.5%కి తగ్గిస్తున్నాం.
⇔ వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, బ్యాంకింగ్‌లో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, గ్రామీణ డిమాండ్ దీర్ఘకాలంలో పుంజుకునే అవకాశాలు వంటివి భారత్ వృద్ధికి సానుకూలమైనవి.
ఏటీఎంలు సాఫీగా నడిచేందుకు కృషి: జైకామ్
హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకు ఏటీఎంల వద్ద రద్దీ పెరిగిపోరుున నేపథ్యంలో కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు తమవంతు సాయం అందిస్తున్నట్టు జైకామ్ సెక్యూరిటీ సిస్టమ్స్ తెలిపింది. భారీ రద్దీని బ్యాంకులు తట్టుకోవడం వెనుక బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ పాత్ర తగినంత ఉన్నట్టు తెలిపింది. జైకామ్ కంపెనీ ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులకు చెందిన 4,500 ఏటీఎంల వద్ద సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సేవలదిస్తోంది.
ఎరుుర్‌పోర్ట్‌లలో ఐడీబీఐ పీఓఎస్ మెషీన్లు...
ముంబై: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విమాన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ముంబై ఎరుుర్‌పోర్టులో పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు తెలియజేసింది. ఈ పారుుంట్లలో ఐడీబీఐ వీసా, రూపే డెబిట్ కార్డు వినియోగదారులు డబ్బును డ్రా చేసుకోవచ్చని, ఒక కార్డుకు గరిష్టంగా రూ.2,000 వరకు తీసుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు కూడా వారి వీసా/రూపే డెబిట్ కార్డు ద్వారా ఈ పారుుంట్లలో డబ్బును డ్రా చేసుకోవచ్చని వివరించింది.