notes cancellation
-
అవినీతికి వేసిన చేదు మందు
జాబువా/రెవా: దేశంలో వేళ్లూనుకున్న అవినీతిని నిర్మూలించేందుకు, నల్లధనాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు నోట్లరద్దును ఒక చేదు ఔషధంగా ప్రయోగించినట్లు ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని జాబువా, రెవాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడారు. ఈ నెల 28న జరిగే పోలింగ్‌లో ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కకుండా చూడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ‘మేడమ్ సర్కార్’, ‘రిమోట్ కంట్రోల్ సర్కార్’ అని సంబోధించిన మోదీ..ప్రజలు పది గంటలు పనిచేస్తే, తాను మరో గంట ఎక్కువ కష్టపడతానని చెప్పారు. నాలుగు తరాల తరువాత ఏ వంశ పాలన అయినా ముగుస్తుందని ఢిల్లీ చరిత్ర నిరూపించిందని, కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ వల్లే మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు. మధ్యప్రదేశ్‌కు ‘డబుల్ ఇంజిన్’.. ‘చీడపీడల నివారణకు విషపూరిత మందులు వాడుతాం. అలాగే, దేశంలో అవినీతిని అంతమొందించడానికి నేను నోట్లరద్దు అనే చేదు ఔషధాన్ని ఉపయోగించాను. గతంలో పడక గదులు, కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో నగదు దాచుకున్న వారంతా ఇప్పుడు సంపాదించుకున్న ప్రతి పైసాకు పన్ను కడుతున్నారు. ఆ డబ్బును సామాన్యుడికి అవసరమైన పథకాలకు ఖర్చుచేస్తున్నాం’ అని మోదీ అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే 14 కోట్ల మందికి రుణాలిచ్చినట్లు చెప్పారు. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమని, ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మధ్యప్రదేశ్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్‌లా పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి పట్టింపు లేని ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు వద్దని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పోలిస్తే రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లో రోడ్ల లాంటి మౌలిక వసతులు కూడా కరువయ్యాయని అన్నారు. -
నోట్ల రద్దుతో పెరిగిన పన్నుల చెల్లింపులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించే ధోరణులు పెరిగాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యురాలు షమికా రవి తెలిపారు. ఇన్నాళ్ల తర్వాత డీమోనిటైజేషన్ను తరచి చూస్తే.. దీన్ని మరికాస్త మెరుగ్గా అమలు చేసి ఉండొచ్చని అనిపించినా.. పెద్ద నోట్ల రద్దుతో పన్నులపరంగా ప్రయోజనమే చేకూరిందని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం అప్పట్లో సుమారు రు. 15.41 లక్షల కోట్ల మేర విలువ చేసే పెద్ద నోట్ల చలామణీలో ఉండగా.. ప్రస్తుతం 15.31 లక్షల కోట్ల కరెన్సీ మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరింది. పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో షమికా రవి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూపాయి పతనాన్ని .. దేశ శక్తి, సామర్థ్యాల క్షీణతకు నిదర్శనంగా భావించరాదని ఆమె స్పష్టం చేశారు. -
‘నోట్ల రద్దు నివేదిక’కు బీజేపీ ఎంపీలే అడ్డు!
న్యూఢిల్లీ: నోట్లరద్దుపై పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘంరూపొందించిన నివేదిక బుట్టదాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ చైర్మన్‌గా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సభ్యుడిగా ఉన్న కమిటీలోని మొత్తం 31 సభ్యుల్లో అధికార బీజేపీకి చెందినవారే 17 మంది ఉన్నారు. నివేదికలోని అంశాలను బీజేపీ ఎంపీలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ముసాయిదా నివేదిక మార్చికే సిద్ధమయినా, బీజేపీ సభ్యుల వైఖరి వల్ల దానికి ఆమోదం లభించలేదు. కమిటీలో మెజారిటీ సభ్యులు బీజేపీ ఎంపీలే కావడంతో ముసాయిదా నివేదికకు ఆమోదం లభించడం ఇక కష్టమే అని తెలుస్తోంది. ఈ నెల 31తో కమిటీ ముగుస్తున్న నేపథ్యంలో నివేదిక చిత్తుకాగితానికే పరిమితమవుతుందని భావిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అనాలోచితమని కమిటీ తన నివేదికలో దుయ్యబట్టింది. -
వడ్డీరేట్లు అరశాతం మించి తగ్గవు!
పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీరేటుకు లభించే కాసా డిపాజిట్లు భారీగా పెరగడమే కాకుండా, ఇదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వేగం అందుకున్నాయంటోంది ప్రభుత్వరంగ విజయా బ్యాంక్. దేశీయ బ్యాంకింగ్ రంగం భారీగా పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి అధికంగా నిధుల కేటాయింపులు వంటి సమస్యలతో సతమతవుతున్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.ఏ శంకర్ నారాయణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటనకు వచ్చిన నారాయణ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు... వచ్చే నెలతో పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతోంది. నోట్ల రద్దు వల్ల బ్యాంకులు ఎదుర్కొన్న కష్టాలు ముగిసినట్లేనా. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రారంభంలో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ మొత్తం మీద బ్యాంకులకు మేలే జరిగిందని చెప్పొచ్చు. తక్కువ వడ్డీరేటు ఉండే కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లు భారీగా పెరిగాయి. సగటున ప్రతీ బ్యాంక్ కాసా డిపాజిట్లు 10 శాతం చొప్పున పెరిగాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు విజయా బ్యాంకు మొత్తం డిపాజట్లలో కాసా డిపాజిట్లు 19 శాతంగా ఉంటే నోట్లరద్దు తర్వాత అది 29 శాతానికి చేరింది. అలాగే డిజిటల్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. గతంలో చాలా తక్కువగా ఉండే డిజిటల్ లావాదేవీలు ఇప్పుడు 32 శాతానికి చేరుకున్నాయి. దక్షిణాది ప్రభుత్వరంగ బ్యాంకుల డిజిటల్ లావాదేవీల్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం. డిమోనిటైజేషన్, జీఎస్టీవల్ల ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో రుణాలకు డిమాండ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడిప్పుడే కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇదే సమయంలో రిటైల్ రుణాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. మా బ్యాంక్ విషయానికి వస్తే మొత్తం రుణాల్లో ఈ ఏడాది 15 శాతం వృద్ధికి అవకాశం ఉండగా, రిటైల్ రుణాల్లో మాత్రం 28–30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా హౌసింగ్, రెంటల్, ఎడ్యుకేషన్, ఎంఎస్ఎంఈ రుణ పథకాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇదే సమయంలో డిపాజిట్లలో కూడా 15 శాతం వృద్ధి నమోదు అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం రూ.2.28 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చి నాటికి 2.55 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి నిధుల కేటాయింపులు వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు మూలధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో విజయా బ్యాంక్‌కు ఎంత మూలధనం అవసరం ఉంది? ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి నిరర్ధక ఆస్తులు పెరగడం కొద్దిగా నెమ్మదించడం ఆశావహం. గడిచిన త్రైమాసికంతో పాటు వచ్చే త్రైమాసికాల్లో కూడా మా బ్యాంకు నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. అక్టోబర్ 26న ఫలితాలు ఉండటంతో వివరాలు పూర్తిగా చెప్పలేను. కానీ, ప్రస్తుతం మా బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7 శాతం, నికర నిరర్థక ఆస్తులు 5 శాతం లోపు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నాం. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.5 శాతంగా ఉండటంతో అదనంగా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా? వివిధ రకాల ప్రచారం జరుగుతున్నా... అధికారికంగా ఆ దిశగా ప్రభుత్వంలో కానీ, బ్యాంకుల మధ్య కానీ ఎటువంటి చర్చలు జరగడం లేదు. ఆర్థిక మూలాల పరంగా చూస్తే చిన్న బ్యాంకుల్లో మేము మొదటి స్థానంలో ఉండగా, పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత మూడోస్థానం మాదే. కాబట్టి విలీనాలకు సంబంధించి చర్చలు జరిపే స్థాయిలో ఉన్నాం. ఇప్పటికే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో ఇవి ఇంకా దిగి వచ్చే అవకాశం ఉందా? ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండటంతో వడ్డీరేట్లు మరికాస్త తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే పరపతి సమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయో లేవో చెప్పలేం కానీ.. వచ్చే 12 నెలల కాలంలో మరో అరశాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి ఆర్థిక సాయం చేద్దామనుకుంటున్నారు? రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. ఈ అంశం మీదే మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపాం. రాజధానిలో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం రూ.5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం – సాక్షి, అమరావతి -
నోట్ల రద్దుపై రహమాన్ పాట
-
ఫలితం తేలేది నేడే!
-
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర!
-
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం
గుజరాత్ పారిశ్రామిక సదస్సులో ప్రధాని మోదీ దహేజ్/సూరత్/న్యూఢిల్లీ: గత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని అదుపు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని ప్రతిపక్షాలు అనేక అసత్యాలు ప్రచారం చేయడంతో పాటు పుకార్లు పుట్టించాయని మోదీ ఆరోపించారు. నోట్ల రద్దు అనంతరం దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక జీడీపీ లెక్కలు నిరూపించాయన్నారు. గుజరాత్‌లోని దహేజ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో రూ. 30 వేల కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్‌ను మంగళవారం మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో విపక్షాలు నాపై అన్ని రకాల ఆరోపణలు చేశాయి. అయితే ద్రవ్యోల్బణం గురించి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం గురించి చర్చించకపోవడం చాలా పెద్ద విషయం. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విజయం సాధించిందని దాన్ని బట్టే అర్థమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు గుజరాత్‌లోని భరూచ్ వద్ద నర్మదా నదిపై కేబుల్ ఆధారంగా నిర్మించిన నాలుగు లేన్ల బ్రిడ్జిని ఆయన జాతికి అంకితం చేశారు. 1.3 కి.మి పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోని పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జి కావడం విశేషం. ఆధ్యాత్మికతే భారత్ బలం ఆధ్యాత్మికతే భారత్ బలమని, అయితే దురదృష్టవశాత్తూ కొంతమంది దీన్ని మతానికి ముడిపెడుతున్నారన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా(వైఎస్ఎస్)’ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాభా, జీడీపీ, ఉద్యోగితా రేటు ఆధారంగా భారత్‌ను గుర్తిస్తున్నారని, అయితే ఆధ్యాత్మికపరంగా గుర్తించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. మునులు, సాధువుల ద్వారా భారత ఆధ్యాత్మికత బలపడుతోందని చెప్పారు. ఒక్కసారి యోగాపై ఆసక్తి చూపి శ్రద్ధగా సాధన చేస్తే అది జీవితంలో భాగమైపోతుందని వివరించారు. వైఎస్ఎస్ను స్థాపించిన యోగి పరమహంసను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. -
ఇంకా స్తబ్ధతే!
► కుదుట పడని రియల్ రంగం ► పది శాతం పడిపోయిన పురోగతి ► ఆదాయంలో రూ.కోట్లలో వెనకంజ ► కొత్త జిల్లాల్లో పెరగని దస్తావేజులు ► నోట్ల రద్దు, నగదు పరిమితే కారణం సాక్షి, నిర్మల్ : పెద్ద నోట్ల రద్దు కారణంగా గతేడాది నవంబర్ నుంచి రియల్ రంగం పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే కొత్త నోట్ల రాక, మార్కెట్లో వాటి చలామణి సాధారణ స్థాయికి వస్తున్నప్పటికీ రియల్ రంగంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొనుగోలుదారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్క ఆధారాలు చూపించాల్సి పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు, ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురోగతిలో తిరోగమనం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలలో ఉన్నాయి. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా మొత్తంగా 41,495 దస్తావేజులు కాగా, రూ.65.68 కోట్ల ఆదాయం లభించింది. అదే 2016లో ఆ 12 నెలల కాలంలో 40,861 దస్తావేజులు కాగా, రూ.59.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండేళ్ల పరంగా పురోగతిని చూస్తే 2015 కంటే 2016లో పురోగతి 10 శాతం తిరోగమనంలో ఉండగా ఆదాయం పరంగా రూ.5.69 కోట్ల వెనకంజలో ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పరంగా వార్షిక ఆదాయం ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలై మార్చితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మరో నెల మార్చి మిగిలి ఉండగా వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్ల వెనకంజలో ఉంది. ఈ ఆదాయాన్ని ఈ ఒక్క నెలలో అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. జనవరి నెలలో ఉమ్మడి జిల్లా మొత్తంగా రూ.2.70 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో మరో మూడు కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్న వార్షిక లక్ష్యాన్ని అందుకోవడం నష్టంగానే కనిపిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడినా... కొత్త జిల్లా ఏర్పడక ముందు మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో రియల్ రంగం జోరుగా సాగింది. మంచిర్యాల ప్రాంతంలో ప్రతీ రోజు 60 దస్తావేజులు, నిర్మల్ ప్రాంతంలో 40 దస్తావేజుల వరకు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరుగడం ఖాయంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్‌ప్లాంట్ కింద భూ నిర్వాసితులకు ముంపు కింద భారీగా పరిహారం రావడం అక్కడ గత మూడు, నాలుగేళ్లుగా రియల్ రంగం జోరుగా సాగింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత క్రమంగా ఇక్కడ దస్తావేజుల సంఖ్య తగ్గుతూ రోజుకు 40 వరకు వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఈ సంఖ్య మరింత తగ్గింది. గత సెప్టెంబర్ ముందు నుంచి నిర్మల్ జిల్లా ఏర్పాటు మీద ఉద్యమం సాగగా, అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లాను కూడా ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా క్రయవిక్రయాలు సంఖ్య పెరిగి దస్తావేజులు రోజుకు 40 వరకు జరిగాయి. అయితే ఇక్కడ భూముల రేట్లను రెండు, మూడు ఇంతలు, అంతకంటే ఎక్కువ పెంచడంతో ఆ తరువాత క్రమంలో కొనుగోలులో స్తబ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 15కు పడిపోయింది. ఆదిలాబాద్ నాలుగేళ్లుగా రియల్ పరంగా సబ్ధత నెలకొంది. ఒక్కప్పుడు రోజుకు 40 దస్తావేజులు కాగా ప్రస్తుతం 20 నుంచి 30 వరకు అవుతున్నాయి. ఆసిఫాబాద్‌లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇదిలా ఉంటే మరో ఏడాది వరకు రియల్ రంగంలో పురోగతి ఉండకపోవచ్చునని అధికారులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నోట్ల చెలామణిపై పరిమితుల నేపథ్యంలో మునపటి పరిస్థితిని అందుకోవడం ఆశామాషీకాదని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో దస్తావేజులు, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజుల ఆదాయం (ఏప్రిల్–మార్చి) సంఖ్య రూ.కోట్లలో) 2014–15 30,104 55.71 2015–16 45,870 60.42 2016–17(జనవరి వరకు) 31,527 45.43 -
వంద శాతం సీట్లు బీజేపీకే కట్టబెట్టాలి
యూపీ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి గోండా(యూపీ): ‘‘ఈ ఎన్నికల్లో ఒక్క తప్పునకు కూడా తావు ఇవ్వొద్దు. బీఎస్పీ, ఎస్పీ పార్టీ ఏదైనా ఒక్క సీటు కూడా వారికి దక్కనివ్వొద్దు. వంద శాతం సీట్లను బీజేపీకే కట్టబెట్టాలి’’అని ఉత్తరప్రదేశ్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. శుక్రవారం ఇండో–నేపాల్ సరిహద్దులకు సమీపంలోని గోండా ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో మోదీపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశా, మహారాష్ట్ర, చండీగఢ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదా గుజరాత్‌లోని పంచాయతీ ఎన్నికలైనా గత మూడు నెలల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ మూడో కన్నుతో చూసి బీజేపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు.’ అని అన్నారు. 150 మంది ప్రాణాలు బలి తీసుకున్న కాన్పూర్ రైలు ప్రమాదం ఘటన వెనుక కుట్ర ఉందని, సరిహద్దుల అవతల నుంచి కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లభించాయని మోదీ చెప్పారు. -
అన్ని రంగాల్లో విఫలం
ప్రభుత్వంపై పార్లమెంటులో విపక్షం దాడి ► నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణకు డిమాండ్ ► విపక్షాలతో గొంతు కలిపిన శివసేన న్యూఢిల్లీ: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విపక్షం సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దాడి చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తెలిపే తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చలో నోట్ల రద్దు, సర్జికల్ దాడులు తదితరాలపై కాంగ్రె స్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర విపక్షాలు విరుచుకుపడ్డాయి. నోట్ల రద్దుతో సాధించాలనుకున్న అవినీతి నిర్మూలన వంటి లక్ష్యాలేవీ నెరవేరలేదని, అవినీతిపరులే లాభపడ్డారని పేర్కొన్నాయి. అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన కూడా వీటితో గొంతు కలిపింది. లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే గంటన్నరపాటు ప్రసంగించి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లోకి నెట్టిన నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉన్నా రు. సభకు హాజరైన కాంగ్రెస్ చీఫ్ సోనియా.. ఖర్గే ప్రసంగిస్తున్నపుడు ఆయనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ కనిపించారు. ఈ ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని, నోట్ల రద్దు నిర్ణయంపై దేశం మొత్తం ప్రధాని వెంట ఉందని మంత్రి మహేశ్ శర్మ అన్నారు. రాజ్యసభలో: నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రాజ్యసభలో కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. ప్రణాళికా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. అందుకే మోదీ పీఎం అయ్యారు: ఖర్గే ‘పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారంటే అందుకు కారణం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందువల్లే. రాజ్యాంగాన్ని పరిరక్షించింది మేమే’ అని ఖర్గే పేర్కొన్నారు. తన 60 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అభివృద్ధి అంతా మోదీ హయాంలోనే జరిగిందని బీజేపీ పదేపదే అనడంపై ఆయన స్పందించా రు. ఇందిర ఎమర్జెన్సీని విధిం చారని బీజేపీ సభ్యులు చెప్పగా, సోని యా వెంటనే స్పందిస్తూ.. ‘ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది’ అని అన్నారు. -
నేడే కేంద్ర బడ్జెట్
-
ఎదురు దెబ్బలు తగిలినా భవిష్యత్తు ఆశాజనకమే !
-
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడ్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించనున్నారని, పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో..ఆయా ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో పలు ప్రతిపాదనలుండొచ్చు. అయితే, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. జైట్లీ తాజా పద్దు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. -
నిర్మాణ సంస్థలకు రూ.800 కోట్లు
• రాష్ట్రానికి రూ.40 కోట్ల నష్టం!! • హైదరాబాద్ రియల్టీని నట్టేట ముంచేసిన పెద్ద నోట్ల రద్దు • అమ్మకాల్లో 40 శాతం క్షీణత; ఇంకా 28,088 ఫ్లాట్లు రెడీ ఫర్ సేల్ • జీఎస్టీ, రెరా, బినామీ బిల్లుల అమలుపైనే రియల్టీ ఆశలు 60 లక్షల చ.అ.లకు ఆఫీస్ స్పేస్ దేశంలో 2015లో మొత్తం 4.11 కోట్ల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరగ్గా.. 2016 నాటికిది 4.6 కోట్ల చ.అ.లకు పరిమితమైంది. ప్రత్యేకించి 2016 హెచ్ 2 గణాంకాలను పరిశీలిస్తే.. లావాదేవీలు 2.4 కోట్ల చ.అ., కొత్త ప్రారంభాలు 1.01 కోట్ల చ.అ.లుగా నమోదైంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లావాదేవీలను పరిశీలిస్తే.. 2015లో 46 లక్షల చ.అ. లావాదేవీలు జరగ్గా.. 2016 నాటికిది 60 లక్షల చ.అ.లకు చేరింది. అంటే 31 శాతం వృద్ధి నమోదైందన్నమాట. గూగుల్ 5 లక్షల చ.అ., ఫ్యాక్ట్‌సెట్ 4.30 లక్షల చ.అ., రెడ్బ్రిక్స్ 1.30 లక్షల చ.అ., సింక్రోని 2.20 లక్షల చ.అ. వంటి కంపెనీలు కార్యాలయాల స్థలాలను తీసుకున్న వాటిల్లో ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్ ‘‘హైదరాబాద్ రియల్టీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం లేదు. 95 శాతం మార్కెట్ మధ్య తరగతి గృహ విభాగం కావడమే ఇందుకు కారణం. నోట్ల రద్దు స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొస్తుంది’’ ...దేశంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు అనంతరం ఏ స్థిరాస్తి నిపుణుణ్ని, సంఘాన్ని పలకరించినా ఇదే సమాధానం. అయితే వాస్తవానికి మాత్రం వారివన్నీ ఉత్తి ముచ్చట్లేనని.. పెద్ద నోట్ల రద్దు హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నట్టేట ముంచేసిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. స్థిరాస్తి అమ్మకాల రూపంలో నిర్మాణ సంస్థలకు రావాల్సిన రూ.800 కోట్లు, స్టాంప్ డ్యూటీ రూపేణ రాష్ట్రానికి దక్కాల్సిన రూ.40 కోట్ల ఆదాయానికి గండి పడిందని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ ఎనిమిది నగరాల్లోనూ నెలకొంది. 2016 జూలై–డిసెంబర్ (హెచ్ 2) హైదరాబాద్ రియల్టీ పరిస్థితిపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.. ⇔ గడిచిన నాలుగేళ్లలో హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు, ప్రారంభాల్లో ఏ ఏడాది లేని క్షీణత 2016లో కనిపించింది. 2015 క్యూ4లో 5,057 ఫ్లాట్లు అమ్ముడుపోగా.. 2016 క్యూ4 నాటికి 3,034 ఫ్లాట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంటే అమ్మకాలు 40 శాతం క్షీణించాయి. ఇంకా హైదరాబాద్‌లో విక్రయానికి సిద్ధంగా 28,088 యూనిట్లున్నాయి. ఈ గణాంకాలు చాలవూ.. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు భాగ్యనగరం స్థిరాస్తి రంగాన్ని నట్టేట ముంచేసిందనడానికి!! ⇔ కొత్తగా ప్రారంభమైన ఫ్లాట్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2015 హెచ్ 2లో 5,740 ఫ్లాట్లు ప్రారంభం కాగా.. 2016 హెచ్ 2లో ఇవి 5,900లకు పెరిగాయి. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం మాత్రం అధిక ప్రాధాన్యం గల మార్కెట్‌గా నిలుస్తుంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్యాలయాలకు దగ్గరగా ఉన్న గృహాల అమ్మకాల్లో 60 శాతం వృద్ధి కనిపిస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్ట్‌ల్లోనూ 73 శాతం ఈ ప్రాంతంగానే ప్రారంభమయ్యాయి. ⇔ హెచ్ 2లో నమోదైన మిగిలిన నగరాల గణాంకాలను పరిశీలిస్తే.. అహ్మదాబాద్‌లో కొత్త ఫ్లాట్లు 5,200, అమ్మకాలు 7,400, బెంగళూరులో కొత్తవి 13,395, అమ్మకాలు 20,309, చెన్నైలో కొత్తవి 4,800, అమ్మకాలు 7,737, కోల్‌కతాలో కొత్తవి 9,093, అమ్మకాలు 7,308, ముంబైలో కొత్తవి 9,740, అమ్మకాలు 25,403, ఎన్సీఆర్లో కొత్తవి 9,273, అమ్మకాలు 16,913, పుణెలో కొత్తవి 11,300 కొత్త ఫ్లాట్లు ప్రారంభం కాగా.. 16,800 ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. బడ్జెట్ తర్వాతే మంచి ముహూర్తం అయితే ఏనాడూ లేని విధంగా వచ్చే నెలలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై రియల్టీ నిపుణులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పన్ను రాయితీలు, ప్రోత్సాహాకాల వంటి వాటితో నోట్ల రద్దు దెబ్బ నుంచి ఉపశమనాన్ని అందిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా 2017 మాత్రం స్థిరాస్తి రంగానికి కలిసొస్తుందని అంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), బినామీ లావాదేవీల చట్టం వంటి వాటితో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులొస్తాయని.. పారదర్శకత నెలకొనడం ఖాయమని చెబుతున్నారు. నిబంధనలను అనుగుణంగా నిర్మాణాలు, గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, అప్పగింత, నిర్మాణంలో నాణ్యత, వసతుల కల్పన.. వంటి వాటితో కొనుగోలుదారుల్లోనూ నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు. – నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గులాం జియా -
అభివృద్ధిపై దృష్టి పెట్టండి
► మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ! ►నాయకులకు భద్రత పెంచాలని ఆదేశం ►మావోయిస్టు పార్టీ మార్చిన నగదుపై చర్చ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల డీజీపీలకు సూచించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల నుంచి డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఏటా ఎంఓపీఎఫ్(మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రిమిజమ్)కు సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేవారు. కానీ గతేడాది ప్రణాళిక బడ్జెట్లో నిధుల కోత విధించారు. దీంతో మావోయిస్టు ప్రాబల్య ప్రాంత రాష్ట్రాలు తమకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల ని కేంద్ర హోంశాఖను కోరాయి. ఈ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్లో నాన్ ప్లాన్ (ప్రణాళికేతర)బడ్జెట్ కింద నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం మార్పిడి చేసుకోవాలి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ప్రస్తుతం మావోయిస్టుల పరిస్థితి, ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లపై బుధవారం సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. మల్కన్ గిరిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండడంతో ఆ దిశలో కేంద్ర కమిటీ వ్యూహాలపై అన్ని రాష్ట్రాలు నిఘావర్గాల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని హోంశాఖ సూచించినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి వ్యవహారంపై కూడా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. బీడీ కాంట్రాక్టర్ల ద్వారా మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి చేసిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పర్య టించే రాజకీయ నాయకులకు బందోబస్తు పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. -
వారసుడు
► డీఎంకే పగ్గాలు ‘స్టాలిన్’కు అప్పగింత ► కరుణ హాజరుకాని తొలి సమావేశం ► కరతాళ ధ్వనులతో శ్రేణుల మద్దతు ► అమ్మకు నివాళి ► రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ అధినేత కరుణానిధి రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్ కే డీఎంకే వర్గాలు పట్టం కట్టాయి. పార్టీ నిర్వాహక అధ్యక్షుడిగా తమ దళపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాక్షి, చెన్నై: అనారోగ్యం, వయోభారం కారణంగా తొలిసారిగా కరుణానిధి హాజరు కాలేని పరిస్థితి నెలకొనడంతో బుధవారం నాటి సర్వసభ్య సమావేశం ఉద్వేగ భరితంగా సాగింది. గతాన్ని నెమర వేసుకుం టూ సోదరా...పగ్గాలు చేపట్టరావా అని పార్టీ సం యుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ కన్నీటి పర్యంతంతో స్టాలిన్ ను ఆహ్వానించారు. ఈ క్షణంలో స్టాలిన్ తో పాటు ఆ సమావేశంలోని ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు సుడులు తిరగడంతో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, దయాళు అమ్మాల్ దంపతుల పెద్దకుమారుడు ఎంకే అళగిరి, చిన్నకుమారుడు ఎంకే స్టాలిన్ ల మధ్య వారసత్వ సమరం ఏళ్ల తరబడి సాగుతూ వచ్చిన విష యం తెలిసిందే. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని కరుణానిధి పదేపదే చెప్పకొచ్చినా, పార్టీకి వారసుడెవ్వరన్న విషయంలో మాత్రం చిక్కులు తప్పలేదు. కరుణానిధి ప్రతినిధిగా, పార్టీ కోశాధికారిగా ప్రజల్లో స్టాలిన్ దూసుకెళ్తున్నా, నాయకత్వ పగ్గాలు ఆయన గుప్పెట్లోకి చేరేదెప్పుడోనన్న ఎదురు చూపులు ఏళ్ల తరబడి డీఎంకేలో సాగుతూ వచ్చాయి. అదే సమయంలో కరుణానిధిని తప్ప, మరొకర్ని అధ్యక్షుడిగా తాను అంగీకరించబోనని పదే పదే పెద్ద కుమారుడు, బహిష్కృత నేత ఎం అళగిరి స్పష్టం చేస్తుండడంతో వారసత్వ వ్యవహారం ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ నెలాఖరు నుంచి వయోభారం, అనారోగ్య సమస్యలతో కరుణానిధి గోపాలపురం ఇంటికి, కావేరి ఆసుపత్రికి పరిమితం అవుతుండడంతో పార్టీ నిర్వహణ బాధ్యతలు స్టాలిన్ కు అప్పగించాల్సిన పరిస్థితి. ఇందుకు డీఎంకే వర్గాలు ముక్తకంఠంతో ఆమోదించడంతో నిబంధనల్ని సడలించి మరీ నిర్వాహక అధ్యక్ష పదవికి స్టాలిన్ ను ఎంపిక చేస్తూ, అధ్యక్షుడి వద్ద ఉన్నట్టుగానే అన్ని రకాల అధికారులు అప్పగించడం విశేషం. ఉద్వేగ భరితంగా : అన్నా అరివాలయం వేదికగా ఉదయం పది గంటలకు డీఎంకే సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. కరుణానిధి హాజరు అవుతారని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, ఆయన రాలేని పరిస్థితి నెలకొనడంతో కరుణ హాజరు కాని తొలి సమావేశంగా సర్వ సభ్యం ఉద్వేగ భరితంగా సాగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ నేతృత్వంలో సాగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, సర్వ సభ్య సభ్యులు అందరూ తరలి వచ్చారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా, కార్యక్రమాల విస్తృతం ధ్యేయంగా అన్ని రకాల వ్యవహారాల పర్యవేక్షణకు పార్టీ నిబంధనల్ని సడలిస్తున్నట్టు ఈసందర్భంగా అన్భళగన్ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ నిర్వాహక అధ్యక్ష పగ్గాలను స్టాలిన్ కు అప్పగిస్తున్నామని అన్భళగన్ చేసిన ప్రకటనతో ఒక్క సారి అక్కడ కరతాళ ధ్వనులు మార్మోగాయి. నేతలందరూ లేచి నిలబడి మరీ కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. ఈ సమయంలో అన్భళగన కు పాదాభివందనం చేస్తూ ఆశీస్సుల్ని స్టాలిన్ అందుకున్నారు. సోదరా పగ్గాలు చేపట్టరావా: అన్భళగన్ తీర్మానానికి మద్దతు పలుకుతూ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ సాగించిన ప్రసంగం ఉద్వేగాన్ని నింపింది. 1956లో జరిగిన డీఎంకే మహానాడుకు అధ్యక్షత వహించాలని నెడుంజెలియన్ ను అప్పట్లో అన్నా ఆహ్వానించారని గుర్తు చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో నెడుంజెలియన్ ను ఉద్దేశించి ‘తంబి వా...తలమై తాంగ్గు’( సోదరా(తమ్ముడు) అధ్యక్షత వహించవూ..!) అని అన్నా ఆహ్వానించారని, ఇప్పుడు ఆ భాగ్యం తనకు దక్కిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్వేగానికి లోనవుతూ సోదరా... అధ్యక్ష పగ్గాలు చేపట్టరావా అని ఆహ్వానించారు. దురై మురుగన్ కన్నీటి పర్యంతానికి తోడు స్టాలిన్ సైతం ఉద్వేగానికి లోను కావడం, సభలో ఉన్న వాళ్లందరి కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరగడం గమనార్హం. బరువెక్కిన హృదయంతో : ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ల మార్గ దర్శకంలో ఈ బాధ్యతను స్వీకరించేందుకు నిర్ణయించినట్టు స్టాలిన్ తన ప్రసంగం ద్వారా వ్యాఖ్యానించారు. ఎన్నికల ద్వారా ఎన్నో పదవులకు ఎన్నికయ్యానని, అప్పుడు కల్గిన మధురానందం, ఇప్పుడు తనకు లేదని, బరువెక్కిన హృదయంతో బాధ్యతను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. బాధ్యతగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళి : అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పచ్చ గట్టి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. అయితే, స్టాలిన్ రాజకీయ నాగరికతను చాటే రీతిలో తన పయనాన్ని సాగిస్తున్నారు. 2016లో జరిగిన జయలలిత సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అందరి దృష్టిలో పడ్డారు. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు అపోలోకు వెళ్లి మరీ అన్నాడీఎంకే వర్గాల్ని పరామర్శించారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతి పక్షంగా అండగా ఉంటామని పదేపదే చెప్పకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సర్వ సభ్య సమావేశంలో అమ్మ జయలలిత మృతికి సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయడం విశేషం. అలాగే, తుగ్లక్ సంపాదకుడు చో రామస్వామి, డీఎంకే నేతలు కోశిమణి మృతికి సంతాపం తెలియజేశారు. తీర్మానాలు : రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, అన్నదాతల్ని ఆదుకోవాలని, రైతు రుణాల్ని రద్దు చేయాలని, మృతి చెందిన రైతు కుటుంబాలకు సాయం ప్రకటించాలని, నీట్ రద్దు చేయాలని, కచ్చదీవుల్లోని అంతోనియార్ ఆలయానికి తమిళజాలర్లను అనుమతించాలని సర్వ సభ్య సమావేశంలో తీర్మానాలు చేశారు. అలాగే, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ కేంద్రం తీరును నిరసిస్తూ, కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. కరుణ ఆశీస్సులు : కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన స్టాలిన్ నేరుగా గోపాలపురానికి చేరుకుని కరుణానిధి ఆశీస్సుల్ని అందుకున్నారు. అన్భళగన్, దురై మురుగన్ ఈసందర్భంగా స్టాలిన్ వెంట ఉన్నారు. ఇక, అన్నయ్య స్టాలిన్ కు పగ్గాలు అప్పగించడంపై చెల్లెమ్మ, ఎంపీ కనిమొళి ఆనందం వ్యక్తం చేశారు. స్వయంగా అన్నయ్యను ఇంటికి వెళ్లి మరీ కలిసి సత్కరించారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ లతో పాటు డీఎంకే మిత్ర పక్ష పార్టీల నాయకులు, ఇతర పార్టీల నాయకులు స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. స్టాలిన్ నిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. బాణా సంచాలుపేల్చుతూ, స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. సీఎంతో భేటీ : సాయంత్రం సచివాలయంలో పార్టీ నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సీఎం పన్నీరు సెల్వంతో స్టాలిన్ భేటీ అయ్యారు. జల్లికట్టు, రైతు ఆత్మహత్యలు, రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలన్న అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. -
కేసీఆర్‌ను మెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో!
► గవర్నర్‌ను ప్రశ్నించిన చాడ ► కేసీఆర్ పాలన మేడిపండు చందంగా ఉందని విమర్శ ► ప్రభుత్వ వైఫల్యాలపై మిలిటెంట్ తరహా ఉద్యమాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మేడిపండు చందంగా సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వ పాలన గవర్నర్ నరసింహన్ కు కనిపించడం లేదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. మేడిపండు వంటి ఈ పాలనను విప్పిచూస్తే కాని గవర్నర్‌కు వాస్తవ పరిస్థితులు అర్థం కావన్నారు. గతంలో ఏ సీఎంనూ గవర్నర్ పొగిడిన దాఖలాలు లేవని, అటువంటిది సీఎం కేసీఆర్‌ను మెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో గవర్నర్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ పొగడ్తల వర్షం కురిపించడానికి కేసీఆర్ సాధించిన ఘనకార్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. సోమవారం మగ్దూంభవన్ లో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహ, ఎం.ఆదిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు, విధానాలతో ప్రజలు నలిగిపోతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలు, వివిధ వర్గాల సమస్యలపై మార్చిలో మిలిటెంట్ తరహా ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. 9న పెద్దనోట్ల రద్దుపై నిరసన... పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. డబుల్ ఇళ్ల నిర్మాణంలో వైపల్యం, ప్రభుత్వం ఇచ్చిన ఇతర హామీల అమలులో వైఫల్యంపై మార్చిలో పాదయాత్రల ద్వారా పల్లెపల్లెకు సీపీఐ, జనవరి, ఫిబ్రవరిలో సం స్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
మద్యం కిక్కు
► ఒక్కరోజులోనే రూ.కోటిన్నర విలువజేసే మద్యం తాగేశారు ► కనిపించని పెద్దనోట్ల రద్దు ప్రభావం నాగర్‌కర్నూల్ విద్యావిభాగం : ఒకవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు పోలీసులు నిబంధనలు విధించినా జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులు ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా రూ.కోటిన్నరకు పైగా విలువజేసే మద్యం తాగేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, బార్ షాపుల్లో మద్యం విక్రయిం చారు. బెల్ట్‌షాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరి గాయి. జిల్లావ్యాప్తంగా 45 వైన్ షాపులతోపాటు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కరోజే 2,300 కేసుల లిక్కర్, నాలుగువేల పైచిలుకు బీరు కేసులు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి దాదాపు 52 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు నగదు దొరకక సతమతమవుతుంటే మందుబాబులపై దీని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గతంలో ప్రతినెలా ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో తిమ్మాజీపేటలోని మద్యం డిపో నుంచి రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు అమ్ముడయ్యేది. పెద్దనోట్ల రద్దు అనంతరం నెల రోజులపాటు పరిశీలిస్తే రూ.160 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. దీనికితోడు కొత్త జిల్లాగా ఏర్పడిన నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ ఒకరోజు ముందే మందుబాబులపై ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించడం గమనార్హం. -
భారీ స్థాయిలో బంగారం అక్రమాలు !
-
రద్దయిన నోట్లతో కనకాభిషేకం!
► దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు ► ఢిల్లీలో ఇంతవరకు రూ. 650 కోట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లతో అక్రమార్కులు బంగారు పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని ఈ డబ్బుతో నల్లకుబేరులు భారీగా బంగారాన్ని కొంటున్నారు. బులియన్ వ్యాపారులు పకడ్బందీగా ఈ నోట్లకు కనకపు కడ్డీలను అమ్ముకుని దర్జాగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను(ఐటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన దాడుల్లో కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢిల్లీ ‘నోట్లకు బంగారం’ లావాదేవీలకు అడ్డాగా మారింది. ఇంతవరకు రూ. 650 కోట్లకు పైగా విలువైన ఇలాంటి అమ్మకాలను ఢిల్లీలో గుర్తించారు. తాజా దాడుల్లో.. ఢిల్లీలోని కరోల్ బాగ్, చాందినీ చౌక్ తదితర చోట్ల షాపులు, బులియన్ వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 250 కోట్ల బంగారం అమ్మకాలు బయటపడ్డాయి. రద్దయిన నోట్లకు నలుగురు ట్రేడర్లు బంగారాన్ని అమ్మినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన నోట్లకు బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును డొల్ల(షెల్) ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు.. నోట్ల రద్దు తర్వాత ఢిల్లీలోనే జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల లెక్కల్లో చూపని బంగారం అమ్మకాలు వెలుగు చూశాయి. ఇద్దరు దళారులను, ఇద్దరు బ్యాంకు మేనేజర్లను అరెస్ట్‌చేశారు. కాగా, బెంగళూరులో శుక్రవారం బులియన్ ట్రేడర్లు, నగల వ్యాపారుల షాపుల్లో, ఇళ్లలో జరిపిన దాడుల్లో రూ. 47 కోట్ల లెక్కచెప్పని ఆదాయం బయటపడింది. ఆగ్రాలో ఓ బులియన్ గ్రూపుపై జరిపిన దాడుల్లో.. లెక్కల్లో లేని 12 కోట్ల డబ్బు బయటపడింది. కేరళలో రూ.39 లక్షలు సీజ్ మలప్పురం: కేరళలో రద్దయిన నోట్లకు మార్పిడి చేసిన రూ. 39.98 లక్షల విలువైన 2000 కరెన్సీని జప్తు చేశారు. తిరూర్ వ్యాపారి షాబిర్ బాబు ఇంట్లో ఈ మొత్తం బయటపడింది. దళారిగా వ్యవహరించిన అలీని అరెస్ట్ చేసి, అతనికి షాబిర్ నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన రూ. 3 లక్షల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు మీడియాలో చర్చించొద్దు.. అధికార నిర్ణయాలపై ఐటీ అధికారులు ట్విటర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లలో చర్చించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింది. అధికార నిర్ణయాలతోపాటు, రహస్యంగా జరిపే అధికార భేటీల వివరాలపైనా కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని, ఇకపై దీన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. నేటి నుంచి ‘నగదు రహిత’ అవార్డులు నగద రహిత(డిజిటల్) చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజీ ధన్ వ్యాపార్ యోజన’ అవార్డులు ఆదివారం నుంచి 100 నగరాల్లో ప్రారంభం కానున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది విజేతలకు రూ. 100 క్యాష్ బ్యాక్ ఇస్తారు. మరో పథకం కింద ప్రతివారం గెలిచిన వ్యాపారికి గిఫ్ట్లిస్తారు. 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మేశారు! ప్రత్యేక రాయితీ పథకం కింద సుంకం కట్టకుండా దిగుమతి చేసుకున్న వందల కేజీల బంగారాన్ని ఓ సంస్థ అడ్డదారిలో అమ్మేసి అడ్డంగా దొరికిపోయింది. నోయిడా సెజ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెజర్స్ శ్రీలాల్ కంపెనీ రూ. 140 కోట్ల విలువైన 430 కేజీల బంగారాన్ని అక్రమంగా అమ్మినట్లు రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు గురు, శక్రవారాల్లో జరిపిన దాడుల్లో బయటపడింది. ఈ కంపెనీలో, కంపెనీ అధికారుల ఇళ్లలో దాడులు జరిపి రూ. 2.60 కోట్ల నగదు(రూ. 12 లక్షల కొత్త నోట్లతో కలిపి), 15 కేజీల బంగారు నగలు, 80 కేజీల వెండిని సీజ్ చేశారు. నోట్లను రద్దు చేసిన నవంబర్ 8న ఈ కంపెనీ 24 కేజీల బంగారాన్ని కొని రద్దయిన నోట్లకు అమ్మినట్లు గుర్తించారు. -
కొరియర్ పార్శిళ్లపై డేగ కన్ను
► హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి వెళ్తున్న భారీ ప్యాకింగ్స్ ►పాత నోట్లుగా అనుమానిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు ► రెండు సంస్థల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: రద్దయిన నోట్ల మార్పిడి నగరంలో కష్టసాధ్యం కావడంతో నగదు బయటి ప్రాంతాలకు తరలిపోతోందా..? దీనికి కొన్ని కొరియర్ సంస్థలు పరోక్షంగా సహకరిస్తున్నాయా..? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ నేపథ్యంలో ప్రధానంగా రెండు సంస్థల కార్యకలాపాలపై డేగకన్ను వేసినట్లు తెలిసింది. వీటితో పాటు ఇతర సంస్థల నుంచి ఉత్తరాదికి వెళ్లే పెద్ద ప్యాకింగ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. పెరిగిన నిఘా.. కేసులు... పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలీసులతో పాటు ఐటీ, సీబీఐ తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మార్పిడి ముఠాలు చిక్కడంతో పాటు లెక్కలు లేని నగదు సైతం స్వాధీనమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరంలో ఈ ‘మార్పిడి’ సాధ్యం కాకపోవడంతో నల్ల కుబేరులు ఉత్తరాదికి చెందిన ముఠాలను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ‘రోడ్డు’ ద్వారా తరలించడం కుదరక... నోట్ల రద్దు ప్రకటించిన తొలి రోజుల్లో ఎస్కార్ట్ హుండీ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఈ దందాలో సిటీ నుంచి పాత నోట్లు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు అధికారులు అనుమానించారు. ఈ విధానంలో ఉత్తరాదిలో ఉన్న ఏజెంట్లు వివరాలు కేవలం నగదును పంపే వ్యాపారస్తులకు తెలుస్తుండేవి. వీరు ఓ కారు/ తేలికపాటి వాహనంలో పాత నోట్లును నేర్పుగా పేర్చి, ఈ కారును నమ్మకమైన వ్యక్తికి అప్పగించి ఉత్తరాదిలో చేర్పించారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై దృష్టిపెట్టి దాడులు చేసేలోపే ఈ దందాకు బ్రేక్ పడింది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల సరిహద్దులు, ఇతర రాష్ట్రాల్లోనూ రహదారులపై తనిఖీలు పెరగడంతో ఈ దందాను వదిలేసినట్లు తెలిసింది. ప్రత్యేక నిఘా... నిబంధనల ప్రకారం నగదును కొరియర్ ద్వారా పంపే ఆస్కారం లేదు. అయితే కొన్ని సంస్థల నిర్వాహకుల సహకారంతో నల్లబాబులు ఈ దందా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల రెండో విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇది మరింత జోరందుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలిసింది. ప్రధానంగా రెండు కొరియర్ సంస్థలు ఈ దందాకు సహకరిస్తున్నాయనే అనుమానంతో వాటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏం చేస్తారో అంతు చిక్కట్లేదు..! నగరం నుంచి రోజూ భారీగా కొరియర్ పార్శిల్స్ ద్వారా నగదు ఎక్కడికి వెళ్తోంది? అక్కడ వ్యవస్థీకృత ముఠాల ద్వారా మార్పిడికి పాల్పడుతున్నారా? ఆదాయం చూపే ఆస్కారం ఉన్న బినామీల ద్వారా డిపాజిట్లు చేయిస్తున్నారా? అనే అంశాలపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమానిత లావాదేవీలు, కార్యకలాపాలకు సంబంధించి జాబితా సిద్ధం చేసుకున్న అధికారులు త్వరలో దాడులు చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
పూర్తి నగదు రహితం సాధ్యం కాదు
ఎస్ఎల్బీసీ సమావేశంలో బాబు సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీల అంశంపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాటమార్చారు. పూర్తి స్థాయిలో నగదు రహితం సాధ్యం కాదని ఆయన తాజాగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకే ఇది సాధ్యం కాలేదన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన 197వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘నగదు రహిత లావాదేవీ’లను ప్రోత్సహిం చడం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రజలు పూర్తిగా నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన నోటి నుంచి పూర్తిస్థాయిలో నగదు రహితం సాధ్యం కాదన్న మాటలు వెలువడడం విశేషం. అయితే నగదు రహిత లావాదేవీల అంశంలో ప్రజల సైకాలజీ మారాలని ఆయనీ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలు నగదు లావాదేవీల నుంచి నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన అవసరముందన్నా రు. బయోమెట్రిక్ విధానంతో కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా మొబైల్ నుంచే లావాదేవీలు జరుపుకునే సౌలభ్యాన్ని కనుగొనడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు అంశంపైనా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ప్రతీ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సుదీర్ఘమైన సమస్యను తన రాజకీయ జీవితంలో ఎదుర్కొనలేదని వ్యాఖ్యానించారు. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల క్యూలైన్లలో నించోలేక అనేకమంది మరణించారని, మరికొందరు అనారోగ్యం పాలయ్యారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని అంటూ.. వీటిని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. మాకు నో రూల్స్: బాబు ‘‘రాజకీయంగా మాకు తలనొప్పులు రాకుండా చూడండి. నిబంధనలున్నా మమ్మల్ని దృష్టిలో ఉంచుకోండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు హితబోధ చేశారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏకంగా ముఖ్యమంత్రే నిబంధనలను పాటించవద్దని, అధికార పార్టీ వారి విషయంలో చూసీచూ డనట్లు వ్యవహరించాలని పేర్కొనడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోయింది. నిబం ధనల ప్రకారం వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల తరువాత మేము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల రిఫరీలు, పరిశీలకులుగా వస్తారు. మేము మాత్రం పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి న బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ప్రతి విషయంలోనూ అధికార యంత్రాంగం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ముందు కెళితే రాజకీయంగా మాకు ఇబ్బందులు తప్పవని దృష్టిలో ఉంచుకోవాలి’’ అని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో అధికులు అసంతృప్తితో ఉన్నారని సీఎం చెప్పారు. రాయలసీమ జిల్లాల నుంచి అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ రహదారికి ఏకంగా 26,700 ఎకరాల భూమిని సమీకరించడం సాధ్యం కాదని ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. బాబు మాత్రం సమీకరణే తప్ప భూసేకరణ వద్దని తేల్చిచెప్పారు. 2018లో అమరావతిలో జాతీయ క్రీడలు అమరావతిలో 2018లో జాతీయ క్రీడలను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఇబ్రహీంపట్నం మూలపాడులో 28వ ఆలిండియా అడ్వకేట్స్ క్రికెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. -
నన్ను అవహేళన చేసినా పర్లేదు..
ఆ పది ప్యాకెట్లలో ఏమున్నాయో చెప్పండి ► ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ సవాల్ బహ్రైచ్: ప్రధాని మోదీపై విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కార్పొరేట్ గ్రూపుల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మోదీ స్పందిస్తూ.. రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం స్పందించిన రాహుల్.. తనను మోదీ అవహేళన చేసేలా మాట్లాడినా ఫర్వాలేదని, అయితే వ్యక్తిగత అవినీతికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో గురువారం నిర్వహించిన జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నది తాను మాత్రమే కాదని, దేశంలోని యువత కూడా ఇదే విధంగా భావిస్తోందని, ఉద్యోగాలు కల్పిస్తామని మోసగించినట్టుగా వారంతా భావిస్తున్నారని చెప్పారు. సహారా, బిర్లా గ్రూపుల నుంచి గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు ముడుపులు స్వీకరించారంటూ దీనికి సంబంధించిన పత్రాలను రాహుల్ చూపించారు. 2013–14 మధ్య ఆరు నెలల కాలంలో సహారా గ్రూపు నుంచి తొమ్మిది విడతల కింద మోదీ రూ. 40 కోట్లు తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుకు సంబంధించి ఆశ్చర్యకరంగా మోదీ తీసుకున్న నిర్ణయం పేదల కోసం కాదని, దేశంలోని 50 పెద్ద కంపెనీల కుటుంబాల కోసం అని విమర్శించారు. అవినీతి ఆరోపణలకు జవాబివ్వండి అంతకుముందు రాహుల్ ట్విటర్ వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు. సహారా గ్రూపు నుంచి మీరు స్వీకరించిన పది ప్యాకెట్లలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు ఆదాయపన్ను శాఖకు సమర్పించిన 9 పత్రాలనూ రాహుల్ పోస్ట్ చేశారు. అక్టోబర్ 2013 నుంచి ఫిబ్రవరి 2014 మధ్య మోదీజీకి చెల్లించిన క్యాష్ పేమెంట్ల పేరిట ఈ ప్రతాలు ఉన్నాయి. -
నోట్ల రద్దుపై గ్రామస్థాయిలో ఉద్యమం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్య మించాలని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా సూచించారు. పార్టీ నేతలతో గాంధీ భవన్ లో మంగళవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం రాకపోగా పేదల కష్టాలు, చిల్లర కరెన్సీ కోసం ఇబ్బందులు పెరిగాయని అన్నారు. నోట్ల రద్దు నల్ల కుబేరులకు లాభం చేస్తూ పేదలకు నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సాహిత్యం, పార్టీ సిద్ధాంతం, పార్టీ నాయకుల కార్యక్రమాలను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి కాంగ్రెస్ సందేశ్ పుస్తకాలను మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ గౌడ్, అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
‘అదృశ్య వినియోగదారులు’ ఎవరు?
‘ముసద్దీలాల్’కేసులో సీసీఎస్ దర్యాప్తు ముమ్మరం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన గత నెల 8 రాత్రి రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాన్ని నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల అరెస్టుపై హైకోర్టు స్టే విధించడంతో విచారణకు సహకరించాల్సిందిగా కోరుతూ ప్రశ్నావళి జారీ చేశారు. దీన్ని నిందితులకు పంపిన అధికారులు వారి నుంచి వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 14 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు సంస్థలూ బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ‘అనుమానాస్పదంగా’ భారీ వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించి ఫిర్యాదు చేశారు. రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిన్ గుప్తా, సీరా మల్లేశ్, నరేంద్ర జిగెల్లబోయిన, వినూత బొల్ల నిందితులుగా ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన నవంబర్ 8 అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 3 గంటల వ్యవధిలో ఈ సంస్థలు రూ.100 కోట్ల వ్యాపారం చేసినట్లు రికార్డులు రూపొందించాయి. ఈ వ్యవధిలో ఐదు వేల మందికిపైగా వినియోగదారులు ఒక్కొక్కరూ రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నట్లు బిల్లుల్లో చూపించింది. ఈ సమయంలో అంతమంది వినియోగదారులు రావడమనేది ఒక ఎత్తయితే.. అందరూ ఒకే మొత్తంలో పసిడి ఖరీదు చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారు లు ఈ దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఆ రోజు, ఆ సమయంలో ఈ షాపులకు ఎవరూ వచ్చినట్లు వాటిలో కనిపించలేదు. దీంతో ఆ ‘అదృశ్య వినియోగదారులు’ఎవరనే అంశానికి దర్యాప్తు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డులన్నీ సేకరించాలని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. భారీ మొత్తంతో ముడిపడిన కేసు కావడంతో దీనిపై ఆదాయపన్ను శాఖ, ఈడీ సైతం సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి. -
వెనిజులాలో నోట్ల రద్దు నిర్ణయం వాయిదా
-
పెద్దనోట్లపై చర్చకు భయపడిన కాంగ్రెస్
కేంద్ర కార్మికశాఖమంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నేపథ్యం, పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు భయపడి, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పార్లమెంటులో చర్చను జరగకుండా స్తంభింపజేయడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన కుంభకోణాలు, మలినమైన చరిత్ర, స్కాములు, బ్లాక్‌మనీకి కారణాలు బయటకు వస్తాయనే భయంతోనే సభకు అంతరాయం కలిగించిందని దత్తాత్రేయ ఆరోపించారు. మోదీ తీసుకున్న సాహసోపేతమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయంవల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఆర్బీఐ అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి 19 వేల కోట్లు కరెన్సీ తెచ్చామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర శాసనసభలో చర్చ సంతోషకరమన్నారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు, టీఆర్ఎస్తో బీజేపీ రాజకీయ స్నేహానికి సంబంధం లేదన్నారు. పెద్దనోట్ల రద్దు వద్దు అని ఏ పార్టీ అనలేదనీ, కమ్యూనిస్టులతో సహా అందరూ పెద్దనోట్ల రద్దు ఉద్దేశాన్ని అంగీకరిస్తూనే.. దుష్ప్రచారం చేస్తున్నారనీ ఇది తగదని దత్తాత్రేయ అన్నారు. -
పార్టీలకు కొత్త మినహాయింపుల్లేవు
-
పార్టీలకు కొత్త మినహాయింపుల్లేవు
రద్దయిన నోట్ల డిపాజిట్లపై జైట్లీ స్పష్టీకరణ ► రద్దయిన నోట్లను విరాళంగా స్వీకరించొద్దు ► అలా చేస్తే ఐటీ విచారణ ఎదుర్కొనక తప్పదన్న జైట్లీ ముంబై/న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు పాతనోట్లను డిపాజిట్ చేస్తే ఐటీ విచారణ ఉండదంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఐటీ విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా చట్టాల్లో కొత్తగా మార్పులేమీ చేయలేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. చట్టప్రకారం పార్టీల అకౌంట్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. ‘నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు తమకొచ్చే విరాళాలను రద్దయిన నోట్ల రూపంలో స్వీకరించరాదు. ఒకవేళ ఏ పార్టీ అయినా స్వీకరిస్తే అది నిబంధనలకు విరుద్ధమే’ అని జైట్లీ తెలిపారు.‘రెండున్నరేళ్లుగా మేం అధికారంలో ఉన్నాం. అప్పటినుంచి రాజకీయ పార్టీలకు సంబంధించి న్యాయ, పన్ను విధానాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. 15–20 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానమే కొనసాగుతోంది. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా నల్లదనాన్ని వైట్‌మనీగా మార్చుకునేందుకు తప్పుడు దార్లలో వెళ్లిందని అనుమానం వస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నియమాలు అందుబాటులో ఉన్నాయి’అని జైట్లీ చెప్పారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా కూడా జైట్లీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఐటీ శాఖకు రాజకీయ పార్టీల నిధులపైనా విచారణ జరిపే అధికారం ఉందన్నారు. పార్టీల ఆదాయం, కానుకల విషయంలో ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 13 (ఏ) నియమాలు వర్తిస్తాయని ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదని అధియా వెల్లడించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రద్దయిన మొత్తాన్నీ చెలామణిలోకి తీసుకురాలేమని.. ఇందులో కొంత మొత్తాన్ని మళ్లీ తక్కువ విలువైన కరెన్సీతో ముద్రించి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మిగిలిన ఖాళీని డిజిటల్ కరెన్సీ భర్తీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇన్నాళ్లూ.. నగదు ప్రవాహం ఎక్కువగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో యథేచ్చగా పన్ను ఎగవేతలు జరిగాయని, నల్లధనం, అవినీతి రాజ్యమేలాయన్నారు. ‘నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. అతి త్వరలో కరెన్సీని బ్యాంకింగ్, పోస్టల్ వ్యవస్థ ద్వారా ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంది. దీని వల్ల ప్రజల సమస్యలు తగ్గుతాయి. డిజిటల్ లావాదేవీ విషయంలో గత ఐదు వారాల్లో చాలా మార్పు వచ్చింది. పార్లమెంటులోని ఓ వర్గానికి మాత్రమే ఈ విషయం తెలియలేదు’అని జైట్లీ తెలిపారు. ‘ఈ నిర్ణయం వల్ల ఆర్థిక, సామాజిక రంగాల్లో ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీ ని వల్ల స్వల్పకాలమే కష్టాలుంటాయి’అని ఆర్థిక మంత్రి అన్నారు. దేశంలో 75 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పెద్ద మొత్తం ఈ–వ్యాలెట్లున్నందున డిజిటల్ లావాదేవీలు మరింత ఊపందుకుంటాయనిఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా జీఎస్టీ ఏప్రిల్ 1, 2017 నుంచి, సెప్టెంబర్ 16 మధ్యలో ఎప్పుడైనా జీఎస్టీ అమల్లోకి రావొచ్చని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ 10 కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్న జైట్లీ.. పన్ను నిర్వహణ ఒక్కటే పెండింగ్‌లో ఉన్నందున త్వరలోనే దీనిపైనా ఓ నిర్ణయం తీసుకుని జీఎస్టీని అమల్లోకి తెస్తామన్నారు. ‘ఇది లావాదేవీలపై పన్ను. ఆదాయపు పన్ను కాదు. ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా లావాదేవీలపై పన్నును అమల్లోకి తీసుకురావొచ్చు. కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చేందుకు మరింత పకడ్బందీగా నిర్ణయం తీసుకోనున్నాం’అని జైట్లీ స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కావాలనే జీఎస్టీని ఆలస్యం చేశాయని విమర్శించారు. కాగా, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇంతవరకు రూ.5.5లక్షల కోట్ల విలువైన కొత్తనోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు రూ.6–6.5 లక్షల కోట్లు మార్కెట్లోకి చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. నవంబర్ 8కి ముందు మార్కెట్లో రూ.15.44లక్షల కోట్ల విలువైన రద్దయిన (రూ.500, వెయ్యి) నోట్లున్నాయి. దీంతో పోలిస్తే.. 35.6శాతం కరెన్సీ మార్కెట్లోకి విడుదల చేశామని వెల్లడించింది. -
మోదీ,చంద్రబాబులపై మహిళల మండిపాటు
-
ఆ సిఫార్సులను ఇందిరా గాంధీ తొక్కేశారు!
-
దేశాన్ని నాశనం చేసింది!
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం ► 1971లోనే నోట్ల రద్దు చేసి ఉంటే.. ఇంత నష్టం జరిగేది కాదు ► వారికి దేశం కన్నా పార్టీనే ముఖ్యం ► బీజేపీకి దేశమే తొలి ప్రాథమ్యం ► పార్టీ ఎంపీల భేటీలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై నోరిప్పాలంటూ విపక్షాలు మూకుమ్మడిగా చేసిన డిమాండ్‌కు ప్రధాని మోదీ స్పందించారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు కోరినట్లుగా పార్లమెంటులో కాకుండా, గురువారం బీజేపీ పార్లమెంటరీ భేటీలో ఆయన తన వాదన వినిపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కారణమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లక్ష్యంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కన్నా కాంగ్రెస్‌కు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ధ్వజమెత్తారు. 1971లో ఇందిరాగాంధీ హయాంలోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే.. దేశం ఇంతగా నాశనమయ్యేది కాదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుకు 1971లోనే వాంఛూ కమిటీ సిఫారసు చేసిందని గుర్తు చేస్తూ.. ‘ఆ ప్రతిపాదనతో నాటి ఆర్థిక మంత్రి వైబీ చవాన్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ వద్దకు వెళ్లి.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దానికి స్పందనగా ఇందిరాగాంధీ ‘ఒకే ప్రశ్న అడుగుతాను.. ఇకపై కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయొద్దా?’ అని చవాన్ ను ప్రశ్నించారని మోదీ పేర్కొన్నారు. ‘మీరు చెప్పండి.. కాంగ్రెస్‌కు పార్టీ ముఖ్యమా? దేశమా?.. కాంగ్రెస్‌కు పార్టీ ముఖ్యమైతే.. బీజేపీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం’ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1988లో బినామీ చట్టం చేసిందన్న మోదీ.. ఇంతవరకు దీన్ని నోటిఫై చేయలేదని, చట్టం అమల్లోకి వచ్చేలా విధివిధానాలను రూపొందించలేదని విమర్శించారు. ‘గతంలో ప్రతిపక్షాలు కుంభకోణాలకు వ్యతిరేకంగా సభాకార్యక్రమాలను అడ్డుకునేవి.. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తూ సభను అడ్డుకుంటున్నాయి’ అని ఎద్దేవా చేశారు. జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్ తదితర లెఫ్ట్ దిగ్గజాలు గతంలో నోట్ల రద్దుకు మద్దతివ్వగా.. ఇప్పుడు ఆ పార్టీల నేతలు తమ సిద్ధాంతాలతో రాజీ పడిపోయి.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని ఎత్తి పొడిచారు. తన నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని.. అక్రమార్కులు, అవినీతి పరులకు ఇస్తున్న మద్దతుకు ఉదాహరణగా మోదీ పేర్కొన్నారు. ‘పదేళ్లు అక్రమంగా సంపాదించిన ధనమంతా 11వ ఏడాది వ్యర్థమవుతుందం’టూ చాణక్య నీతిలో పేర్కొన్న అంశాన్ని గుర్తుచేస్తూ.. యూపీఏ పదేళ్ల పాలనలో దోచుకున్న ధనం ఇప్పుడు పనికిరాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీతో సైద్ధాంతికపరమైన విభేదాలున్నా.. నోట్లరద్దుపై బహిరంగంగా మద్దతిచ్చిన బిహార్, ఒడిశా సీఎంలను మోదీ ఈ సందర్భంగా అభినందించారు. మన్మోహన్ స్వరం మారిందెందుకు? నోట్లరద్దు ఘోరతప్పిదమన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపైనా మోదీ విరుచుకుపడ్డారు. ‘1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పన్ను ఎగవేతదారులను కఠినస్వరంతో హెచ్చరించిన మన్మోహన్ ఇప్పుడెందుకు స్వరం మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన తన పార్టీ గురించి బాధపడుతున్నారు. దేశం గురించి కాదు’అని విమర్శించారు. యూపీఏ హయాంలో నల్లధనంపై స్పందనలేకపోవటంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనూ మోదీ గుర్తుచేశారు. ‘డిజిటల్’ప్రచారం చేయండి అవినీతి, నల్లధనంపై పోరులో వెనకడుగు వేయవద్దంటూ పార్టీ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు. డిజిటల్ లావాదేవీలను తమ జీవన విధానంలో భాగంగా చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘క్రిస్మస్ గిఫ్ట్’ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికారులకు అపరిమిత అధికారాలిచ్చారన్న విమర్శలను ఖండించిన మోదీ.. ‘అధికారుల రాజ్యం నడవదు. నవంబర్ 8కి ముందు ప్రజల లావాదేవీలపై పోస్టుమార్టం చేయాల్సిన పనిలేదు. వారిని డిజిటల్ లావాదేవీలవైపు ప్రోత్సహించండి’ అని అన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’ని భ్రష్టుపట్టించారు
• ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుల ఫైర్ • నాటి సీఎం రాజశేఖరరెడ్డి తెచ్చిన అద్భుత పథకమిది • బకాయిల పెండింగ్, అక్రమాలతో నాశనం చేశారని మండిపాటు • మెరుగుపరిచామే తప్ప చెడగొట్టలేదు: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ అమల్లో లోపాలు, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవల కొరతపై కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే ఈ అంశంపై విరుచుకుపడ్డారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ప్రధాన ప్రశ్న అడగ్గా.. తర్వాత జీవన్‌రెడ్డి, డీకే అరుణ, సంపత్‌కుమార్, కోమటిరెడ్డిలు అనుబంధ ప్రశ్నలు సంధిస్తూ, ప్రభుత్వ తీరును ఎండ గట్టారు. మంత్రి లక్ష్మారెడ్డి ‘అంతా బాగుంది’ అనే తరహా చెప్పిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు. పేదల ప్రాణాలతో చెలగాటం కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ అంశంపై ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 137 వ్యాధులను తొలగించారని, స్పెసిఫికేషన్ లేకుండా కొన్ని ఆసుపత్రుల్లో పరికరాలు కొని రూ.20 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదేమని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రులకు ‘ఆరోగ్యశ్రీ’ బకాయిలు చెల్లించకపోవటంతో పేదల చికిత్స లకు ఇబ్బంది వచ్చిందని మండిపడ్డారు. పేద లకు చివరకు పురుగుల సెలైన్ ఎక్కిం చారంటూ గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘట నకు సంబంధించి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, రూ.330 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆందోళనకు దిగి, చికిత్సలు నిలిపివేశాయని చెప్పారు. ఒక్క నిమ్స్కే రూ.100 కోట్లు బకాయిపడటంతో వాటిని ఇప్పించాల్సిందిగా ఆస్పత్రి నిర్వాహకులు ఓ సందర్భంలో తన దృష్టికి తెచ్చారన్నారు. ఆ కర్నూల్‌కు చేరువలో ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి పేద రోగులు అక్కడికి వెళ్లి చికిత్సలు చేయించుకుని, డబ్బులకు ఇబ్బంది పడుతు న్నారని కాంగ్రెస్ మరో సభ్యురాలు డీకే అరుణ చెప్పారు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమా దాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానన్న సీఎం హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదని మరో సభ్యుడు సంపత్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులనే జిల్లా ఆస్పత్రులుగా మార్చారని, మరో సభ్యుడు చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఇక సరిహద్దు జిల్లాల వారు ఏపీలో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఏపీతో మాట్లాడాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య సూచించారు. వైఎస్ తెచ్చిన గొప్ప పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. నిరుపేదలకు ఆరోగ్య ధీమా కలిగించేందుకు ఓ డాక్టర్ అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే... ఇప్పుడు దాన్ని పనికిరాకుండా చేశారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ పథకం సాధ్యం కాలేదు. – కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోర్డు మారిస్తేసరిపోతుందా? కొత్త జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులకే జిల్లా ఆసుపత్రి అని బోర్డు తగిలించారు. బోర్డు మారిస్తే వైద్యసేవలు మెరుగుపడతాయా? సదుపాయాలు, సౌకర్యాలు కల్పించరా? – చిన్నారెడ్డి భ్రష్టు పట్టించారు జేబులో రూపాయి లేకున్నా సరే తెల్లకార్డుంటే చాలు.. ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా నిర్వహించే గొప్ప పథకానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి గొప్పగా అమలు చేశారు. ఇప్పుడు బిల్లుల పెండింగ్, అక్రమాలతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు. చివరకు పురుగులున్న సెలైన్ ఎక్కిస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. – టి.రామ్మోహన్‌రెడ్డి మేమే మెరుగుపరిచాం: లక్ష్మారెడ్డి గత ప్రభుత్వం హయాంలో అమలైన ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నామే తప్ప లోటు చేయలేదని మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ‘‘గతంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో ఓ కార్యకర్తను పరామర్శిం చేందుకు స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి సౌకర్యాలు చూసి మారుమూల ప్రాంత ఆసుపత్రిలో ఇంతమంచి వైద్య సేవలా అంటూ ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వ సమయంలోనే ఆరోగ్యశ్రీ భ్రష్టుపట్టింది. డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్మెంట్ లేకుండా పోతే మా ప్రభుత్వం వచ్చాకే నియామకాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపడటం వల్ల 20 శాతం మేర రోగుల సంఖ్య పెరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పురస్కారం కూడా ప్రదానం చేసింది..’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీకి రూ.1,460 కోట్లు కేటాయించామని, అందులో గత ప్రభుత్వాల తాలూకు రూ.260 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని చెప్పారు. గత అక్టోబర్ 3 నుంచి 14వరకు కొన్ని ఆస్పత్రుల్లో సేవలు నిలిపేసినా.. పేదలకు ఇబ్బంది కాకుండా చూశా మన్నారు. గతంలో కరీంనగర్ లాంటి పెద్ద ఆస్పత్రిలో కూడా ఐసీయూ ఉండేది కాదని, ఇప్పుడు తాము అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలుండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. -
బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నారా?
• ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్బరుద్దీన్ మండిపాటు • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించొద్దని హితవు • రాజకీయ పార్టీల విరాళాలు ఆపేయాలని కేంద్రానికి సూచన సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రాన్ని గుడ్డిగా సమర్థించొద్దని.. రాష్ట్రానికి అపార నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీరు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటున్నాం.. మీకు అండగా ఉంటున్నాం.. మీరేమో బీజేపీకి అండగా నిలబడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై అసెంబ్లీలో చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్లధనం, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తీసుకునే చర్యలను వ్యతిరేకించే వారెవరూ ఉండబోరన్నారు. దేశంలో బీజేపీ ఏది చెబితే అది జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశ ద్రోహం అన్న ధోరణి కొనసాగుతోందని విమర్శిం చారు. కుప్పకూలుతున్న బ్యాంకింగ్ వ్యవస్థను, కొన్ని కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. నల్లధనం రూపు మాపేందుకు చేపట్టిన చర్యగా ప్రభుత్వం చెబుతున్న లక్ష్యం పక్కదారి పట్టిందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఇప్పటికే రూ.17.70 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరిందని, ప్రభుత్వం అంచనాకు మించినంత డబ్బు బ్యాంకుల్లో జమ అవుతుందని, ఇక నల్లధనం మిగిలిందెక్కడ అని ప్రశ్నించారు. చేతనైతే రాజకీయ పార్టీలు వసూలు చేసే విరాళాలను ఆపేయాలని కేంద్రానికి సూచిం చారు. 2005 నుంచి 2015 వరకు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కలసి రూ.5,450 కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు డెమోక్రటిక్ రిఫారŠమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావించిన లెక్కలను ఉటంకించారు. రాజకీయ పార్టీల వసూళ్లు అవినీతి కిందకు రాదా అని ప్రశ్నిం చారు. రాజకీయ పార్టీల వసూళ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అసెంబ్లీకి సూచించారు. తెలంగాణలో 9వేల గ్రామాలు ఏటీఎంలకు దూరంగా ఉన్నాయని, బ్యాంకులు, 4 వేలకు పైగా తపాలా కార్యాలయాలు లేని గ్రామాలు ఉన్నాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు ఎంతవరకు సురక్షితమో సమీక్షించు కోవాల్సిన అవసరముందని, సైబర్ నేరాల నియం త్రణకు ఒక చట్టం కూడా ఇప్పటివరకు లేదని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో హైదరాబాద్ తీవ్రంగా నష్టపోయిందని, నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా చేసేందుకు 4 వేలకు పైగా స్వైపింగ్ మెషీన్లు, 22 వేల మంది బ్యాంకు ఉద్యోగులు కావా లని ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఓ ఇంటర్వూ్యలో పేర్కొన్నారని, ఆ లెక్కన రాష్ట్రమంతటా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం సాధ్యమవు తుందా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. -
పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన ఆర్టీసీ ఆదాయం
► ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ► రీజియన్ కు 150 కొత్త బస్సులు ► ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఆదాం సాహెబ్ చీరాల అర్బన్ : పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీకి ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని, ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నట్లు ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఆదాం సాహెబ్ అన్నారు. సాధారణ పరిశీలనలో భాగంగా గురువారం చీరాల వచ్చిన ఆయన ముందుగా ఆర్టీసీ డిపో గ్యారేజీని పరిశీలించి అక్కడి వారితో మాట్లాడారు. అనంతరం బస్టాండ్‌లోని డిపో మేనేజర్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. డిపోలోని సర్వీసుల వివరాలు, ఆదాయాలపై రికార్డులను తనిఖీ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 10 శాతం మేర తగ్గిందని, చిల్లర సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామని చెప్పారు. ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోయే రూట్లలో పోలీస్, రవాణాశాఖ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆరుగురు ఎస్ఐలను ఆర్టీసీకి కేటాయించారన్నారు. వీరి సహకారంతో ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. అలానే జిల్లాకు 150 కొత్త బస్సులు వచ్చాయని, వీటిలో 110 సూపర్‌లగ్జరీలు, డీలక్స్‌లు 20, ఎక్స్‌ప్రెస్‌లు 20 బస్సులు వచ్చాయన్నారు. వీటిలో చీరాలకు ఎనిమిది సూపర్‌లగ్జరీ బస్సులు కేటాయించామన్నారు. వీటిని షాపూర్, హైదరాబాద్ సర్వీసులకు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు చిల్లర కష్టాలు తగ్గించేందుకు ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముందుగా రిజర్వేషన్ కౌంటర్లలో ఏర్పాటు చేశామని, తర్వాత గ్రౌండ్ బుకింగ్ కౌంటర్లు, కార్గోలలో, దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులలో స్వైపింగ్ మెషిన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రెండేâýæ్ల కాలంలో ఆర్టీసీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ఆర్టీసీ బస్టాండ్ల నవీకరణ, కొత్త బస్సులు వంటివి వచ్చాయన్నారు. సిబ్బంది కూడా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రయాణికులు లేకుంటే ఆర్టీసీనే ఉండదని, సంస్థ అభివృద్ధికి అందరూ పాటుపడాలన్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ డి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ జి.శ్యామల, ఎస్టీఐ రవివర్మ, తదితరులు ఉన్నారు. -
నేటితో ముగియనున్న శీతాకాల సమావేశాలు
-
ఇంకొక్క రోజే..!
► నేటితో ముగియనున్న శీతాకాల పార్లమెంటు ► కొనసాగుతున్న ప్రతిష్టంభన న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి. గురువారం కూడా నోట్లరద్దు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతోపాటు ఇతర అంశాలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదంతో పార్లమెంటు వాయిదా పడింది. రైతు రుణాల మాఫీకి డిమాండ్ రాజ్యసభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్షాలు, అధికార పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు నోట్లరద్దుతోపాటు వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన రైతులకు రుణాల మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అటు అధికార పక్షం సభ్యులు కూడా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో పలువురు యూపీఏ నేతలకూ సంబంధాలున్నాయంటూ ప్రచురితమైన పత్రికల కాపీలను చూపించారు. అధికార పక్షమే సభ సజావుగా నడవకుండా అడ్డుకుంటోందని గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను రోడ్లపై పారేసుకుంటున్నారు. అందుకే వారికిచ్చిన రుణాలను వెంటనే రద్దుచేయాలి’అని డిమాండ్ చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ఎంపీలు నినాదాలు చేస్తుండటంపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కురియన్ రాజ్యసభను వాయిదా వేశారు. ఏ నిబంధనైనా ఓకే: విపక్షాలు నోట్లరద్దుపై ఏ నిబంధన కిందైనా చర్చకు సిద్ధమేనని విపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. అయితే.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగటంతో అధికార, విపక్షాలు పోటాపోటీగా ఆరోపణలకు దిగాయి. నోట్లరద్దుపై చర్చకు టీఆర్ఎస్ ప్రయత్నించటం, తృణమూల్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో తీవ్ర గందరగోళం మధ్యే సభ శుక్రవారానికి వాయిదా పడింది. -
అద్భుతంగా రాజన్న ఆలయం
► ఐదేళ్లలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కేటీఆర్ ► సిరిసిల్ల, వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సిరిసిల్ల: దేశంలోనే అరుదైన శైవ క్షేత్రంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవ స్థానాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి çపరిచేందుకు బ్లూప్రింట్ రూపొం దించి చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో పురోగతి కనిపిస్తోందని, రాబోయే నాలుగై దేళ్లలో పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. సోమవారం వేములవాడ రాజన్న ఆల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. ‘‘రూ.400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనుల కోసం ఏటా రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేసింది. నాంపల్లి గుట్టను కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గుడి చెరువు కింది 35 ఎకరాల స్థలాన్ని సేకరించి, పనులు ప్రారం భించడానికి మరో 9 నెలల సమయం పడు తుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అ మలు పరుస్తాం. గతంలో వేములవాడ గుడికి వస్తే పదవులు పోతాయని దుష్ప్రచారం చేశారు. సీఎం గుడికి వచ్చి ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేశారు’’అని పేర్కొన్నారు. దర్శనానికి మరోసారి వస్తా.. వేములవాడ రాజన్న దర్శనానికి మరోసారి వస్తానని కేటీఆర్ చెప్పారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నా రని, తాను దర్శనానికి వెళ్తే కనీసం గంట పాటు క్యూలైన్ నిలిపివేయాల్సి వస్తుంద న్నారు. భక్తులను ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను తప్ప రాజన్నను దర్శించుకొంటే పదవులు పోతాయనే భయంతో కాదంటూ చమత్కరించారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ నిధులు రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రెండు మూడ్రోజుల్లో జీరో వడ్డీకి సంబంధించిన నిధులను బ్యాంకుల్లో జమ చేస్తామని కేటీఆర్ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేములవాడ మున్సి పల్, దేవాలయ అభివృద్ధిపై అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. రాజన్న భక్తులకు ఆన్ లైన్ సేవలు వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో ఆన్లైన్ సేవలను మంత్రి కె.తారకరామారావు సోమవారం ప్రారంభించారు. తద్వారా భక్తులకు గదుల సమాచారంతోపాటు ఇతరత్రా సేవలు ఆన్లైన్లోనే అందు బాటులో ఉండే వెసులు బాటు కలిగినట్లయింది. -
రైతులకు రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: రైతుల కోసం రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో అవస్థల్లో ఉన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎంతో ఉపకరిస్తుందన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారంలోగా సబ్సిడీ నిధులు రైతులఖాతాల్లో జమ అవు తాయన్నారు. బ్యాం కర్లు సబ్సిడీ డబ్బులను రైతులకు అందజేయా లని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశారని, యాసంగి పంట సాగు కోసం ఇవి ఉపయోగపడతాయన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవ సాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై పరోక్షంగా పెట్టుబడి పెట్టామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏడా దికి రూ. 25 వేల కోట్లు విడుదల చేస్తున్నా మని తెలిపారు. ప్రతి నెల రెండు వేల కోట్ల పనులు ప్రాజెక్టులకు వెచ్చిస్తు న్నామన్నారు. 2018 జూన్ నాటికి కాళేశ్వరం నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు అందుతా యని, రెండు పంటలకు నీరందుతుందన్నారు. యాసంగికి 12.50 లక్షల మెట్రిక్ టన్నుల వరివిత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
నోట్ల రద్దుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
త్యాగాలు ప్రజలకేనా ?
-
మోదీ నివాసంలో రహస్యంగా!
-
మోదీ నివాసంలో రహస్యంగా!
నోట్ల రద్దుపై ఆరుగురు సభ్యుల బృందం కసరత్తు ► కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అధియా నేతృత్వంలో.. ► కీర్తిప్రతిష్టలు, ప్రజాదరణను పణంగా పెట్టి నిర్ణయం తీసుకున్న మోదీ ► నోట్ల రద్దు వికటిస్తే నేను బాధ్యత తీసుకుంటా: కేబినెట్‌తో ప్రధాని న్యూఢిల్లీ: నెల రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నోట్ల రద్దుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవటం, నవంబర్ 8న ప్రకటించటం వెనక చాలా పెద్ద అధ్యయనమే జరిగింది. మోదీ ఆదేశాలతో ఆరుగురు సభ్యుల బృందమొకటి అహోరాత్రులు శ్రమించింది. పీఎంవో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భేటీ అయితే అనుమానాలొస్తాయని.. ఏకంగా ప్రధాని నివాసంలోని (7 లోక్‌కళ్యాణ్ మార్గ్) రెండు గదుల్లో సెటిలై అధ్యయనం చేసింది. మోదీకి విశ్వాసపాత్రుడైన ఐఏఎస్ అధికారి హస్ముఖ్ అధియా ఈ టీమ్‌కు నాయకత్వం వహించారు. మిగిలిన సభ్యులంతా డేటా, ఆర్థిక విశ్లేషణలో నిపుణులైన యువకులే. (కొందరు మోదీ సోషల్ మీడియా అకౌంట్లను, యాప్‌లను నిర్వహిస్తున్నారు). ఈ టీమ్ సారథి అధియా, ప్రధానికి నమ్మినబంటుగా పనిచేసిన అధికారి. బయటి ప్రపంచంలోనే చాలా తక్కువ మందికే ఈయనతో పరిచయం ఉంది. నల్లధనంపై ఎన్నికల్లో చేసిన వాగ్దానాలపై పనిచేసిన ఈ బృందం.. భారత ఆర్థిక వ్యవస్థకు సమస్యగా మారిన నల్లధనం, అవినీతిని పారద్రోలేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలను పరిశీలించాక.. చివరికి ఈ నిర్ణయానికొచ్చింది. ప్రతి అడుగూ రహస్యమే.. రూ. 500, వెయ్యి నోట్ల రద్దు విషయం తెలిస్తే.. ఎవరెవరు ముందుగా జాగ్రత్తపడతారో, డబ్బును బంగారం, ఇతర ఆస్తుల రూపంలోకి మార్చుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటారో ముందుగానే గుర్తించి.. వారికి అసలెంతమాత్రం సమాచారం తెలియకుండా అత్యంత రహస్యంగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. అంతా అనుకున్నట్లుగా జరిగాకే.. దీనిపై ప్రకటనకు మోదీ సిద్ధమయ్యారు. విధి విధానాల వెల్లడి, పథకం అమలుతోపాటు.. ప్రకటన తర్వాత తలెత్తే ఏ ఇబ్బందినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు మోదీ సిద్ధమయ్యారు. తన ప్రజాదరణ, కీర్తిప్రతిష్టలను పణంగా పెట్టి ఈ నిర్ణయం తీసుకున్న మోదీ.. ఏమాత్రం తలకిందులైనా తనే బాధ్యతగా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ‘నోట్లరద్దుపై పరిశోధనలన్నీ చేశాను. అంతా మంచే జరుగుతుంది. ఈ పథకం విఫలమైతే.. దానికి నేను బాధ్యత తీసుకుంటాను’ అని నవంబర్ 8 ప్రకటనకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని తెలిపారు. ఈ సంగతిని కొందరు మంత్రులు రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2003–2006 మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అధియా తన పనితీరుతో మోదీని ఆకట్టుకున్నారు. విశ్వసనీయంగా, సమర్థవంతంగా పనిచేయటంతోపాటు నరేంద్రుడికి యోగాను పరిచయం చేశారు. ఈ బృందాన్ని ఇంటర్వూ్య చేసిన రాయిటర్స్ రిపోర్టర్స్ వెల్లడించిన ప్రకారం.. అధియాచతురత కలిగిన నిష్కపటమైన వ్యక్తి. 2015 సెప్టెంబర్‌లో అధియా కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రిపోర్టు చేయాలి కానీ.. ప్రధానితో నేరుగా సంబంధాలుండడం గమనార్హం. లోతైన విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు మోదీ, అధియా గుజరాతీలో మాట్లాడుకుంటారు. ముందుగా అనుకున్నదే కానీ.. నోట్ల రద్దు వ్యవహారం మోదీ సడన్ గా తీసుకున్నదేం కాదు. మొన్నటి ఏప్రిల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్లేషకులు ‘పెద్దనోట్ల రద్దు’ సాధ్యమేనని తెలిపారు. మేలో రిజర్వ్ బ్యాంకూ కొత్త సిరీస్ నోట్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. రూ. 2 వేల నోటు డిజైన్ కూడా పూర్తయిందని.. ఆగస్టులో ప్రకటించింది. నోట్ల ముద్రణ కేంద్రాలు పనిచేయటం ప్రారంభించకముందే అక్టోబర్ చివర్లో మీడియాలో కొత్తనోట్ల వార్తలొచ్చాయి. దీంతో మోదీ అండ్ టీమ్ అప్రమత్తమైంది. ‘ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నవంబర్ 18న ఈ ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం లీకయ్యే ప్రమాదం ఉండటంతో ముందుగానే ప్రకటించాల్సి వచ్చింది’ అని ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. ప్రతీదీ పక్కాగా.. మోదీ నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించగానే.. అధియా ఓ ట్వీట్ చేశారు. ‘నల్లధనాన్ని నిర్మూలించటంలో ప్రభుత్వం తీసుకున్న పెద్ద, ధైర్యమైన నిర్ణయం’ అన్నారు. నల్లధనం నిర్మూలిస్తామంటూ ఎన్నికల్లో ప్రకటించిన మోదీ.. అధికారంలోకి వచ్చినçప్పట్నుంచీ అదే పనిలో ఉన్నారని ఆయన సన్నిహితులంటారు. చాలాసార్లు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక నిపుణులతో మోదీ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ‘భారత్ కొత్త నోట్లను ఎంత త్వరగా ముద్రించగలదు? వాటినెలా పంపిణీ చేయాలి? ప్రభుత్వ బ్యాంకులకు డిపాజిట్లు పెరగటం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది?, నోట్లరద్దువల్ల ఎవరు లాభపడతారు?’ అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే వారన్నారు. వీటి ద్వారా నోట్ల మార్పిడిపై∙కొంత సమాచారం మోదీకి వచ్చింది. ‘తప్పుచేసిన వారెవరూ పారిపోకుండా ఉండాలనుకున్నాం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తే.. చేసిందంతా అర్థరహితమే అని అనుకున్నాం’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న అధికారి తెలిపారు. ప్రజలకు సమస్యల్లేకుండా.. కొత్త నోట్లతో 2లక్షల ఏటీఎంలను నింపేందుకు అవసరమైన 8 లక్షల కోట్ల రూపాయలను ఏటీఎంలలో నింపి ఆర్థిక వ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావటం అంత సులభమేం కాదు. దేశంలోని నాలుగు నోట్ల ముద్రణ కేంద్రాలు అహోరాత్రులు శ్రమించి కొత్త 500, 2వేల రూపాయల నోట్లను ముద్రిస్తే.. అవి మార్కెట్లోకి వచ్చి ప్రజలకు అందేందుకు కనీసం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మోదీకి తెలుసు. అందుకే డిజిటల్ పేమెంట్స్‌పై దృష్టి సారించారు. రహస్యంగా పనిచేయటమే ఈ ఆపరేషన్ కు చాలా కీలకం. -
ఇది నల్లధన నిర్మూలన యజ్ఞం: మోదీ
-
పాక్ దెబ్బ షారుఖ్‌కి పడదు..!
వచ్చే నెల వస్తున్న ‘రయీస్’ సినిమా విషయంలో షారుఖ్‌కి పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. దేశమంతా పెద్దనోట్ల రద్దు, చిల్లర కష్టాల్లో మునగడం ఒక కారణం అయితే, ఇండియా కూడా పాక్‌కు దీటైన చెబుతూ ఉండటం మరో కారణం. ఇంతకీ సంగతేమి టంటే ‘రయీస్’లో పాకిస్తాన్ హీరో యిన్ మాహిరా ఖాన్ నటించింది. ‘పాక్ వాళ్లు ఎవరైనా మన సినిమాల్లో నటిస్తే ఆ సినిమాలను నిషేధించండి’ అని గతంలో రాజ్ థాక్రే నుంచి హెచ్చరిక వచ్చింది. దాని నుంచి బయటపడటానికి పాక్ వాళ్లు నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే పాక్ హీరో అలీ జాఫర్ నటించిన ‘డియర్ జిందగీ’కి ఈ సమస్యలు తగ్గాయి. దానికి కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులే. కనుక ఇప్పుడు ‘రయీస్’కి కూడా ఏ అడ్డంకులూ ఉండవని భావిస్తున్నారు. 1980లలో గుజరాత్లో మద్యం మాఫియాను నడిపిన ‘రయీస్ ఆలమ్’ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ పాత్రను షారుఖ్ ధరించగా ఇతని ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ ఏసిపి మజ్ముదర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. -
నోట్ల రద్దుతో నెల రోజుల్లో ఏం జరిగింది ?
-
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ తీర్మానం
కోల్‌కతా: పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధన 169 కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ బుధవారం వరకు ముగిసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీపీఎం, కాంగ్రెస్ ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలన్న అధికార పార్టీ డిమాండ్‌ను అవి వ్యతిరేకించాయి. ‘నల్లధనానికి మేం వ్యతిరేకమే. నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రణాళిక లేకుండా తీసుకున్నారు. దీంతో నగదు సరఫరా ఆగిపోయింది. దేశంలో మాంద్యం లాంటి వాతావరణం నెలకొంది. మోదీ నాయకత్వం వల్ల ఎప్పుడూ చూడని పరిస్థితులు తలెత్తాయి’ అని ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అన్నారు. -
డబ్బుల్లేకున్నా.. టోకెన్ ఉంటే చాలు..
హైదరాబాద్: కాయగూరలు కొనాలా? చిల్లర ఉండాలి.. చేతిలో నగదు ఉండాలి అని ఇక చూసుకోవాల్సిన పనిలేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. రైతు బజార్లలో ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో కలసి సంయుక్తంగా ‘టీ-సేవ’కు శ్రీకారం చుట్టింది. ఫలక్‌నుమా రైతుబజార్లో ఈ నెల 5న దీన్ని ప్రారంభించారు. అంతా టోకెన్ల సిస్టమ్.. మొదటగా రైతుబజార్‌కు వచ్చే వినియోగదారులు టీ-సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలపాలి. ఆ తర్వాత టీ-సేవ ప్రతినిధి వెంటనే సదరు వినియోగదారుని అకౌంట్లో నగదు మొత్తాన్ని పరిశీలిస్తారు. అనంతరం కూరగాయలు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు కావాలో అడుగుతాడు. వినియోగదారుడు తెలిపిన నగదుకు అనుగుణంగా రూ.5, 10, 20లకు సంబంధించిన టోకెన్లను అందిస్తారు. ఉదాహరణకు రూ.200ల కూరగాయలు కావాలని కోరిన వినియోగదారుడికి రూ.20లు విలువజేసే 10 టోకెన్లను అందజేస్తారు. ఒకవేళ రూ. 200కు కంటే అనగా రూ.20-30 తక్కువగా కూరగాయలు తీసుకుంటే మిగిలిన డబ్బులను ఖాతాలోకి వెనక్కి పంపడమో లేదా నగదు రూపంలో చిల్లర ఇవ్వడమో చేస్తారు. కాగా ఈ టోకెన్లను స్వీకరించిన రైతులకు సంబంధిత నగదును అకౌంట్లకు బదిలీ చేస్తారు. లేదా నగదు అందజేస్తారు. డెబిట్ కార్డు ఉన్న వారికి నేరుగా టోకెన్లను ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తారు. -
నోట్ల రద్దుపై రాద్ధాంతమెందుకు?
అంబేడ్కర్ స్ఫూర్తితో మోదీ సాగుతున్నారు: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగా ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. నల్లధనాన్ని వెలికితీ స్తున్న మోదీని ప్రతిపక్షాలు తప్పుబట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతి 20 ఏళ్లకోసారి కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారానే దేశంలో సమానత్వం వస్తుందని అంబేడ్కర్ సూచించారని, ఆయన ఆశ యాలు, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని 2014 నుంచి మోదీ అనేక చర్యలను చేపట్టారన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నల్లధనం వెలికితీయడం ద్వారా వచ్చే మొత్తంలో 25 శాతం నిధులను గరీబ్ కల్యాణ్ యోజన పేరిట పేదలు, రైతులకు ఖర్చు చేస్తామని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో నగదు రహిత సమాజం నిర్మాణానికి పాటుపడడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రం ఇళ్లులేని నిరుపేదల కోసం రాష్ట్రానికి 90 వేల ఇళ్లు కేటారుుస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి మా త్రం పేదలపై మనసు రావడం లేదని విమర్శించారు. ఇళ్లు లేని పేదలను గుర్తించడం లేదని, రెండు పడక గదుల ఇళ్ల కోసం కేంద్రం పరిధిలోని హడ్కో ద్వారా రూ.3,300 కోట్ల రుణాన్ని ఇచ్చినా, ఆ ఇళ్లను నిర్మించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించకుండా ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ చేపట్టే ఉద్య మాల్లో పేదలు, మహిళలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, శేరి నరసింగరావు, జాజుల గౌరి, బంగారు కృతి, నానావత్ భిక్కునాథ్నాయక్, గుంగగోని భరత్‌గౌడ్, వడ్డేటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు సమస్య 50 రోజుల తర్వాతే
► నోట్ల రద్దుపై అభిషేక్ సింఘ్వీ హెచ్చరిక ►సహనం నశిస్తే సామాజిక సంక్షోభం తప్పదు ►మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దువల్ల అసలు సమస్య 50 రోజుల తర్వాత వస్తుందని ఏఐీసీసీ అధికారప్రతినిధి అభిషేక్ సింఘ్వీ హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘నోట్ల మార్పిడి కోసం 50 రోజులు ఓపిక పడితే మంచిరోజులు వస్తాయని ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారు. ప్రజలు ఇంకా ఓపిక పడుతున్నారు. సహనం నశిస్తే సామా జిక సంక్షోభం తలెత్తక తప్పదు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం రోజుకోరకంగా వ్యవహరిస్తూ, గంటకో నిర్ణయం తీసుకుంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. బాత్రూమ్కు పోరుు వచ్చేలోగా నిర్ణయాలేమైనా మారా యా.. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా.. అని జోక్‌లు వేసుకునే పరిస్థితిని కేంద్రం తెచ్చింది. ఇలాంటి నిర్ణయాలతో ప్రధాని మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు’అన్నారు. చర్చించడానికి మోదీకి భయమెందుకు? ‘నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం జరుగుతోంది. జాతీయ ఉత్పత్తి దారుణంగా పడిపోతోంది. కేవలం 2శాతమే ఉన్న వ్యవ స్థతో 100 శాతం నగదు రహిత లావాదేవీలు ఎలాసాధ్యం? క్యాష్‌లెస్ విధానంతో అసంఘ టిత రంగ కార్మికుల పరిస్థితి ఏమిటి? దీనిపై పార్లమెంటులో చర్చించడానికి మోదీ ఎందు కు భయపడుతున్నారు? సమగ్రంగా చర్చించ డానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ, సుప్రీం కోర్టు జడ్జితో కమిటీ వేయడానికి ఎందుకు జంకుతున్నారు? సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా పంతాలకు పోతూ, మోదీ మొండిగా, అప్రజాస్వామికంగా వ్యవహరి స్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడు తున్న వారిపై కేంద్రం క్రూరంగా వ్యవహరి స్తోంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా... మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకంగా ఓటేస్తాయన్న భయంతో ఓటింగు పెట్టడానికి మోదీ భయ పడుతున్నారు. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలి. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిపై పోరాడుతాం. నోట్ల రద్దు విషయం బీజేపీ నేతలకు ముందుగానే తెలుసు. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ నేతల లావాదేవీలపై విచారణ జరిపించాలి’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పఠాన్‌కోట్, బురాన్ ఉదంతాలన్నీ ఇప్పుడే జరిగాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరెన్సీ చెస్టుల నుంచి పంట రుణాలు
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం కలిగించే చర్యలను ఆర్బీఐ చేపట్టింది. కరెన్సీ చెస్టులు నిర్వహిస్తున్న బ్యాంకులు రబీ సాగుకు సరిపడా నగదును అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇందుకోసం బ్యాంకర్ల కమిటీ జిల్లా స్థారుు సమన్వయకర్తలతో కలిసి పనిచేయాలని కోరింది. ‘చెస్టుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, డీసీసీబీలకు నగదు కేటారుుంచడానికి బ్యాంకులు జిల్లా స్థారుు సమన్వయకర్తల సేవలు వినియోగించుకోవాలి’ అని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ చివరలో ముగిసే ఈ సీజన్లో సుమారు రూ.35 వేల కోట్ల పంట రుణాలు అవసరమవుతాయని ఓ అంచనా. -
2.5 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి రాకపోవచ్చు: ఎస్బీఐ
ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో రూ.2.5 లక్షల కోట్ల విలువ గల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవచ్చని ఎస్బీఐ అంచనా వేస్తోంది. గత నెల 8న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటి విలువ రూ.15.44 లక్షల కోట్లుగా అంచనా. గత నెల 27 వరకూ 8.27 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయని, మొత్తం మీద రూ.13 లక్షల కోట్లు వస్తాయని ఎస్బీఐ అంచనా వేస్తోంది. 2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవచ్చని పేర్కొంది. ఎస్బీఐ ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2016 మార్చి నాటికి పెద్ద కరెన్సీ నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు. వీటిని రద్దు చేసిన మరుసటి రోజున పెద్ద కరెన్సీ నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. మార్చితో పోల్చితే ఈ విలువ రూ.1.26 లక్షల కోట్లు అధికం. నవంబర్ 10-27 మధ్య రూ.8.44 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్/మార్పిడి అయ్యారుు. మొత్తం మీద రూ.13 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి వస్తారుు. -
ప్రధాని వచ్చినా పార్లమెంటు స్తంభనే!
► మోదీ క్షమాపణకు విపక్షాల పట్టు ► ఉభయ సభల్లో ఆందోళన న్యూఢిల్లీ: పార్లమెంటులో నోట్లరద్దుపై వరుసగా 11వ రోజూ గందరగోళం కొనసాగింది. ప్రధాని మోదీ రాజ్యసభకు హాజరైనా.. విపక్షాలు చర్చకు అంగీకరించలేదు. నోట్లరద్దు నేపథ్యంలో విపక్షాలపై చేసిన విమర్శలకు మోదీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో సభలో గందరగోళం నెలకొంది. అటు లోక్‌సభలోనూ అదే పరిస్థితి. దీంతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి. కాగా, సభ వాయిదా పడినప్పటికీ 15 నిమిషాల సేపు మోదీ సభలోనే కూర్చున్నారు. మారని విపక్షాల తీరు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. గురువారం మోదీ రాజ్యసభకు హాజరైనా ఆందోళన విరమించలేదు. పలుమార్లు నోట్లరద్దుపై చర్చ మొదలుపెట్టాలని చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పినా విపక్షాలు తగ్గలేదు. ‘విపక్షాలు నల్లధనానికి మద్దతుగా ఉన్నాయని మోదీ అంటున్నారు. ఇది దారుణం. ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభ వారుుదా పడింది. మధ్యాహ్నం కూడా ప్రధాని సభకొచ్చారు. మోదీ క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేయగా, 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించి చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఐటీ బిల్లుపై చొరవ తీసుకోండి: కేంద్రం ఆదాయపు పన్ను బిల్లుకు సవరణకు తీసుకురావటంపై విపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం ఫిర్యాదు చేశాయి. ‘లోక్‌సభ నిబంధనలకు తిలోదకాలిచ్చి కేంద్రం సంఖ్యాబలంతో సవరణల బిల్లును ఆమోదించింది రాజ్యాంగ హక్కులను కాలరాసి తీసుకున్న నిర్ణయంపై చొరవతీసుకోగలరు’ అని రాష్ట్రపతిని కోరారు. -
బంద్ పాక్షికం
►నిరసనలు తెలిపిన ప్రతిపక్షాలు ►కేంద్రం, ప్రధాని దిష్టిబొమ్మల దహనం ►ఎక్కడికక్కడ అరెస్ట్‌లు ►నడిచిన బస్సులు కరీంనగర్ : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వామపక్షపార్టీలు ఇచ్చిన సోమవారం నాటి బంద్ జిల్లా కేంద్రంలో పాక్షికంగా జరిగింది. అధికార టీఆర్ఎస్పార్టీ తటస్థంగా ఉండడం, కాంగ్రెస్ కేవలం నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో బంద్ప్రభావం పెద్దగా కనిపించలేదు. వ్యాపారవాణిజ్య వర్గాలు అక్కడడక్కడ సహకరించగా కొన్ని చోట్ల స్పందన కరువైంది. జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలను మూసివేరుుంచారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రధాన రహదారిపై ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకొని డీపీటీసీ సెంటర్‌కు తరలించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన తెలంగాణచౌక్‌లో నల్లజెండాలతో నిరసన తెలపగా..పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం వదిలిపెట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీడీఎస్‌యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గీతాభవన్, మంకమ్మతోట, కమాన్చౌరస్తాలలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ధర్నా డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో నల్లజెండాలతో ధర్నా చేపట్టారు. మృత్యుంజయం మాట్లాడుతూ ప్రధాని నిర్ణయంతో దేశంలోని 70 శాతం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేసి సామాన్యుల ప్రాణాలను బలితీసుకున్న ఘనత బీజేపీకే దక్కిందన్నారు. కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రహమత్ హుస్సేన్, దిండిగాల మధు, ఉప్పరి రవి, చెర్ల పద్మ, ముస్తాక్, ఎలగందుల మల్లేశం, ఒంటెల రత్నాకర్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, అంజన్‌కుమార్, వెంకటరమణ, వెన్న రాజమల్లయ్య, రాంచందర్, ప్రమోద్‌రావు, రాజేంద్రప్రసాద్, నిహాల్ హైమద్, ఎం.డీ తాజ్, భూమయ్య, దేవేందర్, ఇమ్రాన్, నదీమ్, చంద్రయ్యగౌడ్, బాలరాజు, చంద్రశేఖర్, అఖిల్, రవి, ఉయ్యాల శ్రీనివాస్, తాళ్లపెల్లి అంజయ్యగౌడ్, అలీ, పొలాస వాసు, నయీం, చాంద్, ఆసిఫ్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఎస్.సంపత్, రమేశ్, సదానందం ఉదయమే బస్టాండ్‌కు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఏసీపీ రామారావు, సీఐ హరిప్రసాద్ అరెస్ట్ చేసి డీపీటీసీకి తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు. సీపీఎం జిల్లాకార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు చేసి ఇరువై రోజులు గడుస్తున్న ప్రజల ఇబ్బందులు తీర్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనం అఖిల భారతయువజన సమాఖ్య(ఏఐవైఎఫ్), అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కమాన్‌చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లేశం మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను బ్యాంకులు, ఏటీఏంల చుట్టూ తింపడం మోడీ అవివేకానికి నిదర్శనమన్నారు. కసిబోజుల సంతోష్‌చారి, నునావత్ శ్రీనివాస్, సందీప్‌రెడ్డి, సారుుకృష్ణ, రమేశ్, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో బంద్‌ను విఫలం చేసేందుకు ప్రతిపక్షనాయకులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణచౌక్‌లో డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఐద్వా నాయకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగదు రహిత సమాజాన్ని సృష్టిస్తానని చెప్పిన ప్రధాని.. పెద్దనోట్లు రద్దు చేసి నగదు లేని సమాజంగా మార్చారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐజిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, నాయకులు భాస్కర్‌నాయక్, స్వరూప, రమేశ్‌గౌడ్, సురేష్, రాజు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ధర్నా కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు గుదిబండగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. డాక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు స్విస్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల నల్లధనాన్ని వెలికి తీసి సామాన్యులకు పంచిపెడతామని ప్రగల్బాలు పలికిన ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడస్తున్నా ఆ దిశగా చర్యలు శూన్యమన్నారు. ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బోగె పద్మ, వెంకటరమణారెడ్డి, గండి శ్యాంకుమార్, సాన రాజన్న, దుబ్బాక సంపత్, మోకనపెల్లి రాజమ్మ, జావిద్, సుధాకర్‌రావు, వరాల అనిల్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుతో నెల్లూరులో ’రియల్ ’ఢమాల్
-
ఖమ్మం కూరగాయల మార్కెట్‌పై నోట్ల రద్దు దెబ్బ
-
చిరు వ్యాపారులపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
ప్రధాని క్షమాపణకు పట్టు
ప్రతిపక్షాల ఆందోళనతో ఏడో రోజూ సాగని ఉభయ సభలు న్యూఢిల్లీ: వరుసగా శుక్రవారం ఏడో రోజూ పార్లమెంట్ సమావేశాలు చర్చ లేకుండానే వారుుదా పడ్డాయి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న తమను విమర్శిస్తున్న ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు ఇరు సభలను స్తంభింపచేశారుు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఉభయ సభల్లో నినాదాలు చేస్తూ వెల్‌లో ఆందోళన చేపట్టారు. నల్లధనం మార్చుకునేందుకు సమయం ఇవ్వనందునే నోట్ల రద్దును విమర్శిస్తున్నారన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వారుుదాపడ్డారుు. రాజ్యసభ ప్రారంభం కాగానే మాజీ సభ్యుడు దిపెన్ ఘోష్ మృతికి సంతాపం తెలిపారు. ప్రతిపక్షాల వద్ద నల్లధనం ఉందంటూ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని, క్షమాపణలు చెప్పాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్‌చేశారు.ప్రధాని సభకు రాకపోవడం సభకు, ప్రతిపక్షాలకు అవమానమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రధాని క్షమాపణలు చెప్పరని, ప్రతిపక్షాలే క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. మరోపక్క.. లోక్‌సభలో కూడా ప్రధాని క్షమాపణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రధాని సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం రేగింది. ‘వెల్‌లో నినాదాలు చేస్తూ... పేపర్లు చింపే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా? నేను అనుమతించను? అంటూ సభను స్పీకర్ సుమిత్ర అన్నారు. లోక్‌సభలో యువకుడి హల్చల్ న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం ఓ యువకుడు కొద్దిసేపు అలజడి సృష్టించాడు. పార్లమెంటు సభ్యుల విజిటింగ్ పాస్‌తో ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. సభ వారుుదా ప్రకటన వెంటనే లోక్‌సభ సాధారణ ప్రజల గ్యాలరీ నుంచి సభలో దూకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్‌పురికి చెందిన రాకేశ్ సింగ్ బాఘెల్‌గా గుర్తించారు. -
ఒకటే భయం
-
నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ
-
నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ
ఘోరమైన నిర్వహణా వైఫల్యం.. చట్టబద్ధంగా కొల్లగొట్టడమే రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ ధ్వజం ► మన్మోహన్ హయాంలోనే నల్లధనం, కుంభకోణాలన్న జైట్లీ ► మాజీ ప్రధాని ప్రసంగించినంతసేపు సభలోనే మోదీ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ నిర్ణయాన్ని ‘వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’గా అభివర్ణించారు. ఈ అంశంపై వారం రోజులుగా అట్టుడుకుతున్న రాజ్యసభలో గురువారం మాజీ ప్రధాని మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2 శాతం తగ్గుతుందన్నారు. ప్రధాని మోదీ సభకు హాజరవటంతో.. ప్రశ్నోత్తరాలను ఎత్తేసి నోట్లరద్దుపై చర్చకు అధికార, విపక్షాలు అంగీకరించాయి. మోదీ కూడా చర్చలో పాల్గొంటారని జైట్లీ సభకు వెల్లడించారు. దీంతో 12 నుంచి ఒంటిగంట మధ్య ప్రశ్నోత్తరాల్లో మన్మోహన్ ప్రసంగించారు. ‘నోట్లరద్దు పథకం ఉద్దేశం మంచిదే అయినా.. దీన్ని అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సామాన్యులు, పేదల కష్టాలను అంచనావేయటంలో ప్రభుత్వానిది ఘోరమైన నిర్వహణా వైఫల్యం’అని విమర్శించారు. పథకంలో లోపాలు వెతకటం తన ఉద్దేశం కాదన్న మాజీ ప్రధాని.. ఇప్పటికైనా సమస్యలకు ఆచరణసాధ్యమైన పరిష్కారాలు వెతికి దేశప్రజలను ఆదుకుంటే బాగుంటుందన్నారు. పరిస్థితులను మోదీ తక్కువ అంచనా వేశారన్నారు. రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యవసాయం, అసంఘటిత రంగాలు, చిన్న పరిశ్రమలు చాలా నష్టపోయాయని, ప్రజలకు నోట్లు, బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోతోందని అన్నారు. 50 రోజులు సహకరించాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ తప్పుబట్టారు. నోట్లరద్దు అంతిమ ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు. ‘50 రోజుల సమయం తక్కువే. కానీ పేదలు, సామాన్యులకు ఈ 50 రోజులు నిత్య నరకం. అందువల్లే ఇప్పటివరకు 60-65 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ప్రజల విశ్వాసం దెబ్బతింటోంది’ అని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులకు అనుగుణంగా రోజుకో కొత్త నిర్ణయం తీసుకోవటం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంకుపై విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. రిజర్వ్ బ్యాంకుపై వస్తున్న విమర్శలన్నీ న్యాయమైనవేనన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గరగా ఉండే.. సహకార బ్యాంకులను తాజా పథకంలో చేర్చకపోవడం పెద్ద తప్పిదమన్నారు. ఆయన హయాంలోనే నల్లధనం పోగైంది మన్మోహన్ ప్రసంగంపై ఆర్థిక మంత్రి జైట్లీ దీటుగా స్పందించారు. మన్మోహన్ నోట్లరద్దు పథకాన్ని విమర్శించటంలో ఆశ్చర్యమేమీ లేదని.. ఎక్కువ నల్లధనం పోగైంది ఆయన హయాంలోనేనని అన్నారు. జీడీపీ తగ్గుతుందనడంలో వాస్తవం లేదని.. నోట్ల రద్దు వల్ల మాధ్యమిక, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని.. షాడో ఎకానమీలోని డబ్బంతా ప్రధాన వ్యవస్థలోకి వస్తుందన్నారు. నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులకు బ్యాంకులు మరిన్ని రుణాలి స్తాయన్నారు. ‘తమ కళ్లెదుటే నల్లధనం, స్కాంలు జరిగినా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నల్లధనంపై వ్యతిరేక పోరాటాన్ని పెద్ద తప్పిదంగా పరిగణించటం హాస్యాస్పదం. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కానీ విపక్షమే చర్చనుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతోంది’అని విమర్శించారు. ఓ ఆర్థికవేత్త ఇలాంటి అంశాలపై తక్షణ ప్రభావాన్ని మించి ఆలోచన చేయాలన్నారు. మన్మోహన్ మాట్లాడుతున్నంతసేపు మోదీ సభలోనే ఉన్నారు. భోజన విరామానికి ముందు జైట్లీ, నఖ్వీలతో వెళ్లి మన్మోహన్తోపాటు విపక్షనేతలను ప్రధాని ఆప్యాయంగా పలకరిం చారు. అంతకుముందు మన్మోహన్ మాట్లాడ తారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. దీనిపైజైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్లరద్దుపై చర్చలో భాగంగా మాట్లాడితే అభ్యంతరం లేదన్నారు. దీనిపై అధికార, విపక్షాల మధ్య ఆందోళనతో సభ ప్రశ్నోత్తరాల సమయం వరకు వారుుదా పడింది. తిరిగి మొదలు కాగానే మోదీ రాకపోవటంతో విపక్షాలు నిరసన తెలిపారుు. మోదీ సభకు వస్తారని కురియన్ చెప్పారు. అటు లోక్‌సభలో వారుుదా తీర్మానంపై వెనక్కుతగ్గేది లేదని విపక్షాలు చెప్పటంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ రేపటికి వారుుదా వేశారు. -
అమ్మో.. వచ్చేస్తుంది ఒకటో తారీఖు
-
నోట్ల రద్దుతో కళ తప్పిన కృష్ణా నగర్
-
రైతు బజార్లపై నోట్ల రద్దు ప్రభావం
-
కొత్త నోట్లు వచ్చేదాకా కష్టాలు తప్పవు
-
నోట్ల రద్దుతో టమోటా రైతులు కుదేల్
-
మరో ఏడాది కష్టాలే..!
నొమురా అంచనావృద్ధి రేటు అంచనాలకు కోత ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకూ (2017-18, జూలై - సెప్టెంబర్) కొనసాగుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనావేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలకు కోత విధించిన కేర్, ఆంబిట్ వంటి ఆర్థిక విశ్లేషణా సంస్థల జాబితాలో తాజాగా నొమురా కూడా చేరడం గమనార్హం. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ⇔ మార్చి త్రైమాసికానికి ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ చోటుచేసుకుంటుంది. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ⇔ భారత్‌లో వినియోగ డిమాండ్ కీలకమైనది. పెద్ద నోట్ల రద్దు వల్ల నెలకొన్న ‘క్యాష్ షార్టేజ్’ వినియోగ డిమాం డ్‌పై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. ⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.5%కి తగ్గిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.9% నుంచి 7.5%కి తగ్గిస్తున్నాం. ⇔ వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, బ్యాంకింగ్‌లో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, గ్రామీణ డిమాండ్ దీర్ఘకాలంలో పుంజుకునే అవకాశాలు వంటివి భారత్ వృద్ధికి సానుకూలమైనవి. ఏటీఎంలు సాఫీగా నడిచేందుకు కృషి: జైకామ్ హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకు ఏటీఎంల వద్ద రద్దీ పెరిగిపోరుున నేపథ్యంలో కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు తమవంతు సాయం అందిస్తున్నట్టు జైకామ్ సెక్యూరిటీ సిస్టమ్స్ తెలిపింది. భారీ రద్దీని బ్యాంకులు తట్టుకోవడం వెనుక బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ పాత్ర తగినంత ఉన్నట్టు తెలిపింది. జైకామ్ కంపెనీ ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులకు చెందిన 4,500 ఏటీఎంల వద్ద సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సేవలదిస్తోంది. ఎరుుర్పోర్ట్లలో ఐడీబీఐ పీఓఎస్ మెషీన్లు... ముంబై: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విమాన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ముంబై ఎరుుర్‌పోర్టులో పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు తెలియజేసింది. ఈ పారుుంట్లలో ఐడీబీఐ వీసా, రూపే డెబిట్ కార్డు వినియోగదారులు డబ్బును డ్రా చేసుకోవచ్చని, ఒక కార్డుకు గరిష్టంగా రూ.2,000 వరకు తీసుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు కూడా వారి వీసా/రూపే డెబిట్ కార్డు ద్వారా ఈ పారుుంట్లలో డబ్బును డ్రా చేసుకోవచ్చని వివరించింది. -
కృష్ణానగరే మామ..కష్టాల కడలే!
లైఫంతా సినిమా మామ సినిమాయే లైఫురా మామ...కళ్ల నిండా కలలతో జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్‌లో కనిపిస్తారు.ఇప్పుడు వారికి కలలొచ్చే పరిస్థితి లేదు. కంటి నిండా కునుకు లేదు. పెద్ద నోట్ల రద్దుతో షూటింగులు కుంటుపడి, పని లేక కిస్తులు, పస్తులతో సతమతమవుతున్న జూనియర్ ఆర్టిస్టులపై ఓ రిపోర్ట్. హైదరాబాద్‌లో సినీ శ్రమజీవులు ఉండే కృష్ణానగర్ - ఇందిరా నగర్ - గణపతి కాంప్లెక్స్... సినిమాల్లో బోల్డంత మంది జనాలు నిలబడే సీన్స్‌లో కనిపిస్తారే (జూనియర్ ఆర్టిస్టులు)...ఈ మూడు ఏరియాలూ వాళ్ల అడ్డా. ఎప్పుడూ ఈ ఆర్టిస్టులతో ఈ మూడు ఏరియాలూ కిటకిటలాడుతుంటాయ్. గత రెండు వారాలుగా కూడా జనం కిటకిటలాడుతున్నారు. కానీ, వారి మానసిక స్థితి మాత్రం మారిపోయింది. ఎవరి ముఖాల్లోనూ కళలేదు. ‘పెద్ద నోటు పోటు’ని తట్టుకోలేకపోతున్నారు. చాలావరకూ షూటింగ్స్ ఆగిపోయాయి. జరుగుతున్న కొద్ది షూటింగ్స్‌లోనూ... ఇంతమందికీ ఉపాధి లేదు. దాంతో, వీళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుటి సరదా మాటలు లేవు.. జోష్ లేదు. పెద్ద నోట్లు ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్న కార్మికులను ఇబ్బందుల్లో పడేసింది. సమస్య ఏంటంటే... ఇరకాటంలో చిన్నవాళ్లు పాత నోటు స్థానంలో కొత్త నోటు రావడం, పాత నోట్లను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, బ్యాంకులో డబ్బున్నా కావల్సినంత తీసుకోలేకపోవడంతో చిన్న నిర్మాతలు ఇరకాటంలో పడిపోయారు. డబ్బులు సర్దుబాటు చేయలేక షూటింగులు ఆపేశారు. వాస్తవానికి పెద్ద సినిమాలు ఆరేడు నిర్మాణంలో ఉంటే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యలో సెట్స్‌పై ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు ఈ చిన్న, మధ్యశ్రేణి సినిమాలే కొండంత అండ. తీరా ఇప్పుడు దానికి గండి పడింది. అసలింతకీ ఈ జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు ఎలా వస్తుంటాయి? మొన్నటి దాకా పరిస్థితి ఎలా ఉంది? ఆ విషయానికొస్తే... క్లాస్... మధ్యస్థం... మాస్! దాదాపు అన్ని ఉద్యోగాల్లోనూ గ్రేడులున్నట్లే.. ‘జూనియర్ ఆర్టిస్టు’లకు కూడా గ్రేడులుంటాయి. ‘ఎ’, ‘బి’, ‘సి’ అని మూడు గ్రేడ్లు. ‘ఎ’ అంటే క్లాస్, ‘బి’ అంటే మధ్యస్థం, ‘సి’ అంటే పక్కా లోకల్. వీళ్లల్లో ‘ఎ’ క్లాస్వాళ్లు భారీ సినిమాల్లో వచ్చే ఫంక్షన్ సీన్స్, ఇతరత్రా సన్నివేశాల్లో చేస్తారు. ఇక, కాలేజీ, కోర్టు వంటి సన్నివేశాలకు ‘బి’ గ్రేడ్వాళ్లు పనికొస్తారు. పక్కా ఊర మాస్ సీన్స్‌ని ‘సి’ గ్రేడ్ వాళ్లు చేస్తారు. ‘‘సినిమాల్లోని కథ, షూటింగ్ అవసరాన్ని బట్టి వీళ్లల్లో ఎ, బి గ్రేడ్లవాళ్లకు సగటున నెలలో 15 నుంచి 20 రోజులు షూటింగ్ ఉంటుంది. ‘సి’ వాళ్లకు 5 నుంచి 10 రోజులు ఉండడం గగనం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి సత్యనారాయణ ‘సాక్షి’తో అన్నారు. తాజా నోట్ల మార్పు పరిణామం కారణంగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ మూడు గ్రేడ్ల వాళ్లకూ సరిగ్గా పని లేదని తెలిపారు. బ్రేక్‌కి బ్రేక్ ఎప్పుడో? తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యుల సంఖ్య దాదాపు 2,500. షూటింగ్‌లన్నీ జోరుగా జరు గుతూ ఫిల్మ్‌నగర్ కళకళలాడుతున్నప్పుడే వీళ్లందరికీ పని దొరకడం కష్టం. అలాంటిది... ఇప్పుడు షూటింగ్‌లకు ‘కరెన్సీ దెబ్బ’ పడ్డాక మరీ కష్టమైంది. హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా, మరికొన్ని భారీ సినిమాలు మినహా మెజారిటీ ఛోటా సినిమా షూటింగులకు బ్రేకులు పడ్డాయి. పాత నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్ని రోజులు ‘బాహుబలి-2’ షూటింగ్ జరిగింది. దాంతో సినిమా ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, కొన్ని సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్నాయి. సంక్రాంతి పండగకు వచ్చే సినిమాల్లో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం మీద జూనియర్ ఆర్టిస్టులకు ఈ మధ్య ఎప్పుడూ రానంత ‘లాంగ్ బ్రేక్’ వచ్చింది. మరి.. ఈ బ్రేక్‌కి బ్రేక్ పడేదెప్పుడో? సిక్స్ టు సిక్స్ జాబ్ ఏ జాబ్ అయినా 9 టు 6 ఉంటుంది. కానీ, జూనియర్ ఆర్టిస్టులది మాత్రం పన్నెండు గంటల కాల్షీట్. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చేయాల్సిందే. ఆరు దాటిందంటే మాత్రం ఆ రోజు వారీ వేతనానికి, అదనంగా మరో సగం చేర్చి మొత్తం చెల్లిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ జరిగినప్పుడు భోజనం పెడతారు. భోజనం లేకపోతే వంద రూపాయలిస్తారు. ఒకవేళ రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటితే అప్పుడు ‘డబుల్ కాల్షీట్’కి (డబుల్ పేమెంట్) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ‘కన్వేయన్స్’ (అంటే రానూ పోనూ ఛార్జీలు) కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ‘యూనియన్’ రూల్ ప్రకారమే జరగాలి. అయితే, ‘‘కన్వేయన్స్ విషయంలో కొన్ని కంపెనీలు ఫర్వాలేదు. కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం ఇవ్వడం లేదు. రూల్ ప్రకారంగా అయితే రూ. 150 ఇవ్వాలి’’ అని ఓ జూనియర్ ఆర్టిస్ట్ బాధ వెళ్లగక్కారు. అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి! ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కావడంతో షూటింగ్ పెట్టుకున్నా, ‘క్యాష్’ ఇవ్వలేని పరిస్థితిలో నిర్మాత ఉన్నాడు. దాంతో లావాదేవీలన్నీ ‘చెక్’ రూపంలోనే జరుగుతున్నాయ్. ఇచ్చిన చెక్ చెల్లిందా ఓకే. చెల్లకపోతే ఆ కంపెనీ చుట్టూ తిరగక తప్పదు. జూనియర్ ఆర్టిస్టుల విషయంలో ఈ బాధ్యత అంతా యూనియనే తీసుకుం టుంది. ఒకవేళ ఏ నిర్మాత అయినా షూటింగ్ పెట్టుకోవా లనుకుంటే, చెక్ తీసుకోవడానికి యూనియన్ అంగీకరి స్తోంది. యూనియన్ ఆమోదించింది కాబట్టి... ఒకటీ రెండు రోజులు దొరికే పనిని కాదనకుండా ఒప్పుకుంటు న్నారు చిన్న కళాకారులు. ‘‘అన్నం పెట్టే నిర్మాతను అర్థం చేసుకోవాలి. అందుకే ‘చెక్’ని ఆమోదిస్తున్నాం’’ అని తెలుగు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలు కూరి సత్యనారాయణ తెలిపారు. వెరసి, మొన్న నవంబర్ 8 తర్వాత నుంచి చేతి నిండా పని లేక, చేతుల్లో డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులతో చిన్న కళాకారులు బతుకు బండిని భారంగా లాగుతున్నారు. - ‘సాక్షి’ సినిమా డెస్క్ ‘‘మాదంతా క్యాష్ అండ్ క్యారీ. పాత నోట్ల రద్దుతో కొన్ని నిర్మాణ సంస్థలు చెక్కులిస్తామంటున్నాయి. ఒకవేళ ఆ చెక్కులు బౌన్స్ అయితే? సినిమా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాలి. నెలకోసారి బిల్ చెల్లించే విధంగా కొన్ని మెస్‌లు షూటింగులకు టిఫిన్స్, మీల్స్ సప్లై చేస్తున్నాయి కానీ, షూటింగులు తగ్గడంతో వాళ్లకూ వ్యాపారం లేదు. మొత్తం మీద యాభై శాతం అమ్మకాలు తగ్గాయ్. ఇప్పుడు జనాల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. వంద నోటున్నోడు ఖర్చు పెట్టడానికి, తినడానికి కూడా ఆలోచిస్తున్నాడు. భారీ ఉద్యమాలు, బంద్‌లు కూడా మా వ్యాపారాలపై ఇంత ప్రభావం చూపలేదు’’ - రత్నం, ‘మంగా’ టిఫిన్ సెంటర్ ఓనర్, కృష్ణానగర్ ‘‘ఎక్కువగా చిన్న సినిమా షూటింగులకు నోట్లు బ్రేకులు వేశాయి. దాంతో చాలా మంది ఖాళీనే! ‘షెడ్యూల్ క్యాన్సిల్ అయితే నిర్మాత నష్టపోతాడు. లెక్కలు తర్వాత... ముందు షూటింగ్ చేయండి’ అని ప్రొడక్షన్ మేనేజర్లు అంటున్నారు. లేటైనా డబ్బులు ఇస్తారనే నమ్మకంతో మిగతావాళ్లు షూటింగులకు వెళ్తున్నారు. లేదంటే పాత నోట్లు తీసుకుంటున్నారు.’’ - నారాయణ, ఓ జూనియర్ ఆర్టిస్ట్ లోకల్ కన్నా ముంబై మోడల్స్‌కే ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్‌లు వేరు... మోడల్స్ వేరు. పబ్ సాంగ్స్, విదేశాల్లో తీసే పాటలకు, కాస్ట్లీ సీన్స్కూ జూనియర్ ఆర్టిస్టులకు కాకుండా మోడల్స్‌కే ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్ మోడల్స్కైతే రోజుకి రూ. 1,000 నుంచి 2,000 వరకూ ఉంటుంది. రానూ పోనూ ఛార్జీల కింద రూ. 150 నుంచి రూ. 200 వరకూ వస్తారు. అదే ముంబై మోడల్స్‌కి అయితే రూ. 5,000 వరకూ పారితోషికం ఉంటుంది. రానూపోనూ ఫ్లైట్ ఛార్జీలు, హోటల్లో బస - అన్నీ నిర్మాతే చూసుకోవాలని ఒక ప్రముఖ చిత్ర నిరా ్మణ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ వెంకట్ తెలిపారు. జూ.ఆర్టిస్ట్ పారితోషికం (ఒక కాల్షీట్కి) ఎ గ్రేడ్ రూ. 650 బి గ్రేడ్ రూ. 650 సి గ్రేడ్ రూ. 550 ఉదయం 6 గంటల కాల్షీట్ అయితే ‘ఏ’, ‘బి’ గ్రేడ్వారికి రూ. 650 ఇవ్వాలి, సాయంత్రం ఆరు దాటితే మరో సగం కాల్షీట్కి కూడా పే చేయాలి. ఒకవేళ రాత్రి తొమ్మిది కూడా దాటితే డబుల్ కాల్షీట్ పేమెంట్ ఇవ్వాలి. ఒకటిన్నర కాల్షీట్ కింద ‘ఏ’, ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్ట్‌లకు రూ. 975, ‘సి’ గ్రేడ్ జూనియర్ ఆర్టిస్ట్‌లకు రూ. 825 దక్కుతుంది. కాస్ట్యూమ్ కాస్ట్! మామూలుగా సినిమాల్లో పెద్ద ఆర్టిస్టుల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు - ప్రతి ఒక్కరూ పాత్రను బట్టి వేసుకునే దుస్తులు నిర్మాతే సమకూర్చాలి. ఒక్కోసారి వాళ్లే తెచ్చుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులు మాత్రం దాదాపు తమ సొంత బట్టలతోనే షూటింగ్స్‌లో పాల్గొంటారు. అందుకు గాను చిన్న నిర్మాత అయితే డ్రెస్‌కి రూ. 100, పెద్దవాళ్లైతే రూ. 200 వరకూ వాళ్ళకు ఇస్తారు. భోజనం ఖర్చు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉదయం లొకేషన్‌కి వచ్చినప్పటి నుంచి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పే వరకూ.. నిర్మాతే భోజన వసతి సమకూర్చాలి. రాగానే టీ లేక కాఫీ, ఆ తర్వాత టిఫిన్, మధ్యాహ్న భోజనం లోపు ఓ రెండు సార్లు టీలు, భోజనం తర్వాత సాయంత్రం టీ, స్నాక్స్ ఇలా అన్నీ ఇస్తారు. దీనికి గాను ఒక్కో జూనియర్ ఆర్టిస్ట్‌కి రోజుకి అయ్యే ఖర్చు రూ. 150 నుంచి రూ. 175 వరకూ ఉంటుంది. -
సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానా !
-
పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి లాభమెంత?
2016 మార్చి నాటికి రూ.500, 1,000 నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు ♦ ఇందులో బ్యాంకులకు చేరనివి రూ.3.5 లక్షల కోట్లు ♦ మార్పిడి, డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరే ఈ మొత్తం ఆర్బీఐ నుంచి డివిడెండ్ రూపంలో కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం బిజినెస్ డెస్క్ ‘పెద్ద నోట్లను ఉపసంహరించడంతో సంపద ధ్వంసం కాదు.. సంపద బదిలీ అవుతుంది’ ఇదీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియం గత వారం చెప్పిన మాటలు. ఆయన అభిప్రా యంతో కొందరు ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ప్పటికీ, నోట్ల రద్దుతో ప్రభుత్వానికి భారీ ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు మార్పిడికి, డిపా జిట్లకు రాని డబ్బంతా రదై్దన నోట్ల రూపంలో ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చేరుతుం దన్నదే ఆ అంచనాల సారాంశం. అదేలా అంటే.. ► చెలామణీలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల విలువ 2016 మార్చి నాటికి రూ. 14.18 లక్షల కోట్లు ఉంది. మొత్తం కరెన్సీ నోట్లలో ఈ పెద్ద నోట్ల విలువ 80 శాతం వరకూ ఉంటుంది. మిగిలినవన్నీ చిన్న నోట్లే. ► సుమారు రూ.14 లక్షల కోట్ల విలువైన ఈ పెద్ద నోట్లలో దాదాపు 25 శాతం బ్యాంకుల వద్దకు చేరవని అంచనా. అంటే ఈ మొత్తం దాదాపు రూ.3.5 లక్షల కోట్లు. ► ఇలా బ్యాంకుల వద్దకు మార్పిడి, డిపాజిట్ కోసం చేరని రూ.3.5 లక్షల కోట్లు రిజర్వుబ్యాంక్‌కు వచ్చిన లాభంగా పరిగణిస్తారు. ► రద్దయిన నోట్ల స్థానంలో ఇప్పుడు రిజర్వుబ్యాంకు కొత్తగా రూ.500, రూ.2,000 నోట్లను ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల వద్దకు మార్పిడి కోసం, డిపాజిట్ల రూపంలో వచ్చిన పాత నోట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయి. కానీ బ్యాంకుల వద్ద జమకాని రూ.3.5 లక్షల కోట్ల విలువైన పాత నోట్లకు బదులుగా కూడా రిజర్వుబ్యాంక్ అంతే మొత్తం కొత్త నోట్లను అదనంగా ముద్రిస్తుంది. ► ప్రతీ ఏడాది రిజర్వుబ్యాంక్‌కు వివిధ కార్యకలాపాల ద్వారా వచ్చిన లాభాన్ని డివిడెండు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇదే ప్రక్రియలో భాగంగా కేంద్రానికి ఈ రూ. 3.5 లక్షల కోట్లు బదిలీ అవుతాయి. ఈ డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుంది? నిధుల సమస్యలతో వివిధ రంగాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవు తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రో సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలకు కోత విధిస్తోంది కూడా. ఇటువంటి సమయంలో హఠాత్తుగా సమకూరిన ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఏ రూపంలోనైనా వినియోగిం చుకోవచ్చు. అవి.. ఏమిటంటే.. ► అదనంగా వచ్చిన ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దాదాపు రూ.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ► మొండి బకాయిలతో మూలధనం కోసం అర్రులుచాస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధనాన్ని సమకూర్చవచ్చు. ► మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయవచ్చు. ► సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించవచ్చు. -
యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు
తమ్మినేని వీరభద్రం డిమాండ్ సాక్షి, ఝరాసంగం/హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం సం గారెడ్డి జిల్లా రారుుకోడ్, వట్పల్లి మండలాల్లో మ హాజన పాదయాత్ర సా గింది. సిరూర్లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు, చిరుద్యోగులు, కార్మికులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దొంగనోట్లు, నల్లధనం ఉన్న బడాబాబులను వదిలేసి సామాన్యులపై పడడం సరికాదన్నారు. కొత్త నోట్లను ముద్రించేం దుకు 3 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు పాత నోట్లు చలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఎందుకు పోరాడటం లేదని తమ్మినేని ప్రశ్నించారు. -
అప్పుడు కళ కళ..ఇప్పుడు వెల వెల
-
రద్దుతో విపక్షాల ఎదురు దాడి
-
నేటి సాయంత్రం ప్రధానితో భేటీ
-
నలుపు లేక తెలుపు లేదు!
అక్షర తూణీరం పెద్ద నోట్ల రద్దు బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందనీ.. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు. ఇద్దరు పరిచయస్తులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒకాయన రెండో ఆసామికి అప్పున్నాడు. దొరక్క దొరక్క దొరికాడని బాకీ తీర్చనందుకు సాధిస్తున్నాడు. రైలు దిగి ఎటూ పోవడానికి లేదు. పాపం అందుకని ఓపిగ్గా భరిస్తు న్నాడు. ఇంతలో ఒకచోట ఉన్నట్టుండి రైలు ఆగింది. గబగబా పది మంది ముసుగు దొంగలు రైలెక్కారు. ఆ చివర్నించి కత్తులు చూపించి వరుసగా నగా నట్రా నుంచి జేబులు వొలి చేస్తున్నారు. రెండో ఆసామి ఒక్కసారిగా జాగృతమయ్యాడు. జేబులో ఉన్న పైకం, మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికున్న రెండు పెళ్లి ఉంగరాలు తీసి రుణదాత చేతిలో పెట్టాడు. ఆలస్యానికి క్షమించమన్నాడు. నష్టం జరగలేదు సరికదా బాకీ తీరిపోయింది. ఈ నోట్ల రద్దు వేళ ఇలాంటివి, ఇంకా చిత్ర విచిత్ర సన్నివేశాలు ఎదు రవుతున్నాయి. ప్రధాని మోదీ పుణ్యమా అని రెడ్‌లైట్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. నిల్వ డబ్బుని, నిల్వ కోరికల్ని వదిలించుకుంటున్నారు. అక్కడ కూడా పెద్ద నోట్ల అర్హత గలవారికే గిరాకీ ఉందిట. మరీ చిల్లర వారికి బోణీలు కావడం లేదుట. ఇది ఇలా ఉంచితే దానధర్మాలు పెరిగాయి. చాలాచోట్ల దేవాలయ జీర్ణోద్ధరణలు సాగుతున్నాయి. యాభై ఏళ్లు గడచినా ఒక్క వాహనమైనా లేని దేవుళ్లకి అవి అమరుతున్నాయి. మా ఊళ్లో ఒకాయన మంచి హైక్లాస్ రికార్డింగ్ డ్యాన్సులు వరుసగా స్పాన్సర్ చేస్తున్నాడు. మా ఊరంతా ఆ నిషాలో జోగు తోంది. పన్నులతో సహా జగమొండి బాకీలు వద్దంటే రాలుతున్నాయి. ఒక సంపన్నుడు ఉత్తి పుణ్యానికి కవి సమ్మేళనం పెట్టించాడు. అంతేనా, ఒక్కో కవిని రెండేసి ఐదొందల నోట్లతో సత్కరిం చాడు. అంతేనా, శ్రోతలకి కూడా ఒక్కో నోటిస్తానని కబురంపాడు. అయినా, కవులకు భయపడి శ్రోతలంతగా స్పందించలేదు. నోట్ల రద్దుతో సర్వే సర్వత్రా విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. కొందరు నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తున్నారు. మరికొందరు కొంచెం బాగానే నిల్వలున్నట్టు చిన్న మొహాలతో తిరుగుతున్నారు. బయటపడి బావురుమనలేదు. అట్లాగని దిగమింగనూ లేరు. దీనివల్ల చాలా నష్టం అని కేకలు పెడుతున్నారు గానీ ఎవరికి నష్టమో చెప్పడం లేదు. కొందరు సమన్యాయం జరగలేదని, డెమోక్రసీలో ఇది అన్యాయమనీ అరుస్తు న్నారు. కొందరికి ముందే ఉప్పందిందని వారి వాదన. కావచ్చు. మోదీ దేవుడేం కాదు. క్యాబినెట్ సహచరులు అంతకంటే కాదు. ఢిల్లీకి ఇక్కడీ ఆసులో గొట్టంలా తిరిగే వారె వరో ఒక్క చెవిలో పడేశారనీ, అది ఒక వర్గం చెవుల్లో కాంతి వేగంతో ప్రసరించిందనీ అంటున్నారు. పాపం పుణ్యం పైనున్న వాడికి తెలియాలి. ఇక్కడేమైందంటే, ఈ చర్యని సమర్థించే వారంతా నీతిపరులని, వ్యతిరేకిస్తున్న వారంతా నల్లధనవంతులని ఓ ముద్ర పడుతోంది. కాస్త ముందుగా మాక్కూడా చెప్పకూడదా మేమూ ఒడ్డున పడేవాళ్లమని పరోక్షంగా కష్టపడుతున్నారు. ఒక లాయరు కేసు ఓడిపోతే క్లయింట్‌కి ‘న్యాయం గెలి చింది’ అని టెలిగ్రామ్ కొట్టాడు. వెంటనే క్లయింట్, ‘పై కోర్టుకి అప్పీల్ చేయండి’ అని జవాబు కొట్టాడు. ఇప్పుడు కూడా వాదోపవాదాలు బయటపడకుండా ధ్వని ప్రధానంగా జరుగుతున్నాయి. కొందరేమంటున్నారంటే, ఇది బావిలో పూడిక తీయడం లాంటిది. ఇక కొత్తనీరు బుగ్గలు బుగ్గలుగా ఊరుతుంది. ఆ వూరే నీరంతా నల్లదే అవుతుందంటున్నారు. బ్లాక్ లేకుండా వైట్ లేదంటున్నారు. ఒక పెద్దాయన దీనికి సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ‘‘రద్దు నోట్లని భద్రంగా ఉంచండి మేం వస్తాం! వాటిని తిరిగి చెలామణిలోకి తెస్తాం ఇదే ఈసారి మా ఎన్నికల ఎజెండా’’ అని కాంగ్రెస్ పార్టీ ఓ స్టేట్మెంట్ ఇస్తే ఢిల్లీకి కళ్లు తిరుగుతాయి. నల్లవారంతా ఏకమై గెలిపించుకోరా? చూడండి కావలిస్తే. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ప్రభుత్వంపై మహిళ సంచలన వ్యాఖ్యలు
-
వెలవెలబోతున్న కూరగాయల మార్కెట్లు
-
నోట్ల రద్దుతో వారిద్దరూ హాట్ టాపిక్ మారారు
-
‘నోటు’పై హోరాహోరీ!
పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా పౌరులంతా బజారునపడిన వేళ బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిహద్దు ఆవల మన సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘటన ఈ సమావేశాల్లో ప్రముఖంగా చర్చకొస్తుందని అందరూ అంచనా వేస్తున్న సమయంలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు సంగతిని ప్రకటించారు. మరో రెండు, మూడు గంటల్లో ఆ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానం కాబోతున్నాయని చెప్పి అందరిలో వణుకు పుట్టించారు. పల్లెసీమల సంగతేమోగానీ నగరాలు, పట్టణాల్లోని జనం అప్పటికప్పుడు ఏటీఎంల దగ్గరకు పరుగెత్తారు. వాటిలో సైతం ‘కాబోయే చిత్తు కాగితాలు’ బయట కొస్తుంటే తలలు పట్టుకున్నారు. మోదీ ప్రకటనలోని ఆంతర్యాన్ని తెలుసు కోలేని వారు ఆ రోజుకు టీవీలు కట్టేసి కంటినిండా నిద్రపోయి ఉండొచ్చుగానీ... తెలతెలవారాక పాల ప్యాకెట్లు అమ్మేవారు ఇది చిత్తుకాగితమని చెప్పేసరికి తెల్ల బోయారు. అప్పటికీ తెలివి తెచ్చుకోనివారికి ఇతరచోట్ల జ్ఞానోదయమైంది. ఇక ఆ క్షణం నుంచి ఎవరికీ నిద్ర లేదు. వేరే వ్యాపకానికీ అవకాశం లేదు. అన్నీ మరిచి ఏటీఎంల దగ్గరా, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం తప్ప దిక్కూ మొక్కూ లేకపోయింది. ఆనాటినుంచీ పిల్లలూ, పెద్దలూ, పిల్లల తల్లులు, వికలాంగులూ, వృద్ధులూ... అందరికందరూ అన్నపానీయాలను మరిచి నిలువుకాళ్ల యజ్ఞం చేస్తున్నారు. గుండె ఆగి మరణించినవారు కొందరైతే, పాత నోట్లిస్తే వైద్యానికి నిరాకరించిన ఉదంతాల్లో మృత్యువాతపడినవారు మరికొందరు. తమ చర్యల ఆంతర్యం నల్లధనం పనిపట్టడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో సహజంగానే నిప్పులు కురుస్తాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడుతోంది. జాతి విస్తృత ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి సహకరించమని అఖిలపక్ష సమావేశంలో మోదీ విజ్ఞప్తి చేశారు. ‘మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. చర్చించండి. వాదిం చండి. కానీ ఈ సమావేశాలను సజావుగా సాగనివ్వండ’ని ఆయన కోరారు. వాస్తవానికి ప్రధాన సమస్య పెద్ద నోట్ల రద్దుతోపాటు దేశాన్ని వేధిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. జమ్మూ–కశ్మీర్ ఇంకా కుదుటపడలేదు. సాక్షాత్తూ ఢిల్లీలోనే ఉన్నతశ్రేణి విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో ఒక విద్యార్థి మాయమై రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. అదే నగరంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఒక హత్యలో ప్రమేయం ఉన్నదంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఇవిగాక ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వం నిధులు సమకూర్చడం, ఏక కాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వంటివి అతి ముఖ్య మైన సమస్యలని కేంద్రం చెబుతోంది. ఈ రెండింటినీ చర్చించాలనడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంగా మన దేశంలో చట్టసభల పని తీరు ఎలా ఉంటున్నదో, అందులో ఎవరి పాపమెంతో... వాటిని సరైన తోవన పెట్టడం ఎలాగో కూడా నిగ్గుతేలిస్తే మంచిదే. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, విపక్ష సభ్యుల్ని సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న పోకడలను చర్చిస్తే మేలే. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ఈ ధోరణులకు ఎవరు బాధ్యతవహించాలో తేల్చడమూ అవసరమే. చర్చలో విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే కాదు... ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా అత్యవసరం. ఎన్నికల్లో పార్టీలకు నిధులు సమకూర్చడంపై చర్చ సాగాల్సిందే. కానీ అంతకన్నా ముందు ఆ ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడమెలా అన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. నెగ్గడం కోసం నానాగడ్డీ కరవడం, అలవికాని హామీలివ్వడం, అధికారంలోకొచ్చాక వెన్ను పోటు పొడవటం ఎలాంటి నీతో... దానివల్ల మొత్తంగా ఎన్నికలంటేనే ఏవగింపు కలిగే స్థితి ఏర్పడటం ఎంత ప్రమాదకరమో చర్చించాలి. మిగిలినవన్నీ వాటి తర్వాతనే. గత అనుభవాలు చూస్తే విపక్షాల ఏకైక వ్యూహం పార్లమెంటును సాగనీయ కుండా చేయడమేనని అర్ధమవుతుంది. సమావేశాలు చాపచుట్టుకుపోతే... పదే పదే అవి వాయిదాల్లో గడిచిపోతే దాన్ని తమ విజయంగా భావించడం రివాజు అయింది. ఇప్పుడు సైతం అలాగే వ్యవహరిద్దామనుకుంటే జనం మెచ్చరని... సభను స్తంభింపజేయడం కాక ‘ఎలాగైనా’ చర్చ సాగేలా చూడటం తక్షణావస రమని విపక్షాలు తెలుసుకోవాలి. మరోవైపు కీలకమైన సమస్యలు వచ్చిపడిన ప్పుడు చర్చను పక్కదోవ పట్టించే వ్యూహం ప్రభుత్వాలకు ఎటూ ఉంటుంది. హఠాత్తుగా మరేదో సమస్యను తెరమీదికి తెచ్చి సభ దృష్టి మళ్లించిన సందర్భాలు యూపీఏ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంది. పార్లమెంటు సమావేశాలు ఎలా ఉండబోతాయో మంగళవారంనాటి పరిణా మాలే చెబుతున్నాయి. పరస్పరం తలపడే తృణమూల్, సీపీఎంలు రెండూ విపక్ష సమావేశానికి హాజరుకావడం, తామంతా పార్లమెంటులో ఉమ్మడి పోరుకు సిద్ధ పడుతున్నామని సంకేతాలివ్వడం కీలకమైన అంశమే అయినా...పెద్ద నోట్ల రద్దు ఉత్పాతంపై సమష్టిగా రాష్ట్రపతిని కలుద్దామన్న తృణమూల్ ప్రతిపాదనకు ఎవరూ సుముఖత చూపకపోవడం గమనించదగ్గది. అందుకు మరికాస్త సమయం తీసు కుందామన్న ఇతర పార్టీల సూచన ఆమెకు రుచించలేదు. మరోవైపు కేరళలో తమ ప్రభుత్వం చేస్తున్నట్టు బెంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నోట్ల స్వీకారానికి ముందుకు రావాలన్న సీపీఎం సూచనపైనా ఆమె ఎటూ తేల్చలేదు. అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ నేతలు యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు కాజేశారని విమర్శించారు. కనుక ప్రధానంగా ఈ రెండు పక్షాల భుజ బలప్రదర్శనకూ ఈ సమావేశాలు వేదికవుతాయన్న అనుమానాలు తలెత్తుతు న్నాయి. అదే జరిగితే జనం క్షమించరు. తక్షణ సమస్యలపై చర్చించడం, సరైన పరి ష్కారాలను అన్వేషించడం, చట్టసభల ఔచిత్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్ని పక్షాలూ గుర్తించాలి.