
కరెన్సీ చెస్టుల నుంచి పంట రుణాలు
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం కలిగించే చర్యలను ఆర్బీఐ చేపట్టింది. కరెన్సీ చెస్టులు నిర్వహిస్తున్న బ్యాంకులు రబీ సాగుకు సరిపడా నగదును అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇందుకోసం బ్యాంకర్ల కమిటీ జిల్లా స్థారుు సమన్వయకర్తలతో కలిసి పనిచేయాలని కోరింది.
‘చెస్టుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, డీసీసీబీలకు నగదు కేటారుుంచడానికి బ్యాంకులు జిల్లా స్థారుు సమన్వయకర్తల సేవలు వినియోగించుకోవాలి’ అని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ చివరలో ముగిసే ఈ సీజన్‌లో సుమారు రూ.35 వేల కోట్ల పంట రుణాలు అవసరమవుతాయని ఓ అంచనా.