రూ.350 నోటు వస్తోందా?: ఆర్‌బీఐ ఏం చెప్పించిందంటే.. | FactCheck: Is RBI Issued New Rs 350 And Rs 5 Currency Notes? Check The Actual Truth Inside | Sakshi
Sakshi News home page

రూ.350 నోటు వస్తోందా?: ఆర్‌బీఐ ఏం చెప్పించిందంటే..

Published Sun, Jan 26 2025 7:57 PM | Last Updated on Mon, Jan 27 2025 4:17 PM

Is RBI Issued New Rs 350 Rs 5 Currency Notes Check The Truth

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.350, రూ.5 నోట్లను విడుదల చేస్తున్నట్లు.. కొన్ని వార్తలు, నోట్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తలు నిజమేనా? లేక కేవలం పుకార్లు మాత్రమేనా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూ. 5 నోట్లు, రూ. 350 నోట్లు కేవలం పుకారు మాత్రమే అని ఆర్‌బీఐ వెల్లడించింది. మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ఫొటోలే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవే ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చినట్లు చెబుతున్నారు.

2016 డిమోనిటైజేషన్ తరువాత పాత రూ. 500, రూ. 1000 నోట్లను ఆర్‌బీఐ రద్దు చేసింది. ఆ తరువాత కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని రోజులలోనే రూ. 200 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు.

2023లో ఆర్‌బీఐ పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ప్రజలవద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులలో ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో రెండు వేలరూపాయల నోట్లన్నీ కూడా ఆర్‌బీఐకు చేరుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నోటు రూ. 500 మాత్రమే.

భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు
భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.

ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?

ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement