అసలు సమస్య 50 రోజుల తర్వాతే
► నోట్ల రద్దుపై అభిషేక్ సింఘ్వీ హెచ్చరిక
►సహనం నశిస్తే సామాజిక సంక్షోభం తప్పదు
►మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దువల్ల అసలు సమస్య 50 రోజుల తర్వాత వస్తుందని ఏఐీసీసీ అధికారప్రతినిధి అభిషేక్ సింఘ్వీ హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘నోట్ల మార్పిడి కోసం 50 రోజులు ఓపిక పడితే మంచిరోజులు వస్తాయని ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారు. ప్రజలు ఇంకా ఓపిక పడుతున్నారు. సహనం నశిస్తే సామా జిక సంక్షోభం తలెత్తక తప్పదు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం రోజుకోరకంగా వ్యవహరిస్తూ, గంటకో నిర్ణయం తీసుకుంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. బాత్‌రూమ్‌కు పోరుు వచ్చేలోగా నిర్ణయాలేమైనా మారా యా.. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా.. అని జోక్‌లు వేసుకునే పరిస్థితిని కేంద్రం తెచ్చింది. ఇలాంటి నిర్ణయాలతో ప్రధాని మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు’అన్నారు.
చర్చించడానికి మోదీకి భయమెందుకు?
‘నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం జరుగుతోంది. జాతీయ ఉత్పత్తి దారుణంగా పడిపోతోంది. కేవలం 2శాతమే ఉన్న వ్యవ స్థతో 100 శాతం నగదు రహిత లావాదేవీలు ఎలాసాధ్యం? క్యాష్‌లెస్ విధానంతో అసంఘ టిత రంగ కార్మికుల పరిస్థితి ఏమిటి? దీనిపై పార్లమెంటులో చర్చించడానికి మోదీ ఎందు కు భయపడుతున్నారు? సమగ్రంగా చర్చించ డానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ, సుప్రీం కోర్టు జడ్జితో కమిటీ వేయడానికి ఎందుకు జంకుతున్నారు? సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా పంతాలకు పోతూ, మోదీ మొండిగా, అప్రజాస్వామికంగా వ్యవహరి స్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడు తున్న వారిపై కేంద్రం క్రూరంగా వ్యవహరి స్తోంది.
లోక్‌సభలో మెజారిటీ ఉన్నా... మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకంగా ఓటేస్తాయన్న భయంతో ఓటింగు పెట్టడానికి మోదీ భయ పడుతున్నారు. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలి. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిపై పోరాడుతాం. నోట్ల రద్దు విషయం బీజేపీ నేతలకు ముందుగానే తెలుసు. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ నేతల లావాదేవీలపై విచారణ జరిపించాలి’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పఠాన్‌కోట్, బురాన్ ఉదంతాలన్నీ ఇప్పుడే జరిగాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.