abhishek singhvi
-
‘ఈరోజుల్లో ట్రంప్ అంటే’.. సుప్రీం కోర్టులో సరదా ఘటన
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరిపింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా వాదనలు మళ్లీ ప్రారంభించాలని కేజ్రీవాల్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పట్టుపట్టారు. జీవించే హక్కు, స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన చాకచక్యంగా ఈ రోజుల్లో ట్రంప్ అనే పదం చాలా ప్రమాదకరంగా మారిందని చమత్కరించారు. ట్రంప్ అనే పదంపై సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు నవ్వారు.ఇక.. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది. -
గవర్నర్ పదవి రద్దు చేయాలి: అభిషేక్ సింఘ్వీ
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. అలా కానీ పక్షంలో ఎటువంటి రాజకీయలకు సంబంధం లేని ఉన్నతస్థాయి వ్యక్తులను మాత్రమే ఏకాభిప్రాయంతో నియమించాలని డిమాండ్ చేశారాయన. తాజాగా ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.‘‘ఈ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటంటే.. ప్రతీ సంస్థను కించపర్చటం, దాని విలువ తగ్గించటం. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే గవర్నర్‌ను తెలగించాలి. ఎందుకంటే ఎన్నికల ప్రకియలో ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కానీ గవర్నర్ కాదు. ప్రస్తుతం గవర్నర్ల తీరు వల్ల పరిపాలన కష్టంగా మారుతోంది. ప్రభుత్వం చేసని కొన్ని ముఖ్యమైన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు’’ అని అన్నారు.తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. మరోవైపు.. సింఘ్వీ ఇటీవల తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి
-
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ స్వింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్‌మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.అసెంబ్లీ దగ్గర రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్క, చెల్లెమ్మలకు రాఖి పండుగ శుభాకాంక్షలు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు తీసుకువచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించాం. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మహిళల రక్షణ విషయంలోను మా ప్రభుత్వం హై ప్రయారిటీ ఇస్తుంది. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు. మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ మను వెళ్ళడం వలన మన రాష్ట్రానికి అన్నివిధాల న్యాయం జరుగుతుంది. అభిషేక్ సింఘ్వీ మను రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.ఆదివారం సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ తీర్మాణం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో నా వాదన వినిపిస్తానని తెలిపారు. -
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
మార్పు కోసం మార్పా?
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు. ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్‌ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు. ఇక భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి. ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్ చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్ చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఏడాది జూన్‌లో న్యాయ కమిషన్ దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది. దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది. నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు. ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్ వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా? ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్ఎస్లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్ డిఫమేషన్ ను చేర్చడం. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్ చెప్పిన మాట నిజం! అభిషేక్ సింఘ్వీ వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి? అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ నివేదిక వచ్చే వరకు ఆగలేరా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కీలక విధాన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని మేం కోరాం. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. తదుపరి విచారణను రేపటి(గురువారం)కి వాయిదా వేశారు. చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!) -
త్వరగా ముగించేందుకు సాకులు వెదుకుతోంది
న్యూఢిల్లీ: పెగసస్ అంశంపై చర్చకు నిరాకరిస్తున్న ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను ముందుగానే ముగించేందుకు సాకులు వెదుకుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్లమెంట్లో ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వమే అడ్డుకుంటోంది. ఈ సమావేశాలను ముందుగానే ముగించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. అంతిమంగా ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి’ అని ఆయన మీడియాతో అన్నారు. పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్ నుంచి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఏ రూపంలోనైనా ప్రభుత్వ ఏజెన్సీలు సంపాదించాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోతోందన్నారు. ఒకవేళ ఆ సాంకేతికతను పొందితే ఎవరెవరిపై ప్రయోగించారో తెలపాలని అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. -
డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా భద్రతా సిబ్బంది సహా 1.15 కోట్ల ప్రభుత్వ ఉద్యోగు లకు తక్షణమే డీఏ(కరువు భత్యం) విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వేతనాలు తగ్గుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఉద్యోగుల జీవితాలతో తమషాలు చేయ వద్దని, వారి ఇబ్బందులను పట్టించు కోవాలని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి శనివారం కేంద్రాన్ని కోరారు. గత ఏడాది నిలిపివేసిన డీఏను తక్షణమే పునరుద్ధరించి, ఏడో వేతన సంఘం సిఫారసుల ప్రకారం డీఏ ఎరియర్స్‌ను చెల్లించాలన్నారు. కోవిడ్ సమ యంలో, దేశానికి సేవలందిస్తున్న 1.13 కోట్ల మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచడానికి బదులు వారి కష్టార్జితాన్ని లాగేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. సైనికులు, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి రూ.37,500 కోట్లను లూటీ చేయడం నేరమని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. చదవండి: మత్తు బానిసలు 275 మిలియన్లు! -
పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా విరాళాలు
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ మన్ కీ బాత్‌లో చెప్పిన కాసేపటికే సింఘ్వీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18సార్లు సమావేశమైన మోదీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుడుగా మోదీ అంగీకరించి తీరాలన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. పీఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్ రూ. 30 కోట్లు, పేటీఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ ఆరోపించారు. సీపీసీతోనూ బీజేపీకి అనుబంధం ! కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)తో బీజేపీకి ఎప్పట్నుంచో సత్సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. 2007 నుంచి బీజేపీ ఈ బంధాలను కొనసాగిస్తోందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా చైనాతో మంచి సంబంధాలు ఉన్నావారేనని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో 13 ఏళ్లుగా సత్సంబంధాలున్న రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదని నిందించారు. -
ఫాంహౌస్‌లోనూ నిద్రపోనివ్వం!
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనంతా అవినీతిమయమని, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులంతా బందిపోటు ముఠాలా ప్రజలను దోచుకున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ ఆరోపించారు. రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. టీఆర్ఎస్ను ఓడించి అవినీతి సొమ్మునంతా కక్కిస్తామన్నారు. ‘ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌లో కూర్చుంటానని కేసీఆర్ అంటున్నారు. ఆయన ఓటమిని ముందే అంగీకరిస్తున్నారు. ఓడాక ఫాంహౌస్‌లో నిద్రపోతామనుకుంటే కుదరదు. ప్రశ్నిస్తాం.. ఆయన అవినీతిపై నిజాలు తేలుస్తాం.. నాలుగున్నరేళ్లలో ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డారో అంత సొమ్మును కక్కిస్తాం..’అని అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్‌లతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారా డని విమర్శించారు. ‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను తుంగ లో తొక్కారు. నిధులు కొల్లగొట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించారు’అని దుయ్యబట్టారు. అమలవ్వని హామీలు.. అన్నింట్లో కమీషన్లు కేజీ టు పీజీ విద్యా విధానం అమలు చేస్తామని దాన్ని నీరుగార్చారని అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. 16 వేలకు పైగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరగలేదని.. 1,349 ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని చెప్పారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదని, 33 వేల ప్రభుత్వ జీవోలను తొక్కిపెట్టారని, వాటి చాటున మిషన్ భగీరథ, కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇష్టారీతిన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో 2 శాతం కమీషన్ తీసుకోవాలని ప్రభుత్వంలోని నంబర్ టు చెప్పారని బహిరంగంగానే ఓ మున్సిపల్ చైర్మన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక భూ కుంభకోణాలకు అంతేలేదని, ఇలాంటి కుంభకోణాలు దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు. సుజనాపై దాడులు రాజకీయ కుట్ర.. ఇక బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరిపై ఈడీ కేసులను అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. సుజనాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుజనా కంపెనీలపై ఈడీ దాడుల అంశంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తోందని అడగ్గా.. అదో రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం తనకు గిట్టని వారిపై ప్రతీకార దాడులకు దిగుతోందని అందులో భాగంగానే సుజనా కంపెనీలపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మోదీ ప్రభుత్వం తనను వ్యతిరేకించే వ్యక్తులపై కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతల కంపెనీలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని అడిగారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ‘థగ్స్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ’.. అవినీతిలో తెలంగాణ రెండో స్థాన ంలో ఉందని అభిషేక్ సింఘ్వీ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ‘థగ్స్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజ్యంలో పుత్రుడు, పుత్రిక, పరివారానిదే పెత్తనమని ధ్వజమెత్తారు. ఈ దోపిడీ కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయని, కొద్దిరోజుల్లోనే వారి నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. -
థగ్స్ ఆఫ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ భక్షకుడిలా తయారైయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితతో కుటుంబ పాలనతో తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. థగ్స్ (చీటింగ్) ఆప్ టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అన్ని రంగాల్లో మోసం చేసిందని.. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని విస్మరించారని మండిపడ్డారు. విద్యార్థులను కనీస వసతులు కల్పించకుండా కేజీ టూ పీజీ అమలు చేశామని చెప్పడానికి సిగ్గలేదా అని ఘాటుగా స్పందించారు. 1200 మంది అమరుల కుటుంబాలను ఆదుకుంటామని.. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మండిపడ్డారు. అవినీతిలో తెలంగాణ దేశంలో రెండవ రాష్ట్రంగా నిలిచిందని.. కమీషన్ల కోసమే కేసీఆర్ పథకాలను పెట్టారని వ్యాఖ్యానించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరే విధంగా పాలన అందిస్తామని సింఘ్వీ తెలిపారు. కాంగ్రెస్‌కు 66-70 స్థానాలు.. కాంగ్రెస్‌లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కనీస వివరణ అడగకుండా టీఆర్ఎస్ నుంచి తనను బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు నారాయణ రెడ్డి తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వేలోనే మహాకూటమికి 66-70 స్థానాలు వస్తాయని తేలిందని ఆయన తెలిపారు. -
కుడి ఎడమైన ఎన్నికల ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్ ఓడిపోరాదోయ్!’ అన్నట్లుగా పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రానున్న ఎన్నికలకు రణ తంత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇరు పార్టీలు తమ విధేయులను అక్కున చేర్చుకుంటూనే కొత్త వర్గాలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఇరు పార్టీలు కూడా కొంత అగమ్యగోచరంలో పడిపోతున్నాయి. ఒకప్పుడు బ్రాహ్మణ్–బణియన్ పార్టీగా ముద్ర పడిన బీజేపీ, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక వెనుకబడిన వర్గాల వారిని, షెడ్యూల్డ్ కులాల వారిని దరి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరిట వరుస సంస్మరణ కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగానే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది. షెడ్యూల్డ్ కులాల వేధింపుల నిరోధక చట్టంను సడలిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో భగ్గుమన్న దళితులు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంతో దిగివచ్చిన మోదీ ప్రభుత్వం దళితులను మెప్పించడం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఆది నుంచి పార్టీని నిలబెట్టిన అగ్ర కులాల వారు ‘ఎటూ పోలేరులే’ అనుకుని ఈ చర్యలకు పూనుకుంది. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒరుగుతుందని, ముఖ్యంగా శాశ్వతంగా రిజర్వేషన్లను ఎత్తివేస్తారని భావించిన అగ్రవర్ణాల వారు కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమకు రిజర్వేషన్లు కావాలంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. గుజరాత్లో పటేళ్లు, యూపీలో ఠాకూర్లు, మహారాష్ట్రలో మరాఠాలు, హర్యానాలో జాట్ల ఆందోళన అలాంటివే. ఎస్సీల వేధింపు చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ధరించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఎత్తివేయాలని ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాల వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు, ఎస్సీలను దూరం చేసుకోకుండానే అగ్ర వర్ణాల వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక పాలక పక్ష బీజేపీ అగమ్యగోచరంలో పడింది. అయితే అన్ని రాష్ట్రాల్లో వాజపేయి అస్థికల కళశాల ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా తిరిగి బ్రాహ్మణులను ఆకట్టు కోవచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకప్పుడు అగ్రవర్ణాలు, దళితులు, మైనారిటీల పార్టీగా పలు వర్గాల మద్దతు కలిగిన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ‘మైనారిటీల పార్టీ’గా బీజేపీ వేసిన ముద్రను చెరపేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీ వ్యతిరేకత కారణంగా మైనారిటీలు ఎలాగైనా కాంగ్రెస్ వైపే ఉంటారన్న విశ్వాసంతో అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవకాశం దొరికినప్పుడల్లా దేవాలయాలను సందర్శిస్తున్నారు. తనను తాను శివభక్తుడిగా చెప్పుకున్న ఆయన ప్రస్తుతం మానస సరోవరం యాత్రలో ఉన్నారు. ఆఖరికి రాహుల్ గాంధీ జంధ్యం ధరించే బ్రాహ్మణుడు అంటూ గతేడాది కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఓ బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణ సమాజం డీఎన్ఏ కలిసి ఉందని వ్యాఖ్యానించారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు బ్రాహ్మణ కళ్యాణ బోర్డును పార్టీ ఏర్పాటు చేస్తుందని, బోర్డు ద్వారా రుణాలు, ఉపకార వేతనాలను ఇస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో గోసంరక్షణ శాలలను ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వ్యాఖ్యానించడం, పలు రాష్ట్రాల్లో గోవధలను ముందుగా నిషేధించినది కాంగ్రెస్ ప్రభుత్వాలనేనని పార్టీ మరో సీనియర్ నాయకుడు మనీష్ తివారీ వ్యాఖ్యానించడం బ్రాహ్మణులను ఆకర్షించడంలో భాగమేనన్నది సుస్పష్టం. అయితే రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆందోళనపై స్పందించే విషయంలో అగమ్యగోచరంలో పడిపోతోంది. ఈ అంశంపై రాహుల్ గాంధీ పూర్తి మౌనం పాటిస్తుండగా, పార్టీ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆందోళనను విమర్శించాల్సిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, వారి ఆందోళనను మోదీ వైఫల్యంగా మాట్లాడారు. నేడు దేశంలో పలు వర్గాల వారు ఆందోళన చేయడానికి కారణం మోదీ వారికిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడమేనంటూ విమర్శించారు. అగ్రవర్ణాల దాడులకు గురవుతున్న దళితులు, మైనారిటీల పట్ల ఇరు పార్టీలు పరిమితంగా మాట్లాడుతున్నాయి. ఇక దేశంలో మరోపక్క వ్యవసాయం, ఆర్థిక సంక్షోభాల కారణంగా రైతులు, కార్మికులు, కర్షకులు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది విజయమో తేల్చేదే వారే. -
‘జమిలి’ రాజ్యాంగ ధిక్కారం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ యోచనను కాంగ్రెస్ ‘రాజ్యాంగ ధిక్కారం’గా పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అర్థంపర్థం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక వాదనతో ఏకకాలంలో ఎన్నికలకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ ప్రయత్నం నియంతృత్వానికి మరో ఉదాహరణ. చెప్పుకోవటానికి మంచిగా అనిపించే ఈ యోచన..ప్రభుత్వ గిమ్మిక్. ఏకకాలంలో ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగంలో కనీసం 10 సవరణలు చేయాలి. ఇందుకు మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి ఉందా?’ అని ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికలంటే ప్రభుత్వాన్ని, ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు గల హక్కును నిరాకరించటమేనన్నారు. -
ప్రియాంక కాంగ్రెస్‌లో కీలకంగా ఉంటారు కానీ..
న్యూఢిల్లీ: ప్రియాంక వాద్రా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారనీ ఇకపైనా ఆమె అదేవిధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనేందుకు ఇది సూచన మాత్రం కాదని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ముఖ్యభూమిక పోషిస్తారంటూ ముఖ్యనేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై మరో నేత అభిషేక్ సింఘ్వి వివరణ ఇచ్చారు. ‘ప్రస్తుతం ప్రియాంక పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె పాత్ర కొనసాగుతుంది. అయితే, దానర్థం ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారు, ఎన్నికల్లో పాల్గొంటారని మాత్రం కాదు’అని తెలిపారు. -
కాంగ్రెస్ నేత సింఘ్వి భార్యకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య అనితా సింఘ్వీకి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.అనితా సింఘ్వీ నీరవ్ మోదీ నుంచి రూ 6 కోట్ల విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేశారని, దీనికి సంబంధించి రూ 1.5 కోట్లు చెక్కు ద్వారా, మిగిలిన మొత్తం నగదు రూపంలో చెల్లించారని ఆరోపణలున్నాయి. నగదు రూపంలో చెల్లింపులకు సరైన ఆధారాలు చూపాలని ఐటీ అధికారులు కోరినట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీ కార్యాలయాల్లో సీబీఐ, ఈడీ జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో అనిత సింఘ్వీ ఆభరణాల కొనుగోళ్లు వివరాలున్నాయని సమాచారం. ఈ పత్రాల్లోనే లెక్కల్లో చూపిన సొమ్ము..లెక్కల్లో చూపని సొమ్ము అనే కాలమ్స్‌ను అధికారులు గుర్తించారు. పీఎన్బీలో నీరవ్ మోదీ రూ 11,300 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేతపై అనిల్ అంబానీ దావా
అహ్మదాబాద్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీపై రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ పరువునష్టం దావా దాఖలు చేసింది. తమ గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను అనిల్ అంబానీ తరఫు ప్రతినిధులు సింఘ్వీకి వ్యతిరేకంగా రూ.5000 కోట్లకు పరువునష్టం దావా వేశారు. గుజరాత్ హైకోర్టులో తమ దావాను దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సింఘ్వీ, అనిల్ అంబానీ కంపెనీకి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కంపెనీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అందుకే రూ.5000 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నాయి. గత నెలలో సింఘ్వీ ఓ సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఇటీవల ప్రభుత్వం రూ.1.88 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొన్నారు. 50 మంది కోటీశ్వరులు దాదాపు రూ.8.35 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉందన్నారు. గుజరాత్‌కు చెందిన రిలయన్స్(అనిల్ అంబానీ గ్రూప్), అదానీ, ఎస్సార్ సంస్థలు బ్యాంకులకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ రుణాలన్నింటిన్నీ జైట్లీ ఎన్పీఏగా చూపిస్తున్నారని సింఘ్వీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అనిల్ అంబానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
మోదీజీ...ఆ ఖర్చులు భరించిందెవరు..?
సాక్షి,న్యూఢిల్లీ: వాద్రా విమాన ఖర్చులను దళారీ చెల్లించాడనే ఆరోపణలను హైలైట్ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 100కు పైగా చేసిన దేశీయ, అంతర్జాతీయ పర్యటనల విమాన ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నించింది. మోదీ చార్టర్డ్ విమానాలను పలు కార్పొరేట్ సంస్థలు స్పాన్సర్ చేశాయని పేర్కొంది. రాబర్ట్ వాద్రాకు విమాన టికెట్ల కోసం మధ్యవర్తి సంజయ్ భండారి రూ 10 లక్షల కోట్లు ఇచ్చారన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జయ్ షాపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతోందని ఏఐసీసీ ప్రతినిధి అబిషేక్ సింఘ్వి అన్నారు. 2003 నుంచి 2007 వరకూ మోదీ విమాన ప్రయాణ ఖర్చులు రూ 16.56 కోట్లని ఆర్టీఐ కింద గుజరాత్ ప్రభుత్వం నుంచి తాను సేకరించిన వివరాల్లో వెల్లడైందని చెప్పారు. అయితే మోదీ చార్టర్డ్ విమానాల్లో విహరించేందుకు అయిన ఖర్చును ఎవరు చెల్లించారని దేశమంతా తెలుసుకోగోరుతోందని సింఘ్వి అన్నారు. 2007లో తాను దీనిపై ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఇంతవరకూ స్పందన లేదన్నారు.రూ 16.56 కోట్ల మేర ప్రయివేటు సంస్థలు ఇచ్చిన బహుమతిని ప్రభుత్వాధినేత ఎలా స్వీకరిస్తారని సింఘ్వి నిలదీశారు. వాద్రా ఎయిర్ టికెట్లపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ స్పందన కోరడాన్ని సింఘ్వి తోసిపుచ్చారు. ఏడేళ్ల కిందటి వ్యవహారాన్ని బీజేపీ ఇప్పుడు హైలైట్ చేస్తున్నదని వారు చెబుతున్న దళారీ ఇటీవల వరకూ మోదీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని అన్నారు. -
మీ పర్యటన ఖర్చులు ఎవరు పెట్టారు?
సాక్షి, న్యూఢిల్లీ : రాబర్ట్ వాద్రా విమాన టిక్కెట్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ దేశవ్యాప్త పర్యటనలు ఖర్చుల వివరాలను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యంగా 2003 నుంచి 2007 మధ్య కాలంలో నరేంద్రమోదీ చార్టర్డ్ ఫ్లయిట్లో వందసార్లు జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిర్వహించారని.. ఈ మొత్తం ఖర్చును ఎవరు భరించారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అప్పటి పర్యటనల ఖర్చు మొత్తం రూ.16.56 కోట్ల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఖర్చు ఎవరు పెట్టారో.. ప్రజలకు తెలపాలని ఆయన బీజేపీని డిమాండ్ చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారితో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఉన్న సాన్నిహిత్యం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో సింఘ్వి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా-సంజయ్ భండారి ఈ మెయిల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న ఈ మెయిల్స్‌నే కేంద్రం లీక్ చేస్తోందని ఆయన ఆరోపించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఇతర బీజేపీ నేతలతోమ కూడా సంబయ్ భండారీ సన్నిహితంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్ అవినీతిపరులు, దొంగల పార్టీ
భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అవినీతిపరులు, దొంగల పార్టీ అని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అవినీతిపరులతో కూడుకున్నది కావడంతో మిగతా వారిని కూడా దొంగలుగానే ఆ నాయకులు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసే తాటాకు చప్పుళ్లకు మోదీ భయపడరని, ఈ నిర్ణయంపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రశ్నే తలెత్తదన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా కమిటీ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై శనివారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధాని కావాలని కలలు గంటున్న కాంగ్రెస్ నాయకుడికి దేశం గురించి ఎలాంటి శ్రద్ధాసక్తులు లేవని పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బంగారంపై జరుగుతున్న ప్రచారాన్ని మహిళలు నమ్మవద్దని, మోదీ చర్యలతో 20 రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 5 వేలు తగ్గిందన్నారు. -
అసలు సమస్య 50 రోజుల తర్వాతే
► నోట్ల రద్దుపై అభిషేక్ సింఘ్వీ హెచ్చరిక ►సహనం నశిస్తే సామాజిక సంక్షోభం తప్పదు ►మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దువల్ల అసలు సమస్య 50 రోజుల తర్వాత వస్తుందని ఏఐీసీసీ అధికారప్రతినిధి అభిషేక్ సింఘ్వీ హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలసి గాంధీభవన్‌లో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘నోట్ల మార్పిడి కోసం 50 రోజులు ఓపిక పడితే మంచిరోజులు వస్తాయని ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారు. ప్రజలు ఇంకా ఓపిక పడుతున్నారు. సహనం నశిస్తే సామా జిక సంక్షోభం తలెత్తక తప్పదు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం రోజుకోరకంగా వ్యవహరిస్తూ, గంటకో నిర్ణయం తీసుకుంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. బాత్రూమ్కు పోరుు వచ్చేలోగా నిర్ణయాలేమైనా మారా యా.. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా.. అని జోక్‌లు వేసుకునే పరిస్థితిని కేంద్రం తెచ్చింది. ఇలాంటి నిర్ణయాలతో ప్రధాని మోదీ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు’అన్నారు. చర్చించడానికి మోదీకి భయమెందుకు? ‘నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం జరుగుతోంది. జాతీయ ఉత్పత్తి దారుణంగా పడిపోతోంది. కేవలం 2శాతమే ఉన్న వ్యవ స్థతో 100 శాతం నగదు రహిత లావాదేవీలు ఎలాసాధ్యం? క్యాష్‌లెస్ విధానంతో అసంఘ టిత రంగ కార్మికుల పరిస్థితి ఏమిటి? దీనిపై పార్లమెంటులో చర్చించడానికి మోదీ ఎందు కు భయపడుతున్నారు? సమగ్రంగా చర్చించ డానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ, సుప్రీం కోర్టు జడ్జితో కమిటీ వేయడానికి ఎందుకు జంకుతున్నారు? సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా పంతాలకు పోతూ, మోదీ మొండిగా, అప్రజాస్వామికంగా వ్యవహరి స్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడు తున్న వారిపై కేంద్రం క్రూరంగా వ్యవహరి స్తోంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా... మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకంగా ఓటేస్తాయన్న భయంతో ఓటింగు పెట్టడానికి మోదీ భయ పడుతున్నారు. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలి. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిపై పోరాడుతాం. నోట్ల రద్దు విషయం బీజేపీ నేతలకు ముందుగానే తెలుసు. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ నేతల లావాదేవీలపై విచారణ జరిపించాలి’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పఠాన్‌కోట్, బురాన్ ఉదంతాలన్నీ ఇప్పుడే జరిగాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రశ్నలకు బదులేది?
ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం సిల్చార్ (అసోం): ప్రధాని మోదీ తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తప్పుబట్టారు. కీలక అంశాలపై తన ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించుకున్నారన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రధాని ఆనందం పొందారేతప్ప అసలు విషయాన్ని దాటవేశారని శుక్రవారం అసోంలోని సిల్చార్‌లో జరిగిన సభలో విమర్శించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే పథకం, విదేశాలనుంచి నల్లధనం తీసుకురావడం, నాగా ఒప్పందం, మేకిన్ ఇండియా కింద ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారన్న ప్రశ్నలను మరోసారి గుర్తుచేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బిహార్ పరిస్థితే వస్తుందని, బీజేపీ ఎక్కడికి వెళ్లినా అశాంతిని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. తన ప్రసంగంలో రోహిత్ వేముల, కన్హయ్యకుమార్‌ల కోసం మోదీ ఒక్క క్షణం కూడా కేటాయించలేదని, దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వడం అవసరం లేదని ప్రధాని భావించార ంటూ రాహుల్ తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ భావాజాలన్ని రుద్దాలని ప్రయత్నిస్తున్నారని, దానిని ఎప్పటికీ అంగీచరించమన్నారు. మోదీకి రాహుల్ ఫోబియా: కాంగ్రెస్ న్యూఢిల్లీ: రాహుల్ ఫోబియాలో మోదీ చిక్కుకున్నారని, వ్యంగ్య ప్రసంగంతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, పేదల వ్యతిరేక విధానాలపై ఒక్కమాట మాట్లాడలేదని శుక్రవారం విలేకరుల సమావేశంలో సింఘ్వి తప్పుపట్టారు. -
'హామీ నిలబెట్టుకోకే ఉద్యమం తీవ్రరూపం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలం కావడం మూలంగానే కాపుల ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా పరిణామాలపై సోమవారం మాట్లాడిన ఆయన.. టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. పవన్ కళ్యాణ్‌తో జతకట్టి కాపుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు వారిని పట్టించుకోలేదన్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు.