
న్యూఢిల్లీ: ప్రియాంక వాద్రా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారనీ ఇకపైనా ఆమె అదేవిధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనేందుకు ఇది సూచన మాత్రం కాదని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ముఖ్యభూమిక పోషిస్తారంటూ ముఖ్యనేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై మరో నేత అభిషేక్ సింఘ్వి వివరణ ఇచ్చారు. ‘ప్రస్తుతం ప్రియాంక పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె పాత్ర కొనసాగుతుంది. అయితే, దానర్థం ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారు, ఎన్నికల్లో పాల్గొంటారని మాత్రం కాదు’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment