priyanka vadra
-
లోక్ సభ ఎంపీగా ప్రియాంక వాద్రా ప్రమాణస్వీకారం
-
ప్రాణం పోయినా బీజేపీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోము
-
‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’
సాక్షి, చండీగఢ్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు పెట్రోల్ బాంబు వంటి వారని హర్యానా హోం మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాహుల్, ప్రియాంకలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా 144 సెక్షన్ విధించి ఉండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా బీజేపీ హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్ చేశారు. చదవండి : రాహుల్‌కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు Beware of @priyankagandhi and @RahulGandhi as they are live Petrol Bombs where ever they go they ignite fire and cause loss to Public Property. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 24, 2019 -
చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మనీష్ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. -
అమేథీలో అభివిద్ధిని బీజేపీ అడ్డుకుంది: ప్రియాంక
-
పార్టీ ఆదేశాల మేరకే బరిలో దిగలేదు: ప్రియాంక
-
ప్రియాంక ఫ్యాక్టర్
-
మాటకు మాట
-
రాహూల్ భారతీయుడని యావత్ దేశానికి తెలుసు: ప్రియాంక
-
అమేథీలో రాహుల్ నామినేషన్
అమేథీ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ రోడ్‌షోలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి ఇద్దరు పిల్లలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా రాహుల్ వెంట ఉన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలో తల్లి సోనియాగాంధీ పాల్గొనలేదు. అనంతరం అమేథీ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తనయుడు రాహుల్ వెంట ఆమె ఉన్నారు. నామినేషన్ సందర్భంగా అమేథీ పట్టణం కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, రాహుల్, ప్రియాంక కటౌట్లతో నిండిపోయింది. ఎండను సైతం లేక్కచేయని కార్యకర్తలు అమేథీలో రాహుల్, ఆయన కుటుంబసభ్యులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రహదారికి రెండు వైపులా ఎదురు చూస్తున్న అభిమానులకు రాహుల్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా అభిమానులు ఓపెన్ టాప్ వాహనంలో ఉన్న రాహుల్ తదితరులపై పూలవర్షం కురిపించారు. అమేథీ మాకు పవిత్ర భూమి అమేథీ నియోజకవర్గం తమ తండ్రి(రాజీవ్‌గాంధీ) కర్మభూమి, తమ కుటుంబానికి పవిత్రమైన చోటు అని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ నామినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్లో..‘ కొన్ని అనుబంధాలు హృదయపూర్వకమైనవి. మా సోదరుని నామినేషన్ దాఖలు సందర్భంగా మా కుటుంబం మొత్తం హాజరయింది. ఇది మా తండ్రి కర్మభూమి, మాకు పవిత్రమైన ప్రాంతం’ అని తెలిపారు. అమేథీలో ద్విముఖ పోరు ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. బీజేపీ తరఫున స్మృతి ఇరానీ గురువారం నామినేషన్ వేయనున్నారు. పొరుగునే ఉన్న రాయ్‌బరేలీ సీటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు. -
తల్లితోపాటు ఈడీ ఎదుట వాద్రా
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, అతని తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని వాద్రాపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తన భర్త, అత్తతోపాటు వచ్చి జైపూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద వారిని వదిలివెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ముందుగా రాబర్ట్ వాద్రాను, కొద్దిసేపటి తర్వాత మౌరీన్‌ను విచారణ నిమిత్తం లోపలికి పిలిచారు. సుమారు 9 గంటలపాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా హాజరుకావాల్సి ఉం టుందని ఆయనకు తెలిపారు. బికనీర్‌లో 2015లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి తహశీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కొనుగోళ్లు చేపట్టిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో గల సంబంధాలపైనా వాద్రాను ఈడీ ప్రశ్నించిందని సమాచారం. ఈ కేసులో ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ రాబర్ట్ వాద్రా స్పందించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై స్పందించిన రాజస్తాన్ హైకోర్టు.. విచారణకు సహకరించాలంటూ వాద్రాతోపాటు ఆయన తల్లి మౌరీన్‌ను ఆదేశించింది. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ ఈడీకి స్పష్టం చేసింది. -
రాహుల్ గాంధీతో కమల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ బుధవారం భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయాల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రియాంక వాద్రాతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యంను రిజిస్టర్ చేయించడం కోసం మంగళవారం ఎన్నికల సంఘం అధికారులను కూడా కమల్ కలిశారు. కమల్‌తో భేటీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈరోజు ఢిల్లీలో కమల్ హసన్‌తో భేటీ అవడం సంతోషంగా ఉంది. మా రెండు పార్టీలకు సంబంధించిన విషయాల గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి కూడా చర్చించామని’ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Enjoyed meeting @ikamalhaasan in Delhi today. We discussed a wide range of issues concerning our two parties, including the political situation in Tamil Nadu. pic.twitter.com/cPWQd8w7YY — Rahul Gandhi (@RahulGandhi) June 20, 2018 -
ప్రియాంక కాంగ్రెస్‌లో కీలకంగా ఉంటారు కానీ..
న్యూఢిల్లీ: ప్రియాంక వాద్రా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారనీ ఇకపైనా ఆమె అదేవిధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనేందుకు ఇది సూచన మాత్రం కాదని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ముఖ్యభూమిక పోషిస్తారంటూ ముఖ్యనేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై మరో నేత అభిషేక్ సింఘ్వి వివరణ ఇచ్చారు. ‘ప్రస్తుతం ప్రియాంక పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె పాత్ర కొనసాగుతుంది. అయితే, దానర్థం ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారు, ఎన్నికల్లో పాల్గొంటారని మాత్రం కాదు’అని తెలిపారు. -
ప్రచారానికి ప్రియాంక
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా కన్నడనాట ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. బెంగళూరుతో పాటు పలు ముఖ్య ప్రాంతాల్లో ఆమె ప్రచార సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 1978లో మాజీ ప్రధాని, ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ చిక్కమగళూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయకేతనం ఎగురవేయడం తెలిసిందే. అందుకే అక్కడి నుంచే ప్రియాంక ప్రచారం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి రావాలని ప్రియాంకను ఆహ్వానించామని, తేదీలను ఖరారు చేయాల్సి ఉందని కాంగ్రెస్ నాయకుల చెబుతున్నారు. సోనియా, మన్మోహన్ కూడా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటి ఖుష్బూ తదితరులు కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. -
రాహుల్‌పై హర్ధిక్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో రాహుల్ నాయకుడే కాదని తెలిపాడు. అదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ హర్ధిక్ ఆహ్వానిస్తున్నాడు. ‘ ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ, అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయం’ అని శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన హర్ధిక్ పేర్కొన్నాడు. ఇక 2019 ఎన్నికల్లో పటీదార్ అనమత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) తరపున పోటీ చేయబోనని హర్ధిక్ స్పష్టం చేశాడు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్ధిక్ పోటీ చేయలేదు. 24 ఏళ్ల హర్ధిక్‌కు వయోపరిమితి( పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలి) కారణంగానే దూరంగా ఉన్నాడని.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హర్ధిక్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తననెవరూ అడ్డుకోలేరని చెబుతూ.. ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపాడు. -
అమ్మ స్థానంలో ప్రియాంక.. క్లారిటీ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు సోదరుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరిస్తున్న వేళ.. ప్రియాంక గాంధీ గురించి ఓ ఆసక్తికర కథనం జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలి నుంచి ఆమె కూతురు ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారనేది దాని సారాంశం. దీనిపై ఎట్టకేలకు ప్రియాంక రాబర్ట్ వాద్రా స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కూడా రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీనే పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఆ స్థానంలో నేను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అక్కడ మా అమ్మే మళ్లీ పోటీ చేయబోతున్నారు’’ అని ప్రియాంక చెప్పారు. తాను చూసిన శక్తివంతమైన మహిళల్లో సోనియా ఒకరని.. అలాంటి వ్యక్తి సేవలు పార్టీకి చాలా కాలం అవసరం ఉందని భావిస్తున్నానని ప్రియాంక చెప్పారు. కాగా, సోనియాకు అనారోగ్యంగా ఉన్న సమయంలో రాయ్ బరేలి నియోజక వ్యవహారాలను ప్రియాంకనే చూసుకునేవారు. కేవలం అధ్యక్ష పదవి నుంచే తాను తప్పుకుంటాను తప్ప.. రాజకీయాల నుంచి కాదని సోనియా గాంధీ నిన్న స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోట... తొలిసారి రాయ్ బరేలిలో కాంగ్రెస్ తరపున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేయగా.. భారతీయ లోక్ దల్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో 1977లో ఓడిపోయారు. 1996, 1998లో బీజేపీ రాయ్ బరేలిని కైవసం చేసుకుంది. చివరకు 1999లో కాంగ్రెస్ తొలిసారిగా ఇక్కడ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కంచుకోటగా మార్చుకుంది. ఇక సోనియాగాంధీ 2004లో రాయ్ బరేలిలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే గెలుస్తూ వస్తున్నారు. 2014లో సైతం సోనియా విజయం సాధించి ప్రస్తుతం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
దీపావళి తరువాత పట్టాభిషేకం..?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దీపావళి తరువాత పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అందుకుంటారని యువనేత సచిన్ పైలెట్ ఆదివారం ప్రకటించారు. రాజకీయాల్లో వ్యక్తులు సాధించిన విజయాలే అతని సమర్థతకు గాటురాయి అని అని ఆయన చెప్పారు. ఇంటి పేరు అనేది.. ఆయా నేతలకు భారం కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతం పార్టీని ఉపాధ్యక్షస్థానం నుంచి నడిపిస్తున్న రాహుల్ గాంధీ.. దీపావళి తరువాత.. అధ్యక్ష బాధ్యతలు తీసుకుని.. పార్టీని గాడిన పెడతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీ గాడి తప్పిన ప్రతిసారీ.. ఒక గాంధీ వారసుడు బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించారని.. ఇదే సెంటిమెంట్ రాహుల్ గాంధీ విషయంలో మరోసారి రుజువు అవుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా వాద్ర కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని సచిన్ పైలెట్ తెలిపారు. అయితే ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం.. రాకపోవడం అనేది ఆమె వ్యక్తిగత విషయం అని అన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలు అత్యంత సహజమని.. అదేమంత నేరం కాదని చెప్పారు. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చే వారికి ప్రజా సేవపైన పూర్తి అవగాహన ఉంటుందని అన్నారు. -
ప్రియాంకా, డింపుల్ ఫొటో పక్కపక్కనే..
అలహాబాద్: సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయనున్నాయా? తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య దాదాపు పొత్తు కుదిరినట్లేనా? అంటే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అలహాబాద్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి హసీబ్ అహ్మద్ ఏర్పాటుచేసిన పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఫొటోలు చేర్చారు. అతడి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో కూడా ఈ ఫ్లెక్సీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్లలో 'ఉత్తరప్రదేశ్‌లోకి మతశక్తులు ప్రవేశాన్ని అడ్డుకునేందుకు మేమంతా ఒక్కటయ్యాం. ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్‌కు సుస్వాగతం' అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాశారు. ప్రియాంక, డింపుల్‌తోపాటు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రమోద్ తివారీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఫొటోలు కూడా చేర్చారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన హసీబ్ వివరణ ఇస్తూ.. 'ఈ పోస్టర్ ద్వారా కమ్యునల్ శక్తులను అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని చెప్పాలనుకున్నాను. పునర్వైభవాన్ని తెచ్చేందుకు అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో తప్పకుండా ఆలోచించాలి. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే వెళితే మా పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా రెండు పార్టీలు కలిసి పనిచేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు చేయొచ్చు' అని చెప్పాడు. కాగా, దీనిపై యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముకుంద్ తివారీ స్పందిస్తూ 'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేం పాటిస్తాం. పార్టీ విజయం కోసం పనిచేస్తాం' అని అన్నారు. మరోపక్క, వీరి కలయికపై బీజేపీ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ ఒంటరిగా పోటీ చేస్తే బతకదనే విషయం కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసుకాబట్టే సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీలకు ఈసారి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని, బీజేపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
వాళ్లు మాకు గట్టి ప్రత్యర్థులే: ప్రియాంక
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమకు గట్టి ప్రత్యర్థేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తమకు ముఖ్యమైన ప్రత్యర్థి అయి తీరుతుందని ఆమె చెప్పారు. తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలను అధిగమిస్తుందన్న ధీమాను ప్రియాంక వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కష్టాలు ఎదుర్కొందని, అయినా వాటి నుంచి బయటపడిందని, ఇప్పుడు కూడా ఇలాగే కష్టాల నుంచి బయట పడటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
పార్లమెంట్‌కు ప్రియాంక పుత్రుడు
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ తన స్నేహితులతో బుధవారం పార్లమెంట్‌ను తిలకించాడు. సందర్శకుల గ్యాలరీలో నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. సోనియాగాంధీ మనవడైన రైహాన్... స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చాడు. ఆ తర్వాత సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం గాంధీ కార్యాలయంలో కొద్దిసేపు గడిపాడు. ఈ సందర్భం గా రైహాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎంతో బాగుందన్నాడు. ఇదిలాఉంచితే ప్రియాంక గాంధీ తన కుమారుడు రైహాన్, కుమార్తె మిరాయాలను లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ తన వెంట తీసుకెళ్లారు. -
'చేతి' లో అంతఃపుర కుట్ర
రాహుల్ ఒంటికి రాజకీయ అధికారం ఏ మాత్రం సరిపడదని దిగ్విజయ్ ఎప్పుడు నిర్ధారణకు వచ్చారు? 2014 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రచార ఘట్టంలో ఆయన మీద కాంగ్రెస్ అపారమైన ఆశలు పెట్టుకున్న సమయంలోనే ఇలాంటి నిర్ధారణకు వచ్చేశారా? కాంగ్రెస్‌కు కడు దీనమైన పరిస్థితిని కల్పించిన ఫలితాలు చూశాక వచ్చారా? ప్రజాస్వామిక వ్యవస్థలో ఎదురయ్యే ఒక కఠోర వాస్తవం ఏమిటంటే, ఒకసారి ఒక ప్రకటన చేస్తే, దాన్ని చెరిపివేయడం ఇక బ్రహ్మతరం కూడా కాదు. కాబట్టే ఉత్తమ రాజకీయవేత్తలు వారు ఎంతో జాగ్రత్తగా చెప్పిన విషయానికి, వారు చెప్పకుండా వదిలిపెట్టిన దానితోనే ఓ ముసుగు కప్పి ఆసక్తి రేకెత్తేటట్టు అంతే జాగరూకత వహిస్తారు. ఇక ఉత్తమోత్తములైన రాజకీయవేత్తలైతే తాము చెప్పిందాన్ని పత్రికా రచయితలు విశ్లేషించడానికి ఉబలాటపడేటట్టు చేయవచ్చు. మాటలాడడం తప్ప, రోజంతా పొద్దు పుచ్చడానికి మరో పనేదీ లేకపోతే, కాంగ్రె స్లో కాకలు తీరిన దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకుడి నోటి నుంచి కూడా, అభేద్యమైన అన్ని అవరోధాలను దాటుకుని కొన్ని అప్రియ సత్యాలు బయటకు ఉరుకుతూ ఉంటాయి. రాజకీయాధికారమంటే వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధీ ఒంటికి ఏమా త్రం సరిపడదంటూ ఆయన ఇచ్చిన ప్రక టన సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే వెలు వడి ఉంటుంది. తప్పుని ఎప్పుడైనా సరిదిద్దుకోవచ్చు. కొన్ని మినహాయింపులతో అబద్ధం సంగతి కూడా అంతే. అవి వాటికవే సమసిపోతాయి కూడా. కానీ తెలిసో తెలియకో సత్యాన్ని ప్రజలంతా చర్చించుకునే విధంగా వదిలిపెట్టి ఆ తరువాత నాలుక్కరుచుకుని ఎంత ప్రయత్నించినా మళ్లీ వెనక్కి లాక్కుని రావడం సాధ్యం కాదు. రాహుల్‌గాంధీకి రాజకీయాలలో మహాత్మా గాంధీలా అవతరించే ఉద్దేశాలేమీ లేనపుడు, కాంగ్రెస్ పార్టీ తన భావి ఆశలన్నింటినీ ఆయన మీదే ఎందుకు పెట్టుకున్నట్టు? ఇది ఎవరికైనా వెంటనే వచ్చే ధర్మసం దేహం. అసలు రాహుల్ ఒంటికి రాజకీయ అధికారం ఏ మాత్రం సరిపడదని దిగ్విజయ్ ఎప్పుడు నిర్ధారణకు వచ్చారు? 2014 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రచార ఘట్టంలో ఆయన మీద కాంగ్రెస్ అపారమైన ఆశలు పెట్టుకున్న సమయంలోనే ఇలాంటి నిర్ధారణకు వచ్చేశారా? కాంగ్రెస్‌కు కడు దీనమైన పరిస్థితిని కల్పిం చిన ఫలితాలు చూశాక వచ్చారా? లేకపోతే, ఎన్నికల సమరం మధ్యలో విశ్రాంతి కోసం రాహుల్ గాంధీ పరుగెట్టిన మరు క్షణంలో ఇలాంటి నిర్వేదానికి దిగ్విజయ్ వచ్చారా? లేదంటే అసలు ఓటర్లతో రాహుల్ గాంధీ మమేకం కాలేకపోయిన పుడు ఈ జ్ఞానోదయం అయిందా? ఇతరులు ఎవరినీ అడగలేరు కనుక చతికిలపడిన కాంగ్రెస్‌వారు తమని తామే ప్రశ్నించుకుంటు న్నారు- రాహుల్ గాంధీ ఇంత కంటే మెరుగైన రీతిలో వ్యవహరిం చగలరని అనుకోవడానికి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా? తన కవి హృదయం ఎదుటివారికి బోధపడే విధంగా చేసుకుని, రాజ కీయాల గురించి ఆలోచించగలిగే మనిషిగా ఆయన తనను తాను మలుచుకోగలరా? కానీ, రాహుల్ మాత్రం ఇంతవరకు ఏంటినా నుంచి సంకేతాలు తెగిపోయిన రేడియోలా మౌన ముద్ర దాల్చడానికి పరిమితమయ్యారు. త్వరలోనో, సంవత్సరంలోనో, లేదా ఆ తరువాతే గానీ జరిగే ఎన్నికలేమీ లేవు. ఉన్నా అవన్నీ విపక్ష జడత్వంతో ఉంటాయి. ఇంతలో తెరమరుగు కావడమనే ప్రమాదం ఉంది. ఒకవేళ రాహుల్‌కు అధికార రాజకీయాల పట్ల ఆసక్తి లేకుంటే, ఆయన దిగ్మండలంలో మరో రాజకీ యం ఏదీ లేదు కూడా. అంటే వెల్లకిలా శయనించాలని రాహుల్ గాంధీ గట్టిగా ఆకాంక్షిస్తున్నారన్నమాట. రాహుల్ గాంధీ రాజకీయ జీవితం నుంచి వైదొలగి, తన స్థానాన్ని సోదరి ప్రియాంక వాద్రాకి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీలో సంతోషించే వారి సంఖ్య పెరుగుతుందన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబ సంస్థగా చెలామణిలో ఉంది కాబట్టి, సదరు కుటుంబం బయట నుంచి కొత్త నాయకుడు ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఇప్పుడు పార్టీ ఎదురు చూడడం సాధ్యం కాదు. అయితే తిరస్కరించడానికి వీల్లేని రీతిలో వర్ధిల్లుతున్న గుసగుసలు కొన్ని కాంగ్రెస్ వారిలో ఉత్కంఠకు కారణమవుతున్నాయి. అందుకే కొందరు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అమాయకంగా చేసినవి కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ వాణిగా, పార్టీని ముందుండి నడిపించే నేతగా ప్రియాంకకు పట్టం కట్టే దృశ్యాన్ని వీక్షించడానికీ, పార్టీని పునర్ నిర్మించాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకునే వీలు కల్పిస్తూ రాహుల్‌ను ప్రవాసానికి అనుమతించడానికీ సంబంధించిన దృశ్య మాలికను చూపించే అంతఃపుర కుట్ర ఇప్పటికే ఆరంభమైందనీ, దిగ్విజయ్ వ్యాఖ్యలు దీనినే సంకేతిస్తున్నాయని పార్టీలో కొందరు భాష్యం చెప్పేవరకు వెళ్లారు. జమీందారీ విధానం మీద పరిశోధన చేసిన ఏ చరిత్ర పరిశోధకునికైనా కాంగ్రెస్ సంక్షోభం కరతలామలకమంటే అతిశయోక్తి కాదు. వేరే ఎక్కడో ఉండి, జమీందారీ వ్యవహారాలను చక్కబెట్టాలనుకునే భూస్వామి గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది కేవలం భౌతికంగా గైర్హాజరు కావడం గురించిన ప్రశ్న ఒక్కటే కాదు. నిజానికి అంశం కూడా ఇందులో ఉందనుకోండి. రాహుల్ గాంధీకి విదేశాలకు వెళ్లాలని ఉంది. అందుకే ఇండియాలో ఉన్నప్పటికీ ఆయన భౌతికంగా గైర్హాజరైనట్టే. నాయకుడంటే పార్టీకీ, క్రింది శ్రేణి కార్యకర్తల వరకు అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఘోర పరాజయం తరువాత ఇది మరింత అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, పునర్ వైభవం సంగతి దేవుడెరుగు, అసలు బతికి బట్టకడితే చాలు అన్నట్టే ఉంది. విజయంలోనే కాదు, ఓటమి సమయంలోనూ నాయకుడు అవసరమే. అప్పుడే పార్టీని ముందుండి నడిపించగలరు. సలహాదారులు వాళ్ల స్థానాలలో ఉంటారు. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉండవలసిన చోట ఉంటుంది. అయితే అగ్రశ్రేణి నాయకత్వం చతికిల పడితే ఇవేమీ సాధ్యం కాదు. ఏమీ జరగదు. కాంగ్రెస్ ప్రయోజనాలనే గుండె అంతా నింపుకున్న దిగ్విజయ్ వంటి వారి అంతరంగం ఇదే కావచ్చు. బహుశా రాహుల్ ఆత్మతృప్తి తత్వంలో పడినట్టు ఉన్నారు. దీని సమర్థకులు దీనికీ ఉన్నారు. రెండేళ్లు కదలకుండా కూర్చో. ప్రస్తుత ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయే వరకు ఓపిగ్గా వేచి ఉండు. అప్పుడే నేను రక్షకుడిని అంటూ ధీరత్వం ప్రదర్శించు- అంటుంది ఈ తత్వం. ఓటర్లు కూడా అలాంటి ఆత్మ తృప్తి పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి తత్వం అంతగా రాణించదని చెప్పే ఉదంతాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు, ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి పొంచి ఉన్నాయి. మమతా బెనర్జీ, జయలలిత వంటి నాయకురాళ్లు ఓటమిని ఎదర్కొన్నా, మళ్లీ పోరాడారు. వాళ్లు ఎప్పుడూ యుద్ధభూమిని విడిచిపెట్టి పోలేదు. దిగ్విజయ్ సింగ్ ఇద్దరితో మాట్లాడారు- ఒకరు ప్రజలు, రెండు కాంగ్రెస్‌ను గుప్పిట్లో పెట్టుకున్న కుటుంబంతో. ఆయన మార్పు గురించి మాట్లాడడం లేదు. కానీ ఎక్కడో ఉన్న భూస్వామి పనులు జరిగేటప్పుడు పొలం దగ్గర ఉండాలని కోరుతున్నారు. అయినా జమీందారీ వ్యవస్థ శాశ్వత ఒప్పందం మీద ఆధారపడి ఉంది కాబట్టి, భూస్వామిని మార్చడం కూడా అంత సులభం కాదు. అయితే భూస్వామి నిర్లక్ష్యం చేసిన జమీన్లు భ్రష్టుపట్టాయి. మాజీ సంస్థానాధీశుడు కాబట్టి దిగ్విజయ్‌సింగ్‌కు ఈ అంశం బాగా తెలుసు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
ప్రియాంకా.. ఇక నీవే దిక్కు!!
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణంగా.. కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త నాయకత్వం కోసం అర్రులు చాస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణమైన ఫలితాలు రావడం, దేశవ్యాప్తంగా వచ్చిన ఆధిక్యాల్లో కనీసం అర్ధసెంచరీ కూడా చేరుకోలేకపోవడం లాంటి పరిణామాలు చూసి పూర్తిగా నీరుగారిపోయింది. పార్టీలో యువరక్తం ఏదైనా మ్యాజిక్ చేస్తుందనుకుంటే.. రాహుల్ గాంధీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఆయన పేలవమైన ప్రసంగాలు చూసి సొంత పార్టీ కార్యకర్తలే నీరసించిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే ఇక దేశంలోనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందన్న భయం ఆ పార్టీ నాయకులకు మొదలైంది. అయితే.. గాంధీ-నెహ్రూ కుటుంబం తప్ప మరొకరి నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించలేని ఆ పార్టీ, ఇప్పుడు మళ్లీ వారసులే రావాలంటూ ఆహ్వానిస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ ముమ్మూర్తులా నాయనమ్మను పోలి ఉండటంతో ఇకమీదట ఆమే పార్టీ పగ్గాలను చేపట్టాలని పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు కోరుతున్నారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంకా వాద్రా ప్రసంగాలు వెయ్యిరెట్లు బాగుండటం.. ఇలాంటి కారణాలతో ప్రియాంకను ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోపే ఆమె పార్టీ పగ్గాలను చేపడితే.. ఈలోపు కాంగ్రెస్‌కు ఎంతోకొంతమేర జవసత్వాలు అందిస్తారని భావిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి సోనియాగాంధీ ఎటూ నాయకత్వ బాధ్యతలు చేపట్టే పరిస్థితిలో ఉండకపోవచ్చని, రాహుల్ గాంధీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే ఉంటుందని అంటున్నారు. -
ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు?
ప్రియాంకపై వెంకయ్య ధ్వజం సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాతో ప్రియాంక వాద్రా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నరేంద్రమోడీపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం విజయవాడలో ఒక హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మోడీ గాలి వీస్తోందని.. కాంగ్రెస్‌కు సెలవు చీటీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్చౌహాన్లు అవసరమైతే తృతీయ ప్రత్యామ్నాయంతో కలుస్తామని చెప్పడాన్నిబట్టే.. వాళ్లు గెలవ లేరని తేలుతోందని వెంకయ్య ఎద్దేవా చేశారు.