సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా కన్నడనాట ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. బెంగళూరుతో పాటు పలు ముఖ్య ప్రాంతాల్లో ఆమె ప్రచార సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 1978లో మాజీ ప్రధాని, ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ చిక్కమగళూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయకేతనం ఎగురవేయడం తెలిసిందే. అందుకే అక్కడి నుంచే ప్రియాంక ప్రచారం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి రావాలని ప్రియాంకను ఆహ్వానించామని, తేదీలను ఖరారు చేయాల్సి ఉందని కాంగ్రెస్ నాయకుల చెబుతున్నారు.
సోనియా, మన్మోహన్ కూడా
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటి ఖుష్బూ తదితరులు కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment