కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో ప్రియాంకకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో పలువురు నేతలు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తున్నారు. పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ రాహుల్‌ను సమర్ధించారు. పార్టీ నేతగా రాహుల్ సమర్ధుడు..2019లో మిత్రపక్షాల వెన్నుదన్నుగా రాహుల్ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతా’రని సిద్ధూ వ్యాఖ్యానించారు.
తన ఒంట్లో రక్తం ప్రవహించే వరకూ తాను రాహుల్ వెన్నంటి ఉంటానని చెప్పుకొచ్చారు.మరోవైపు డీవి శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సైతం రాహుల్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఎన్నికల్లో రాహుల్ చెమటోడుస్తున్నా స్ధానిక నాయకత్వం ఓట్లుగా మలుచుకోలేకపోవడం వంటి కారణాలతో తాము ఓటమి పాలవుతున్నామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment