జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ (ఫైల్‌పోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళితో రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో జేడీ(ఎస్) మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి బెంగళూర్‌లో మకాం వేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో మంతనాలు జరపుతున్నారు. దేవెగౌడ నివాసంలో భేటీ జరుగుతోంది. మీరు సూచించిన వారికే సీఎం పదవి ఇస్తామని దేవెగౌడకు కాంగ్రెస్ నేతలు ఆఫర్ చేసినట్టు సమాచారం.
బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుండా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదిస్తూ దేవెగౌడతో వారు సంప్రదింపుల్లో నిమగ్నమయ్యారు. కాగా, హైదరాబాద్ కర్ణాటక, బాంబే కర్ణాటక, కోస్తా, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా, బెంగుళూర్ సిటీలో కాంగ్రెస్, మైసూరు ప్రాంతంలో జేడీ(ఎస్) ముందంజలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment