HD Deve Gowda
-
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్‌పై మరో లుక్అవుట్ నోటీసు
బెంగళూరు: అసభ్య వీడియోల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శనివారం దర్యాప్తు చేట్టింది. మరోవైపు..ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై రాష్ట్ర హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర మరోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.‘ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణలకు లుక్అవుట్ నోటీసులు పంపించాం. హెడ్డీ రేవణ్ణ విదేశాలను వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అందుకే రెండోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం. వీటిని శుక్రవారమే జారీ చేశాం. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది’ అని హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర తెలిపారు. ఇప్పటికే ఒకసారి లుక్ అవుట్ నోటీలు జారీ చేయగా..దర్యాప్తు బృందం ముందు హాజరుకావడానికి సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి నోటీసులు పంపించారు.ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళపై లౌంగిక దాడులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయనకు సంబంధించినగా కొన్ని అసభ్య వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన అనంతరం ప్రజ్వల్ ఇండియా విడిచి విదేశాలకు వెళ్లారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరుతున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అసభ్య వీడియోల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.మరోవైపు.. ఈ వ్యవహారంలో బాధితులకు తగిన సాయం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ‘ న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధిత మహిళలు సంఘీభావం తెలపటానికి అర్హులు. ఈ క్రూరమైన నేరాలకు కారణమైన పార్టీలను చట్టం ముందకు తీసుకురావటం మన సమిష్టి బాధ్యత’అని రాహుల్ గాంధీ అన్నారు. -
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్‌పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్‌సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
జేడీఎస్ అధినేత దేవెగౌడ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి ఆగ్రహం
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాగా కేరళలో పినరయి విజయన్ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్ కేరళ యూనిట్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు. కేరళ యూనిట్ కూడా సమ్మతించింది ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్‌కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు. కుమారస్వామిని సీఎం చేసేందుకే.. ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్ ఖండించారు. జేడీఎస్ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం జోక్యం చేసుకోం కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు(ఎల్డీఎఫ్) జెడీఎస్ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. కేరళలో వామపక్ష పార్టీతోనే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే కె కృష్ణన్‌కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
చీలిక దిశగా జేడీ(ఎస్)?
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) చీలిక దిశగా సాగుతున్నట్టు కని్పస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆయన నిర్ణయాన్ని పార్టీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సి.ఎం.ఇబ్రహీం బాహాటంగా వ్యతిరేకించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో తాను చేరబోయేది లేదని ఆయన సోమవారం కుండబద్దలు కొట్టారు. పైగా తమ వర్గమే సిసలైన జేడీ(ఎస్) అని ఆయన చెప్పుకొచ్చారు! ‘‘దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో జట్టు కట్టాలనుకుంటే అది వారిష్టం. మేం మాత్రం అందుకు మద్దతిచ్చేదే లేదు’’ అని స్పష్టం చేశారు. తద్వారా పార్టీలో చీలిక తప్పదని సంకేతాలిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కర్ణాటక విభాగం విషయమై ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు తనకు సర్వాధికారాలూ ఉన్నాయని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తులను వ్యతిరేకిస్తూ పొరుగు రాష్ట్రాల్లో ఎందరో నేతలు పార్టీని వీడారని దేవెగౌడకు ఆయన గుర్తు చేశారు. కనుక బీజేపీతో పొత్తు యోచన మానుకోవాలని సూచించారు. ‘‘జేడీ(ఎస్) ఎప్పటికీ ఎన్డీఏతో కలవరాదనేదే మా తొలి నిర్ణయం. ఇక ఈ పొత్తుకు దేవెగౌడ అస్సలు అనుమతించరాదన్నది మా రెండో నిర్ణయం’’ అని పార్టీ నేతలతో భేటీ అనంతరం ఇబ్రహీం మీడియాకు తెలిపారు. -
దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు. ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
ఢిల్లీ చేరుకున్న జో బైడెన్.. తొలిసారి భారత్‌లో పర్యటన
updates.. తొలిసారి భారత్ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బైడెన్‌కు విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. తొలిసారి భారత్‌లో జోబైడెన్ పర్యటిస్తున్నారు. ఐటిసి మౌర్య హోటల్లో బస చేయనున్నారు జో బైడెన్. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి అమెరికా అధ్యక్షుడు బయలుదేరారు. తన నివాసంలో జో బైడెన్‌కు మోదీ ప్రైవేటు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ అనంతరం ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారతదేశంలో జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం.. ప్రధాని, యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఎజెండాలో ప్రధాన అంశాలు ►జీ 20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | G 20 in India | South African President Cyril Ramaphosa arrives in Delhi for the G 20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/3OKiXtJVhi — ANI (@ANI) September 8, 2023 ►రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా జీ20 సదస్సుకు లావ్రోవ్ హాజరవుతున్నారు. ►ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఘట్టర్స్‌కు గన స్వాగతం ►ఢీల్లీలో అర్జంటీనా ప్రెసిడెంట్ అల్బర్ట్ ఫెర్రాండెజ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు ఘన స్వాతం పలికారు. ► జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఢిల్లీకి చేరుకున్నారు #WATCH | G 20 in India | Japanese Prime Minister Fumio Kishida arrives in Delhi for the G 20 Summit pic.twitter.com/9q5I0FhwHE — ANI (@ANI) September 8, 2023 ►రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టులోఆయన భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రేపు ప్రధాని మోదీతో రిషి సునాక్ ధ్వైపాక్షిక భేటీ కానున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు విచ్చేశారు రిషి. అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అశ్వనీ చౌబే ► యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజలీ అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani arrives in Delhi for the G20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/oEUI6gB57G — ANI (@ANI) September 8, 2023 ► జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత్ చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. #WATCH | G 20 in India | Cultural dance performance at Delhi airport to welcome Italian Prime Minister Giorgia Meloni, who arrived to attend the G20 Summit, earlier today. pic.twitter.com/ZZHsn4lukZ — ANI (@ANI) September 8, 2023 ► మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు.. జెట్ డీల్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. ► ప్రధాని మోదీ శుక్రవారం తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. మారిషస్ నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. ► ఇక, శనివారం జీ-20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ► ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాని మోదీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో కొంతసేపు ముచ్చటించనున్నారు. ► తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్, ఈయూ/ఈసీ (యూరోపియన్ కమిషన్), బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Prime Minister Narendra Modi to hold more than 15 bilateral meetings with world leaders. On 8th September, PM will hold bilateral meetings with leaders of Mauritius, Bangladesh and USA. On 9th September, in addition to the G20 meetings, PM will hold bilateral meetings with the… pic.twitter.com/OAGVTBjTyx — ANI (@ANI) September 8, 2023 ►జీ20 సదస్సు కోసం శుక్రవారం ఉదయం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. #WATCH | Argentina President Alberto Fernández arrives in Delhi for the G20 Summit. He was received by MoS for Steel and Rural Development, Faggan Singh Kulaste. pic.twitter.com/hWTmnMb9Ov — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్న శనివారం విందు కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు హెచ్డీ దేవేగౌడ, మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం అందింది. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆయన ఆఫీసు వర్గాలు తెలిపాయి. ► ఇక, విందు కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని దేవేగౌడ.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆరోగ్య కారణల రీత్యా తాను హాజరు కాలేపోతున్నట్టు వెల్లడించారు. అయితే, జీ20 సమావేశాలు సక్సెస్ కావాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. "I will not be attending the G20 dinner organised by the Hon. President of India Draupadi Murmuji, on 09 September 2023, due to health reasons. I have already communicated this to the government. I wish the G20 summit a grand success," tweets Former Prime Minister HD Deve Gowda https://t.co/pCl3dCxkY4 pic.twitter.com/Pj9NIqP9BI — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Security checks underway in the wake of the G20 Summit, scheduled to be held in the national capital from September 9 to 10. (Visuals from Minto Road) pic.twitter.com/PCIaIPOCB9 — ANI (@ANI) September 8, 2023 ► ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. #WATCH | Delhi: For the G20 Summit, the national capital has been adorned with mural paintings. (Visuals from Lotus Temple) pic.twitter.com/eimW5AhvUp — ANI (@ANI) September 8, 2023 సెప్టెంబరు 9-10 తేదీల్లో జరిగే జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో ఇప్పటికే ఢిల్లీలో సందడి మొదలైంది. ఈ సమావేశం కోసం దేశ రాజధాని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. గత ఏడాది కాలంగా జీ-20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ఈ సమావేశంలో ఆ బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది. -
BJP Alliance: బీజేపీతో జట్టు ఖరారు!
ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్(సెక్యులర్) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది. బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్‌సభ పోటీకి గానూ జేడీఎస్ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ-జేడీఎస్ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు. ఈ క్రమంలో.. మాండ్యా, హసన్, తుమకురు, చిక్‌బళ్లాపుర్, బెంగళూరు రూరల్ సీట్లను జేడీఎస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది. ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య -
జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్(జనతా దళ్(సెక్యులర్)) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కొనసాగించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్ పార్టీ భవిష్యత్తుపై పునరాలోచనలో పడింది. బీజేపీతో కలిసే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధినేత దేవె గౌడ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నామని జనతా దళ్(సెక్యులర్) అధినేత హెచ్డీ దేవె గౌడ తెలిపారు. దీంతో బీజేపీతో జేడీఎస్ పొత్తు కొనసాగించనుందనే అంశానికి తెరపడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి జేడీఎస్ పోరాడుతుందని దేవె గౌడ కుమారుడు కుమారస్వామి గత వారం తెలిపాడు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ జేడీఎస్.. బీజేపీతో కలిసే పోటీ చేయనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ ఐఏఎస్‌ల బదిలీల అంశంలో బీజేపీ నేతలతో పాటు జేడీఎస్ సభ్యులు కూడా పోరాడారు. ఈ క్రమంలో పలువురు నేతలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ అంశాల అనంతరం బెంగళూరులో మీడియా సమావేశం అనంతరం మాట్లాడిన దేవె గౌడ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఒక్క సీటు గెలిచినా పర్వాలేదు.. కానీ తాము తప్పకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. తమకు ప్రాబల్యం ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆయా స్థానాలను నిర్ణయిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు -
అరుదైన ఘట్టం!..జీవిత కాలంలో చూస్తానని ఊహించలేదు: దేవెగౌడ
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(91) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత కాలంలో ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకను చూస్తానని గానీ అందులోకి అడుగుపెట్టి కూర్చొంటానని గానీ ఊహించ లేదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని, దాన్ని చూడటం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. తాను 1962లో కర్ణాట శాసనసభలో అడుగుపెట్టానని, 1961 నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాని చెప్పారు. 32 ఏళ్ల క్రితం ఈ గొప్ప ప్రజల సభలోకి అగడుపెట్టానన్నారు. ఐతే తాను ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, ప్రజా జీవితంలో ఇంతకాలం కొనసాగుతానని కూడా ఊహించలేదన్నారు. అన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.. కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం, కూర్చొవడమే అన్నారు. 91 ఏళ్ల వయసులో ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. పాత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడూ భారతదేశం ఇంకా వలసపాలనలోనే ఉందని, పూర్తి స్వేచ్ఛ రాలేదని పేర్కొన్నారు. నాటి జాతిపిత, ప్రముఖ జాతీయ వ్యక్తులను స్మరించుకుంటూ..మన దేశ పార్లమెంట్‌పై రక్తంతో తడిసిన కళంకం లేదన్నారు. తాము శాంతియుతంగా, అహింసా మార్గాల ద్వారా దేశానికి బానిస విముక్తి కలిగించి స్వతంత్యాన్ని సమపార్జించామని చెప్పారు. ఇది అత్యంత అమూల్యమైన విజయం అని, విలువలతో కూడిన వ్యవస్థను కాపాడు కోవడమే గాక మన భావితరాలకు అందించాలన్నారు. "అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అది పలువురు నాయకుల అహంకారం, వినయం, గెలుపోటములు చూసింది. మొత్తంగా అది సమతుల్యతను కాపాడుకుంటూ.. భారతదేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నించింది. ఈ పార్లమెంట్ అన్ని కులాలు, జాతులు, మతాలు, భాషలు తోసహ అన్ని భౌగోళికాలను పోషించింది. ఇది అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. ఇలా భారతదేశ వైవిధ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు. ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. మన సుసంపన్నమైన ప్రజాస్వామ్య సంప్రదాయం కొనసాగాలని, కాలం గడిచే కొద్ది అభివృద్ధి చెందుతూ ప్రకాశవంతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా" అని అన్నారు దేవెగౌడ. (చదవండి: 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్) -
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
బెంగళూరుకు కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకకు ఒకరోజు పర్యటన కోసం వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగుళూరుకు వెళ్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. పలు అంశాలపై వీరు చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చిస్తారు. రాష్ట్రాల్లో బలం లేకపోయినా ఇతర పార్టీల సభ్యులను లోబర్చుకుని బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వంటి అనైతిక కార్యకలాపాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు దేవెగౌడ నివాస ప్రాంతంలో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దేవెగౌడ, కుమారస్వామితో రాజకీయ చర్చల అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజరవుతారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కోసం శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారు. హజారేతో భేటీ అనంతరం షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకుంటారు. కేసీఆర్ ఈ నెలాఖరులో బిహార్, పశ్చిమ బెంగాల్లోనూ పర్యటించనుండగా.. ఇంకా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. -
దేశం ఎటుపోతోంది: దేవెగౌడ
బనశంకరి: జయప్రకాష్ నారాయణ్ దేశానికి రెండో స్వాతంత్య్రం తీసుకువచ్చారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. సోమవారం జేడీఎస్ ఆఫీసులో జేపీ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జేపీ తెచ్చిన స్వాతంత్య్రం కూడా నేడు నశిస్తోంది, దేశంలో ఏ వైపు నడుస్తుందనేది, భవిష్యత్ ఏమిటనేది తెలియడం లేదు. అందరూ అధికార మంత్రాన్ని జపిస్తున్నారు అని వాపోయారు. యువత జేపీ మార్గంలో నడవాలని సూచించారు. చదవండి: పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగిన అమితాబ్ -
కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం
దొడ్డబళ్లాపురం: ఇంట్లో వారికి కరోనా సోకినందున కచ్చితంగా కోవిడ్ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఆదేశించినా రాజకీయ నాయకులే పెడచెవిన పెడుతున్నారు. జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి సోమవారం రాత్రి రామనగర పట్టణంలో జరిగిన జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గత వారం కుమారస్వామి బెంగళూరులో కోర్టులో ఒక కేసు వాయిదాకు హాజరవ్వాల్సి ఉంది. అయితే తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని లాయర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇందుకు సరేనన్న జడ్జి ఈ నెల 17వ తేదీ వరకూ కుమారస్వామి ఎటువంటి సమావేశాల్లో, సభల్లో కనిపించరాదని, తాను టీవీ, పేపర్లలో చూస్తుంటానని, అలా జరిగితే అరెస్టు వారెంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. అయితే కుమారస్వామి జడ్జి హెచ్చరికలు బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా బారిన పడిన విషయం విదితమే. చదవండి: దేవెగౌడ దంపతులకు కోవిడ్ -
దేవెగౌడ దంపతులకు కోవిడ్
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు బుధవారం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దేవెగౌడ కోరారు. తనను కలిసేందుకు రావద్దని సూచించారు. దేవెగౌ డకు ఎలాంటి లక్షణాలు లేకున్నా, టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. దేవెగౌడకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామ ర్శించారు. ప్రధాని ఫోన్ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం బీఎస్ యడి యూరప్ప ట్వీట్ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది. నిత్యం సుమారు రెండు వేల పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. -
కరోనా సోకింది, మీరంతా ఆందోళనపడొద్దు: మాజీ పీఎం
సాక్షి, బెంగళూరు : సీనియర్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ (87) ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఈ సమాచారాన్ని స్యయంగా దేవెగౌడ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు, భార్య చెన్నమ్మకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, తమతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ట్విట్ చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని, యథావిధిగా వారి పనికి తిరిగి వస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ స్పందిస్తూ రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవెగౌడ్,ఆయన భార్యకు కరోనా సోకిందని తెలిసింది. ఈ నేపథ్యంలోవారికి చికిత్స చేస్తున్న వైద్యులతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కాగా దేశంలో కరోనా వైరస్ రెండవ దశలో మళ్లీ విజృంభిస్తోంది. కర్ణాటక సహా, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకు సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులు సిద్ద రామయ్య, బీఎస్ యడ్యూరప్ప, డీకే శివకుమార్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ಹಿರಿಯ ರಾಜಕಾರಣಿಗಳು ಹಾಗೂ ಮಾಜಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಾದ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ದೇವೇಗೌಡರು ಮತ್ತು ಅವರ ಶ್ರೀಮತಿ ಚೆನ್ನಮ್ಮನವರು ಕೊರೋನಾ ಸೋಂಕಿನಿಂದ ಸಂಪೂರ್ಣ ಗುಣಮುಖರಾಗಲಿ, ಶೀಘ್ರದಲ್ಲಿ ಚೇತರಿಸಿಕೊಂಡು ಎಂದಿನಂತೆ ತಮ್ಮ ಕೆಲಸಕಾರ್ಯಗಳಲ್ಲಿ ತೊಡಗಿಕೊಳ್ಳಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ. https://t.co/YZ7Januj0u — B.S. Yediyurappa (@BSYBJP) March 31, 2021 My wife Chennamma and I have tested positive for COVID-19. We are self-isolating along with other family members. I request all those who came in contact with us over the last few days to get themselves tested. I request party workers and well-wishers not to panic. — H D Devegowda (@H_D_Devegowda) March 31, 2021 -
24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో కన్నడభాషలో ప్రమాణం చేశారు. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. కరోనా లాక్డౌన్ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. -
ఆ పెళ్లిలో భౌతిక దూరం మాయం
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్‌లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్‌గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. -
బెంగళూరు: వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
-
అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిఖిల్, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల క్రితం జాగ్వార్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభకు పోటీ చేయను
సాక్షి బెంగళూరు: ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజ్యసభకు పోటీ చేయనని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వెల్లడించారు. జూన్‌లో రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒక స్థానానికి కాంగ్రెస్ సహాయంతో దేవెగౌడ పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో వాటన్నింటికి ఆయన స్పష్టత నిచ్చారు. శనివారం జేపీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను రాజ్యసభకు వెళ్లనని తెలిపారు. తాను రైతుల కోసం పోరాడేందుకు రాజ్యసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడున్నా రైతుల తరపున పోరాటం చేస్తానని తెలిపారు. చదవండి: మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం తన జీవితమే ఒక పోరాటం అని, తనకు అధికార దాహం లేదని వెల్లడించారు. అంతకుముందు దాసరహళ్లిలో జరిగిన సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో దేవెగౌడ పాల్గొని మాట్లాడారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాయని, ఇక ఇంటికే పరిమితం అవుతానని ఎవరూ భావించొద్దని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన పోరాటం ఎప్పటికి ఆగదని స్పష్టం చేశారు. ఇటీవలే కేరళలో చికిత్స తీసుకుని వచ్చానని, నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు, కానీ ప్రస్తుతం వ్యవస్థకు విరుద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్‌తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్‌కే కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ కర్ణాటక అధ్యక్షుడిగా దళిత నేత, సక్లేశ్పూర్ ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి నియమితులయ్యారు. అంతేకాకుండా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మధు బంగారప్ప, యువజన విభాగం అధ్యక్షుడిగా నిఖిల్ కుమారస్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవె గౌడ గురువారం అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటమే కాకుండా గతంలో హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
హెచ్.డి. దేవెగౌడ (జేడీఎస్) : రాయని డైరీ
కుమారస్వామి వచ్చి కూర్చున్నాడు. ‘‘నేనిక కూర్చోలేను నాన్నగారూ’’ అన్నాడు. ‘‘ఇప్పుడైనా నువ్వు కూర్చొని ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు?’’ అన్నాను. చప్పున కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారస్వామి చాలా సెన్సిటివ్. ఏదీ ఆపుకోలేడు. కన్నీళ్లను అసలే ఆపుకోలేడు. అభినందన సభల్లో చేతికి అందిన పుష్పగుచ్ఛం కూడా అతడిని ఏడిపిస్తుంది. అంత మృదు హృదయుడు సీఎంగా నిలబడగలిగాడంటే, అదీ కాంగ్రెస్ సపోర్ట్‌తో ఒక ఏడాది కాలాన్నయినా పూర్తి చేశాడంటే గొప్ప సంగతే.’’ ‘‘కళ్లు తుడుచుకో కుమార స్వామి’’ అన్నాను. తుడుచుకోలేదు. తుడుచుకుని మాత్రం చేసేదేముంది అన్నట్లు ఉండిపోయాడు. ‘‘ఈ కలివిడి ప్రభుత్వాలు ఇలాగే ఏడుస్తాయి కుమారస్వామీ’’ అన్నాను. చివ్వున తలెత్తి, నా కళ్లలోకి చూశాడు! ‘‘నన్నంటున్నారా, ప్రభుత్వాలను అంటున్నారా లేక ప్రభుత్వాలను అడ్డు పెట్టి నన్ను అంటున్నారా నాన్నగారూ..’’ అన్నాడు ఉద్వేగంగా. ‘‘ఏమన్నాను కుమారస్వామి?’’ అన్నాను. ‘‘అదే నాన్నగారూ.. ‘ఇలాగే ఏడుస్తాయి’ అన్నారు కదా. ఆ ఏడుస్తున్నది ఎవరూ అని’’ అన్నాడు. ‘‘ఛ.. ఛ.. కుమారస్వామి. మనమెందుకు ఏడుస్తాం. సంకీర్ణ ప్రభుత్వాలను అంటున్నాను నేను’’ అన్నాను. ‘‘అయినా సరే, నేనిక కూర్చోలేను నాన్నగారు. సిద్ధరామయ్య నాకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు’’ అన్నాడు. ‘‘సిద్ధరామయ్య రెస్పెక్ట్ ఇస్తున్నంత కాలం కూర్చొని, సిద్ధరామయ్య రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కనుక లేచి వెళతాను అంటే దానర్థం మన మీద మనకు రెస్పెక్ట్ లేదని కుమారస్వామీ..’’ అన్నాను. నివ్వెరపోయి చూశాడు. ‘‘మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వని సిద్ధరామయ్యను కదా నాన్నగారూ మీరు అనవలసింది. మినిమం రెస్పెక్ట్ను కోరుకుంటున్న నన్ను అంటున్నారేమిటి?’’ అన్నాడు. ‘‘సిద్ధరామయ్య ఎవరు?’’ అన్నాను. ‘‘అర్థమయింది నాన్నగారూ. సిద్ధరామయ్య ఎవరు అన్నట్లుగానో, సిద్ధరామయ్య ఎవరైతే నాకేంటి అన్నట్లుగానో ఉండమనేగా మీరు చెబుతున్నారు’’ అన్నాడు! కొంచెం కొంచెం తేరుకుంటున్నట్లుగా ఉన్నాడు. నా మాట అర్థమౌతోంది. ‘‘సిద్ధరామయ్యకు డెబ్బై తొమ్మిది సీట్లు, నీకు ముప్పై ఏడు సీట్లు ఉండొచ్చు కుమారస్వామీ. అలాగని సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. సొంతకాళ్లపై నిలబడే బలం లేక, నువ్వు సిద్ధరామయ్య చేతులపై కూర్చొని ఉండొచ్చు. అలాగని కూడా సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్నట్లుంటేనే.. ‘నేనెవరో మీకు తెలుసు కదండీ’ అని చెప్పుకోడానికి వస్తారు ఎవరైనా. ఏమంటున్నాడూ.. కూలగొట్టేస్తానంటున్నాడా గవర్నమెంటుని! కూలగొట్టుకోనివ్వు’’ అన్నాను. ‘‘అది కాదు నాన్నగారూ నా ఆవేదన.. మనతో పొత్తు పెట్టుకుంటే వాళ్ల పార్టీకి నష్టం జరుగుతోందని రాహుల్‌తో అంటున్నాడట. మనం అంత హీనం అయిపోయామా!’’ అన్నాడు. ‘‘పట్టించుకోకు’’ అన్నాను. ‘‘ఎందుకు పట్టించుకోకూడదు నాన్నగారూ?’’ అన్నాడు. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఒకరు నష్టం చేయడమేంటి కుమారస్వామీ? వాళ్లకు ప్రెసిడెంట్ లేకపోతే కదా!!’’ అన్నాను. అప్పుడు కళ్లు తుడుచుకున్నాడు. జూలైతో జేడీఎస్‌కి ఇరవై ఏళ్లు నిండుతాయి. కుమారస్వామిని జాతీయ అధ్యక్షుడిని చేస్తేనన్నా కాస్త కుదుట పడతాడేమో చూడాలి. -
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే..!
బెంగళూరు : ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ మళ్లీ ఎన్నికల బరిలోకి నిలువడం కొత్త చర్చకు దారితీసింది. 85 ఏళ్ల వయస్సులోనూ ఆయన కర్ణాటక తూముకూర పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆమోదం ఉంటే.. ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన తనయుడు కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన దేవెగౌడ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయని దేవెగౌడ తెలిపారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని, అధికారమనేది ఆ తర్వాతి విషయమేనని తెలిపారు. ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశముందని ఆయన తనయుడు, కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా బాధంతా మోదీ మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారనే.. ప్రధాని ముఖం ముందే అడిగే దమ్మూ, ధైర్యం నాకున్నాయి’ అని దేవెగౌడ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని, కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీ కన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘పార్టీ స్థాపించినప్పుడు నాతో సమిష్టిగా పనిచేసినవారు.. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్‌లో, ఇంకొంతమంది బీజేపీలో ఉన్నారు. దీంతో పార్టీ కొంత దెబ్బతిన్నా.. చెదిరిపోకుండా నిలబెట్టాను. నా కుటుంబసభ్యులు పార్టీ అధ్యక్షుడు కాకుండా నేను అడ్డుకున్నాను’ అని దేవెగౌడ తెలిపారు. -
దేవెగౌడ నామినేషన్
బెంగళూరు: జనతాదళ్(సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(85) సోమవారం కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా తుముకూరు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ కండువా ధరించి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషంలోనైనా తనకే కాంగ్రెస్ టికెట్ లభిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. రాజన్న అనే మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తుముకూరు నుంచి నామినేషన్ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు విభేదాలను వీడి, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ 8, కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి తన మనవడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పోటీ చేస్తున్న తుముకూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోపాటు జేడీఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబానికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవెగౌడ గెలుపు అంత సులువు ఏమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు. -
తుంకూరు నుంచి మాజీ ప్రధాని పోటీ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని తుంకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు జేడీఎస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు శనివారం ప్రకటించారు. తుంకూరు నియోజకవర్గం నుంచి దేవెగౌడ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే, అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ముద్దహనుమెగౌడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఏమిటీ సంకీర్ణం, సమన్వయం ఎక్కడుంది? ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీని నేను. నాకెందుకు టిక్కెట్ నిరాకరించారు. ఇది సరైనది కాదు' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో హనుమెగౌడ బీజేపీ అభ్యర్థి జీఎస్.బసవరాజయ్యపై 74 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన హసన్ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు దేవెగౌడ ఇటీవల స్వయంగా ప్రకటించారు. జేడీఎస్‌కు గట్టిపట్టున్న మాండ్యాం నుంచి పోటీచేయాలని ఆయన యోచించినా అక్కడ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ బరిలో నిలవడంతో పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. కీలకమైన ఎన్నికలు కావడంతో అటు కాంగ్రెస్ నుంచి, ఇటు సొంతపార్టీ నుంచి ఆయన పోటీకి తీవ్రంగా పట్టుబట్టారు. దీంతో దేవెగౌడ పోటీకి దిగక తప్పలేదు. మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్ 19, జేడీఎస్ 9 చోట్ల పోటీచేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేవెగౌడ 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
కాంగ్రెస్, జేడీఎస్‌ల సీట్ల పంపకం ఖరారు
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలసి పోటీచేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్ 19, జేడీఎస్ 9 చోట్ల పోటీచేయబోతున్నట్లు తెలిసింది. ఎవరెక్కడ బరిలోకి దిగాలో నిర్ణయించే బాధ్యతను రెండు పార్టీల ప్రధాన కార్యదర్శులకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బుధవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. కనీసం 12 స్థానాలు ఇవ్వాలని గతంలో కోరిన జేడీఎస్ తాజాగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీకి దక్కే సీట్ల కన్నా కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుపొందడమే ముఖ్యమని భావిస్తున్నట్లు దేవెగౌడ వెల్లడించారు. -
దేవెగౌడ ఇంటికి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ (ఎస్) అధినేత హెచ్డీ దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు దేవేగౌడతో రాహుల్ భేటీ అయ్యారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. రాహుల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీఎస్ పది స్థానాలు కోరిందని, రాహుల్ కేసీ వేణుగోపాల్, డానిష్ అలీతో చర్చించిన అనంతరం.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ పాత మైసూరు ప్రాంతంలో సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్-జేడీఎస్ తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు బద్ధవిరోధులుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సీట్ల పంపకాలు జరిపి.. ఇరు పార్టీల శ్రేణుల మధ్య సయోధ్య కుదర్చడం కాంగ్రెస్-జేడీఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలోని మాండ్య, హసన్ లోక్‌సభ సీట్లను జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. -
దేవెగౌడపై సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు : కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా చెప్పుకుంటున్న తాజా ఆడియో క్లిప్పులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రీతమ్ గౌడగా చెప్పబడుతున్న బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడుతూ.. ‘త్వరలోనే మాజీ ప్రధాని దేవెగౌడ చనిపోతారు... ఆయన కొడుకు కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతి త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుంది’ అంటూ ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో... జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. కాగా ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి... జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం కన్నడ రాజకీయాలను ఎటు తీసుకుపోతాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. -
రాయని డైరీ; దేవె గౌడ (మాజీ ప్రధాని)
లోక్‌సభలో రేపు నా చివరి ప్రసంగం. లోక్‌సభకు కూడా ఇవి చివరి ప్రసంగ దినాలే. సోమవారం నాకు చివరిది. బుధవారం లోక్‌సభకు చివరిది. లోక్‌సభకు చివరి రోజులు కాబట్టి నాలాగే అందరూ ప్రసంగించాలనుకుంటే కనుక మొన్న ఏడో తారీఖున లోక్‌సభలో నేను మాట్లాడిందే నా చివరి ప్రసంగం అవుతుంది. ఆరోజు నాకేం తృప్తిగా అనిపించలేదు. తనివితీరా మాట్లాడాలని మనసు ఎంతగానో తపించింది. ‘‘అయినా సరే, ‘కొంతే’ మాట్లాడాలి మీరు’’ అని కటువుగా అనేశారు సుమిత్రా మహాజన్! ఒక మాజీ ప్రధానికి స్పీకర్ ఇచ్చిన ఆరు నిముషాలు ఆ ‘కొంత’కు మాత్రం ఎలా సరిపోతాయి?! ఆరు నిముషాల్లోనే అన్నీ చెప్పేయాలని ఎమోషనల్ అవుతుంటే.. ఐదో నిముషంలోనే ‘‘మీ టైమ్ అయిపోతోంది గౌడాజీ’’ అని స్పీకర్ గుర్తుచేశారు. ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయాను. గుర్తొచ్చే సరికి ఆరో నిముషమూ గడిచిపోయింది! ‘‘మేడమ్ స్పీకర్ మహాజన్.. మరికొంత సమయం కావాలి’’ అని అభ్యర్థించాను. ‘అవసరమా?’ అన్నట్లు, కళ్లజోడులోంచి చూశారావిడ! ప్రధాని అవకముందు గానీ, ప్రధానిగా ఉన్నప్పుడు గానీ, మాజీ ప్రధానిగా గానీ నన్నెవరూ అలా చూడలేదు. ఇరవై ఏళ్ల క్రితం ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి, పూర్తిగా ఒక ఏడాది కూడా ప్రధానిగా లేని ఒక మాజీ ప్రధానికి, అదీ కాంగ్రెస్ సపోర్ట్‌తో ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏం ఉంటుందని మేడమ్ స్పీకర్ భావించినట్లున్నారు! అయినా నేను మాట్లాడ్డం ఆపలేదు. మైక్ లాగేశారు! మనసు చివుక్కుమంది. ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు ఉమన్ రిజర్వేషన్ బిల్లు వచ్చిందో మేడమ్ స్పీకర్ మర్చిపోయినట్లున్నారు! ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు వరి రైతులు ఒక వంగడానికి ‘దేవె గౌడ’ అని పేరు పెట్టుకున్నారో మేడమ్ స్పీకర్‌కి గుర్తులేనట్లుంది! ఢిల్లీలో సోమ, మంగళ, బుధ.. మూడు రోజులు ఉండాలి. పడుకోబోతుండగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేశాడు.. ‘‘పడుకున్నారా?’’ అని! ‘‘లేదు ఖర్గే. నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను’’ అన్నాను. ‘‘అనుకున్నాను. నాకు ఫోన్ చేయాలని అనుకుంటారని. సభలో అలా అనేశారేమిటి గౌడగారు. చివరి ప్రసంగం కావచ్చని! హసన్ సీటును మీ మనవడు ప్రజ్వల్‌కి ఇచ్చి, నార్త్ బెంగళూరు నుంచి మీరు కంటెస్ట్ చేస్తారని మేమంతా అనుకుంటుంటే..!’’ అన్నాడు ఖర్గే. ‘‘సీటుకు, చివరి ప్రసంగానికి లింకేమిటి ఖర్గే. సీటున్నా ఇక జన్మలో మాట్లాడకూడదని కూర్చుంటే అది చివరి ప్రసంగమే కదా. అయినా ఆవిడ చూశారా ఎలా మైక్ లాగేశారో’’ అన్నాను. ‘‘నేనూ గమనించాను గౌడగారూ.. మేడమ్ స్పీకర్ మిమ్మల్ని చూసిన చూపులో.. ‘ఎప్పుడూ నిద్రపోతూ కనిపించేవారు, ఇవాళెందుకు మెలకువగా ఉండి.. ప్రసంగిస్తానని పీక్కు తింటున్నారు’ అనే విసుగు కనిపించింది’’ అన్నాడు. ‘‘ఎవరైనా ఎందుకు నిద్రకు ఆగలేకపోతారు ఖర్గే?’’ అని ఆవేదనగా అడిగాను. ‘‘నిద్ర చాలకపోతే గౌడగారూ’’ అన్నాడు. ‘‘నిద్ర ఎందుకు చాలకపోతుంది ఖర్గే?’’ అని అడిగాను. ‘‘విరామం, విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ పోతుంటే’’ అన్నాడు. ‘‘అదే చెప్పాలనుకుంటున్నాను ఖర్గే.. రేపు సభలో. నాకిచ్చిన టైమ్ సరిపోకపోతే మీకిచ్చిన టైమ్లోంచి ఈ మాజీ ప్రధానికి కొంత ఇవ్వగలరా?’’ అని అడిగాను. ‘‘ఫుల్ టైమ్ తీసుకోండి గౌడగారు.. మా మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏముంటుందనీ! తీసుకోండి’’ అన్నాడు ఖర్గే. -మాధవ్ శింగరాజు -
అదే నా చివరి ప్రసంగం కావొచ్చు
న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయకపోవచ్చనే సంకేతాలను మాజీ ప్రధాని దేవె గౌడ (85) శుక్రవారం ఇచ్చారు. మధ్యంతర బడ్జెట్‌పై సోమవారం తాను లోక్‌సభలో మాట్లాడేదే తన చివరి ప్రసంగం కావచ్చనీ, కాబట్టి ఆరోజున తనకు మరింత ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరానని దేవెగౌడ తెలిపారు. బడ్జెట్‌పై చర్చ సమయంలో కాంగ్రెస్‌కు కేటాయించిన సమయంలోనూ తనకు కొంత ఇవ్వాలని తాను ఆ పార్టీని కోరతానన్నారు. 320 రోజులు ప్రధానిగా చేశాననీ, ఆ సమయంలో తాను దేశానికి ఏం చేసిందీ ఎక్కువ మందికి తెలీదు కాబట్టి పార్లమెంటులో దీనిపై మాట్లాడతానన్నారు. ప్రస్తుతం హసన్ లోక్‌సభ స్థానానికి దేవె గౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి?’
బెంగళూరు: అస్సాంలోని డిబ్రూగఢ్ సమీపంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద రోడ్డు కమ్ రైలు వంతెన(బోగీబీల్) ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బోగీబీల్ వంతెనకు 1997లో ప్రధాని హోదాలో తానే శంకుస్థాపన చేశానని పేర్కొన్నారు. అలాంటింది ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధకరమన్నారు. తన పాలన కాలంలో కశ్మీర్ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్, బోగీబీల్ వంతెన పథకాలను మంజూరు చేశానని.. అలాగే ప్రతి ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. కానీ నేడు ప్రజలు ఆ విషయన్ని మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతం మరిచి ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీకు ఆహ్వానం అందలేదా అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి? అని చమత్కారంగా సమాధానమిచ్చారు. కాగా, బోగీబీల్ వంతెనను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1997 లోనే ఆమోదం.. బోగీబీల్ వంతెనను అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించారు. ఈ ఒప్పందంలో భాగంగా 1997లోనే ఈ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న నాటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ బోగీబీల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది. -
రాష్ట్రానికి ముగ్గురు సీఎంలా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో తేల్చిచెప్పాలని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడను బీజేపీ ప్రశ్నించింది. అసలు ప్రస్తుత సీఎం ఎవరంటూ చమత్కరించింది. ఒక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు సీఎంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. కుమారస్వామి సోదరుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) మంత్రి రేవణ్ణ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో ఆయన కల్పించుకుని పెత్తనం చలాయిస్తున్నారంటూ ట్విటర్లో పేర్కొంది. దేవెగౌడ కూడా రాష్ట్ర పరిపాలన వ్యవహరాల్లో తలదూరుస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ‘అనేక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచుస్తున్నారు. అసలు మీలో ఎవరు సీఎం అని ప్రజలకు సందేహంగా ఉంది. ముందు నిజమైన సీఎం ఎవరో తేల్చుకోండి’ అని ట్విట్ చేసింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తండ్రి, ఇద్దరు కొడుకులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, జేడీఎస్‌ని కుటుంబ పార్టీగా బీజేపీ వర్ణించింది. బీజేపీ వ్యాఖ్యలపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాధ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు అర్థమంతంగా మాట్లాడాలని హెచ్చరించారు. -
‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది. ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం ఓడిపోతే ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన మంత్రే లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చు. సాధారణంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోతామని భావించిన సందర్భాల్లోనే ఓటింగ్‌కు కంటే ముందే ప్రధాని లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తారు. 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు కేంద్ర ప్రభుత్వాలపై గతంలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 25 సార్లు అవి వీగిపోయాయి. ఒక్కసారి మాత్రం తీర్మానంపై ఓటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసం వచ్చింది. భారత్–చైనా యుద్ధానంతరం 1963లో ఆయన ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 285 ఓట్ల మార్జిన్‌తో నెహ్రూ సభా విశ్వాసాన్ని పొందారు. రాజీÐŒ గాంధీ, అటల్ బిహారీ వాజపేయి చెరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనగా, లాల్ బహదూర్ శాస్త్రీ, పీవీ నర్సింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ మొత్తం 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మురార్జీ దేశాయ్‌కి కూడా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదురుకాగా, ఒకసారి ఓటింగ్‌కన్నా ముందే (1979, జూలై 12) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చివరి సారి 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకొన్నది అటల్ బిహారి వాజపేయికాగా, 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకే అవిశ్వాసం ఎదురయింది. విశ్వాస తీర్మానాల్లో.. దేశంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానాల సందర్భంగా ఐదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేయగా, ఏడుసార్లు మాత్రం ప్రధాన మంత్రులు సభా విశ్వాసాన్ని నిరూపించుకో గలిగారు. రెండు సార్లు ప్రధాన మంత్రులు విశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ జరగక ముందే పదవులకు రాజీనామా చేశారు. 1979లో చరణ్ సింగ్ రాజీనామా చేయగా, 1996లో వాజపేయి రాజీనామా చేశారు. 1979, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చర్చకు రావల్సి ఉండగా ముందే చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1996, మే 27,28 తేదీల్లో వాజపేయి విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ ఓటింగ్ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. 1989లో వీపీ సింగ్, 1990లో చంద్రశేఖర్, 1993లో పీవీ నర్సింహారావు, 1996లో హెచ్డీ దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో వాజపేయి, 2008లో మన్మోహన్ సింగ్‌లు సభా విశ్వాసాన్ని పొందారు. వీరిలో ముగ్గురు ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షల్లో వీగిపోయి వారి పదవులకు రాజీనామా చేశారు. 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజపేయిలు అలా రాజీనామా చేశారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ సభా విశ్వాసాన్ని పొంది తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. వారి స్థానాల్లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. -
మార్ఫింగ్ కానేకాదు.. నిజం
ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో... నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంటర్నెట్ను షేక్ చేసి పడేసింది. మాజీ ప్రధాని దేవె గౌడ తన ఇంట్లో బెడ్‌పై యోగా చేస్తున్న ఫోటో ఒక్కటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఫోటోను ట్వీట్ చేయగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘అది మార్ఫింగ్ కాదు కదా?’ అని ప్రశ్నించటం, నేతలతోపాటు పలువురు సెలబ్రిటీలు, మరికొందరు ఆ ఫోటోను సరదాగా రీట్వీట్ చేయటం... నిన్నంతా ఈ ఫోటోనే హల్ చల్ చేసింది. అయితే కాసేపటికే ఆయన బెడ్ రూమ్‌లో యోగా చేస్తున్న ఫోటోలు మొత్తం బయటికి వచ్చేశాయి. ‘తాను ప్రతీరోజు ఆసనాలు వేస్తానని.. యోగా డే సందర్భంగా కాస్త ఎక్కువ సేపే చేశానని’ ఈ సందర్భంగా దెవె గౌడ స్థానిక మీడియాతో కూడా చెప్పారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి రియాక్ట్ కాకపోయినా.. 86 ఏళ్ల ఈ మాజీ పీఎం మాత్రం స్పందించినట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు బెడ్రూమ్లో ఆసనాలతో ఆయన చేసిన ఫోటోషూట్ తెగ వైరల్ అవుతోంది. ఇక ట్రోలింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. Deve Gowda on #WorldYogaDay is my new spirit animal. pic.twitter.com/7L0ZQN4kJn — Sayantan Ghosh (@sayantansunnyg) 21 June 2018 When you win only 37 seats in the polls, but life still comes up trumps....#InternationalDayofYoga2018 #HDDeveGowda pic.twitter.com/WH4WFBc3M0 — Nistula Hebbar (@nistula) 21 June 2018 #India's former prime minister HD Deve Gowda with some of the moves on #WorldYogaDay in his bedroom. 🙄🙄 🙈 (h/t @nistula) pic.twitter.com/B8pFoLBVo0 — Bhuvan Bagga (@Bhuvanbagga) 21 June 2018 Former Prime Minister of India, H.D. Devegowda, 85, alliance partner of @INCIndia, in throes of International Yoga Day in his bedroom in Bengaluru. NDA alliance partner Nitish Kumar did not celebrate International Yoga Day in Patna. pic.twitter.com/W9YgBl9QQs — Shivam Vij (@DilliDurAst) 21 June 2018 Devegowda and Yoga 🧘♂️ ! pic.twitter.com/zbW6fWSTdc — Vishweshwar Bhat (@VishweshwarBhat) 21 June 2018 Deve Gowda on #WorldYogaDay is a mood. pic.twitter.com/5cw74k1JKT — ¯\_(ツ)_/¯ (@karishmau) 21 June 2018 Confusion > Either he is doing yoga or Sleeping ??? More Confusion > What Media people are shooting ??? — AmAr K ChAndrA (@iamAKC7432) 21 June 2018 what media is doing in his bedroom? — Anant (@TooMuchToSay_) 21 June 2018 Looks like he’s singing ‘Pehla Nasha’ 😂 — Harsha (@harsha_rama) 21 June 2018 Good heavens what is this — Sudeshna (@SudeshnaShome) 21 June 2018 Jab mujhe school jaane ka man nahi hota tha, This was my yoga pose. — Puneet (@PuneetVuneet) 21 June 2018 -
‘నేను సీఎం కావడం నాన్నకు ఇష్టం లేదు’
బెంగళూరు: తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతలకు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. ‘ నాకు ఆరోగ్యం పరంగా సమస్యలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇదే విషయాన్ని మా తండ్రి కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎం పదవిని మీ వద్దే ఉంచుకోండని కాంగ్రెస్ నేతలను కోరారు. కానీ వారు మాత్రం నన్ను సీఎంను చేశారు’ అని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ‘ఒక్కొసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలనా అని భయమేస్తోంది. ఎందుకంటే విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా అనే అనుమానం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా తనకు డబ్బు అవసరంలేదని, ఇతరవాటిపై ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కుమారస్వామి పేర్కొన్నారు -
కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా కలసి అభినం దనలు తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే మంగళవారం బెంగళూరు వెళ్లి ఆయన్ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆయన ఆహ్వానించడం తెలిసిందే. మంగళవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగ ళూరు వెళ్లారు. సీఎంతోపాటు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, బి.వినోద్ కుమార్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు సీఎం వెంట వెళ్లారు. బెంగళూరుకు వెళ్లగానే కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరు కున్నారు. అక్కడే కుమారస్వామిని కలసి అభినందించారు. దేవెగౌడ, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేశారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. మంత్రులు, ఎంపీలను వారికి పరిచయం చేశారు. అనంతరం గంటకుపైగా ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు సీఎం బృందం తిరుగు పయనమైంది. అందుకే ముందుగా.. బెంగళూరులో బుధవారం జరిగే కుమార స్వా మి ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాం గ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకనే సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగా వెళ్లి వచ్చి నట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ఎత్తుగడ అనుసరించినట్టుగా భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్‌తో కలసి వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న అంచనా తోనే ఈ మార్గాన్ని అనుసరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి -
కర్ణాటక: ఇక రంగంలోకి నాన్నను దింపుతా!
సాక్షి, బెంగళూరు : బీజేపీకి సాధారణ మెజారిటీ లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ నేత యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీపై పోరాటానికి సీనియర్ రాజకీయ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను రంగంలోకి దింపుతున్నాయి. ఇదే విషయాన్ని జేడీఎస్ నేత, దేవెగౌడ తనయుడు కుమారస్వామి వెల్లడించారు. ‘ఈ పోరాటానికి నాయకత్వం వహించి.. అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాల్సిందిగా మా నాన్న (హెచ్డీ దేవెగౌడ)ను కోరుతాను. బీజేపీ ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ఆయన అందరి దృష్టికి తీసుకెళతారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి సాగాల్సిన అవసరముంది’ అని కుమారస్వామి గురువారం విలేకరులతో అన్నారు. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించినప్పటికీ.. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి.. గవర్నర్ వజుభాయ్ వాలా అసంబద్ధంగా ప్రవర్తించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ‘మా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మేం దృష్టిపెట్టాం. బీజేపీ, ఆ పార్టీ మంత్రులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. బీజేపీకి మెజారిటీ లేదు. అయినా గవర్నర్ ఇలా ఎందుకు ప్రవర్తించారు? ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు’ అని కుమారస్వామి అన్నారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక విధానసౌధ ఎదుట కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనలో జేడీఎస్ కురువృద్ధ నేత దేవెగౌడ కూడా పాల్గొన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. -
దేవెగౌడకు కాంగ్రెస్ నేతల ఆఫర్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళితో రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో జేడీ(ఎస్) మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి బెంగళూర్‌లో మకాం వేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో మంతనాలు జరపుతున్నారు. దేవెగౌడ నివాసంలో భేటీ జరుగుతోంది. మీరు సూచించిన వారికే సీఎం పదవి ఇస్తామని దేవెగౌడకు కాంగ్రెస్ నేతలు ఆఫర్ చేసినట్టు సమాచారం. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుండా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదిస్తూ దేవెగౌడతో వారు సంప్రదింపుల్లో నిమగ్నమయ్యారు. కాగా, హైదరాబాద్ కర్ణాటక, బాంబే కర్ణాటక, కోస్తా, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా, బెంగుళూర్ సిటీలో కాంగ్రెస్, మైసూరు ప్రాంతంలో జేడీ(ఎస్) ముందంజలో ఉన్నాయి. -
మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హసన్ జిల్లా హోలెనారసిపురలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దేవెగౌడ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు తన సతీమణి చెన్నమ్మ దేవెగౌడ, కుమారుడు రేవన్న కుటుంబసభ్యులు కూడా ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాజా ఎన్నికల్లో జేడీఎస్ బాగా పనిచేసిందని, చక్కగా ప్రచారం నిర్వహించిందని దేవెగౌడ పేర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. జేడీఎస్ కింగ్‌మేకర్ అయ్యే అవకాశముందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
హంగ్ అసెంబ్లీపై దేవెగౌడ వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ తప్పదన్న సర్వేల అంచనాలపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్పందించారు. తమ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలపై స్పందిస్తూ ప్రస్తుతం అది ఓ అంశం కాదని, ఆ పరిస్థితే వస్తే పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరిస్తున్నాయని, తమ పార్టీ వనరుల లేమితో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తానేం చేయలేనని, ఎన్నికల్లో పోరాడేందుకు ఎవరు తనకు నిధులు సమకూరుస్తారని ప్రశ్నించారు. ఎన్నో ఇబ్బందుల మధ్య తాము రెండు జాతీయ పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నామని చెప్పారు. మైసూర్ సహా బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక సహా కర్ణాటక అంతటా తాము మంచి ఫలితాలను సాధించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని అన్నారు. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఐక్యత ఇంకా ఓ కొలిక్కిరాలేదని చెప్పుకొచ్చారు. -
బీజేపీ గెలిస్తే.. సూసైడ్ చేసుకుంటా అన్నాడు!
సాక్షి, బెంగళూరు: జనతాదళ్ సెక్యూలర్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌ను రక్షిస్తుందని, బీజేపీపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని జేడీఎస్ నేతలను మోదీ విమర్శించారు. తమకూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. గతంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తాను కర్ణాటకకు వచ్చినప్పుడు.. ‘మోదీ గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేవెగౌడ, ఆయన పార్టీ జేడీఎస్ నేతల చర్యలు ఎప్పుడూ కాంగ్రెస్‌ను రక్షించేవిగా, బీజేపీని అడ్డుకునేవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేవెగౌడపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, ఆయన 100 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకుంటూ జీవించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ను విజయం వరించదని ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయని ఆరోపించారు. తెరవెనుక ఏం జరుగుతుందో కర్ణాటక ప్రజలకు తెలుసునని, ఈ ఎన్నికల్లో బీజేపీనే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారం రోజుల్లోనే మోదీ యూటర్న్.. ఇటీవల ఉడిపిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ ప్రధాని దేవెగౌడపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ వారం రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. కన్నడ వ్యక్తి ప్రధాని కావడం గర్వకారణమని, దేవెగౌడ ఆ ఘనత సాధించారని ఇటీవల కొనియాడారు. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. జేడీఎస్ లాంటి పార్టీకి మద్దతు తెలిపి మీ ఓటును వృథా చేసుకోవద్దంటూ కర్ణాటక ప్రజలకు తాజాగా మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మార్పు కోరుకుంటే బీజేపీకి ఓటువేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. -
‘బీజేపీతో పొత్తా?.. వెలేస్తా’
సాక్షి, బెంగళూరు: జనతా దళ్(సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ.. తనయుడు కుమార్‌స్వామికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీతో పొత్తు లాంటి ప్రయత్నం చేస్తే కొడుకని కూడా చూడకుండా కుమారస్వామిని వెలేస్తానని ప్రకటించారు. సోమవారం తన నివాసంలో ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు దేవెగౌడ ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీతో కుమారస్వామి పొత్తు అంశం గురించి జర్నలిస్ట్ ప్రస్తావించగా... ‘ఒకవేళ అలాంటిదే జరిగితే నేను, నా భార్య, నా కుటుంబమే కుమార స్వామిని వెలిస్తుంది. గతంలోనే అతను (కుమారస్వామి) తప్పు చేశాడు. వ్యక్తిగతంగా నష్టపోవటంతోపాటు పార్టీని కొలుకోలేని దెబ్బతీశాడు. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తానంటే ఎలా ఊరుకుంటా?. పార్టీలోంచే కాదు, ఇంట్లో కూడా అతనికి స్థానం ఉండదు’ అని దేవెగౌడ హెచ్చరించారు. తండ్రి ప్రకటనపై తనయుడు కుమారస్వామి స్పందించారు. ‘ఆయన(దేవెగౌడ) ఆ మాటలు ఏ సందర్భంలో అన్నారో నాకు తెలీదు. కానీ, అలాంటి పరిస్థితి రాదనే నా నమ్మకం. ఖచ్ఛితంగా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని కుమారస్వామి తెలిపారు. కాగా, సర్వే ఫలితాల్లో ‘హంగ్’ ఏర్పడొచ్చన్న కథనాలమేర కుమారస్వామి.. బీజేపీతో దోస్తీ వైపు అడుగులు వేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
సిద్దూకి.. అక్కడైతే గెలుపు సులభం..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. పరమేశ్వర రెండేసి స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం.. ఆ స్థానంలో జేడీఎస్, బీజేపీ ఒప్పందం చేసుకున్నాయన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో చాముండేశ్వరి నియోజక వర్గంతో పాటు, బగల్కోట్ జిల్లాలోని బదామి నుంచి సీఎం పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆయన కోసం బదామి ప్రస్తుత ఎమ్మెల్యే బీబీ చిమ్మనకట్టి తన సీటు త్యాగం చేయడానికి సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడైతే గెలుపు సులభం.. బదామీలో కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. సిద్దరామయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. అక్కడి ప్రజలు సీఎంను తమ నాయకుడిగా అంగీకరించారనే కారణంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అయితే రెండు స్థానాల నుంచి పోటీచేసేందుకు అధిష్టానం నుంచి సిద్దరామయ్యకు గ్రీన్ సిగ్నల్ రాగా.. జి.పరమేశ్వరకు రెండు స్థానాలకు సంబంధించి టికెట్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పరమేశ్వర ఈసారైనా విజయం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడి కోసం.. చాముండేశ్వరి నుంచి ఐదుసార్లు గెలుపొందిన సిద్దరామయ్య నియోజకవర్గాల విభజన తర్వాత వరుణ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుమారుడు యతీంద్ర కోసం తనకు అనుకూలంగా ఉన్న ఈ స్థానాన్ని సిద్దు వదులుకున్నారని తెలుస్తోంది. కాగా చాముండేశ్వరి ప్రస్తుత ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మద్దతు ఉంది. సిద్దును ఓడించేందుకు ఆయన ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే హెచ్డీ దేవెగౌడ.. ‘సిద్దరామయ్య ఒక దురహంకారి. పార్టీని దుర్వినియోగం చేశాడు. అటువంటి మోసకారిని చాముండేశ్వరి ప్రజలు ఎంతమాత్రం నమ్మరంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామనే భయం వల్లే... కాంగ్రెస్ నాయకులకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. వారు పిరికిపందలని.. అందుకే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
వారసులొస్తున్నారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల జోరు కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈ సారి తమ వారసుల్ని రంగంలోకి దించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై భారీగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వెయ్యడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుమారుల మధ్య పోటీకి సై ? ఎంతోమంది వారసులు ఈ సారి బెర్త్‌లు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంపైనే పడింది. ఈ నియోజకవర్గంలో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచే కుమారుడ్ని రంగంలోకి దించడానికి సిద్దరామయ్య సర్వం సిద్ధం చేశారు. తన కుమారుడు పోటీ చేయడానికి వీలుగానే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా దాని పక్కనే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని అంచనాకి వచ్చింది. అంతే కాక వరుణ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. విజయేంద్ర కూడా లింగాయత్ వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని బరిలోకి దింపితేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టిక్కెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పార్టీ కేడర్ ఆహ్వానం మేరకే తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజాసమస్యల్ని తెలుసుకుంటున్నానని విజేయంద్ర అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వ్యూహాలను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు . మొత్తానికి వరుణ నియోజకవర్గంలో కుమారుల మధ్య పోటీ ఉంటుందా లేదా అన్న సస్సెన్స్‌కు మరి కొద్ది రోజుల్లోనే తెరపడనుంది. టిక్కెట్ రేసులో మరికొందరు వారసులు పార్టీలకతీతంగా చాలా మంది నాయకులు తమ వారసుల్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. కర్ణాటక హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సౌమ్య టిక్కెట్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.బీజేపీ నేతపరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో కుటుంబానికి కుటుంబం మరోవైపు జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. జేడీ (ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ రేవణ్ణలు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. రేవణ్ణ తన కుమారుడు ప్రజ్వల్‌ను కూడా ఈ సారి ఎన్నికల బరిలో దించుతూ ఉండడంతో, కుమారస్వామి కూడా తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి నిఖిల్‌కు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా బలవంతంగా ఒప్పించి తీసుకువస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి మంచి పట్టు ఉన్న పాత మైసూరు నుంచే నిఖిల్‌ను ఎన్నికల బరిలోకి దించాలని కుమారస్వామి యోచిస్తున్నారు..మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సిద్దూపై వ్యతిరేకం.. యడ్డీపై విముఖం
సాక్షి, బెంగళూరు : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ తన దృష్టిని దక్షిణాది మీద కేంద్రీకరించింది. అందులోనూ గతంలో అధికారంలో ఉన్న కర్ణాటక మీద ప్రత్యేకదృష్టిని సారించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాలను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కమలం నేతలు కర్ణాటకను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుజరాత్ ఫలితం బయటకు రాగానే సిద్దరామయ్య ప్రభుత్వంపై బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ట్విటర్ వేదికగా మాటల యుద్ధం మొదలు పెట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధిని, సుపరిపాలనను కోరుకుంటున్నారంటూ మరో ట్వీట్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ప్యాకప్ చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ.. యడ్యూరప్ప తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హస్తానికి ఎదురుగాలేనా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కన్నడ రాష్ట్రంలోనూ గుజరాత్ తరహా ఫలితమే వస్తుందని ప్రముఖ ఆర్థిక వేత్త, రాజకీయ విశ్లేషకులు నరేందర్ ఫణి చెబుతున్నారు. పంజాబ్‌లో అధికార బదలాయింపు ఎందుకు జరిగిందో.. ఇక్కడ కూడా అదే కారణాలతోనే సిద్దరామయ్య ఓటమి చెందే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అయితే కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోరాటం ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. ఇదిలావుండగా.. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిద్దరామయ్య ప్రతికూలతలు కొంతకాలంగా సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అవే నేడు కాంగ్రెస్ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీకి వెన్నుముకలా ఉండే లింగాయత్ సామాజిక వర్గంపై జరిగిన చర్చ ప్రధానమైనది. అంతేకాక బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ భాషతో కూడిన సైన్ బోర్డులు కన్నడికుల ఆలోచనను మార్చిందని అంటున్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం కూడా ప్రభావం చూపనుందని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సిద్దరామయ్య ప్రభుత్వంపై మాటల దాడిని మొదలు పెట్టారు. ప్రధానంగా సిద్దరామయ్య ప్రభుత్వ అనినీతి లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాక మైసూర్ పాలకుడు టిప్పు జయంతిని నిర్వహిచడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందనే వాదన ఉంది. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై హిందూ అతివాదిగా ముద్రపడింది. యడ్యూరప్పపై విమర్శలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాష్ట్ర బీజేపీలో లుకలుకలు అప్పుడే మొదలయ్యాయి. యడ్యూరప్పను ఆగస్టులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ కమిటీ ప్రకటించినా.. రాష్ట్ర నేతలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. యడ్యూరప్ప విషయంపై పార్టీ చీఫ్.. అమిత్ షా రాష్ట్రనేతలతో సమీక్ష జరిపిన తరువాత పరిస్థితిలో కొంత వరకూ మార్పు వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక సమస్యలు గుజరాత్ విజయం తరువాత బీజేపీ స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం చేసిన తప్పిదాలు బీజేపీకి ఆయుధాలుగా మారే అవాశం ఉందని వారు అంటున్నారు. -
కాగుతున్న కావేరి
ఆగని ఆందోళనలు తమిళనాడుకు కావేరి నీరు విడుదల కేఆర్ఎస్తో పాటు హారంగి, కబిని, హేమావతిల నుంచి తమిళనాడుకు నీరు అట్టుడుకుతున్న మండ్య, అన్ని జలాశయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత {పధానితో భేటీ కానున్న హెచ్.డి. దేవెగౌడ బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తమిళనాడుకు కావేరి నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తోంది. మంగళవారం రాత్రి నుంచి కృష్ణరాజసాగర రిజర్వాయర్(కేఆర్ఎస్)తో పాటు హారంగి, కబిని, హేమావతి రిజర్వాయర్ల నుండి తమిళనాడుకు కావేరి పరుగులు పెట్టింది. కేఆర్ఎస్ నుంచి 12వేల క్యూసెక్కులు, హారంగి నుంచి 2వేల క్యూసెక్కులు, కబిని నుంచి 5వేల క్యూసెక్కులు, హేమావతి నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. బుధవారం మండ్య, మైసూరు, చామరాజనగర తో పాటు రాష్ట్ర రాజధాని బెంగళూరులో సైతం కావేరి నదీ జలాలపై నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు రహదారులపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్ వద్ద కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు రైల్ రోకో నిర్వహించారు. బెంగళూరు-చెన్నై రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయడం ద్వారా మండ్య, మైసూరు, బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల వారికి కనీసం తాగేందుకు నీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడుతుందంటూ నిరసనకారులు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఆర్ఎస్తో పాటు కబిని, హేమావతి, హారంగి రిజర్వాయర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ రిజర్వాయర్ల నుండి కిలోమీటరు పరిధి వరకు నిషేధాజ్ఞలను జారీ చేశారు. అట్టుడికిన మండ్య మండ్య నగరం బుధవారం రోజున కూడా ఆందోళనలతో అట్టుడికింది. జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎం.బీ.పాటిల్,తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితల దిష్టిబొమ్మలకు శవయాత్రలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామాల నుండి ర్యాలీగా పట్టణానికి చేరుకున్న ఆందోళనకారులు జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్లోని సిద్ధార్థ థియేటర్లోకి చొరబడి చిత్ర నటుడు కిచ్చ సుదీప్ పోస్టర్‌ను చించేసారు.అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సుభాష్‌నగర్,వీ.వీ.రోడ్ తదితర ప్రాంతాల్లోని దుకాణాలతో పాటు పెట్రోల్ బంక్‌లను మూయించి నిరసనలు తెలిపారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా థియేటర్ యజమానులు బుధవారం జిల్లా వ్యాప్తంగా చిత్ర ప్రదర్శనలు రద్దు చేసారు. ఆగిన రవాణా...... ఇక మండ్య, మైసూరు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బుధవారం కూడా బెంగళూరు-మైసూరు మధ్య బస్సు సర్వీసులను కేఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఇదే సందర్భంలో బెంగళూరు-చెన్నై సర్వీసులను సైతం రద్దు చేశారు. ఇక తమిళనాడుకు కావేరి నీటి విడుదలపై సెప్టెంబర్ 9న బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో తమిళ ఛానళ్ల ప్రసారాలను సైతం ఆ రోజున నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్లు నిర్ణయించారు. కర్ణాటక బంద్ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దాదాపు 52 తమిళ ఛానళ్ల ప్రసారాలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని కన్నడ సంఘాలు కోరగా, ఇందుకు కేబుల్ ఆపరేటర్లు సమ్మతించారు. ప్రధానితో భేటీ కానున్న దేవెగౌడ... కావేరి నదీ జలాల వివాదంతో పాటు మహదాయి నదీ జలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇప్పటికే దేవేగౌడకు ఆహ్వానాన్ని పంపింది. గురువారం ఉదయమే దేవెగౌడ ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో పాటు న్యాయనిపుణులతో చర్చలు జరపనున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై నదీ జలాల పంపిణీ విషయంలో మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరనున్నారు. -
న్యాయమూర్తులకు ఆమాత్రం తెలియదా..!
బెంగళూరు : ‘కర్ణాటకలో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఏడాదికి మూడు పంటలు పండించుకునే పరిస్థితుల్లో ఉన్న తమిళనాడుకు తాగడానికి నీరు లేదని చెబుతున్నారంటే న్యాయమూర్తులకు అసలే మాత్రమైనా తెలుసా అన్న అనుమానం కలుగుతోంది’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి న దీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు అన్యాయం జరిగింది. అయితే ఆవేశపూరితంగా, హింసాత్మకంగా నిరసనను తెలియజేయడం సరికాదు. నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కర్ణాటక తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్‌ను ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడం వల్ల వచ్చే లాభం ఏదీ ఉండదు. ఫాలి నారిమన్‌కు కావేరి వివాదానికి సంబంధించిన పూర్తి విషయాలపై అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను కాదని మరో వ్యక్తిని నియమిస్తే సమస్య మరింత ఆలస్యమవుతుంది’ అని దేవెగౌడ వివ రించారు. కార్యక్రమంలో జేడీఎస్ ఎంపీ సి.ఎస్.పుట్టరాజు తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రిలో మాజీ ప్రధాని పూజలు
భద్రాచలం: మాజీ ప్రధానమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హరదనహళ్లి దొడ్డేగౌడ దేవే గౌడ (హెచ్.డి.దేవేగౌడ) ఆదివారం తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీమణి చెన్నమ్మతో కలిసి ఆదివారం భద్రాద్రి ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పురోహితులు, అధికారులు.. మాజీ ప్రధాని దంపతులకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి గౌరవించారు. తర్వాత తీర్థప్రసాదాలు అందజేశారు. దేవేగౌడ దంపతుల వెంట కొందరు జేడీ(ఎస్) నాయకులు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టంచేశారు. దేవేగౌడ దంపతుల పాతఫొటోలు కొన్ని మీకోసం.. -
దేవెగౌడకు అవమానంపై జేడీఎస్ కన్నెర్ర
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడను రాజ్‌భవన్ వర్గాలు, గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అవమానించడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. గవర్నర్ చర్యను నిరసిస్తూ నగరంలో గురువారం ధర్నాకు దిగారు. నగరంలోని ఆనందరావ్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించిన జేడీఎస్ కార్యకర్తలు గవర్నర్ వజుభాయ్ వాలా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన జేడీఎస్ సీనియర్ నేత వై.ఎస్.వి.దత్త మాట్లాడుతూ.....మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడకు జరిగిన అవమానం ఆయన ఒక్కడికి జరిగింది కాదని, యావత్ కర్ణాటక రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆక్రోశం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రంలోని సమస్యలపై వినతి పత్రం అందజేసేందుకు రాజ్‌భవన్‌కు వెళితే ఆయనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ నడుచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈసంఘటనకు గవర్నర్ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆయన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కన్నడ సంఘాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఈ విషయంపై పోరాటం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే శరవణ మాట్లాడుతూ.....రాజ్‌భవన్‌కు ‘నో ఎంట్రీ’ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేదని వ్యంగ్యమాడారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ కన్నడ ఆస్తి అని, ఆయనను అవమానించడం అంటే కర్ణాటక ప్రజలందరినీ అవమానించడమేనని ఆక్రోశం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఇటీవలి కాలంలో గుజరాత్ భవన్‌లా మారిపోయిందని మండిపడ్డారు. గవర్నర్ వజుభాయ్ వాలాను తక్షణమే ఆ పదవి నుండి తప్పించాలని కోరుతూ త్వరలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాలయ్యతో పాటు పెద్ద ఎత్తున జేడీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజకీయ నిష్ర్కమణ ఉండబోదు
మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అదే సందర్భంలో రాజకీయాల నుంచి నిష్ర్కమణ ఉండబోదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం కోసమని, అయితే రాజకీయాల్లో తాను కొనసాగాలనుకుంటున్నది మాత్రం పార్టీని పటిష్టం చేసుకొనేందుకు అని దేవెగౌడ తెలిపారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ సమయంలో రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు చెబుతారన్న ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి సైతం 2018లో పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవేగౌడ గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్.డి.కుమారస్వామి సారధ్యంలో జేడీఎస్ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే 40స్థానాలు సాధించిందని, ఇదే సందర్భంలో ఓ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలిగిందే మీకు తెలిసిందే కదా! అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహదాయి నదీజలాల పోరాటం, ఎత్తినహొళె అమలుకోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న విషయం అర్థమవుతోందని అన్నారు. కళసా బండూరి పథకం అమలు కోసం ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరినా ఆయన స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రానున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో సైతం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే ఎన్నికల బరిలో దిగనున్నాయని హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. -
ఆ బిల్లుకు ఆమోదం తెలపకండి
గవర్నర్‌తో సమావేశమైన మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) విభజన బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తే ఇక బీబీఎంపీ విభజన ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ శుక్రవారమిక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు. బీబీఎంపీ విభజన బిల్లు ఇప్పటికే గవర్నర్‌కు చేరిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలపవద్దని దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ వాలాను కోరారు. సమావేశం అనంతరం దేవేగౌడ విలేకరులతో మాట్లాడుతూ...‘బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేస్తే ఇక బీబీఎంపీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, బీబీఎంపీ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇది రాజ్యాంగంలోని 74వ సెక్షన్‌కు విరుద్ధం. ఇదే విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ వజుభాయ్ వాలా చాలా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంలో లోకాయుక్త(సవరణ) బిల్లు పై సైతం గవర్నర్‌తో చర్చించాను’ అని వెల్లడించారు. -
మరో పోరాటం
జేడీఎస్ పటిష్టత కోసం కృషి: హెచ్.డి.దేవేగౌడ బెంగళూరు: రాష్ట్రంలోని రెండు జాతీయ పార్టీలకు ధీటుగా జేడీఎస్‌ను మరింత పటిష్టం చేసేందుకు మరోసారి పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. నగరంలోని కృష్ణామిల్ వద్ద నూతనంగా నిర్మించనున్న జేడీఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ నిర్వహించిన అనంతరం హెచ్.డి.దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా పార్టీని పటిష్టం చేసేందుకు తన వద్ద లక్షలాది కార్యకర్తలున్నారన్నారు. వారందరినీ ఒక్కతాటి పైకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. జేడీఎస్‌ను రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా రూపొందించడమే తన లక్ష్యమని, అందుకే ఈ వయసులోనూ పోరాటానికి సిద్ధమయ్యానని అన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇక తమ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం నగరంలో కొంత స్థలాన్ని కేటాయించినందుకు బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణతోపాటు బీబీఎంపీలోని ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దేవేగౌడ తెలిపారు. 15 రోజుల్లో ఈ స్థలంలో ఓ తాత్కాలిక షెడ్‌ను నిర్మించి, అనంతరం పూర్తిస్థాయి కార్యాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. -
కావేరి మండలి వద్దు
ప్రధానితో దేవెగౌడ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం కావేరి జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని ఏర్పాటు చేయవద్దని విన్నవించారు. మండలి ఏర్పాటైతే కర్ణాటక రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందితే ప్రధానిని మంగళవారం కలుసుకోనున్న అఖిల పక్ష బృందంలో నిస్సంకోచంగా పాల్గొంటానని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టుల నడుమ ఈ వివాదం నలుగుతున్నందున దీనిపై తాను మరింత వివరంగా మాట్లాడలేనని అన్నారు. కేబినెట్ నోట్ సిద్ధం కాలేదు కావేరి జల నిర్వహణా మండలి ఏర్పాటుకు కేబినెట్ నోట్ సిద్ధమైందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజె తెలిపారు. ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ దీనిపై ఎలాంటి అపోహలకు తావు లేదని అన్నారు. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడడంలో బీజేపీ ఎంపీలు వెనుకంజ వేయబోరని ఆమె స్పష్టం చేశారు. -
లెఫ్ట్ నేతలతో నితీష్ మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. ప్రకాష్ కారత్, ఏబీ బర్దన్లతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు నేతలు మామూలుగా కలిసారని, ఇది అధికారిక భేటీ కాదని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే అధికారికంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత 11 పార్టీలు సమావేశమయి మూడో ఫ్రంట్ చర్చిస్తాయని దేవెగౌడ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి మూడో ఫ్రంట్‌కు రూపురేఖలు వస్తాయని ప్రకాష్ కారత్ అన్నారు. -
నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
సాక్షి, బెంగళూరు : నిబంధలనకు విరుద్ధంగా రైతుల నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మా ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు దేవెగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైస్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్‌ఖైనీ ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని పనులు కానిచ్చేస్తున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని నైస్ కంపెనీ చేపట్టిన ‘బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్షర్ కారిడార్’ (బీఎంఐసీ)ను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలన్నారు. లేదా ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టాలన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బీఎంసీ’ ప్రాజెక్టును తామే చేపడుతామని ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పాయన్నారు. అంతేకాకుండా టోల్ కూడా సేకరించబోమని చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. అందువల్లే ప్రస్తుతం ‘బీఎంఐసీ’ కోసమని రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే కలుగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని దేవెగౌడ పేర్కొన్నారు.