
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హసన్ జిల్లా హోలెనారసిపురలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దేవెగౌడ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు తన సతీమణి చెన్నమ్మ దేవెగౌడ, కుమారుడు రేవన్న కుటుంబసభ్యులు కూడా ఓటు వేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాజా ఎన్నికల్లో జేడీఎస్ బాగా పనిచేసిందని, చక్కగా ప్రచారం నిర్వహించిందని దేవెగౌడ పేర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. జేడీఎస్ కింగ్‌మేకర్ అయ్యే అవకాశముందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment