సాక్షి, బెంగళూరు : నిబంధలనకు విరుద్ధంగా రైతుల నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మా ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు దేవెగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైస్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్‌ఖైనీ ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని పనులు కానిచ్చేస్తున్నాడన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని నైస్ కంపెనీ చేపట్టిన ‘బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కారిడార్’ (బీఎంఐసీ)ను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలన్నారు. లేదా ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టాలన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బీఎంసీ’ ప్రాజెక్టును తామే చేపడుతామని ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పాయన్నారు.
అంతేకాకుండా టోల్ కూడా సేకరించబోమని చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. అందువల్లే ప్రస్తుతం ‘బీఎంఐసీ’ కోసమని రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే కలుగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని దేవెగౌడ పేర్కొన్నారు.
నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
Published Tue, Jan 7 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement