Black List
-
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్లు చిన్నారుల మృతికి కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది విషపూరితమైందనీ, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ మైడెన్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్‌ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేసిందనీ, అందులో మైడెన్ కూడా ఒకటని ఠాకూర్ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్ లేదన్నారు. కేరళ, గుజరాత్‌లోని రెగ్యులేటర్లు మైడెన్ మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు. బిహార్ ఇప్పటికే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్) మైడెన్ ఫార్మాస్యూటికల్ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్‌లు నాణ్యత లేనివిగా గుర్తించారు బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ) వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు) జమ్మూ కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం) కేరళ (2021) : మెట్ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య) కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు) కేరళ (2021): మెట్ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య) కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత) ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్‌ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?
FATF kept Pakistan on the grey list: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్(బ్లాక్ లిస్ట్)లో ఉంచిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా పాక్ త్వరలోనే ఆ గ్రే లిస్ట్ నుంచి బయటపడునుందని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖార్ చెబుతున్నారు. అంతేకాదు ఆ బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడేందకు పాక్ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్ బయటపడేందకు పలు రకాలుగా కృషి చేసింది. ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ తీవ్రవాదం, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఫైనాన్సింగ్ విషయాల్లో సాధించిన పురోగతిని ధృవీకరించింది. అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ను రక్షించడానికి జీ7 దేశాలు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్డాగ్ పాక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం 34 అంశాలను కవర్ చేస్తూ.. రెండు కార్యాచరణ ప్రణాళికలను గణనీయంగా పూర్తి చేసింది. దీపిలె భాగంగా అక్టోబర్‌లో జరిగే తదుపరి ఎఫ్ఏటీఎఫ్ సమావేశాని కంటే ముందే ఇస్లామాబాద్‌లో పర్యటించనున్నట్లు ఎఫ్ఏటీఎప్ తెలిపింది. ఆ పర్యటనలో ఇస్లామాబాద్‌లో ఉగ్రవాదం, మనీలాండరింగ్ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏర్పాటు చేసిన చట్టాలు, తీసుకుంటున్న చర్యలను గురించి ఎఫ్ఏటీఎప్ తనీఖీలు చేయనున్నట్లు పేర్కొంది ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ మాట్లాడుతూ...ఈ జాబితా నుంచి పాక్ కచ్చితంగా తప్పుకుంటుందని విశ్వసిస్తున్నాం. పాక్‌లో త్వరలో కొత్త సంస్కరణ జరుగుతాయి. ఇది ఒక రకంగా పాక్ ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. గ్రే లిస్ట్ నుంచి నిష్క్రమించడం వల్ల విదేశీ పెట్టుబడులు, పెరుగడమే కాకుండా, ఐఎంఎప్ రుణాలను కూడా పొందగలుగుతుంది. మళ్లీ పాక్ ఇలాంటి గ్రే లిస్ట్‌లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటాం " అని అన్నారు. (చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్‌బై!) -
బ్లాక్ లిస్టులో పెట్టినా.. బాద్షాలా!
టెండర్లు దక్కించుకొని.. పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను జీవీఎంసీ బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే కార్పొరేషన్ పరిధిలో ఏ పనులకు సంబంధించిన టెండర్లలో అయినా వారు పాల్గొనే అవకాశం ఉండదు. కానీ కొందరు ఇంజినీరింగ్ సిబ్బంది మాత్రం నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు. కొత్త టెండర్లలో వారికి చోటు కల్పించి పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: వివిధ కారణాలతో గ్రేటర్ విశాఖ పరిధిలో పనులు నిర్వహిస్తున్న 26 మంది కాంట్రాక్టర్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్ బ్లాక్ లిస్టులో పెట్టారు. చిన్నచిన్న తప్పులు చేసిన 21 కాంట్రాక్టు సంస్థల్ని ఏడాది పాటు.. విభిన్న రకాల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు కాంట్రాక్టర్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. ఏడాది నిషేధం ఉన్న కాంట్రాక్టర్లలో చాలా మంది వరకూ ఈ ఏడాది జూలై వరకూ, ఐదేళ్ల నిషేధం ఉన్న కాంట్రాక్టర్లు 2025 డిసెంబర్ వరకూ ఏ విధమైన టెండర్లలో పాల్గొన కూడదు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొందరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం నిషేధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ పిలుస్తున్న టెండర్లలో తమ అర్హతకు సరిపోయే పనుల్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంజినీర్ల సహకారంతోనే.. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ ఏదైనా ఈ–టెండర్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన వెంటనే రిజెక్ట్ లిస్టులో చేరే వ్యవస్థ జీవీఎంసీలో ఉంది. సదరు కాంట్రాక్టర్ ఫర్మ్ పేరు మార్చి పాన్ కార్డు, లేదా ఆధార్, జీఎస్టీ నంబర్.. ఇలా ఏదైనా ఎంటర్ చేసినా టెండర్ తిరస్కరించాలి. అదే విధంగా ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని తిరిగి సదరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు. పదేపదే రిజెక్ట్ చేసినా టెండర్లలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిషేధాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అధికారాలు జీవీఎంసీ అధికారులకు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాసే పనిలో ఇంజినీరింగ్ సిబ్బంది తలమునకలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్నా వారికి ఎలాగైనా కాంట్రాక్టు దక్కించుకునేలా కుయుక్తులు పన్నుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే యూపీహెచ్సీ టెండర్ల వ్యవహారంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. రూ.కోట్ల విలువ చేసే పనులని దక్కించుకునేందుకు ఐదేళ్ల బ్లాక్ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఆ టెండర్లలో పాల్గొన్నారు. దాదాపు అన్ని టెండర్లలోనూ టెక్నికల్ బిడ్ వరకూ ఆ కాంట్రాక్టర్‌ను ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి ఆ కాంట్రాక్టర్‌ను టెండర్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. కొందరు ఇంజినీరింగ్ అధికారులు సిబ్బంది కలిసి.. చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. టెండర్లు ఫైనలైజ్ చేసే సమయంలో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించి.. నిషేధిత కాంట్రాక్టర్‌ను పక్కన పెట్టారు. పదే పదే.. అదే శైలి.. ఈ ఒక్క కాంట్రాక్టర్ మాత్రమే కాదు బ్లాక్ లిస్టులో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు తమ ఫర్మ్ పేరు మార్చి.. పాత పాన్, ఆధార్ నంబర్‌తో టెండర్లలో పాల్గొంటున్నారు. ఈ విషయం ఇంజినీరింగ్ సిబ్బందికి తెలిసినా.. ఏమీ తెలీనట్లుగా వారికి టెండర్లు అప్పగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లపై నిశిత దృష్టితో వ్యవహరించకపోతే జీవీఎంసీ పనుల వ్యవహారంలో మళ్లీ అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కార్పొరేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్) -
షావోమీకి అమెరికా షాక్..
హాంకాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలం ముగుస్తున్న ఆఖరు రోజుల్లోనూ చైనాను వదిలిపెట్టడం లేదు. తాజాగా మరో తొమ్మిది చైనీస్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ షాకిచ్చారు. స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్‌తో పాటు చైనాలో మూడో అతిపెద్ద చమురు సంస్థ సీఎన్‌వోవోసీ, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (కొమాక్), స్కైరీజన్ తదితర 9 సంస్థలను అమెరికా బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ కంపెనీలకు.. మిలిటరీతో సంబంధాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ కంపెనీల్లో అమెరికన్ ఇన్వెస్టర్లు.. తమకేమైనా పెట్టుబడులు ఉంటే వాటిని ఈ ఏడాది నవంబర్‌లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా తీసుకుంటున్న చర్యలన్నీ అమెరికా దేశ భద్రతకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించనున్నాయంటూ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన సంస్థలకు అమెరికన్ కంపెనీలు.. తమ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎగుమతులు చేయడం, టెక్నాలజీని బదలాయించడం వంటివి చేయకూడదు. ఇప్పటికే 60 చైనీస్ కంపెనీలను అమెరికా ఈ లిస్టులో చేర్చింది. చైనా మిలటరీతో సంబంధాల్లేవు: షావోమీ అయితే చైనా మిలటరీతో తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని షావోమీ తెలిపింది. నిబంధనలకు లోబడి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నామని స్పష్టం చేసింది. కంపెనీ, షేర్లహోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సమీక్షించుకుని, తదుపరి ప్రకటన జారీ చేస్తామని తెలిపింది. చదవండి: వెనక్కి తగ్గిన వాట్సాప్.. ఆ నిర్ణయం 3 నెలలు వాయిదా ఇచట గాలి నుంచి నీరు తయారు చేయబడును -
చైనా టాప్ చిప్ మేకర్‌కు షాకివ్వనున్న ట్రంప్
వాషింగ్టన్: చైనా కంపెనీలకు వరుస షాక్‌లిస్తున్న ట్రంప్ సర్కార్ మరో కీలక అడుగు వైపు కదులుతోంది. చైనా దిగ్గజ చిప్‌మేకర్ ఎస్ఎంఐసీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. ఈ మేరకు ఒక ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. చైనా కంపెనీ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసి)పై వాణిజ్యపరంగా చర్య తీసుకోవాలని యోచిస్తోంది. ఇందుకు రక్షణ శాఖ ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఈ వారం ప్రారంభంలో, పెంటగాన్ స్మిక్ని కట్టడి చేసేందుకు ఒక ప్రతిపాదన చేసినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై స్మిక్ గానీ, వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం గానీ ఇంకా స్పందించలేదు ట్రంప్ ప్రభుత్వం తరచుగా చైనా, హువావే కంపెనీలను బ్లాక్ లిస్టులో చేరుస్తోంది. దాదాపు 275 పైగా చైనా కంపెనీలు ఈ కోవలో ఉన్నాయి. కీలకమైన చైనా పరిశ్రమలను దెబ్బకొట్టేందుకు, టెలికాం పరికరాల దిగ్గజాలు హువావే టెక్నాలజీస్, జెడ్‌టిఇ ఉన్నాయి. అలాగే చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 24 చైనా కంపెనీలను గతనెలలో అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టెల్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్టెల్ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేస్తోంది. -
నిబంధనలు పాటించకపోతే బ్లాక్‌లిస్ట్
కోల్డ్ స్టోరేజీ యజమానులకు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ హెచ్చరిక గుంటూరు (కొరిటెపాడు): అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని కోల్డ్‌స్టోరేజీలను బ్లాక్‌లిస్టులో పెట్టి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు స్పష్టం చేశారు. స్థానిక చుట్టుగుంటలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్ల వ్యవధిలో ఏడు శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలపై నియంత్రణ లేదనే అపోహ వుందని, దానిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కోల్డ్‌స్టోరేజీలకు ప్రత్యేక లైసెన్సు విధానం తీసుకురావడానికి కొలతలు తయారు చేయాలని సూచించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారుల నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)లు క్రోడీకరించి ప్రతి ఏడాది లైసెన్సును రెన్యువల్ చేసేలా చూస్తామని, ఈ మూడు కంటిన్యుటీ లేకపోతే స్టోరేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్సు ధ్రువీకరణ పత్రానికి రాకపోతే బ్లాక్‌లిస్టులో పెడ్తామన్నారు. ప్రమాదాల నివారణకు పూర్తి కొలతలతో ప్రొఫార్మాను తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన శనివారం మధ్మాహ్నం 12 గంటలకు కోల్డ్‌స్టోరేజీల్లో ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి సీసీ కెమెరాలు, కార్బన్డైఆకై ్సడ్(నిప్పును ఆర్పేది), డ్రై స్ప్రింక్లర్స్ ఏర్పాటు, లక్ష లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. -
బ్లాక్ లిస్ట్‌లో ఆయన ఫోన్!
ప్రముఖుల జీవితాల్లో ఏది జరిగినా మీడియాకు ఎక్కేస్తుంది. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీల విడాకుల కథలోని సంగతులు ఇప్పుడు అలాగే బయటకొస్తున్నాయి. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్తో పన్నెండేళ్ల సహ జీవనం, రెండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఏంజిలినా జోలీ కోర్టులో కేసు వేశారు. ఆరుగురి పిల్లల్ని తీసుకుని అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అంతే కాదండోయ్... ఇన్ కమింగ్ మెస్సేజ్‌లతో పాటు బ్రాడ్ పిట్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా జోలీ బ్లాక్ లిస్టులో పెట్టారట. దాంతో, హీరోగారు షాకయ్యారట. ‘‘గతంలో చాలాసార్లు విడాకులు ఇస్తానని బెదిరించింది. నిజంగా ఇంత పని చేస్తుందనుకోలేదు’’ అని సన్నిహితుల వద్ద బ్రాడ్ పిట్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వార్త. ఈ స్టార్ విడాకుల కేసులో పోను పోనూ ఇంకెన్ని కబుర్లు బయటికొస్తాయో చూడాలి. -
పని చేయకుంటే ‘బ్లాక్ లిస్టే’
ఖమ్మం : నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానా విధించడంతోపాటు పేర్లు బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో జిల్లా అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్, జిల్లా పరిషత్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంత్రి తుమ్మల సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాకతీయ మిషన్ పనుల్లో చెరువు పూడిక పనులకంటే ముందు సిమెంటు పనులు పూర్తిచేయాలన్నారు. మొదటి దశలో 851 పనులకు.. 801 పనులు పూర్తయ్యాయని, రెండో దశలో 927 పనులు మంజూరు చేయగా.. 41 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 865 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జూన్ 15 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా 4,517 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో చెరువుల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. పాలెం వాగు పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. దీనిద్వారా 12,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెక్‌డ్యామ్ పనులను వేగవంతం చేయాలని, పదిహేను రోజుల్లో సేఫ్ లెవల్ వంతెన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భగీరథ పనులతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయవద్దన్నారు. 740 గ్రామాలకు డిసెంబర్ నాటికి తాగునీరు అందిస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ పనితీరు సరిగా లేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథలో పర్ణశాల, పూసూరు, కూసుమంచి ఇన్‌టేక్, వాటర్ టెస్టింగ్ ప్లాంటును సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు భూసేకరణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. -
గడువులోగా చేయకుంటే బ్లాక్‌లిస్ట్‌లో..
ఇంజనీరింగ్ పనులపై జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పనులను గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో అమలవుతున్న కార్యక్రమాలపై శనివారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతను పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందిస్తున్న నిధులను బ్రిడ్జిల నిర్మాణానికి వినియోగించుకోవాలని, పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నాటించాలన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలివ్వాలన్నారు. -
ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి
కొల్లాపూర్ రూరల్: మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథ కం (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్న పటేల్ కంపెనీ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కొల్లాపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం ట్రయల్న్‌ల్రో భాగంగా నీట మునిగిన ఎంజీ ఎల్ఐ మొద టి లిఫ్ట్‌ను గురువారం వా రు పరిశీలించా రు. అనంతరం ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ కాం ట్రాక్టర్లు, అధికారులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే మోటార్లు నీట మునిగాయన్నారు. ప్రాజెక్టు మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టరు ఆడిం దే ఆటగా, పాడిందే పాటగా నడుస్తుం దని మండిపడ్డారు. పటేల్ కంపెనీ కాం ట్రాక్టర్లకు పైస్థాయి నుంచే ఆశీర్వాదం ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. జూరాల వద్ద కూడా పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్న పటేల్ కంపెనీ నిర్వాకం వల్లే అక్కడ కూడా నీటి మునకకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎంజీ ఎల్ఐ మోటార్లు నీట మునిగిన వెంటనే మంత్రి హరీష్‌రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సమాచారం ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరి గినప్పుడు అధికారులు, కంపెనీలపై తీ వ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గత ప్రభుత్వ కుట్రలో కు మ్మక్కు కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లో పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసి మోటార్లను సిద్ధం చేయాలన్నారు. మోటార్లు నీట మునగడం వల్ల రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన 25వేల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లనుందని వెల్లడించారు. పంటలకు నష్టం వాటిల్లితే ఎ కరాకు 40 నుంచి 50వేల నష్టపరిహా రం కంపెనీ నుంచి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఈ కంపెనీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయనున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అధికారులు డిజైన్ చేసిన ప్రాజెక్టును కాంట్రాక్టర్లు నిర్మిస్తారు కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు డిజైన్ చేసిన విధంగా ప్రాజెక్టులు చే పట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతంలో పది ప్రాజెక్టులు కడితే తెలంగాణలో ఒకటి, రెండు మాత్రమే కట్టారని, ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉందన్నా రు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మ య్య, ప్రాజెక్టు ఎస్ఈగా పనిచేసిన ఆ యన తమ్ముడు పొన్నాల రామయ్యలి ద్దరూ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇక్కడికి వచ్చి ప్రాజెక్టుపై మాట్లాడాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాం ట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మె ల్యే జూపల్లి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తామని వెల్లడించారు. అంతకు ముందు నీట మునిగిన మోటార్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చి చేరిందని సీఈ కవీందర్, ఎస్ఈ శ్రీరామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తేలడం లేదని అధికారు లు వివరించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిం దని ఎమ్మెల్యే జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి వెంట టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఎంపీపీలు నిరంజన్‌రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వర్రావు, సింగిల్‌విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావు, నాయకులు సు రేందర్‌రావు, రహీం, బాలస్వామి, లోకేష్‌యాదవ్, ఖలీల్, గోపాలమల్లయ్య, కృష్ణయాదవ్ తదితరులున్నారు. -
ఎన్పీడీసీఎల్ తీరే వేరయా!
పనులు చేయలేదని కాంట్రాక్టర్‌కు నోటీసులు బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరిక అయినా.. అతడికే మరో పని అప్పగింత పద్ధతి మార్చుకోని సదరు కాంట్రాక్టు సంస్థ మొదలుకాని రూ.4 కోట్ల పనులు తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు హన్మకొండ, న్యూస్‌లైన్ : చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఉంది... ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారుల తీరు. ఆ కాంట్రాక్టర్ పది లక్షల రూపాయల పని చేయలేడని తెలిసీ.. అతడికే మళ్లీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఆయన పద్ధతి మార్చుకోకపోవడం... పనులు ముందుకు సాగకపోవడంతో సదరు అధికారులు ఏం చేయూలో తోచక తలపట్టుకుంటున్నారు. తమ మీదకు వస్తుందనే కారణంతో సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు. ఇది ఎన్పీడీసీఎల్లో వివాదంగా మారడమే కాకుండా... ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే పనులు చేయడు మొర్రో అంటూ కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు నెత్తీనోరూ బాదుకున్నా... ఆయ న్ను తీసుకొచ్చి అందలమెక్కించడమెందుకు... ఆ తర్వాత తలపట్టకోవడం ఎందుకని విమర్శిస్తున్నారు. అసలేమిటంటే... ఎన్పీడీసీఎల్లో హైవోల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం (హెచ్‌వీడీఎస్) పనుల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన యూడబ్ల్యూటీ సంస్థకు రూ. 40 లక్షల పనులు అప్పగించారు. అంతకుముందు ఖమ్మంలో ఈ సంస్థ పలు పనులు చేసింది. చా లా నిర్లక్ష్యంగా... ఆలస్యంగా పను లు చేయడం తో సదరు కాంట్రాక్టర్‌పై ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు ఫిర్యాదు చేశారు. అంతేకా దు... పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ రెండేళ్ల కిందట మొదలుపెట్టిన పనులు ఇంకా ముం దుకు సాగడం లేదు. ఈ సం స్థ పరిధిలో చేస్తు న్న పనులన్నీ ఇలాగే ఆలస్యమవుతున్నాయి. అధికారులు నోటీసులివ్వడం.. అవి అందిన వారం రోజులు ఏదో పని చేయడం... బిల్లు తీసుకోవ డం... పనులు ఆపేయడం పరిపాటి గా మారింది. అయినప్పటికీ ఆ సంస్థపై ఎన్పీడీసీఎల్ అధికారులు మళ్లీ మక్కువ చూపించారు. వరంగల్ సర్కిల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సంబంధించి ధరలు పెంచాలని బె ట్టు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశం తో యూడబ్ల్యూటీ సంస్థ ప్రతినిధులను పిలిచి మరీ.. అందలమెక్కించారు. ఆ సంస్థతో ఈ ఏడాది ఏ ప్రిల్‌లో టెండర్ వేయించి ఏకంగా రూ. 4 కోట్ల పని అ ప్పగిం చారు. ఒక్క ప్యాకేజీ (4 సబ్స్టేషన్లు) పనులను క ట్టబెట్టారు. కానీ... ఇప్పటివరకు ఒక్క పనీ మొదలుకాలేదు. ఇప్పుడిలా... సబ్స్టేషన్ల కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత.. అధికారులకు పాత పనులు గుర్తుకొచ్చారుు. రెండేళ్ల క్రితం యూడబ్ల్యూటీ సంస్థ చేపట్టిన హెచ్‌వీడీఎస్ పనులు పూర్తికాకపోవడంపై నో టీసులు జారీ చేశారు. బ్లాక్‌లిస్టులో ఎందుకు పెట్టరాదని పేర్కొంటూ నెలరోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని 20 రోజుల క్రితం నోటీసులి చ్చారు. గడువు దాటినా... సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకూ సమాధానం ఇవ్వకపోవడం గ మనార్హం. అయినా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘బల్క్’మీటర్ల టెండర్లలో గోల్మాల్
=కేటు కంపెనీకి రూ.12.58 కోట్ల కాంట్రాక్ట్! =ముఖ్య నేత సోదరుని ‘హస్తం’ =ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలూ ఆ కంపెనీకే.. =పట్టనట్టు వ్యవహరిస్తున్న జలమండలి సాక్షి, సిటీబ్యూరో : కేటు కంపెనీకి అధికారం అండగా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.12.58 కోట్ల టెండర్ కట్టబెట్టేలా చేసింది. ప్రభుత్వ ‘ముఖ్య’ నేత సోదరుని అండతో బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ గ్రేటర్ పరిధిలో దర్జాగా బల్క్కుళాయిలకు నీటి మీటర్లను ఏర్పాటు చేసే టెండర్ ను దక్కించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ మున్సిపాల్టీ నాలుగేళ్ల పాటు ఈ కంపెనీ నిర్వాకాన్ని పసిగట్టి 2010లోనే బ్లాక్‌లిస్టులో పెట్టింది.కానీ సదరు కంపెనీని జలమండలి ముద్దు చేసింది. అంతేకాదు మహానగరం పరిధిలో ఏకంగా 1318 బడా కుళాయిలకు నీటి మీటర్ల ఏర్పాటుతోపాటు వాటిని ఐదేళ్లపాటు నిర్వహణ(మెయింటినెన్స్)ను చేపట్టే టెండరును కట్టబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ముఖ్య నేత సోదరుని ఒత్తిడి కారణంగానే ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం గడించిన సంస్థలను పక్కనబెట్టి ఈ సంస్థను భుజానికెత్తుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పలు సంస్థలు పోటీ పడ్డా... జలమండలి పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో 1318 బల్క్ కుళాయిలున్నాయి. వీటికి సంబంధించి రోజువారీగా బోర్డు సరఫరా చేస్తున్న నీటిని జీఎస్ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఆటోమేటిక్ మీటర్ రీడర్ల (ఏఎంఆర్)తో పక్కాగా లెక్కించే నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని గతేడాది జూన్ 29న మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం జలమండలి టెండర్ల ప్రక్రియను గతేడాది నవంబరు నెలలో పూర్తిచేసింది. ఇందులో నగరానికి చెందిన మ్యాన్టెక్ సంస్థ, పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్స్ పోటీపడ్డాయి. ఇదే తరుణంలో ముఖ్య నేత సోదరుడు అతిగా జోక్యం చేసుకొని పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పారు. ఈ కంపెనీకే టెండరు కట్టబెట్టాలని తీవ్రస్థాయిలో ఆయన వాటర్‌బోర్డు అధికారులపై ఒత్తిడి చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ బాగోతంలో ఆయనకు బాగానే గిట్టుబాటయినట్లు సమాచారం. ఆయన జోక్యం, ఒత్తిడి కారణంగా జలమండలి వర్గాలూ దీనిపై పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు ఇటీవలే మీటర్ల ఏర్పాటు ప్రక్రియను మొదలెట్టింది. ఈ నెలాఖరులోగా 1318 కుళాయిలకు ఈ మీటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సప‘రేటు’.. బడా కుళాయిల(25ఎంఎం)కు ఏర్పాటు చేయనున్న ఏఎంఆర్ నీటి మీటర్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మెట్రో నగరాల్లో రూ.25 వేల లోపుగానే లభ్యమౌతున్నాయి. కానీ ఈ కంపెనీ నగరంలో ఏర్పాటు చేస్తున్న మీటర్ల ధరలు రూ.60 నుంచి రూ.90 వేలు పలకడం గమనార్హం. మీటర్లకు వ్యయం ఇలా.. ఈ మీటర్ల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.4.43 కోట్లు కేటాయించనుంది. మరో రూ.2.57 కోట్లను మీటర్ల కోసమని జలమండలి వినియోగదారుల నుంచి వసూలు చేసింది. మరో రూ.5.58 కోట్లు జలమండలి వ్యయం చేయనుంది. అంటే 1318 బల్క్ కుళాయిలకు ఏఎంఆర్ నీటి మీటర్ల ఏర్పాటుకు రూ.12.58 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని సదరు కంపెనీ తెలివిగా తన ఖాతాలో వేసుకుంటుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ బాగోతంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని బోర్డు కార్మికసంఘాలు కోరుతున్నాయి. ఇదీ లెక్క... ఏఎంఆర్ మీటర్లకు చేయనున్న వ్యయం : రూ.12.58 కోట్లు గ్రేటర్ పరిధిలో మొత్తం కుళాయిలు: 8.05 లక్షలు గ్రేటర్ పరిధిలో బడా కుళాయిలు: 1318 ఒక్కో ఏఎంఆర్ మీటరు ధర: రూ.60 వేలు-రూ.90 వేలు మెట్రో నగరాల్లో ఏఎంఆర్ మీటర్ల ధర: రూ.25 వేలు -
నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
సాక్షి, బెంగళూరు : నిబంధలనకు విరుద్ధంగా రైతుల నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మా ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు దేవెగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైస్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్‌ఖైనీ ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని పనులు కానిచ్చేస్తున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని నైస్ కంపెనీ చేపట్టిన ‘బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్షర్ కారిడార్’ (బీఎంఐసీ)ను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలన్నారు. లేదా ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టాలన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బీఎంసీ’ ప్రాజెక్టును తామే చేపడుతామని ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పాయన్నారు. అంతేకాకుండా టోల్ కూడా సేకరించబోమని చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. అందువల్లే ప్రస్తుతం ‘బీఎంఐసీ’ కోసమని రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే కలుగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని దేవెగౌడ పేర్కొన్నారు. -
బ్లాక్‌లిస్టులో 3 వేల రైస్ మిల్లులు
సాక్షి, హైదరాబాద్: గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి లెవీ బకాయిలు ఉన్నాయంటూ 3 వేల రైస్ మిల్లులను భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టడంపై మిల్లర్లు మండిపడ్డారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో లెవీ తీసుకోబోమనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును శుక్రవారం సచివాలయంలో కలిసి ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా మంత్రికి పరిస్థితి వివరించారు. ‘గత సీజన్లో 55 లక్షల టన్నుల లెవీ(98.5 శాతం) బియ్యం ఇచ్చాం. 2-3 % లెవీ బియ్యం బకాయిలు ఉన్న కొన్ని మిల్లులను కూడా బ్లాక్‌లిస్టులో పెడతారా?’ అని మిల్లర్లు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత డొల్ల
బెంగళూరు, న్యూస్‌లైన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎంత డొల్లగా ఉందో మేయర్ కట్టె సత్యనారాయణ తనిఖీల్లో బట్టబయలైంది. ఓ ప్రాంతంలో నిర్మించిన డ్రెయినేజీ వాల్స్‌ను ఆయన కాలితో తన్ని పరిశీలించగా అవి కుప్పకూలాయి. దీంతో ఆయన కాంట్రాక్టర్‌పై ఆగ్రహోద్యులయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మైసూరు రోడ్డులో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులను పరిశీలించారు. సిర్శి సర్కిల్ నుంచి బీహెచ్ఇఎల్ వరకు జరిగిన పనులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫుట్‌పాత్‌ల వద్ద నిర్మిస్తున్న డ్రెయినేజీ పనులు పరిశీలించారు. కాలితో ఒక్క సారి తన్నితే అవి పడిపోయాయి. దీంతో అక్కడే ఉన్న కాంట్రాక్టర్, పనులు పరిశీలిస్తున్న ఇంజనీర్లును మేయర్ ఛీవాట్లు పెట్టి హెచ్చరించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో తాము ముక్కుమూసుకొని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు మేయర్ దృష్టికి తెచ్చారు. రోడ్డు పక్కనే మల మూత్రాలను గుర్తించి వెంటనే ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుంతమయమైన రోడ్డును మరమ్మతులు చేయాలని సూచించారు. పనులు పూర్తి చేసేందుకు ఇచ్చిన నాలుగు నెలల గడువు పూర్తయ్యిందని, నవంబర్‌లోపు పనులు పూర్తి చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రోడ్ల పనులతో పాటు బీడబ్ల్యూఎస్ఎస్బీ, బెస్కాం పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట బీబీఎంపీ భారీ పనుల స్థాయి సమితి అధ్యక్షుడు సోమశేఖర్, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, అధికారులు పాల్గొన్నారు.