వాషింగ్టన్: చైనా కంపెనీలకు వరుస షాక్‌లిస్తున్న ట్రంప్ సర్కార్ మరో కీలక అడుగు వైపు కదులుతోంది. చైనా దిగ్గజ చిప్‌మేకర్ ఎస్‌ఎంఐసీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. ఈ మేరకు ఒక ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. చైనా కంపెనీ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంఐసి)పై వాణిజ్యపరంగా చర్య తీసుకోవాలని యోచిస్తోంది. ఇందుకు రక్షణ శాఖ ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఈ వారం ప్రారంభంలో, పెంటగాన్ స్మిక్‌ని కట్టడి చేసేందుకు ఒక ప్రతిపాదన చేసినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై స్మిక్ గానీ, వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం గానీ ఇంకా స్పందించలేదు
ట్రంప్ ప్రభుత్వం తరచుగా చైనా, హువావే కంపెనీలను బ్లాక్ లిస్టులో చేరుస్తోంది. దాదాపు 275 పైగా చైనా కంపెనీలు ఈ కోవలో ఉన్నాయి. కీలకమైన చైనా పరిశ్రమలను దెబ్బకొట్టేందుకు, టెలికాం పరికరాల దిగ్గజాలు హువావే టెక్నాలజీస్, జెడ్‌టిఇ ఉన్నాయి. అలాగే చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 24 చైనా కంపెనీలను గతనెలలో అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment