Chip Company
-
రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్ఎల్బీ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.రూ.166 లక్షల కోట్లు ఖర్చుఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్‌గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్‌ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఏటా ఐదు లక్షల మందిఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు. -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
కేంద్ర ప్రోత్సాహకాలు కొనసాగింపు
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?ఐఎస్ఎం రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారం సెమీకండక్టర్లు ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయబోయే కంపెనీలకు పన్ను, విద్యుత్ బిల్లులో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో రెండు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. మరో రెండింటినీ అస్సాంలోని మోరిగావ్‌లో సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1.48 లక్షల కోట్లు వెచ్చించారు. వీటి ద్వారా మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. -
ఈ ఏడాదే చిప్ ప్లాంటు నిర్మాణం షురూ
న్యూఢిల్లీ: పీఎస్ఎంసీ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలెరాలో తలపెట్టిన రూ. 91,000 కోట్ల సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మెగా యూనిట్ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీనితో ఆ ప్రాంతంలో 20,000 పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ విభాగంలో భారత్ ఎంట్రీకి సారథ్యం వహించగలగడం తమకెంతో గర్వకారణమని టాటా ఎల్రక్టానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమీకండక్టర్ల ప్లాంటులో పవర్ మేనేజ్మెంట్ ఐసీలు, డిస్ప్లే డ్రైవర్లు, మైక్రోకంట్రోలర్లు మొదలైన వాటికి అవసరమైన చిప్స్ తయారు చేయనున్నారు. నెలకు సుమారు 50,000 వేఫర్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. -
29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా!
ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెల్ ఇండియా అధినేతగా, వివిధ హోదాల్లో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన నివృతి రాయ్ ఇంటెల్‌కు రాజీనామా చేశారు. త్వరలో, ‘ఇన్వెస్ట్ ఇండియా’ అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొంత కాలం క్రితం ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట్‌గా కొనసాగుతున్న దీపక్ బగ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని రాయ్ భర్తీ చేయనున్నారు. ఇక రాయ్ రాజీనామాని ఇంటెల్ యాజమాన్యం ధృవీకరించింది. ‘రాయ్ నాయకత్వంలో ఇంటెల్ ఇండియా గణనీయమైన వృద్దిని సాధించిందని కొనియాడింది. ఆర్ధిక సేవల విభాగంలో చేరడంపై అభినందనలు తెలిపింది. రాయ్ 1994లో అమెరికా ఇంటెల్‌లో డిజైన్ ఇంజినీర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. 2005లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె ఆ సంస్థ చిప్సెట్ ఇంజినీరింగ్ అండ్ ఐపీ డెవెలప్మెంట్ గ్రూప్ సీనియర్ డైరెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార మెళుకువలు, అపారమైన అనుభవం కారణంగా 2016 నాటికి ఇంటెల్ ఇండియా అధినేత స్థాయికి చేరుకున్నారు. తాజాగా, ఇంటెల్‌కు రాజీనామా చేసి ఇన్వెస్ట్ ఇండియాలో చేరనున్నారు. నారీ శక్తి పురస్కారం.. ఇంటెల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 2021 నుంచి ఇంటెల్ ఇండియా స్కిల్ ట్రైనింగ్, రూరల్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా, 20లక్షల మంది పిల్లలకు, 5,000 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించింది.ప్రపంచ స్థాయిలో మహిళా వ్యవస్థాపకత, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అత్యుత్తమ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. Congrats to @rnivruti of @IntelIndia on being awarded the #NariShaktiPuraskar by Hon’ble President Shri Ramnath Kovind ji for developing power efficient semiconductor chips & new rural connectivity solutions for cost-effective & high-speed broadband connection.@rashtrapatibhvn https://t.co/e4AKR3rEHH — Basavaraj S Bommai (@BSBommai) March 8, 2022 రాజీనామా.. ఇంటెల్‌లో చర్చాంశనీయం కోవిడ్-19తో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరగడం.. వర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొరత నెలకొంది. చిప్‌లు, సెమీ కండక్టర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, కార్ల ఆవిష్కరణలు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతున్నది. ఇలా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ విభాగాలతో పాటు మొత్తం 169 రకాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటెల్ లాంటి చిప్ తయారీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో నివృతి రాయ్ ఇంటెల్ ఇండియాకు రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద! -
భారత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్
న్యూఢిల్లీ: కంప్యూటర్ స్టోరేజీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ‘సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్’ను గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు రూ.2.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,550 కోట్లు) పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఇందులో మైక్రాన్ సొంతంగా 825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్నాయి. స్థానికంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ (తయారీ, వ్యాల్యూ చైన్) ఏర్పాటుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్టు మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహరోత్రా పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు, అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యం పెరుగుతుందని ప్రకటించారు. సర్కారు నుంచి భారీ సాయం మైక్రాన్ ప్లాంట్‌కు కేంద్ర సర్కారు ‘మోడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)’ పథకం కింద ఆమోదం లభించడం గమనార్హం. ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50% కేంద్ర సర్కారు నుంచి లభిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 20% మేర ప్రోత్సాహకాల రూపంలో గుజరాత్ సర్కారు అందిస్తుంది. మైక్రాన్ తన వంతు 30% వెచ్చిస్తే సరిపోతుంది. దశలవారీగా.. గుజరాత్లో మైక్రాన్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ దశల వారీగా కార్యకలాపాలు చేపట్టనుంది. ‘‘తొలి దశ నిర్మాణం ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. ఇందులో 5 లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్ స్పేస్ ఉంటుంది. 2024 చివరికి కార్యకలాపాలు మొదలవుతాయి’’అని మైక్రాన్ ప్రకటించింది. ఈ ప్లాంట్‌తో 5,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా వచ్చే కొన్నేళ్లలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఫేస్ 2 నిర్మాణం ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో ఉంటుందని పేర్కొంది. సెమీకండక్టర్ రంగానికి ఊతం మైక్రాన్ ఏర్పాటు చేయబోయే సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్ట్ ప్లాంట్ భారత సెమీకండక్టర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేలాది హైటెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వర్థిల్లడానికి ఈ పెట్టుబడి కీలక పునాది అవుతుంది. –అశ్వని వైష్ణవ్, ఐటీ, టెలికం మంత్రి అవకాశాల కోసం చూస్తున్నాం.. భారత్‌లో గొప్ప అవకాశాల కోసం చూస్తున్నాం. మెమొరీ, స్టోరేజీలో మైక్రాన్ ప్రపంచ దిగ్గజంగా ఉంది. డేటా సెంటర్లు, స్మార్ట్ఫోన్లు, పీసీలకు మేము కీలక సరఫరాదారుగా ఉన్నాం. – సంజయ్ మెహరోత్రా, మైక్రాన్ సీఈవో -
5 వేలకుపైగా ఉద్యోగాలు.. భారత్‌లో మైక్రాన్ చిప్ ప్లాంట్‌కు ఆమోదం!
న్యూఢిల్లీ: అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ భారత్‌లో ప్లాంటు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్‌పై మైక్రాన్ 2.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనితో 5,000 పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించాయి. వారం రోజుల క్రితమే ప్రాజెక్టుకు ఆమోదముద్ర లభించినట్లుగా పేర్కొన్నాయి. కంప్యూటర్ మెమొరీ ఉత్పత్తులు, ఫ్లాష్ డ్రైవ్‌లు మొదలైన వాటిని మైక్రాన్ తయారు చేస్తుంది. సెమీకండక్టర్ల పథకాన్ని సమీక్షించి, ప్రోత్సాహకాలను పెంచిన తర్వాత మైక్రాన్ ఓసాట్ (అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్)కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. తొలి దశలో కేంద్రం నాలుగు ఓసాట్ ప్రాజెక్టులను క్లియర్ చేసింది. వీటిల్లో టాటా గ్రూప్, సహస్ర సెమీకండక్టర్స్ ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నింటికన్నా ముందుగా సహస్ర ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. -
చిక్కుల్లో ఆపిల్.. కారణమేంటీ ?
మనిషిని ఆపరేట్ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్ చిప్‌ను అమర్చేందుకు ఎలాన్ మస్క్ న్యూట్రాలింక్ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ ప్రయోగం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని చిప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా టెక్ దిగ్గజం ఆపిల్‌పై దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెమీ కండక్లర్లు, మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి. ఇలాంటి సెమీ కండక్టర్లు, మైక్రో ప్రాసెసర్ల సమాహరాన్నే చిప్ లేదా చిప్‌సెట్‌గా పిలుస్తారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చిప్‌ల తయారీ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ఆన్లైన్ వ్యవహరాలు పెరిగిపోయాయి. జూమ్ మీటింగ్స్, వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులతో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, మాక్ప్యాడ్, ఐప్యాడ్ల వినియోగం పెరిగింది. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగింది. కరోనా సంక్షోభంతో పాటే ఈ సమస్య తలెత్తినా.. గత మార్చి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పటికే చిప్‌లు స్టాక్ ఉండడంతో సమస్యలు తలెత్తలేదు. ఓ వైపు చిప్ స్టాక్ అయిపోవడం మరో వైపు చిప్‌ల తయారీ ఇంకా పుంజుకోకపోవడంతో సమస్య తల్తెతింది. చిప్‌లు, సెమీ కండర్లు లేకపోవడం వల్ల ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యాపారం దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ... చిప్ సెట్ల కొరత కారణంగా మాక్, ఐప్యాడ్ అమ్మకాలు క్షీణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం సమయానికి చిప్ మార్కెట్లోకి రాకపోతే తమకు కష్టమేనన్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఆపిల్ ఆదాయం సుమారు 6 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఇందులో మాక్ నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ .61 వేల కోట్లు ఉండగా ఐప్యాడ్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు 54 వేల కోట్లుగా నమోదు అయ్యింది. -
చైనా టాప్ చిప్ మేకర్‌కు షాకివ్వనున్న ట్రంప్
వాషింగ్టన్: చైనా కంపెనీలకు వరుస షాక్‌లిస్తున్న ట్రంప్ సర్కార్ మరో కీలక అడుగు వైపు కదులుతోంది. చైనా దిగ్గజ చిప్‌మేకర్ ఎస్ఎంఐసీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. ఈ మేరకు ఒక ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది. చైనా కంపెనీ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసి)పై వాణిజ్యపరంగా చర్య తీసుకోవాలని యోచిస్తోంది. ఇందుకు రక్షణ శాఖ ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఈ వారం ప్రారంభంలో, పెంటగాన్ స్మిక్ని కట్టడి చేసేందుకు ఒక ప్రతిపాదన చేసినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై స్మిక్ గానీ, వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం గానీ ఇంకా స్పందించలేదు ట్రంప్ ప్రభుత్వం తరచుగా చైనా, హువావే కంపెనీలను బ్లాక్ లిస్టులో చేరుస్తోంది. దాదాపు 275 పైగా చైనా కంపెనీలు ఈ కోవలో ఉన్నాయి. కీలకమైన చైనా పరిశ్రమలను దెబ్బకొట్టేందుకు, టెలికాం పరికరాల దిగ్గజాలు హువావే టెక్నాలజీస్, జెడ్‌టిఇ ఉన్నాయి. అలాగే చైనాలోని షింజియాంగ్‌లోని ఓ తెగ అయిన ఉగర్లపై సామూహిక నిర్బంధం, శ్రమ దోపిడీతోపాటు వారిపై నిఘా వేసిన చైనా అణచివేత కార్యక్రమంలో ఈ సంస్థలు భాగం పంచుకున్నాయని అమెరికా వాణిజ్య విభాగం ఆరోపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 24 చైనా కంపెనీలను గతనెలలో అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. -
హెచ్చుతగ్గులు కొనసాగుతాయ్
* క్యూ3 ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి * పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం న్యూఢిల్లీ: టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థికవ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని నిపుణులు చెపుతున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్‌లు 2014 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ వారం ఫలితాల్ని వెల్లడించనున్నాయి. అలాగే నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), డిసెంబర్ నెలకు వినియోగ, టోకు ద్రవ్యోల్బణాల గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. సోమవారం ఐఐపీ, వినియోగ ద్రవ్యోల్బణం డేటా, బుధవారం టోకు ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడవుతాయి. ఈ డేటాతో పాటు టీసీఎస్, రిలయన్స్, విప్రో తదితర కంపెనీల ఫలితాల్ని ఇన్వెస్టర్లు గమనించి, అందుకు అనుగుణంగా ట్రేడింగ్ నిర్ణయాల్ని తీసుకుంటారని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గతవారం మార్కెట్లో పెరిగిన షేర్లకంటే తగ్గిన షేర్ల సంఖ్య అధికంగా వున్నందున, సమీప భవిష్యత్తులో సూచీల హెచ్చుతగ్గులు ఈ వారం కూడా కొనసాగుతాయని ఆయన అంచనావేశారు. అమెరికా జాబ్స్ డేటాకు అనుగుణంగా సోమవారం మార్కెట్లు ప్రారంభమవుతాయని, అటుతర్వాత భారత్‌లో విడుదలయ్యే గణాంకాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురికావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో విడుదలైన డేటా ప్రకారం డిసెంబర్ నెలలో అక్కడి నిరుద్యోగం రేటు 5.6 శాతానికి తగ్గింది. అయితే డేటా అనుకూలంగా వున్నా, అమెరికా సూచీలు ఆ రోజున క్షీణించాయి. అలాగే చమురు ధరల పతనం, గ్రీసు సంక్షోభం వంటి అంతర్జాతీయ రిస్కులు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతూనే వున్నందున, ఈ అంశాలకు సంబంధించిన వార్తలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో ఫండ్ మేనేజర్ హిరేన్ ధకాన్ చెప్పారు. అమ్మకాల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు... గతేడాది భారత్ మార్కెట్లో భారీ పెట్టుబడిపెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టరు ్ల(ఎఫ్ఐఐలు) కొత్త ఏడాది ప్రారంభంలో మాత్రం అమ్మకాలు జరుపుతున్నారు. జనవరి నెలలో ఇప్పటిదాకా ఈక్విటీల్లో రూ.1,673 కోట్ల నికర విక్రయాలు జరపగా, రూ. 2,620 కోట్ల విలువైన బాండ్లను నికరంగా కొనుగోలు చేశారు. గతేడాది ఎఫ్ఐఐలు బాండ్లు, ఈక్విటీల్లో మొత్తంరూ. 2.58 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.