ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్‌సోర్స్‌డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్‌ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
ఐఎస్‌ఎం రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారం సెమీకండక్టర్లు ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయబోయే కంపెనీలకు పన్ను, విద్యుత్ బిల్లులో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో రెండు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. మరో రెండింటినీ అస్సాంలోని మోరిగావ్‌లో సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1.48 లక్షల కోట్లు వెచ్చించారు. వీటి ద్వారా మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment