
భారతదేశంలోని అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ ఏఐ ప్రాజెక్ట్‌ల విలువ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి.
ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్‌బాట్(ChatBot)ను అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ‘మై స్కీమ్’ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడానికి ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తుంది. పౌరులు వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటికోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం
జంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ-వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్‌సైట్లను కేంద్రం అంతర్గత ఏఐ ప్రాజెక్టు ‘భాషిణి’ని నిర్వహిస్తోంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్, నాణ్యతను, సంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment