రామగుండంలో ప్రాజెక్ట్‌లకు పీఎం వర్చువల్‌గా శంఖుస్థాపన
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్‌మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.
ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
గ్రౌండ్‌మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.
ఎన్‌టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఎన్‌టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.
రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.
ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment