Solar Power Station
-
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
భూటాన్‌లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో ‘సూర్య ఘర్’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.ఇదీ చదవండి: ‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సౌర విద్యుత్‌లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్‌లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్‌ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
సోలార్ ఇన్స్టలేషన్లు 44 శాతం డౌన్..
న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది. 2022లో భారీ స్థాయి సోలార్ ఇన్స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్‌టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్‌కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్‌ను ఫ్యూయల్ గ్యాస్‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌ను గ్యాస్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
పవర్ ‘ఫుల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందనుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్ విధానంలో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లుఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ అండ్ సీఈఓ ఎం.కమలాకర్ బాబు, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శువేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. వీటన్నింటి వల్ల రానున్న రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. సరికొత్త అడుగులు.. నాణ్యమైన వెలుగులు ► 19 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ రూ.620 కోట్లతో 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2,479 కోట్లతో మరో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా సుమారు రూ.3,099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. మరోవైపు రూ.3,400 కోట్లతో దాదాపు 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వీటి వల్ల 1,700 ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిన్నింటి కోసం దాదాపు రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ►ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్స్టేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ వాటి నిర్మాణాలు ప్రారంభిస్తూ, నిర్మించిన వాటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ► ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదని, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేయాలని అధికారులు చెప్పారు. అందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే ఇస్తున్నాం. 25 ఏళ్లపాటు ఢోకా ఉండదు ► రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే, మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్ సగటు ధర రూ.5.30 పడే పరిస్థితులుంటే రూ.2.49కే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ► అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఇప్పటికే 25 వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనంగా మరో 200 ఉద్యోగాలు వస్తాయి. ► 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి రూ.10 వేల కోట్లకు సంబంధించి హెచ్పీసీఎల్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపు మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ కెఎస్జవహర్రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, హెచ్‌పీసీఎల్ డైరెక్టర్ అమిత్ గార్గ్, హెచ్‌పీసీఎల్, ఆయానా, స్ప్రింగ్ అగ్నిత్రా, సోలార్ ఎనర్జీ ఏపీ సిక్స్ ప్రై వేట్ లిమిటెడ్, అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాం. అక్టోబర్ ఆఖరు వరకు 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ.46,581 కోట్ల సబ్సిడీ అందించాం. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ ఏడాది అదనంగా నిర్ణీత కాలపరిమితిలో మంజూరు చేశాం. వ్యవసాయ విద్యుత్ కోసం ‘సెకీ’తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. స్మార్ట్ మీటర్స్ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ.52,015 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 12,586 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. సీఎం చిత్తశుద్ధితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ మంత్రి -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
జలాశయాలపై భారీగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, లోయర్ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో ఫ్లోటింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్‌లో సింగరేణి సంస్థలు తమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సమస్య తప్పుతుంది! భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
దేశంలో రికార్డ్ స్థాయిలో సౌర వెలుగులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్ ఇండియా రిసర్చ్ తెలిపింది. భారత సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్‌లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్–జూన్‌లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది. 2022 జనవరి–జూన్‌లో, అలాగే జూన్ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. ఏప్రిల్–జూన్‌లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్ 1 నుంచి సోలార్ మాడ్యూల్స్‌పై 40, సోలార్ సెల్స్‌పై 25 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. చదవండి: మా రేంజ్ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన -
సౌరశక్తి ఉత్పాదనలో మెట్రో రైల్ సూపర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సౌరశక్తి ఉత్పాదనలో ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తోంది. కర్భన ఉద్గారాలను తగ్గించే కృషిలో ముందుంటోంది. ప్రస్తుతం 28 మెట్రో స్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీ ప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండడం విశేషం. మెట్రో స్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి.. ► సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినపుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుండడం విశేషం. సౌరశక్తి, రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రో స్టేషన్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. ► లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రో స్టేషన్లలో 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం,క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడు గుంతలను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. పలు అవార్డుల పంట.. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం కారణంగా నగర మెట్రోకు పలు అవార్డులు వరించాయి. గతేడాది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డ్(2021) దక్కింది. ఇక తాజాగా ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ మెట్రో సిస్టం బై రైల్ అనాలిసిస్ ఇండియా(2022) అవార్డు వరించింది. (క్లిక్: ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్) మూడు లక్షల మార్కును దాటిన ప్రయాణికుల సంఖ్య.. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో నిత్యం మూడు లక్షల మంది జర్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. మే నెలలో అధిక ఎండల కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో జర్నీకి మొగ్గు చూపడం విశేషం. -
ఒక్కోమెట్టు ఎక్కుదాం.. గమ్యాన్ని చేరుకుందాం
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. దేశవ్యాప్తంగా మరుగన పడిపోయిన ప్రతిభావంతులు, స్ఫూర్తిని అందించే ఘటనలు చోటు చేసుకునప్పుడు ట్విటర్ వేదికగా వాటికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో కల్లోల కశ్మీరానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను మనతో పంచుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోని పల్లి పంచాయితీ దేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామ పంచాయితీగా మారి రికార్డు సృష్టించింది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోలార్ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా గ్రామానికి అవసరమైన విద్యుత్‌ని సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో గమనించిన ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. పల్లి గ్రామ పంచాయతీ తరహాలో పంచాయతీ తర్వాత పంచాయతీ లక్ష్యంగా పని చేసుకుంటూ పోతే కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. That’s how to battle climate change and become carbon neutral: Step by step, Panchayat by Panchayat…👏🏼👏🏼👏🏼 https://t.co/vjDcMQ0p2U — anand mahindra (@anandmahindra) April 27, 2022 చదవండి: నేను తర్వాత కొనేది అదే.. ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన -
సౌర వెలుగులు.!
మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్‌పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్‌ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్‌ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. మదనపల్లె ఆర్టీసీ డిపోలు.. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్‌స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్‌ను గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్‌స్టేషన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది. –వెంకటరమణారెడ్డి, వన్ డిపో మేనేజర్.మదనపల్లె దాతలు ముందుకు రావాలి మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్‌లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. –రెడ్డె్డన్నశెట్టి, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె -
కలియుగ వైకుంఠంలో సౌరకాంతులు
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠంగా పిలిచే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సౌరకాంతులు వెలుగులు విరజిమ్మనున్నాయి. తిరుపతి దేవాలయం కోసం సౌర ఫొటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. తిరుపతి, తిరుమల కొండలపై అనేక ప్రదేశాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఎన్‌వీవీఎన్ నిర్మిస్తుంది. వీటినుంచి ఉత్పత్తయ్యే సౌరశక్తిని టీటీడీ కొనుగోలు చేస్తుంది. 25 ఏళ్లకు ఎన్టీపీసీకి భూమి ఇవ్వనున్న టీటీడీ ఎన్‌వీవీఎన్ ఇప్పటికే టీటీడీ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. అనంతరం తమ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల స్థాపనకు కావాల్సిన భూమిని 25 ఏళ్లకు టీటీడీ సమకూరుస్తుంది. తిరుమల ఆలయానికి విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలని టీటీడీ భావిస్తోంది. శేషాచలం కొండ శ్రేణుల్లోని ధర్మగిరిపై 25 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఆలయ నిర్వాహకులు గతేడాది ప్రణాళిక రూపొందించారు. ఒప్పందం అనంతరం ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన వ్యయాన్ని ఎన్‌వీవీఎన్ భరిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 25 ఏళ్లపాటు టీటీడీ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు ధర యూనిట్‌కు రూ.3 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన ధరను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) నిర్ణయిస్తుంది. మొదలైన ఇంధన సామర్థ్య చర్యలు తిరుమల ఆలయాన్ని ఇంధన సామర్థ్య కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గతేడాది ప్రకటిం చింది. ఇప్పటికే ఉన్న పంపుసెట్లు, ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్లను మార్చాల్సిన అవసరాన్ని ప్రాథమిక ఆడిట్ ద్వారా గుర్తించింది. దీనివల్ల ఆలయానికి ఏటా రూ.4.5 కోట్లు ఆదా అవనుంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో కలిసి పలు ఏజెన్సీలు తమ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, ఆలయ భవనాల్లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. -
పీపీఏ ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి లేదు
సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) సమీక్షించి, వాటి ధరలను సవరించే అధికారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లేదని సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సౌరవిద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. పీపీఏల కింద ధరలను ఖరారు చేసేది ఈఆర్‌సీయేనని, ఆ సంస్థ ఖరారు చేసిన ధరలను తిరిగి ఆ సంస్థే సవరించడానికి అవకాశంలేదని చెప్పారు. పీపీఏ నిబంధనల ప్రకారం ధరలను సవరించే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) లేదని, దీంతో అవి ఈఆర్సీ ముందు పిటిషన్ వేసి దాని ద్వారా ధరలను సవరించాలని చూస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను డిస్కంల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. అందుకే పీపీఏ ధరలను ఈఆర్సీ వద్దే తేల్చుకోవాలని సింగిల్ జడ్జి స్పష్టం చేశారని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. -
విశాఖలో హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్ ప్లాంట్‌లో స్టాండలోన్ ఫ్యూయల్–సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ స్థాపించబోతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన చమురులో 85 శాతం, గ్యాస్‌లో 53 శాతం దిగుమతి చేసుకునే మన దేశంలో ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఓ గేమ్‌చేంజర్ కానుందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు తప్పనిసరి? స్వచ్ఛమైన ఇంధనాలను ప్రోత్సహించడానికి.. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు గ్రీన్ హైడ్రోజన్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తినిచ్చే ఎలక్ట్రోలైజర్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా స్థాపించనుంది. దేశంలో ఇంధన భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని సాధించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. సింహాద్రి థర్మల్ కేంద్రం సమీపంలో ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు (నీటిలో తేలియాడే సౌర ఫలకలు) నుండి ఇన్పుట్ పవర్ తీసుకోవడం ద్వారా 240 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సూర్యరశ్మి సమయంలో ఉత్పత్తి చేసిన ఈ హైడ్రోజన్‌ను అధిక పీడనం వద్ద నిల్వచేస్తారు. 50 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఇంధన కణాన్ని ఉపయోగించి విద్యుదీకరిస్తారు. ఇది సా.5 నుండి ఉ.7 వరకు స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక దేశంలో మరికొన్ని హైడ్రోజన్ శక్తి నిల్వ ప్రాజెక్టులను స్థాపించడానికి అవసరమైన అధ్యయనానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. లద్దాఖ్‌తో ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌తో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఆర్ఈఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు డీజిల్ జనరేటర్లపై ఆధారపడిన లద్దాఖ్, జమ్మూ–కశ్మీర్ వంటి దేశంలోని సుదూర ప్రాంతాలను డీకార్బోనైజ్ చేయడానికి ఈ ప్రాజెక్టు నమూనా కానుంది. 2070 నాటికి లద్దాఖ్‌ను కార్బన్ రహిత భూభాగంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టును ఎన్టీపీసీ పైలెట్ ప్రాజెక్టుగా స్థాపిస్తోంది. -
అప్పుడేమో ఘనం! ఇప్పుడేమో ఇలా..
ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. భారంగా.. ►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. ►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది. ►సోలార్ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. ►సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ►ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది. ►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి. ► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది. చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే -
బుందేల్‌ఖండ్‌ను నాశనం చేశారు: మోదీ
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్‌ఖండ్‌లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు. -
సోలార్ పవరే... సో బెటరు!
ముంబై: ‘వాన రాకడ, ప్రాణం పోకడ’ జాబితాలో ‘కరెంట్’ను కూడా చేర్చారు మహారాష్ట్ర సతార జిల్లాలోని మన్యచివాడి గ్రామస్థులు. ఆ ఊళ్లో కరెంటు అనేది ఉన్నప్పటికీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. చీకటే చీకటి! రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సుదీర్ఘమైన కరెంటు కోతలు భరించలేక గ్రామప్రజలు ఎక్కే గడప, దిగేగడపలా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ‘చూద్దాం, చేద్దాం’ అనే మాటలు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఇలా కాదనుకొని మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘ఎవరో ఇవ్వడం ఏమిటీ, కరెంట్ మనమే తయారు చేసుకుందాం’ అని ఒకరు ప్రతిపాదించినప్పుడు– ‘అవేమైనా రొట్టెలా మనమే తయారు చేసుకోవడానికి’ అని అనుకునేంత అమాయకులు కూడా ఉన్నారు. వారు సోలార్ పవర్ గురించి వినింది లేదు! రకరకాల మాటల తరువాత అందరూ సోలార్ పవర్‌కే ఓటు వేశారు. ఆ తరువాత సోలార్ పవర్ నిపుణులతో చర్చించారు. ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదట గ్రామ వీధుల్లోకి సోలార్ పవర్ లైట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రతి ఇంటికి ‘సోలార్ యూనిట్’ ఆలోచన చేశారు. అయితే ఒక్కో యూనిట్‌కి సుమారు ఆరువేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఊళ్లో బీదాబిక్కీ ఉంటారు కాబట్టి అంత మొత్తాన్ని అందరూ భరించే పరిస్థితి లేదు. దీంతో మహిళా స్వయం సహాయక బృందాలు ఆ ఖర్చులో ఎక్కువ భాగాన్ని భరించాయి. గ్రామపంచాయితీ, దాతలు తమ వంతుగా సహాయపడ్డారు. ఎట్టకేలకు ఊరు చీకటి నుంచి విముక్తి అయింది...‘సోలార్ గ్రామ్’గా మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో కరెంటు కోత అనే మాట వినబడదు. ‘ఒకప్పుడు మా ఊరికి కోడలుగా రావడానికి భయపడేవారు. కరెంటులాంటి మౌలిక సదుపాయాలు లేని ఊరు అనే పేరు ఉండేది. గ్రామ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అయితే పవర్ అనేది గ్రామ అభివృద్ధికి ఎంత కీలకం అనే విషయం అర్ధమైంది’ అంటుంది సంగీత అనే మహిళ. ‘చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు...చిరుదీపమైనా వెలిగించు’ అనే మంచిమాట ఉంది. చిరుదీపం ఏమి ఖర్మ....శక్తిమంతమైన సోలార్ దీపాన్నే వెలిగించారు గ్రామ మహిళలు. ఆ వెలుగులు ఊరకే పోలేదు. ఊరి అభివృద్ధికి గట్టి ఇంధనం అవుతున్నాయి. మన్యచివాడి ఇప్పుడు ఆదర్శ గ్రామం అయింది. ఈ చిన్న గ్రామం గురించి ఎప్పుడూ వినని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం...చిన్నా,పెద్దా తేడా లేకుండా ఊళ్లో ప్రతి ఒక్కరూ సోలార్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం. చదవండి: ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..? -
ఒకే ప్రపంచం.. ఒకే సౌర గ్రిడ్
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. ద్వీపాలకు భారత్ అండ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు. -
సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్
సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా టాటా పవర్ దూసుకెళ్తుంది. టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(టీపీఆర్ఈఎల్) రాజస్థాన్‌లోని లోహర్కి గ్రామంలో 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. రాజస్థాన్‌లోని ఈ ప్రాజెక్టుతో టాటా పవర్ మొత్తం పునరుత్పాదక వ్యవస్థాపన సామర్థ్యం 2,947 మెగావాట్ల(2,015 మెగావాట్ల సోలార్, 932 మెగావాట్ల విండ్ పవర్)కు చేరుకుంది. ఇంకా 1,084 మెగావాట్ల పునరుత్పాదక టాటా పవర్ ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. 756 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 350 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 3.34 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.5 లక్షల మాడ్యూల్స్, 48 ఇన్వర్టర్లు, 720 కిలోమీటర్ల డీసీ కేబుల్, 550 మ్యాన్ పవర్ ఉపయోగించారు. "రాజస్థాన్‌లోని లోహర్కిలో నిర్మించిన 150 మెగావాట్ల ప్రాజెక్టు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలో ఒకటిగా మా స్థానాన్ని సుస్థిరం చేసింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధిని ఇదేవిధంగా మేము కొనసాగిస్తాము" అని టాటా పవర్ సీఈఓ, ఎండి డాక్టర్ ప్రవీర్ సాహా తెలిపారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా టీపీఆర్ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే) -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు.