ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది.
2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది.
భారంగా..
►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు.
►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది.
►సోలార్ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది.
►సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.
►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి.
►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది.
►ఇంటింటికి కనెక్షన్‌లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది.
►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి.
► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది.
Comments
Please login to add a commentAdd a comment