Dawn
-
అప్పుడేమో ఘనం! ఇప్పుడేమో ఇలా..
ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. భారంగా.. ►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. ►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది. ►సోలార్ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. ►సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ►ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది. ►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి. ► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది. చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే -
ఉగ్ర సంస్థలకు రక్షణ కల్పించొద్దు
పాక్ ఆర్మీకి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశం ♦ పాకిస్తాన్ వైఖరిలో అసాధారణ మార్పు! ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో కంగుతిన్న పాకిస్తాన్ దిగివచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రక్షణ కల్పించవద్దంటూ తమ సైన్యాన్ని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, 2008 ముంబై దాడుల కేసుల విచారణను త్వరగా ముగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాక్ పత్రిక ‘డాన్’ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ గురువారం ఈ మేరకు కథనాన్ని వెలువరించింది. సైనిక, పౌర నాయకులతో వరుసగా జరిపిన పలు సమావేశాల అనంతరం షరీఫ్ నుంచి ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశం ఫలితంగా రెండు కీలక చర్యలకు సంబంధించి అంగీకారం వచ్చినట్టు వెల్లడించింది. ఈ మేరకు నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చట్ట అమలు సంస్థలు చర్యలు చేపట్టినపక్షంలో ఆర్మీ సారథ్యంలోని నిఘా సంస్థలు జోక్యం చేసుకోరాదన్న సందేశంతో ఐఎస్ఐ డెరైక్టర్ జనరల్ రిజ్వాన్ అక్తర్, జాతీయ భద్రతా సలహాదారు నాసర్ జాంజువాలు అన్ని ప్రావిన్స్‌లకు వెళ్లి వివరిస్తారు. పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్, ఐఎస్ఐ డీజీ మధ్య అసాధారణ స్థాయిలో కొనసాగిన వాగ్యుద్ధం అనంతరం ఈ చర్యలకు పూనుకున్నట్టు ‘డాన్’ తెలిపింది. ఇదిలాఉండగా డాన్ కథనాన్ని ఊహాకల్పితమైనదిగా పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా అభివర్ణించారు. ఇలాంటి కథనాలు జాతీయ ప్రయోజనాలకు తోడ్పడవన్నారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతోంది వాషింగ్టన్: కశ్మీర్, భారత్‌లపై తాము లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకపోతే చైనా, రష్యాలతో కలసి నడవాల్సి వస్తుందని అమెరికాను పాకిస్తాన్ హెచ్చరించింది. అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని, ప్రపంచ శక్తిగా ఆ దేశం మరెంతో కాలం ఉండలేదని షరీఫ్ ప్రత్యేక దూత సయ్యద్ వెల్లడించారు. -
'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్‌కే నష్టం'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలనకుంటున్న భారత్‌కు ఆ విషయం ఒక కలగానే మిగిలిపోతుందని పాక్‌కు చెందిన దౌత్యవేత్త ఒకరు అన్నారు. పాక్ ను ఒంటిరి చేయాలని చూస్తే భారత్ తానంతట తాను ఒంటరి అవ్వాలనుకోవడమే అని విమర్శించారు. పాక్ తో యుద్ధం చేయాలని భారత్ అనుకోదని, అలా చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందని వారికి తెలుసని అందుకే ప్రస్తుతం యుద్ధం జరిగే అవకాశం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ కథనాన్ని పాక్ కు చెందిన డాన్ పత్రికలో ఆ దౌత్య వేత్త పేరు ప్రకటించకుండా వెల్లడించింది. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగిన దాని మూలాలు పాక్ లోనే ఉన్నాయని, ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ అసలు యుద్ధాన్ని ఎంచుకోదని పాక్ కు చెందిన పలువురు దౌత్యవేత్తలు ధీమా వ్యక్తం చేసినట్లు ఆ కథనం వెల్లడించింది. 'యుద్ధం ఉండబోదు. ఇప్పటికే ఇరు దేశాలు వాస్తవ పరిస్థితిని గుర్తించాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే యుద్ధాన్ని ఇండియా ఎంచుకోదు' అని ఓ దౌత్య వేత్త అన్నట్లు పాక్ డాన్ పత్రిక కథనాన్ని వెలువరించింది. -
ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే
ముంబై మారణహోమంపై పాక్ ఎఫ్ఐఏ మాజీ డీజీ వెల్లడి 26/11 దాడికి కుట్ర జరిగింది పాక్ భూభాగంలోనే.. కసబ్ పాక్ జాతీయుడే.. ఉగ్రవాదులను థట్టా నుంచే దాడికి పంపారు కరాచిలోని ఒక ఆపరేషన్ గది నుంచి దాడికి మార్గదర్శకం చేశారు ముంబై ఉగ్రవాద దాడిపై పాక్ వాస్తవాన్ని, పొరపాట్లను ఒప్పుకోవాలి డాన్ పత్రికలో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిక్ ఇస్లామాబాద్: భారత్‌పై పంజా విసురుతున్న ఉగ్రవాదానికి, తమ దేశంతో ఏ సంబంధం లేదని దబాయిస్తున్న పాకిస్తాన్ కపటనీతి బట్టబయలయింది. ముంబై నగరంలో 166 మందిని బలితీసుకుని మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడికి కుట్ర జరిగింది పాక్‌లోనే అని, పాక్ భూభాగం నుంచే ఆ దాడి జరిగిందని.. ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) మాజీ అధిపతి స్వయంగా బహిర్గతం చేశారు. కరాచీలోని ఒక గది నుంచి ఆ దాడికి మార్గనిర్దేశం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు దర్యాప్తులో లభ్యమయ్యాయని వివరించారు. 2008లో ముంబైపై ఉగ్రవాద దాడి తర్వాత కొన్ని వారాల్లోనే ఎఫ్ఐఏ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తారిక్ ఖోసా మంగళవారం పాక్‌కు చెందిన డాన్ దినపత్రికలో రాసిన వ్యాసంలో.. ఆ దాడుల దర్యాప్తులో వెల్లడైన అంశాలను, దర్యాప్తును నీరుగార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరించారు. తద్వారా ముంబైపై జరిగిన దాడి విషయంలో భారత్ ఇంత కాలం చెప్తున్నదంతా వాస్తవమేనని ధ్రువీకరించారు. తన భూభాగంలో కుట్ర చేసి, అమలు చేసిన ముంబై మారణహోమాన్ని పాక్ పట్టించుకోవాల్సి ఉందని.. ఇందుకు వాస్తవాన్ని ఒప్పుకోవటం, పొరపాట్లను అంగీకరించటం అవసరమని సూచించారు. ఆ ఘోర ఉగ్రవాద దాడుల సూత్రధారులు, పాత్రధారులను పాక్ ప్రభుత్వ భద్రతా సంస్థలు చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులందరితో సహా మంచి తాలిబాన్ చెడ్డ తాలిబాన్ అనే తేడా చూపించటాన్ని, ద్వంద్వ వైఖరిని పాక్ సర్కారు విడనాడాలని హితవుపలికారు. ‘ముంబై దాడుల కేసు సుదీర్ఘ కాలం పాటు సాగుతూ వస్తోంది. నిందితులు జాప్యం చేసే ఎత్తుగడలు, విచారణ జీడ్జీలను తరచుగా మార్చుతుండటం, ప్రాసిక్యూటర్ హత్యకు గురవటం, కొందరు కీలక సాక్షులు వాస్తవంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఎదురు తిరగటం అనేవి కేసు విచారణకు గట్టి ఎదురుదెబ్బలుగా మారాయి’ అని వెల్లడించారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య గత నెలలో రష్యాలో జరిగిన సమావేశాన్ని పాక్ ప్రజలు ఆహ్వానించాలని సూచించారు. ఈ భేటీ అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఐదు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను పేర్కొన్నారు. ముంబై కేసు విచారణను (పాక్‌లో) వేగవంతం చేసేందుకు.. మాటల నమూనాలను అందించటం సహా ఉన్న మార్గాలపై చర్చించాలని అంగీకరించారు. కానీ.. పాకిస్తాన్ ఆ తర్వాత మాట మార్చింది. ఈ కేసుకు సంబందించి మరిన్ని సాక్ష్యాలు, సమాచారం కావాలని భారత్‌ను అడిగింది. ఇరు దేశాలూ కలిసి కృషిచేయాలి... ‘ఈ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమాండర్, అతడి సహాయకుల స్వర నమూనాలను పరీక్షల కోసం రికార్డు చేసేందుకు అనుమతించాలని దర్యాప్తు అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ నిందితులు తిరస్కరించారు. వారి అంగీకారం లేకపోయినా వారి స్వర నమూనాలను రికార్డు చేసేందుకు అనుమతించాలని అధికారులు కోర్టును కోరారు. కానీ.. సాక్ష్యాల చట్టం లేదా అప్పటికి అమలులో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో అటువంటి అంశమేదీ లేదన్న ప్రాతిపదిక మీద కోర్టు ఆ వినతిని కోర్టు తిరస్కరించింది. దీంతో అధికారులు పైకోర్టుకు వెళ్లారు. 2013లో అమలులోకి వచ్చిన నిష్పాక్షిక విచారణ చట్టం.. ఇటువంటి సాంకేతిక సాక్ష్యాన్ని అనుమతిస్తోంది. కానీ.. అంతకుముందు కాలం నుంచే ఇది వర్తిస్తుందా లేదా అన్నది చర్చించాల్సిన ప్రశ్న’ అని వివరించారు. ‘ముంబై కేసు విభిన్నమైనది. ఒక ఘటన, రెండు న్యాయపరిధులు, రెండు విచారణలతో కూడుకున్న కేసు. రెండు దేశాల న్యాయ నిపుణులు.. పరస్పరం ఆరోపణలు చేసుకోవటానికి బదులు.. కలిసి కృషి చేయాలి’ అని అన్నారు. థట్టాలో శిక్షణ ఇచ్చి పంపించారు పాక్‌లోనూ, ఇంటర్పోల్లోనూ పలు ఉన్నత స్థానాల్లో పనిచేసిన తారిక్ ఖోసా 2007లో జరిగిన పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్‌భుట్టో హత్య కేసు దర్యాప్తుకు కూడా సారథ్యం వహించారు. ముంబైపై 26/11 దాడికి సంబంధించి తారిక్ వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ►‘‘మొదటిది.. అజ్మల్ కసబ్ పాకిస్తానీ జాతీయుడు. అతడి నివాస స్థలం, మొదట్లో చదువుకున్న ప్రాంతం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థలో అతడు చేరటం మొదలైన అంశాలను దర్యాప్తు అధికారులు నిరూపించారు. ►రెండోది.. ఆ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సింథ్‌లోని థట్టా వద్ద శిక్షణనిచ్చారు. అక్కడి నుంచే వారిని సముద్రమార్గం ద్వారా పంపించారు. ఆ శిక్షణ శిబిరాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనంలోకి తీసుకున్నారు కూడా. ముంబైలో వినియోగించిన పేలుడు పదార్థాల పైమూతలను (కేసింగ్స్‌ను) ఈ శిక్షణ కేంద్రం నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. ►మూడోది.. ఉగ్రవాదులు బయల్దేరినపుడు సముద్ర ప్రయాణంలో తొలుత వినియోగించిన ఫిషింగ్ ట్రాలర్ (చేపల వేటకు వినియోగించే మర పడవ)ను మళ్లీ వెనక్కు ఓడ రేవుకు తీసుకువచ్చి, కొత్త రంగు వేసి దాచిపెట్టారు. దానిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. దానితో నిందితులకు సంబంధముందన్న నిర్ధారణ జరిగింది. ►నాలుగోది.. ముంబై రేవు వద్ద ఉగ్రవాదులు వదిలేసి వెళ్లిన డింగీ (చిన్న మర పడవ)లోని ఇంజన్‌కు ఒక పేటెంట్ నంబర్ ఉంది. దాని ద్వారా ఆ ఇంజన్ జపాన్‌లో తయారై, లాహోర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి కరాచీలోని ఒక క్రీడావస్తువుల దుకాణానికి చేరుకుందని, దానిని అక్కడ లష్కరే తోయిబాతో సంబంధమున్న ఒక ఉగ్రవాది ఆ ఇంజన్‌ను డింగీతో సహా కొన్నాడని తేలింది. ►ఐదోది.. ముంబై దాడికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసిన కరాచీలోని ‘ఆపరేషన్ రూమ్’ను దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవటం జరిగింది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా సంభాషణలు జరిగాయని బహిర్గతమయింది. ►ఆరోది.. ఈ ముంబై దాడికి సంబంధించిన కమాండర్, అతడి సహాయకులను గుర్తించి, అరెస్ట్ చేయటం జరిగింది. ఏడోది.. ఈ దాడికి ఆర్థిక నిధులు, సదుపాయాలు సమకూర్చిన ఇద్దరు విదేశీ ఫైనాన్షియర్లు, ఫెసిలిటేటర్లను అరెస్ట్ చేసి, విచారణ కోసం తీసుకురావటం జరిగింది.’’ -
గ్రంథాలయ గాంధీ వెంకటప్పయ్య అస్తమయం
తెనాలి రూరల్: గ్రంథాలయోద్యమ పితామహు డు, గ్రంథాలయ గాంధీ బిరుదాంకితుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య(83) అస్తమించారు. గుం టూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వెంకటప్పయ్యకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందారు. వెంకటప్పయ్య 1932లో తెనాలి ఐతానగర్లో రైతు కుటుం బంలో జన్మించారు. హైస్కూల్ చదువుతోనే తృప్తిపడి, 1956లో రేపల్లె శాఖాగ్రంథాలయంలో గ్రంథ పాలకునిగా చేరారు. ఆ తర్వాత చదువును కొనసాగించారు. 1962లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రంథాలయశాస్త్రంలో డిప్లొమా, 1971లోఎం.ఎ, 1981లో ఏయూ నుంచి పీహెచ్డీ పొందారు. 2013లో ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రం గాల ప్రముఖులకు అందజేసిన ఉగాది పురస్కారాన్ని గ్రంథాలయ రంగం నుంచి డాక్టర్ వెలగా ఒక్కరికే ప్రదానం చేయడం విశేషం. సాధారణ లైబ్రేరియన్‌గా జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎన్నో గౌరవాలు, పురస్కారాలను అందుకున్నారు. 1990లో ఉద్యో గ విరమణ అనంతరం రచనా వ్యాసంగలోనే నిమగ్నమయ్యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘంటువులు, తెలుగు ప్రముఖులు, బాలసాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. నమూనా పౌర గ్రంథాలయ చట్టం రూప కల్పన, గ్రంథాలయాల గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీ, పుస్తక ప్రచురణ, బాలసాహిత్య రచనలో కృషి చేశారు. -
'మోడీతో యూఎస్ సంబంధాలు కోరుకుంటోంది'
ఇస్లామాబాద్: ప్రస్తుతం మోడీ ప్రభుత్వంతో అమెరికా సంబంధాలను కొనసాగించాలనుకుంటోందని పాకిస్థాన్ కు చెందిన డాన్ దిన పత్రిక కథనాన్ని వెల్లడించింది. గత అమెరికాలో మోడీ పర్యటించకుండా యూఎస్ ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసింది. వీసా జారీ చేయకుండా అడ్డుకున్న మోడీతో అమెరికా సహాయమంత్రి జాన్ కెర్రీ ఈ నెలాఖరుకు న్యూఢిల్లీలో పర్యటించనుందని డాన్ ఎడిటోరియల్ కాలమ్ లో వెల్లడించింది. బరాక్ ఓబామా, మోడీల మధ్య శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా కెబినెట్, యూఎస్ కేబినెట్ లు ప్రయత్నిస్తున్నాయని కథనంలో వెల్లడించింది. -
లాహోర్‌లో 113 రేప్ కేసులు నమోదు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు లాహోర్ మహానగరంలో 113 అత్యాచార కేసులు నమోదు అయ్యాయని స్థానిక పత్రిక డ్వాన్ ఆదివారం వెల్లడించింది. అయా కేసులకు సంబంధించిన గణాంకాలను సోదాహారణగా ఆ పత్రిక వివరించింది. ఆ కేసుల్లో దాదాపు 86 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపింది. గత ఎనిమిది నెలల్లో 32 సామూహిక అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పింది. ఆ కేసులతో ప్రమేయం ఉన్న 22 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే అత్యాచారానికి గురైన మహిళలంతా యుక్తవయస్సువారేనని డ్వాన్ పత్రిక ఆదివారం ప్రచురించిన కథనంలో వెల్లడించింది.