'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్కే నష్టం' | War will destroy India's economy: Pakistan diplomats | Sakshi
Sakshi News home page

'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్కే నష్టం'

Published Mon, Sep 26 2016 1:51 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్కే నష్టం' - Sakshi

'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్కే నష్టం'

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ను ఒంటరి చేయాలనకుంటున్న భారత్కు ఆ విషయం ఒక కలగానే మిగిలిపోతుందని పాక్కు చెందిన దౌత్యవేత్త ఒకరు అన్నారు. పాక్ ను ఒంటిరి చేయాలని చూస్తే భారత్ తానంతట తాను ఒంటరి అవ్వాలనుకోవడమే అని విమర్శించారు. పాక్ తో యుద్ధం చేయాలని భారత్ అనుకోదని, అలా చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందని వారికి తెలుసని అందుకే ప్రస్తుతం యుద్ధం జరిగే అవకాశం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ కథనాన్ని పాక్ కు చెందిన డాన్ పత్రికలో ఆ దౌత్య వేత్త పేరు ప్రకటించకుండా వెల్లడించింది.

ఉడీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగిన దాని మూలాలు పాక్ లోనే ఉన్నాయని, ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ అసలు యుద్ధాన్ని ఎంచుకోదని పాక్ కు చెందిన పలువురు దౌత్యవేత్తలు ధీమా వ్యక్తం చేసినట్లు ఆ కథనం వెల్లడించింది. 'యుద్ధం ఉండబోదు. ఇప్పటికే ఇరు దేశాలు వాస్తవ పరిస్థితిని గుర్తించాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే యుద్ధాన్ని ఇండియా ఎంచుకోదు' అని ఓ దౌత్య వేత్త అన్నట్లు పాక్ డాన్ పత్రిక కథనాన్ని వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement