న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. యురీ ఉగ్రదాడి, పాక్‌ను దౌత్యపరంగా దెబ్బతీయడం సహా తాజా పరిణామాలపై కేంద్ర కేబినెట్ దృష్టి సారించనుంది. పాక్‌పై యుద్ధం చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ... పాకిస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని కేబినెట్ చర్చించనుంది.
మరోవైపు పాకిస్థాన్‌ను క్షమించే ప్రసక్తే లేదని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. పాకిస్థాన్‌కు బహుముఖ స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దౌత్యపరంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్ ఒక బాధ్యతారాహిత్య దేశమన్నారు. ఉగ్రవాద దాడులను సమర్ధవంతంగా తిప్పికొడతామని ప్రధాని చెప్పారని రాం మాధవ్ పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ రేపు అత్యవసర భేటీ
Published Tue, Sep 20 2016 8:10 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement