failures
-
తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం
-
బాబు బినామీ ముఠా గుప్పిట శ్రీవారి ఆలయం
-
కూటమి వైఫల్యాలపై YSRCP సమరశంఖం
-
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
OnePlus: వన్‌ప్లస్ విక్రయాలు నిలిపేస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులపైనా గురి
సాక్షి, హైదరాబాద్: సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం గత పదేళ్లలో చేసిన అప్పులు, వ్యయం, కల్పించిన ఆయకట్టు, నష్టాలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం, పాలనపరమైన అనుమతులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, ప్రతిపాదించిన ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, మిగిలిన ఆయకట్టుకు సాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు, ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా తరలించిన జలాలు, ఇందుకు అయిన నిర్వహణ వ్యయం, ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం అప్పులు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.81 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఇప్పటివరకు ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించారు? మిగిలిన ఆయకట్టుకు అందించడం సాధ్యమేనా? ఇందుకు ఎంత వ్యయం అవుతుంది? వంటి విషయాలతో సమాచారం తయారు చేసినట్లు చెబుతున్నారు. సీఎం సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ప్రత్యేక నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల స్థితిగతులు, తెలంగాణ ఏర్పడడానికి ముందు చేసిన వ్యయం, తెలంగాణ వచ్చాక ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కూడా నివేదికను రూపొందించారని అంటున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టికి బదులు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన వార్ధా బ్యారేజీ విషయంలో ముందుకు వెళ్తారా? అన్నదానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రాప్ హాలిడే పైనా వివరణ నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు అడుగంటి పోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న 6.4 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సైతం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మొత్తం ఎన్ని టీఎంసీల వరద వచ్చింది? ఆశించిన మేరకు వరద రాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్ని టీఎంసీలు సాగు, తాగునీటి అవసరాలకు వాడారు? తదితర అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వనుందని తెలిసింది. విద్యుత్ సంస్థల నష్టాలు, అప్పులే ప్రధానం తెలంగాణ వచి్చన తర్వాత రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకున్న అప్పులు, నష్టాలు, ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విశ్లేషిస్తూ విద్యుత్ శాఖ అధికారులు నివేదిక ఇచి్చనట్లు తెలిసింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమ, మంగళవారాల్లో విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీతో సమావేశమై విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి రూ.28,140 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించకుండా తామే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎనీ్పడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్) నష్టాలు రూ.50,275 కోట్లకు పెరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నట్టు తెలిసింది. -
56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు! ఏకంగా 23 సార్లు..
కొందరూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల చదువు కోలేకపోవడం జరగుతుంది. ఐతే కొందరూ మాత్రం పట్టువదలకు పెద్దయ్యాక అయినా ఆ కలను నెరవేర్చుకుని మరీ చదువుకున్న ఎందరో వృద్ధుల ఉదంతాలను చూశాం. కానీ ఒక మాస్టర్ డిగ్రీలో ఫెయిలై సబ్జెక్టులు ఉండిపోతే పాసయ్యేంత వరకు ఎదురు చూసిన వ్యక్తిని చూశారా? అది కూడా దాదాపు సగం జీవితంపైనే ఓపిగ్గా గెలపు కోసం నిరీకిస్తూ పరీక్షలు రాయడం మాటలు గాదు కదా!. ఏకంగా 18 సార్లు ఫెయిల్ అయినా సరే..పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఎమ్సెస్సీలో ఉత్తీర్ణత సాధించడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచాడు. వివరాల్లోకెళ్తే..జబల్పూర్కి చెందిన 56 ఏళ్ల రాజ్కరన్ అనే సెక్యూరిటీ గార్డుకి గణితంలో ఎంఎస్సీ చేయాలనేది ప్రగాఢ కోరిక. ఈ ఆలోచన 1996లో ఎంఏ పూర్తి చేసి పాఠశాల్లో విద్యార్థులకు గణితం బోధిస్తున్నప్పుడూ కలిగిందని చెబుతున్నాడు రాజ్కరన్. ఆ రోజుల్లో ఇలా ఎంఏ చేసిన వాళ్లు ఎంఏ మ్యాథ్స్ కూడా చేసే ఆప్షన్ ఉండటంతో తాను అదే ఏడాది జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో గణితంలో ఎంఎస్సీ మ్యాథ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించాడు. మ్యాథ్స్‌లో ఎంఎస్సీ ఎంత కష్టం అన్నది గ్రహించకుండా కేవలం తాను పిలల్లకు గణితం భోధించిన తీరుని అందరూ మెచ్చుకున్నారనే కారణంతో అనాలోచితంగా ఈ నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిపాడు రాజ్కరన్. అయితే తొలిసారిగా ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 1997లో హాజరై, ఫెయిలయ్యానని, అలా పదేళ్లలో మొత్తం ఐదు సబ్జెక్టులలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే పాసయ్యినట్లు తెలిపాడు. అయినా సరే ఇక వదిలేద్దా అని మాత్రం అస్సలు అనుకోలేదని చెప్పాడు. ఎలాగైన గణితంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఎంఎస్సీ పరీక్షలకు ప్రిపేరైనట్లు తెలిపాడు. సుమారు 18 సార్లు ఫెయిల్ అయినట్లు తెలిపాడు. తొలిసారిగా 2020లో కోవిడ్ మహమ్మారి టైంలో ఫస్ట్ ఇయర్ పాసవ్వగా, 2021లో సెకండియర్ పాసవ్వడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎట్టకేలకు గణితంలో ఎమ్మెస్సీ పూర్తి చేయాలన్న తన 25 ఏళ్ల తపస్సు ఫలించిందని చెప్పుకొచ్చాడు. అయితే 18 సార్లు ఎమ్మెస్సీ ఫెయిలైన వ్యక్తిగా పేపర్లో తన గురించి రావడంతో ప్రజలంతా తనను చులకనగా చూడటం మొదలు పెట్టారని, అదే తనలో ఎలాగైన గెలవలనే తపనను మరింత పెంచిదని చెప్పాడు కరణ్. అలాగే సెక్యూరిటీ గార్డుగా అతడి నెల జీతం రూ. 5000/- మాత్రమే. అయినప్పటికి వ్యక్తితగ ఖర్చులు కొంత డబ్బుని తన పీజీ కోసం కేటాయించేవాడినని చెప్పాడు. అలా ఈ మాస్టర్ డిగ్రీ కోసం అని పుస్తకాలకు, పరీక్ష పీజులకైతే ఇప్పటి వరకు దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు అతడు. పైగా తనని అందరూ పెయిల్యూర్‌కి ఉదహారణగా చూపుతూ తమ పిల్లలకి హేళనగా చెప్పేవారో బాధగా తెలిపాడు. అయితే తానెప్పుడూ అవేమీ పట్టించుకోకుండా ఈ డిగ్రీని పూర్తిచేయడమే తన ధ్యేయంగా భావించానని చెప్పాడు. అంతేగాదు ఓపిగ్గా.. విసుగు లేకుండా ప్రయత్నించేవాడు తప్పక విజయం సాధిస్తాడనే విషయం తెలుసుకున్నానని సగర్వంగా చెబుతున్నాడు. పైగా ఈ లక్ష్యాన్నే తాను పెళ్లి చేసుకున్నానని మరో పెళ్లాం ఎందుకని చమత్కారంగా మాట్లాడాడు రాజ్‌కరణ్. (చదవండి: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?) -
వర్షం ఇంక లేదు.. వరదైంది..!
చైనా వరద బీభత్సంతో అల్లాడిపోతోంది. నగరాలు నదుల్లా మారిపోయాయి. వరద ముంపుని ఎదుర్కోవడానికి చైనా కొన్నేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన స్పాంజ్ సిటీస్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదల్ని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు 30 నగరాలను స్పాంజ్ నగరాలుగా మార్చింది. మరి ఈ స్పాంజ్ సిటీస్ సమర్థంగా పని చేయడం లేదా ? ఈ ఏడాది చైనాలో ఎందుకీ వరద బీభత్సం? వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, వరదలు లేదంటే రికార్డు స్థాయి ఎండలు, ఉక్కబోత.. ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయి వర్షాలతో చైనా తడిసి ముద్దవుతోంది. కేవలం జులై నెలలో కురిసిన వర్షాలకే 150 మంది మరణిస్తే, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 250 కోట్ల డాలర్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదల్ని ఎదుర్కోవడం కోసమే చైనా కొన్నేళ్ల క్రితం స్పాంజ్ సిటీల నిర్మాణానికి నడుం బిగించింది. ఏమిటీ స్పాంజ్ సిటీస్ వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అంచనా వేసిన చైనా 2015లో స్పాంజ్ సిటీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చైనాలో 654 నగరాల్లో 641 నగరాలకి వరద ముప్పు పొంచి ఉంది. ప్రతీ ఏడాది 180 పట్టణాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జనాభాతో కిటకిటలాడుతూ ప్రతీ నగరం ఒక కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్షపు నీరు నగరాన్ని ముంచేయకుండా బొట్టు బొట్టు సద్వినియోగం చేసుకోవడమే ఈ స్పాంజ్ సిటీస్ లక్ష్యం. ఏ ప్రాంతంలో కురిసిన వాన నీరు అదే ప్రాంతంలో పూర్తిగా వాడుకునేలా సహజసిద్ధమైన ఏర్పాట్లు చేయడం స్పాంజ్ సిటీస్. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షపు నీటిని ఒక స్పాంజ్‌లా పీల్చుకునేలా నగరాల రూపురేఖలు మార్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ఎంతవరకు అమలైంది? చైనా ఈ ప్రాజెక్టుని అత్యంత ఘనంగా ప్రకటించింది కానీ ఆచరణలో ఇంకా వేగం పుంజుకోలేదు. 2015లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టి 30 నగరాలను స్పాంజ్ సిటీలుగా మార్చింది. ఒక్కో నగరం మీద వెయ్యి కోట్ల యువాన్లకు పైనే ఖర్చు పెట్టింది. గత ఏడాది మొత్తం 654 నగరాలకు గాను 64 నగరాలకు స్పాంజ్ సిటీ మార్గదర్శకాలు పాటించాలని నిబంధనలు విధించారు. 1978 నుంచి గణాంకాలను పరిశీలిస్తే చైనా పట్టణ ప్రాంత జనాభా అయిదు రెట్లు పెరిగింది. చైనా జనాభాలో 90 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఉత్తర చైనా మినహాయించి మిగిలిన పట్టణ ప్రాంత జనాభా అంతా వరద ముప్పులో ఉంది. అందుకే స్పాంజ్ సిటీస్ నిర్మాణం వేగవంతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పాంజ్ సిటీస్ పై ఒక చట్టాన్ని తీసుకువస్తేనే త్వరితగతిన వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పాంజ్ సిటీల నిర్మాణం ఇలా! ► నగరంలో రెయిన్ గార్డ్స్ నిర్మాణం ► వర్షం నీరు రహదారులపై నిలవకుండా నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా రహదారుల నిర్మాణం ► రోడ్డుకిరువైపు పేవ్మెంట్ల మీద, ప్రతీ భవనంలోనూ వాన నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాటు ► నీరు నిల్వ చేయడానికి కొత్తగా కాలువలు, చెరువుల తవ్వకం ► వాన నీరు రిజర్వాయర్లలోకి వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం ► చిత్తడి నేలల పునరుద్ధరణ ► ప్రతీ భవనంపైనా రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు ► వర్షం నీరుని శుద్ధి చేస్తూ తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడేలా ఎక్కడికక్కడ ప్లాంట్ల నిర్మాణం స్పాంజ్ సిటీలకూ పరిమితులున్నాయ్..! చైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీలను నిర్మించినప్పటికీ ఈ ఏడాది వరద బీభత్సాన్ని ఎదుర్కోవడం సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జూ నగరాన్ని పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీగా మార్చేసింది. 2016 నుంచి 2021 మధ్య కేవలం ఈ ఒక్క నగరంపైనే 6 వేల కోట్ల యువాన్లు ఖర్చు పెట్టింది. అయినప్పటికీ వరదల్ని ఎదుర్కోలేక జెంగ్జూ నగరం నీట మునిగింది. దీనికీ కారణాలన్నాయి. చైనా తలపెట్టిన స్పాంజ్ సిటీలు రోజుకి 20 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే తట్టుకోగలవు. అలాంటిది గత జులైలో జెంగ్జూలో ఒక గంటలో 20 సెంటీ మీటర్ల వాన కురిసింది. ఇక బీజింగ్ పరిసరాల్లో మూడు రోజుల్లో 75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఉత్తర చైనాలో సాధారణంగా వర్షలు అంతగా కురవవు. అందుకే ఆ ప్రాంతంలో ఇంకా స్పాంజ్ సిటీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.. ఈ ఏడాది వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర చైనాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అక్కడ స్పాంజ్ సిటీల నిర్మాణం జరగకపోవడంతో వరదలు పోటెత్తాయి. చైనా ఎన్ని చర్యలు చేపట్టి కోట్లాది యువాన్లు ఖర్చు చేసినా ప్రకృతి ముందు తలవంచక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులోనూ టీమిండియా విజయం సాధించి అభిమానులను ఖుషీ చేసినప్పటికి ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. అదే కేఎల్ రాహుల్ వైఫల్యం. టీమిండియా వైస్‌కెప్టెన్ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే కేఎల్ రూపంలో షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈసారి అతని ఔట్‌కు దురదృష్టం కూడా తోడైంది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి రాహుల్ ముందు ఫైన్ పాయింట్లో ఉన్న ఫీల్డర్ బూటుకు తాకి గాల్లోకి లేచింది. ఆ తర్వాత కీపక్ కేరీ ఏ పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. అంతే రాహుల్ కథ ముగిసింది. తొలి టెస్టులో 20 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. రెండో టెస్టులో మరింత దిగజారిపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చచ్చీ చెడి 17 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో అయితే కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రాహుల్ వరుసగా విఫలమవుతున్నా జట్టు మేనేజ్మెంట్ అతనికి అవకాశాలు ఇస్తూనే వస్తోంది. ఇప్పటికైనా కేఎల్ రాహుల్‌ను పక్కకు తప్పించి యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అవకాశమిస్తే మంచిది. రాహుల్ ఎన్ని మ్యాచ్‌లాడిన భారత్ స్కోరు 0/1, 50/1, 100/1 ఇలాగే కనిపిస్తుంది. ఆ ఒక్క వికెట్ కూడా కేఎల్ రాహుల్‌దే అయ్యుంటుంది. జట్టులో ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారైంది రాహుల్ ప్రస్తుత పరిస్థితి. అవకాశమిస్తే ఇరగదీస్తున్నాడా అంటే అదీ లేదు. అందుకే వైస్‌కెప్టెన్ బాధ్యతలు వేరొకరికి అప్పగించి రాహుల్‌ను టీం నుంచి తొలగించడమే ఉత్తమమని క్రీడా పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా అభిమానులు కూడా రాహుల్ ఆటతీరుతో విసుగుచెందారు.అందుకే రెండో టెస్టులో టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే కేఎల్ రాహుల్‌పై ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''ఇక భరించలేం.. కేఎల్ రాహుల్‌ను తొలగించాల్సిందే..'' అంటూ కామెంట్స్ చేశారు. KL Rahul in every Big Match 🤓#INDvsAUS #IndiaVsAustralia pic.twitter.com/uc1wsZDb05 — 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) February 9, 2023 Massive respect for KL Rahul . He were in any private job , he would have been fired long time back in the layoffs ! But @BCCI has different type of love with him . What a waste he is . Burden on the whole country . pic.twitter.com/Zuw9d8H2kT — Sumit (@sumitsaurabh) February 19, 2023 KL Rahul 😂🤣 pic.twitter.com/u6Fq0GDchE — Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 18, 2023 చదవండి: ఆసీస్‌ను భయపెట్టిన స్వీప్, రివర్స్ స్వీప్ శభాష్ హిట్‌మ్యాన్.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్! వీడియో వైరల్ -
సత్యం స్కాం:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ అప్పటి చైర్మన్ బి.రామలింగరాజుకు రబ్బర్ స్టాంప్ మాదిరిగా పనిచేసినట్టు విమర్శించారు. 2009 జనవరిలో రూ.7,800 కోట్ల రూపాయల సత్యం స్కామ్ వెలుగులోకి రావడం తెలిసిందే. (బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్) అనంతరం జరిగిన పరిణామాల్లో సత్యంను టెక్ మహీంద్రా సొంతం చేసుకుని, తనలో విలీనం చేసుకుంది. చాలా ఏళ్లపాటు లేని లాభాలను చూపిస్తూ వచ్చినట్టు రామలింగరాజు స్వయంగా అంగీకరించారు. ఏ కంపెనీ సీఈవో అయినా వాటాదారుల కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలని పరేఖ్ సూచించారు. విఫలమవుతున్న కంపెనీల సంఖ్య పెరుగుతోందంటూ, కొందరి అత్యాశ కారణంగా ప్రజలు డబ్బును, విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు చెప్పారు. (కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం) ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా స్పందిస్తూ.. నాటి సత్యం కంప్యూటర్ స్కామ్ సమయంలో బోర్డును ప్రభుత్వం రద్దు చేసి, ప్రైవేటు రంగంలో నిపుణులతో భర్తీ చేసినట్టు చెప్పారు. నాడు నిపుణులతో ఏర్పాటు చేసిన సత్యం బోర్డులో పరేఖ్‌కు సైతం స్థానం కల్పించడం గమనార్హం. (Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!) ఇదీ చదవండి: ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే? -
అంధకారంలో బంగ్లాదేశ్...10 గంటల పాటు పవర్ కట్
ఢాకా: 130 మిలయన్ల మందికి పైగా ప్రజలు అంధకారంలోనే ఉన్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం మధ్యహ్నాం నుంచే విద్యుత్ సరఫరా నిలచిపోయినట్లు తెలిపింది. సుమారు 80 శాతం దేశంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల మినహ మిగతా ప్రాంతాలకు పవర్ సప్లై నిలిచిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రతినిధి షమీమ్ ఎహ్సాన్ తెలిపారు. ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందనేది తెలియరాలేదని, బహుశా సాంకేతిక సమస్య అయ్యిండొచ్చని ఎహ్సాన్ అన్నారు. ఐతే బంగ్లాదేశ్ కేంద్ర సాంకేతిక మంత్రి జునైద్ పాలక్ రాజధాని ఢాకాలో రాత్రి 8 గం.ల కల్లా విద్యుత్ పునరుద్ధరింపబడుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఉక్రెయిన్ రష్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయి, అందువల్లే బంగ్లాదేశ్ ఈ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో గత కొద్ది నెలలుగా ఈ సంక్షోభం మరింత ఎక్కువైంది. అదీగాక విద్యుత్‌కి సరఫరాకు సరిపడా డీజిల్, గ్యాస్‌ల దిగుమతి చేసేకునేందుకే బంగ్లాదేశ్ ఇబ్బందులు పడటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ చివరిసారిగా 2014 నవంబర్‌లో ఇంత పెద్ద విద్యుత్ సంక్షోభాన్ని చవివచూసింది.ఏదిఏమైన దేశంలో దాదాపు 70 శాతం మంది సుమారు 10 గంటలపాటు విద్యుత్ లేకుండా గడిపారు. (చదవండి: రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...) -
‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’
ఐపీఎల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యామని, అయితే ఇలాంటి వైఫల్యాలు ఎవరికైనా సహజమని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఎందరో దిగ్గజాలకు ఇలాంటి స్థితి ఎదురైందని, ఆ దశను అధిగమించి వారు ముందుకు సాగారని రోహిత్ గుర్తు చేశాడు. ఏం జరిగినా ఈ జట్టుపై తన అభిమానం తగ్గదని చెప్పిన రోహిత్... కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదు సార్లు లీగ్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. -
రాజకీయ పిచ్‌పై రాణించని క్రికెటర్
క్రికెటర్‌గా 21 ఏళ్ల పాటు అనమానమైన ఆల్‌రౌండ్ ప్రతిభ చూపడమే గాక పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ కూడా అందించిన ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ కీలకమైన రాజకీయ పిచ్‌పై మాత్రం చేతులెత్తేశారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా ప్రయత్నించి ప్రధాని పీఠమెక్కినా ఏ మాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమై అపకీర్తి మూటగట్టుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాకిస్థాన్‌లోని మియావలీలో పష్తూన్ తెగకు చెందిన ఇక్రాముల్లా ఖాన్ నియాజీ, షౌకత్ ఖానుమ్ దంపతులకు 1952లో ఇమ్రాన్ జన్మించారు. లాహోర్‌తో పాటు ఇంగ్లడ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత చదువులు చదివారు. 21 ఏళ్లు క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగారు. 1992లో తన సారథ్యంలో పాక్‌కు ఏకైక వన్డే ప్రపంచ కప్ సాధించి పెట్టారు. 43 ఏళ్లొచ్చేదాకా అవివాహితునిగానే ఉండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పాక్ ప్రజల మనసు దోచుకున్నారు. 1996లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీని స్థాపించారు. 20 ఏళ్లకు గానీ నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), భుట్టోలకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల హవాను అధిగమించలేకపోయారు. 2002లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో పీటీఐని రెండో అతి పెద్ద పార్టీగా నిలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరికాన్ని నిర్మూలించి పాక్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా రూపుదిద్దుతాననే హామీలతో 2018 సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపారు. సొంతంగా మెజారిటీ రాకున్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని కల నెరవేర్చుకున్నారు. కానీ ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమవుతూ వచ్చారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి దేశాన్ని దివాలా అంచుకు నెట్టేశాయి. విదేశాంగ విధానంలో కూడా ఇమ్రాన్ తేలిపోయారు. భారత్‌తో కయ్యం కొనసాగించడమే గాక రష్యాకు దగ్గరయ్యే క్రమంలో అర్థం లేని దూకుడు ప్రదర్శించి చిరకాల మిత్రుడు అమెరికాకూ దూరమయ్యారు. ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం పొడిగింపును అడ్డుకునేందుకు విఫలయత్నం చేసి కీలకమైన సైన్యం ఆశీస్సులు కోల్పోయారు. వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులే ఇమ్రాన్ వ్యక్తిగత జీవితమూ ఒడిదుడుకులమయమే. ఆయన మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1995లో ఇంగ్లండ్‌కు చెందిన బిలియనీర్ కూతురు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడారు. ఇద్దరు కొడుకులు పుట్టాక విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహాం ఖాన్‌ను పెళ్లాడి 10 నెలలకే విడిపోయా రు. 2018లో తన ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. -
జట్టుకు భారమయ్యాడు.. తొలగించే సమయం ఆసన్నమైంది
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న భువీ.. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేలు కలిపి 18 ఓవర్లు వేసిన భువీ 7.27 ఎకానమీతో 131 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భువనేశ్వర్ గతేడాది ఐదు వన్డేలు ఆడి 9 వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది మంచి ప్రదర్శనే అయినప్పటికి భువీ మునపటి ఫామ్‌ను చూపట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆరంభంలో.. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం.. తన కోటా బౌలింగ్‌లో డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం.. పొదుపుగా బౌలింగ్ చేయడం భువనేశ్వర్ స్పెషాలిటీ. 2022కు ముందు 42.6 గా ఉన్న డాట్‌బాల్స్ పర్సంటేజీ ఇప్పుడు 61.5కు పెరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2022 టి20 వరల్డ్‌కప్ వరకు భువనేశ్వర్ టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భువీని జట్టు నుంచి తొలగించాల్సిన సమయం వచ్చేసిందంటూ పేర్కొంటున్నారు. మూడో వన్డేకు అతని స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడం మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేయడంలో దిట్ట అయిన దీపక్ చహర్ టీమిండియా తరపున 5 వన్డేలు, 17 టి20లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక దీపక్ చహర్ బ్యాటింగ్‌లోనూ చేయిందించగల సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా భువనేశ్వర్ స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడమే కరెక్టని అభిప్రాయపడ్డాడు. ఇక భువనేశ్వర్ టీమిండియా తరపున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 55 టి20ల్లో 53 వికెట్లు తీశాడు. -
అప్పుడేమో ఘనం! ఇప్పుడేమో ఇలా..
ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. భారంగా.. ►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. ►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది. ►సోలార్ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. ►సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ►ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది. ►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి. ► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది. చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే -
తేజస్వి వైఫల్యానికి ఐదు కారణాలు
పట్నా: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ అధికారపీఠాన్ని అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే అతి చిన్న వయసులో సీఎంగా రికార్డులకెక్కేవారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 200 ర్యాలీల్లో పాల్గొని, ఆర్జేడీ కుల సమీకరణలకు భిన్నంగా పది లక్షల ఉపాధి అవకాశాలపై హామీలిచ్చి, యువతరం మదిని మెప్పించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. బిహార్ రాజకీయాలను సుదీర్ఘకాలంపాటు శాసించిన రాజకీయ దురంధరుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిల కుమారుడు తేజస్వి. చదువు పెద్దగా అచ్చిరాక, అర్ధంతరంగా 10వ తరగతిలోనే చదువుకి స్వస్తిపలికిన తేజస్వి యిప్పుడు దేశంలోనే అతి తక్కువ వయస్సున్న ప్రతిపక్ష నేత. ఆయన రాజకీయారంగేట్రం 2015లో జరిగింది. 2018 నుంచి ఆర్జేడీ అధినాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ గెలుపుని ఖాయం చేసినా, ఆ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. అయితే బిహార్‌లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలపగలిగారు. క్షేత్ర స్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేజస్వి అనుకూల ఓటుగా మలుచుకోలేకపోయారు. మహాగఠ్ బంధన్ వైఫల్యం తేజస్వి వైఫల్యంగానే చూడాలని నిపుణులు అంటున్నారు. మహాకూటమి ఎందుకు ఓడిందంటే... 1. పేదరికం, ఉపాధి కల్పన, వలస కార్మికుల సంక్షోభం లాంటి విషయాలపై తేజస్వి ఎక్కువ దృష్టిపెట్టి, కులాలకు అతీతంగా ప్రచారం చేశారు. ఈ ఎత్తుగడ కలిసిరాలేదు. 2. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీపడి 19 మాత్రమే గెలవడం ఓటమికి ప్రధాన కారణమంటున్నారు. 3. ఏఐఎంఐఎం కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో పోటీచేసి, 5 స్థానాలు పొందడంతో పాటు, మిగిలిన చోట్ల ఓట్లు చీల్చింది. 4. ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది. 5. తేజస్వి క్షేత్ర స్థాయిలో జనంతో మమేకమై ఉంటే ఆర్జేడీ గెలుపు ఖాయమయ్యేదని అంచనా. -
పని చేయకుండా ఓట్లెలా అడుగుతారు?
సాక్షి, హైదరాబాద్: అందమైన అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్ నేతలు ఏం మొహం పెట్టుకుని రాబోయే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతారని మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లతో కలసి రేవంత్ మాట్లాడారు. గ్రేటర్‌ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి 99 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. కానీ, గ్రేటర్లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై రూ.1,200 కోట్ల భారం పడిందని చెప్పారు. హైదరాబాద్‌లో అద్భుతాలు సృష్టించినట్టు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని, పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 3 నుంచి తన పార్లమెంట్ పరిధిలో ‘డివిజన్ యాత్ర’చేపడుతున్నానని, టీఆర్ఎస్ విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని రేవంత్ చెప్పారు. కుసుమ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీలో ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఖమ్మం మేయర్ పాపలాల్ అవినీతి పరుడని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చారని, కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వని కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై రథయాత్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ, టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించాలని తమ పార్టీ ముఖ్య నాయకుల వద్ద ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రథయాత్ర చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు చెప్పానని పేర్కొన్నారు. ముందుగా జీహెచ్ఎంసీలో ఈ యాత్ర చేయాలని, ఆ తర్వాత మండల కేంద్రాలు, జిల్లాల్లో నిర్వహించాలని సూచించినట్లు వివరించారు. ఎన్నికల్లో హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు రాబట్టుకోవడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిపిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలకు, తమకు కూడా గుర్తుండటం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లాంటి హామీలపై యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ ముఖ్యనేతలను జగ్గారెడ్డి కోరారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 2న కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద, జూన్ 6న గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా కృష్ణానదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ దీక్షలు చేయనున్నారు. అందులో భాగంగా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేయనున్నారు. పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, లక్ష్మీదేవిపల్లి పంపుహౌస్ దగ్గర మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లూరు జలాశయం దగ్గర మాజీ మంత్రి నాగం, కరివేన ప్రాజెక్టు దగ్గర మాజీ మంత్రి చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల దగ్గర ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 6న గోదావరి నదిపై ఉన్న పెం డింగ్ ప్రాజెక్టులకు నిరసనగా ఇదే తరహాలో దీక్షలు చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న అంశంపై చర్చించిన టీపీసీసీ నేతలు ఆదివారం ఉస్మానియాకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పా టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటు న్న నూతన వ్యవసాయ విధానంపై జూన్ 3, 4 తేదీల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు రైతులతో సంప్రదించాలని నిర్ణయించారు. చెప్పడానికి వారెవరు: ఉత్తమ్ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది తుగ్లక్ చర్య అని, నూతన వ్యవసాయ విధానం పేరుతో ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదనలను రైతులు అంగీకరించరని చెప్పారు. నూతన వ్యవసాయ విధానంపై రైతులతో సంప్రదిస్తామని, వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొన్నిచోట్ల వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దని కలెక్టర్లు చెబుతున్నారని, ఫలానా విత్తనాలు అమ్మవద్దని చెప్పేందుకు కలెక్టర్లు ఎవరని ప్రశ్నించారు. కలెక్టర్ల తీరుపై కోర్టుకు వెళ్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో సమావేశమైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహా -
అపజయం మంచికే!
‘జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే మనల్ని మరిన్ని విజయాలు పలకరిస్తాయి’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. దక్షిణాదిలో అగ్రకథానాయిక జాబితాలో దూసుకెళుతున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ మంచి జోరు మీద ఉన్నారు. జీవితంలో తనకు ఎదురయ్యే వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటోంది? అనే విషయం గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘నేను చేయాలనుకున్న పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు మనల్ని పలకరిస్తాయి. అలాంటప్పుడు జీవితం పట్ల భయపడాల్సిన పని లేదు. అవి మన గురించి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అపజయాలు మంచికే! అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. గమనించుకోవాలే కానీ వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి’’ అని పేర్కొన్నారు. -
రాహుల్ వైఫల్యాలపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యాలపై వెబ్ సిరీస్ తీస్తానని మాజీ జర్నలిస్ట్, గతంలో కాంగ్రెస్‌తో కలసి పని చేసిన పంకజ్ శంకర్ అన్నారు. గతంలో ఈయన ప్రియాంకా గాంధీ మీడియా వ్యవహారాలను చూసేవారు. కాంగ్రెస్‌ను కష్టాల నుంచి ప్రియాంక గాంధీ మాత్రమే బయటపడేస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పారు. అయితే సోనియా గాంధీ పుత్రప్రేమ వలన రాహుల్ గాంధీని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. మూడు నెలల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే పంకజ్ పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కాంగ్రెస్ పేర్కొంది. -
పరువు కంటే ఎప్పుడూ ప్రాణమే ఎక్కువ..
ఇష్టమైన దుస్తుల మీద మరక పడితే ఏం చేస్తాం?మొదట సబ్బుతో రుద్దుతాం. ఆ తర్వాత నిమ్మకాయతో రుద్దుతాం.ఆపై పెట్రోల్‌తో రుద్దుతాం. ఇంకా ఏవైనా మరకలు పోగొట్టేలిక్విడ్లు దొరికితే వాటితోనూ రుద్ది రుద్ది దూరం చేస్తాం.అంతే తప్ప ఆ దుస్తులను దూరం చేసుకుంటామా?ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా మెదడులో మరకలాంటిది.దానిని రుద్ది రుద్దీ దూరం చేసుకోవాలి. ధైర్యంతో, స్థైర్యంతో, ఓర్పుతో, స్నేహితుల సాయంతో, బంధువుల బలంతో, కుటుంబల సభ్యుల భరోసాతో.ఉన్నది ఒక్కటే జన్మ. జీవించాలి. పోరాడాలి.ఆశను విడువక ఆవలి తీరం చేరుతూనే ఉండాలి. లైఫ్‌కు ఎస్. డెత్‌కు నో. సరిగ్గా వారం క్రితం బాలీవుడ్లో ఒక సినిమా విడుదలైంది.పేరు ‘చిచోరే’.అందులో ఇంటర్ పాసైన కొడుకుపై తండ్రి జె.ఇ.ఇలో ర్యాంకు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పెడతాడు. ఆ కొడుకుకు అదో పెద్ద భారం అవుతుంది. చదువుకునే సమయంలో తండ్రి ఒక ర్యాంకర్. కనుక తాను కూడా ర్యాంకర్ కావాలేమో, లేకుంటే తండ్రి పరువు పోతుందేమోనని ఆ కుర్రాడు భయపడతాడు. అతడు భయపడినట్టే ర్యాంకు రాదు. ఇంకేముంది... జీవితమే ముగిసిపోయింది అనుకుని ఎనిమిదో అంతస్తు నుంచి ఒక్క దూకు దూకేస్తాడు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న కొడుకు దగ్గర కూచున్న తండ్రి, తన తప్పును తెలుసుకొని ‘ఓడిపోవడం నేరం కాదు. నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను. కాకపోతే నీకు చెప్పలేదంతే’ అని తన ఫెయిల్యూర్స్‌ను చెప్పడం మొదలుపెడతాడు. ఆ ఫెయిల్యూర్స్‌ను తాను ఎలా ఫేస్ చేశాడో చెప్తాడు. అవి వింటూ కొడుకు గిల్ట్ నుంచి బయటపడి బతకాలన్న ఇచ్ఛ పొందుతాడు.ఈ సినిమాలో తండ్రి ఒక మాట అంటాడు. ‘మన పిల్లలు గెలిచాక ఏమేం చేయాలో మనందరి దగ్గరా ప్లాన్స్ ఉంటాయి. కాని ఒకవేళ ఓడితే ఏం చేయాలో ఏ ఒక్కరి దగ్గరా ఆలోచన ఉండదు’ అని.ఈ ఆలోచన అందరూ చేస్తే మొన్న జరిగిన ఇంటర్ పిల్లల ఆత్మహత్యల్లాంటివి జరగనే జరగవు. ‘త్రీ ఇడియట్స్’ కూడా ఈ పాయింట్‌నే డిస్కస్ చేస్తుంది. అందులో ప్రాజెక్ట్ పూర్తి కాని ఐఐటి కుర్రాడు ప్రొఫెసర్ తొందరపెడుతున్నాడని ఆత్మహత్య చేసుకుంటాడు.‘ఇది మన విద్యా వ్యవస్థ చేసిన హత్య’ అని మరో స్టూడెంట్ ఆమిర్ ఖాన్ అంటాడు.పిల్లలను ఆత్మహత్యలకు పురిగొల్పడంలో మన పాత్ర ఎంత అనేది ఆలోచించాలి.చచ్చిపోతే తప్ప ముగింపు లేదు అనే మూలకు నెట్టడం గురించి చర్చించాలి.ఒకటో తేది జీతం వచ్చే ఉద్యోగం చేస్తే తప్ప, అందుకు అనువైన చదువు చదివితే తప్ప, అందుకు అనువైన ర్యాంకు తెచ్చుకుంటే తప్ప బతకలేవు, బతకనివ్వము అని చెప్పడం ఎంత అన్యాయమైన విషయమో ఆత్మవిమర్శ చేసుకొని చర్చించాల్సిన సంగతి. తెలుగు సినిమా ప్రేక్షకుడు తొలిసారి ఉలిక్కిపడింది ఒక కన్నతల్లి ఆత్మహత్యాయత్నానికి. ఆమె తానొక్కతే మరణించడానికి ప్రయత్నించదు. చనిపోయే ముందు కడుపున పుట్టిన, బంగారం లాంటి ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోబోయింది. పిల్లలు చనిపోయారు. తాను బతికింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు, పిల్లలకు విషం ఇచ్చినందుకు విచారణ ఎదుర్కొంది. ఆ సినిమా పేరు ‘మనుషులు మారాలి’. అప్పట్లో ఒక విమర్శ ఎదురైంది. ఆ సినిమాలో హీరోయిన్ శారద చదువుకున్న స్త్రీ. కష్టాలు చుట్టుముట్టినప్పుడు, భర్త తోడు లేకుండా పోయినప్పుడు, ట్యూషన్లు అయినా చెప్పుకొని బతకవచ్చు. ఆ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్లకు ఏదో ఒక ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయకుండా చావును పరిష్కారంగా వెతకడం ఏమిటా అని?శారద తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు సానుభూతి చూపించి ఉండవచ్చు. కాని మెచ్చరు. లోలోపల దానిని స్వీకరించరు. శారద పోరాడి ఉంటే ఒక్క ఎనిమిది పదేళ్లు కష్టపడి ఉంటే ముగ్గురు పిల్లలే ఆమె ఆస్తి అయి ఉండేవారు. ఇలాంటి పరిస్థితే ‘మాతృదేవోభవ’లో వచ్చినప్పుడు హీరోయిన్ మాధవి ఎటువంటి పరిస్థితిలోనూ ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకోదు. భర్త చనిపోతే, తాను కేన్సర్ బారిన పడి మృత్యువుకు దగ్గర అవుతుంటే వారిని దత్తత ఇద్దామనుకుంటుందే తప్ప, వాళ్ల ప్రాణం నిలబెడుతుందే తప్ప చంపి చచ్చిపోవాలనుకోదు. సమాజం ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలను అక్కున చేర్చుకుందన్న విషయం, అక్కున చేర్చుకుంటుందన్న ఆశ ఈ సినిమా నుంచి తప్పిపోదు. ‘మరో చరిత్ర’ విడుదలైనప్పుడు తెలుగులో, తమిళంలో విశేషంగా హిట్ అయ్యింది. అందులో ప్రేమికులైన కమల్ హాసన్, సరిత ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఇదే సినిమా హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా విడుదలైనప్పుడు ఒక విమర్శ వినిపించింది. ‘దర్శకుడు బాలచందర్ తన హీరోకు ఇచ్చే క్యారెక్టర్ ఇదా? అతన్ని దుండగులు కొట్టారు. కత్తితో పొడవ లేదు. ఆమె అత్యాచారానికి గురైంది. శక్తి కూడదీసుకొని వారు రోడ్డు మీదకు వెళ్లి ఉంటే సహాయం అంది ఉండేది. అత్యాచారానికి గురైన ఆమెను స్వీకరించి ఆమెకు ప్రాణం పోసే ప్రయత్నం హీరో ఎందుకు చేయలేదు? అత్యాచారం జరిగింది అనగానే అంతా ముగిసిపోయినట్టే అని ఆత్మహత్యకు ఎందుకు పురిగొల్పాడు’ అని. బాలచందరే తీసిన ‘డాన్స్‌మాస్టర్’ సినిమాలో కమల్ హాసన్, రేఖ పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించలేదని సినిమా ప్రారంభంలోనే ఒక జలపాతంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆమె చనిపోతుంది. అతడు బతకుతాడు. ఆమె చనిపోయినా తాను బతికి ఉన్నానన్న గిల్ట్ అతణ్ణి కాలుస్తూ ఉంటుంది. ఇవన్నీ తొందరపాటు నిర్ణయాల తలనొప్పులు. ప్రేమికుల కోసం చావు రెడీగా టేబుల్ మీద పెట్టబడి ఉంటుంది అని చెప్పడం కొన్ని సినిమాలలో చూపారు. కాని ప్రేమకు సంబంధించిన అన్ని పర్యవసానాలకు సిద్ధమయ్యి అందులో దిగాలి, దిగి ఎదుర్కోవాలి అని చెప్పడంలో సినిమా చాలాసార్లు సక్సెస్ అయ్యింది కూడా. చచ్చిపోతామని తెలిసినా కేన్సర్ పేషెంట్లైన నాగార్జున, గిరిజ ‘గీతాంజలి’లో ప్రేమించుకోవడం మానరు. స్ఫూర్తి పొందాల్సింది అలాంటి సినిమాల నుంచే. టీనేజ్ క్రష్లను, తెలిసీ తెలియని వయసులో కలిగే శారీరక ఆకర్షణల పట్ల యువత ఎంత ఎరుకతో ఉంది? వారికి ఎరుక కలిగించాల్సింది ఎవరు? వారి ఇన్నోసెన్స్‌ను వాడుకోవాలని చూస్తున్నది ఎవరు? ‘గుప్పెడు మనసు’ సినిమాలో వివాహితుడైన శరత్‌బాబుతో, టీనేజ్ అమ్మాయి సరిత ఆకర్షణలో పడుతుంది. దాని వల్ల ఆమె మనసు డిస్ట్రబ్ అవుతుంది. అతని కాపురం ప్రమాదంలో పడుతుంది. చివరకు ఎలాగోలా అతడు కాపురం నిలబెట్టుకుంటాడు. కాని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అతడు బానే ఉన్నాడు. నష్టపోయింది ఆ అమ్మాయి. దాని బదులు కష్టమైనా సరే ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని కొంతకాలం దిక్కుతోచని ప్రయాణాలు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.సమస్య వచ్చినప్పుడు సమస్యకు సమీపంగా తచ్చాడి లాభం లేదు. దూరం జరిగి పై నుంచి, బయటి వ్యక్తిగా చూస్తే పరిష్కారం కనపడుతుంది.పరిష్కాలు ఎప్పుడూ వంద ఉంటాయి.చావు మాత్రం ఒక్కటే.ఆత్మహత్య అంటే ఒకటిని వందతో సమానం చేయడం. చాలా మామూలు లెక్కలు తెలిసినవాళ్లు కూడా ఈ తప్పు చేయరు. మరి ఎందుకు చేస్తున్నట్టు? పూరి జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో సినిమా మొదట్లోనే హీరో రవితేజా, హీరోయిన్ తనూ రాయ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది. ఆ తర్వాత వాళ్లు జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక్కటవుతారు. చనిపోయి ఉంటే ఆ క్షణానే సమాధి రాళ్లుగా మారి ఉండే ఆ యువతీ యువకులు నూరేళ్ల జీవితం పట్ల ఆశ పెంచుకోవడంతో ఆ ఆశ కొద్దో గొప్పో ప్రేక్షకులకు కూడా అందుతుంది.అయితే ఒక సదుద్దేశంతో, కేవలం ఆత్మహత్యల నివారణ ఎంత అవసరమో చెప్పడానికి, ఆత్మహత్యల ఆలోచనల్లో ఉన్నవారిని ఓదార్చి, ధైర్యం చెప్పే ఒక శ్రేయోభిలాషి అవసరం చూపడానికి తీసిన సినిమా ‘మీ శ్రేయోభిలాషి’. ఈ సినిమాలో రకరకాల సమస్యలతో బాధ పడుతున్న పదిమందిని కొండ మీదకు తీసుకెళ్లి అక్కడి నుంచి చచ్చిపోయే ఏర్పాటు చేస్తాడు ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్. గృహ హింస ఎదుర్కొనే గృహిణి, టెన్త్ పాస్ కాలేనేమోనని భయం ఉన్న కుర్రాడు, జబ్బు పడ్డానని నిరాశ పెంచుకున్న ఒక దురదృష్టవంతుడు, కొడుకు సరిగ్గా చూడట్లేదని వైరాగ్యం తెచ్చుకున్న ముసలి దంపతులు... వీరంతా ఈ సినిమాలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని రాజేంద్రప్రసాద్ వారికి ధైర్యం చెబుతాడు. వారిలో స్థైర్యం నింపుతాడు. సమస్యలను అర్థం చేసుకుంటే సగం బరువు తొలిగి పోతుందని తెలియచేస్తాడు. బతుకు మీద తీపి కలిగించడం కూడా అవసరం. ఆత్మహత్యల ఆలోచనల నుంచి బలంగా బయటపడేయగల సినిమా ఇది. జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు జీవితం మీద ఇచ్ఛను కలిగించే పాటలు తెలుగు సినిమాల్లో అనేకం ఉన్నాయి. డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ఈ పాట వాటిలో ఒకటిగా ఎన్నదగినది. ‘గోరంత దీపం’ సినిమాలో కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వంలో బాల సుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట అర్థవంతంగా రసస్ఫోరకంగా ఉండి మనసును తాకుతుంది. స్ఫూర్తి నింపుతుంది. ‘నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి’ అంటాడు కవి. ఉప్పదనం అనుభవిస్తేనే కదా బతుకు చేరువైనప్పుడు అదెంత తీపో అర్థమయ్యేది. ఆ పాట పూర్తి సాహిత్యం: పల్లవి: గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు చరణం: కరిమబ్బులు కమ్మే వేళ మెరుపుతీగే వెలుగు కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు దహియించే బాధల మధ్య సహనమే వెలుగు చరణం: కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు చిగురంత ఆశ జగమంత వెలుగు. స్వాతంత్య్రం ఇవ్వలేదని గాంధీజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఆమరణ దీక్షకు దిగి తన ప్రాణాలు నిలబెట్టి తీరవలసిన అగత్యాన్ని బ్రిటిష్‌వారికి కలిగించాడు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు, మానసిక కల్లోలాలు చెలరేగినప్పుడు, అస్సలు వెలుతురు కనిపించనప్పుడు, కనీస ప్రయత్నం చేయడానికి కూడా శక్తి సన్నగిల్లినప్పుడు మన ప్రాణాలు నిలిపే అగత్యాన్ని సమాజానికి ఇవ్వాలి. గోల చేయాలి. బంధువులకు చెప్పాలి. స్నేహితులకు మొరపెట్టుకోవాలి. వారే ఏదో ఒక మార్గం చూస్తారు. పరువు కంటే ఎప్పుడూ ప్రాణమే ఎక్కువ. ఇవాళ్టి అవమానం రేపటి సన్మానంతో తొలగిపోతుంది. కాకుంటే ఆ సన్మానం పొందేందుకు ప్రాణాలతో ఉండాలి.సమాజం పెట్టే వొత్తిడి, విలువలు, లక్ష్యాలు, బాధ్యతలు, బలహీనతలు, భావోద్వేగాలు ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు సమస్యలు తెచ్చిపెడతాయి. విరమించుకుంటే బాగుండు అనే ఆలోచన కలిగిస్తాయి.ఆ క్షణాన్ని దాటేయడమే చేయవలసింది. ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం’ అని పాట. పోరాటం ముగియదు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని మరో పాట. పశువులు ఆత్మహత్య చేసుకోవు. మనిషెందుకు చేసుకోవడం? బతుకుదాం. బతుకునిద్దాం.– కె -
నేలకొరిగిన హేమాహేమీలు..
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పనిచేయని ‘చౌకీదార్’ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్ చోర్ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి ఈసారి రాహుల్ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు. నేలకొరిగిన హేమాహేమీలు.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలో అశోక్ చవాన్, మిలింద్దేవ్రా, సుశీల్‌కుమార్ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్లో షాక్ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెహ్రూ బాటలో నడిస్తేనే.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దివంగత జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే.. 130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. -
ఓటమి పాఠాలు
గెలుపు కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ, ఓటమి మాత్రం కచ్చితంగా ఏదోటి నేర్చుకునే అవకాశాన్నిస్తుంది అంటున్నారు అనుపమా పరమేశ్వరన్. ఇండస్ట్రీలో గెలుపోటములంటే హిట్స్, ఫ్లాపులే. వీటిని అనుపమా ఎలా తీసుకుంటారో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఫ్లాప్స్ అనేవి సహజం. ప్రతి సినిమా బాగా ఆడుతుంది అని కూడా అనుకోలేం. ఎవరైనా సరే విజయం సాధించాలనే కష్టపడతాం. ముఖ్యంగా ఆర్ట్ విషయంలో ఏ ఒక్కరూ సులువుగా తమ పని వల్ల సంతృప్తి చెందరు. ఇంకా ఇంకా బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయపడతారు. ఫెయిల్యూర్ వచ్చిందని ఎవర్నీ నిందించలేం. కానీ, మనం ఎక్కడ తప్పు చేశాం అనే విషయాలు మళ్లీ పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం మెరుగుపరుచుకునే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓటములే మంచి పాఠాలు’’ అని అనుపమా పేర్కొన్నారు. తాజాగా రామ్‌తో ఆమె నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’(తెలుగు), శివరాజ్‌కుమార్‌తో నటించిన ‘నట సార్వభౌమ’ (కన్నడ) సినిమాలు త్వరలో విడుదలకానున్నాయి.