సినిమా ఫ్లాపయితే..!
... నచ్చదు... నాకు ఓటమి అనేది నచ్చదంటున్నారు ప్రియాంకా చోప్రా. ఫెయిల్యూర్స్ పిగ్గీ చాప్స్ (ముద్దు పేరులెండి)కి ఇష్టం లేవట! ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ ఎంత కామనో.... మనిషిలో భావోద్వేగాలూ అంతే కామన్. సినిమా ఫ్లాపయితే ఒక్కొక్కరు ఒక్కో టైప్‌లో బాధపడతారు. మరి, ప్రియాంక ఏం చేస్తారో తెలుసా? ఫుల్లుగా తిని పడుకుంటారట! మీ సినిమా ఫెయిల్ అవుతుందని ఎప్పుడైనా భయపడ్డారా? అని ప్రియాంకా చోప్రాని అడిగితే... ‘‘ఐ డోంట్ లైక్ టు ఫెయిల్. కానీ, తప్పదు. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ విలువ తెలియదు.
నా సినిమా ఫ్లాపయితే నేను ఫెయిలయినట్టే. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించను. ఓ ఐస్ క్రీమ్ టబ్ ఫుల్లుగా తినేసి, దుప్పటి కప్పుకుని పడుకుంటా’’ అన్నారు. ఒక్కోసారి ఎంతో నమ్మకంతో చేసిన సినిమా ఫ్లాపవుతుంది. అప్పుడెలా అనిపిస్తుంది? అని ప్రశ్నిస్తే... ‘‘నా నిర్ణయాల పట్ల ఎప్పుడూ బాధపడను. ప్రతి సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ నన్నీ స్థాయికి తీసుకొచ్చాయి. ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంత దూరం ప్రయాణించా’’ అన్నారు.