piggy chops
-
ప్రియాంకను ఎందుకు పిలిచారు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పుస్తకాల ముద్రణా సంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్’ ఏటా నిర్వహించే పెంగ్విన్ లెక్చర్ కార్యక్రమానికి ఈసారి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఆహ్వానించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్వీట్లు హోరెత్తుతున్నాయి. పెంగ్విన్ సంస్థ మంగళవారం ఢిల్లీలో ‘బ్రేకింగ్ ది గ్లాస్ రూఫింగ్ ఛేజింగ్ డ్రీమ్ (అద్దాల రూఫ్‌ను బద్దలుకొట్టి కలను సాకారం చేసుకోవడం)’ అంశంపై ఏర్పాటుచేసిన లెక్చర్‌కు ప్రధాన వక్తగా ప్రియాంక చోప్రా హాజరయ్యారు. చోప్రాను వందమంది ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ గుర్తించడంతోపాటు అత్యధిక పారితోషకం తీసుకునే పది మంది టీవీ తారల్లో ఒకరిగా ఫోర్బ్స్ గుర్తించింది. హాలీవుడ్లో ప్రముఖ నటిగా, సింగర్‌గా కూడా చోప్రా రాణించారు. చక్కని అందచందాలు కలిగిన చోప్రాను ఆహ్వానించడంలో తప్పేముందని అనేవాళ్లు ఉండవచ్చు. కానీ ఉత్తమ పుస్తకాలను ముద్రించే సంస్థ పెంగ్విన్. పుస్తకాలతోని ఎలాంటి సంబంధం లేని అంటే, రచయితలు, జర్నలిస్టులు, ఎడిటర్లు, పబ్లిషర్లు, పుస్తకాల అమ్మకందార్లలో ఒకరు కాకపోయినా ఆమెను ఆహ్వానించడం ఏమిటన్నదే విమర్శకుల ప్రశ్న. గతంలో పెంగ్విన్ సంస్థ వార్షిక లెక్చర్ కార్యక్రమానికి రష్కిన్ బాండ్, రామచంద్ర గుహ, దలైలామా, అబ్దుల్ కలామ్ లాంటి వారిని పిలిపించింది. ఫెమినిస్ట్ పుస్తకాలను ప్రచురించే జుబాన్ సంస్థను సంప్రదిస్తే ‘పిగ్గీ చాప్స్’కు బదులుగా ఓ మంచి ఫెమినిస్ట్ పేరును సూచించేదిగదా! అంటూ ఒకరు ట్వీట్ చేశారు. పంది లేదా అసహ్యమైన బుగ్గలు కలిగిన వారిని పిగ్గీ చాప్స్ అని పిలుస్తారు. ప్రియాంక చోప్రాకు ఈ పేరును బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ 2005లో ‘బ్లఫ్ మాస్టర్’ షూటింగ్ సందర్భంగా పెట్టారు. అప్పటి నుంచి ఆమెను సన్నిహితులు పిగ్గీ చాప్స్ అని పిలవడం అలవాటయింది. ఈ ట్వీట్‌కు జుబాన్ బుక్స్ సంస్థ వెంటనే స్పందించి వచ్చే ఏడాది లెక్చర్‌కు తప్పకుండా తగిన పేర్లను సూచిస్తామంటూ ట్వీట్ చేసింది. కిరణ్ దేశాయ్, జుంపా లహరి, తహమీమా ఆనమ్, శోభాడే లాంటి రచియితల పేర్లనే కాకుండా పబ్లిషర్ల పేర్లను, జర్నలిస్టుల పేర్లను ఉదాహరణగా పేర్కొంది. సినీతారను పిలవడంలో తప్పేముందంటూ ఆమెను సమర్థించిన వారు కూడా ఉన్నారు. ‘బ్రేకింగ్ ది గ్లాస్రూఫింగ్ చేజింగ్ ఏ డ్రీమ్’ అంశంపై ప్రసంగించిన చోప్రా, బాలివుడ్లోని సెక్సిజం, రేసిజం గురించి నిర్భయంగా మాట్లాడారు. -
పిగ్గీ చాప్స్.. ట్రిపుల్ హ్యాపీనెస్!
ప్రియాంకా చోప్రా నిర్మించిన మొదటి మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్, ఎడిటర్ రామేశ్వర్ ఎస్. భగత్, సౌండ్ మిక్సింగ్ టెక్నీషియన్ అలోక్... ముగ్గురికీ జాతీయ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు... ఓ పెద్దాయన అనారోగ్యానికి గురి కావడంతో వెంటిలేటర్‌పై పెడతారు. అప్పుడు ఉమ్మడి కుటుంబం, బంధువులు... వాళ్ల మధ్య జరిగే వాదోపవాదనలు, గొడవలే సినిమా కథ. ‘లగాన్’, ‘స్వదేశ్’, ‘జోధా అక్బర్’ వంటి చిత్రాలు తీసిన ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాలో సుమారు వందమంది కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి 3 నేషనల్ అవార్డులు రావడంతో పిగ్గీ చాప్స్ (ప్రియాంకా చోప్రా) ట్రిపుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాతగా ఆమెకిది రెండో సినిమా. దీనికి ముందు భోజ్‌పురిలో ఓ సినిమా తీశారు. ‘‘ఐయామ్ స్పీచ్లెస్. నేను దర్శకత్వం వహించిన మొదటి మరాఠీ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిందోచ్! నా కల నిజమైంది. ‘వెంటిలేటర్’ సినిమా యూనిట్‌కి, ముఖ్యంగా నాపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించిన ప్రియాంకా చోప్రా, మధు చోప్రా (ప్రియాంక తల్లి)లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ – ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్ -
సినిమా ఫ్లాపయితే..!
... నచ్చదు... నాకు ఓటమి అనేది నచ్చదంటున్నారు ప్రియాంకా చోప్రా. ఫెయిల్యూర్స్ పిగ్గీ చాప్స్ (ముద్దు పేరులెండి)కి ఇష్టం లేవట! ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ ఎంత కామనో.... మనిషిలో భావోద్వేగాలూ అంతే కామన్. సినిమా ఫ్లాపయితే ఒక్కొక్కరు ఒక్కో టైప్‌లో బాధపడతారు. మరి, ప్రియాంక ఏం చేస్తారో తెలుసా? ఫుల్లుగా తిని పడుకుంటారట! మీ సినిమా ఫెయిల్ అవుతుందని ఎప్పుడైనా భయపడ్డారా? అని ప్రియాంకా చోప్రాని అడిగితే... ‘‘ఐ డోంట్ లైక్ టు ఫెయిల్. కానీ, తప్పదు. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ విలువ తెలియదు. నా సినిమా ఫ్లాపయితే నేను ఫెయిలయినట్టే. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించను. ఓ ఐస్ క్రీమ్ టబ్ ఫుల్లుగా తినేసి, దుప్పటి కప్పుకుని పడుకుంటా’’ అన్నారు. ఒక్కోసారి ఎంతో నమ్మకంతో చేసిన సినిమా ఫ్లాపవుతుంది. అప్పుడెలా అనిపిస్తుంది? అని ప్రశ్నిస్తే... ‘‘నా నిర్ణయాల పట్ల ఎప్పుడూ బాధపడను. ప్రతి సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ నన్నీ స్థాయికి తీసుకొచ్చాయి. ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంత దూరం ప్రయాణించా’’ అన్నారు.