రకుల్‌ప్రీత్ సింగ్
‘జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే మనల్ని మరిన్ని విజయాలు పలకరిస్తాయి’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. దక్షిణాదిలో అగ్రకథానాయిక జాబితాలో దూసుకెళుతున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ మంచి జోరు మీద ఉన్నారు. జీవితంలో తనకు ఎదురయ్యే వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటోంది? అనే విషయం గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘నేను చేయాలనుకున్న పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను.
నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు మనల్ని పలకరిస్తాయి. అలాంటప్పుడు జీవితం పట్ల భయపడాల్సిన పని లేదు. అవి మన గురించి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అపజయాలు మంచికే! అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. గమనించుకోవాలే కానీ వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment