వ్యాయామాలు చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హెవీ వర్కవుట్ చేసే క్రమంలో (80 కిలోల బరువు ఎత్తడం వల్లే) ఆమె వెన్నుముకకు గాయమైంది. దాదాపు రెండువారాలు బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా తన ఆరోగ్యపరిస్థితి గురించి అప్‌డేట్ ఇచ్చింది.
80 కిలోల బరువు ఎత్తా..
ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అసలేమైందంటే అక్టోబర్ 5న 80 కిలోల బరువు ఎత్తాను. అప్పుడు నా వెన్నెముకలో నొప్పి మొదలైంది. అయినా పట్టించుకోకుండా వర్కవుట్ చేశాను. అదే నా పాలిట శాపమైంది. వర్కవుట్ చేసి డైరెక్ట్‌గా షూటింగ్‌కు వెళ్లాను. సాయంత్రమయ్యేసరికి విపరీతమైన వెన్ను నొప్పి.. తట్టుకోలేకపోయాను.
బర్త్‌డే పార్టీ రోజే..
కొంచెం కూడా బెండ్ అవలేకపోయాను. అదే తగ్గిపోతుందిలే అని ఆ నొప్పి భరిస్తూనే ఐదు రోజులు గడిపాను. అక్టోబర్ 10న బర్త్‌డే పార్టీకి రెడీ అవుతున్న సమయంలో నా శరీరం కింది భాగం నా నుంచి వేరైపోయినట్లు అనిపించింది. నొప్పితో విలవిల్లాడిపోయాను. బీపీ పడిపోయింది. పదిరోజులు ఆస్పత్రిలోనే బెడ్‌పై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూర్తిగా కోలుకోలేదు
నా భర్త జాకీ భగ్నానీ... నా పుట్టినరోజును స్పెషల్‌గా ప్లాన్ చేశాడు. కానీ ఆ వేడుకలో పాల్గొనలేకపోయాను. ఆ సమయంలో నన్నెంతగానో అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ పని వెంట పడే నాకు అలా మంచానికి పరిమితమవడం బాధేసింది. ఇప్పటికీ 100 శాతం పూర్తిగా కోలుకోలేదు.
తెలియకుండానే ఏడ్చా..
ఈ గాయం తర్వాత తొలిసారి విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా ఎందుకో నాకు తెలియకుండానే ఏడ్చాను. అప్పుడు కూడా జాకీ ఏదో జోక్ వేసి నవ్వించాడు. ఇలాంటి గాయాలు అయినప్పుడు పూర్తిగా కోలుకునేందుకు ఎనిమిది వారాలదాకా పడుతుందట! అంటే మరో రెండు వారాల్లో నేను నార్మల్ అయిపోతాను అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment